
రాజ్‌కోట్: కర్ణాటకతో ఆరంభమైన రంజీ మ్యాచ్‌లో భారత టెస్టు ఆటగాడు చతేశ్వర పుజారా అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. సౌరాష్ట్ర తరఫున బరిలో దిగిన పుజారా తొలి రోజు (162 బ్యాటింగ్; 17 ఫోర్లు, సిక్స్) అజేయ సెంచరీ సాధించి ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో 50 సెంచరీలు పూర్తి చేసుకున్న తొమ్మిదో భారత క్రికెటర్‌గా ఘనతకెక్కాడు.
ఇందులో సునీల్ గావస్కర్ (81), సచిన్ టెండూల్కర్ (81), రాహుల్ ద్రవిడ్ (68), దివంగత విజయ్ హజారే (60), వసీమ్ జాఫర్ (57), దిలీప్ వెంగ్‌సర్కార్ (55), వీవీఎస్ లక్ష్మణ్ (55), అజహరుద్దీన్ (54) ముందు వరుసలో ఉన్నారు. పుజారా సెంచరీతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి సౌరాష్ట్ర తమ తొలి ఇన్నింగ్స్‌లో 2 వికెట్లు కోల్పోయి 296 పరుగులు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment