ranjy trophy
-
శతక్కొట్టిన నితీశ్‌రెడ్డి.. చెలరేగిన బౌలర్లు! ఆంధ్ర ఘన విజయం
Andhra won by an innings and 157 runs: రంజీ ట్రోఫీ క్రికెట్ టోర్నీ ఎలైట్ డివిజన్లో భాగంగా బిహార్ జట్టుపై గ్రూప్ ‘బి’ మ్యాచ్‌లో ఆంధ్ర భారీ విజయం సాధించింది. ప్రత్యర్థిని ఏకంగా ఇన్నింగ్స్ 157 పరుగుల తేడాతో చిత్తు చేసింది. ఈ మ్యాచ్‌లో మూడు వికెట్లు తీయడంతో పాటు సెంచరీతో చెలరేగిన నితీశ్ రెడ్డి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. పట్నా వేదికగా శుక్రవారం మొదలైన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆంధ్ర తొలుత బౌలింగ్ చేసింది. ఈ క్రమంలో బౌలర్ గిరినాథ్‌రెడ్డి ఏకంగా ఐదు వికెట్లతో చెలరేగి బిహార్ బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని శాసించాడు. ఈ నేపథ్యంలో 182 పరుగులకే బిహార్ తొలి ఇన్నింగ్స్‌లో ఆలౌట్ అయింది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన ఆంధ్ర జట్టు షేక్ రషీద్(91) అద్భుత అర్ధ శతకం, నితీశ్ రెడ్డి సూపర్ సెంచరీ(159; 16 ఫోర్లు, 5 సిక్స్‌లు) కారణంగా మొదటి ఇన్నింగ్స్‌లో 463 పరుగుల భారీ స్కోరు చేసింది. ఈ నేపథ్యంలో 352 పరుగులతో వెనుకబడి రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన బిహార్ మూడోరోజు(ఆదివారం) ఆట ముగిసే సమయానికి 8 వికెట్లు కోల్పోయి 111 పరుగులు చేసింది. అయితే, సోమవారం నాటి ఆటలో కేవలం కేవలం పదమూడు పరుగులు మాత్రమే జతచేసి బిహార్ ఆలౌట్ అయింది. దీంతో ఆంధ్ర ఇన్నింగ్స్ 157 రన్స్ తేడాతో గెలుపు జెండా ఎగురవేసింది. లలిత్ మోహన్‌కు నాలుగు, కేవీ శశికాంత్‌కు మూడు వికెట్లు దక్కగా.. నితీశ్‌రెడ్డి, షోయబ్ మహ్మద్ ఖాన్, ప్రశాంత్ కుమార్ ఒక్కో వికెట్ తీశారు. చదవండి: Ind vs Eng: దెబ్బకు దెబ్బ.. ఘాటుగానే బదులిచ్చాడు! ఫొటో వైరల్ -
పుజారా 50వ సెంచరీ...
రాజ్‌కోట్: కర్ణాటకతో ఆరంభమైన రంజీ మ్యాచ్‌లో భారత టెస్టు ఆటగాడు చతేశ్వర పుజారా అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. సౌరాష్ట్ర తరఫున బరిలో దిగిన పుజారా తొలి రోజు (162 బ్యాటింగ్; 17 ఫోర్లు, సిక్స్) అజేయ సెంచరీ సాధించి ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో 50 సెంచరీలు పూర్తి చేసుకున్న తొమ్మిదో భారత క్రికెటర్‌గా ఘనతకెక్కాడు. ఇందులో సునీల్ గావస్కర్ (81), సచిన్ టెండూల్కర్ (81), రాహుల్ ద్రవిడ్ (68), దివంగత విజయ్ హజారే (60), వసీమ్ జాఫర్ (57), దిలీప్ వెంగ్‌సర్కార్ (55), వీవీఎస్ లక్ష్మణ్ (55), అజహరుద్దీన్ (54) ముందు వరుసలో ఉన్నారు. పుజారా సెంచరీతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి సౌరాష్ట్ర తమ తొలి ఇన్నింగ్స్‌లో 2 వికెట్లు కోల్పోయి 296 పరుగులు చేసింది. -
స్టేడియంలోకి పాములు.. మ్యాచ్‌కు అంతరాయం
ముంబై: ఒక క్రికెట్ మ్యాచ్ నిలిచిపోయిందంటే ఏ వర్షం కారణంగానో, సరైన వెలుతురు లేని కారణంగానో సాధారణంగా జరుగుతూ ఉంటుంది. ఒక ఆటగాడు గాయపడిన సందర్భాల్లో మ్యాచ్‌కు అంతరాయం కలుగుతూ ఉంటుంది. అయితే పాములు కారణంగా మ్యాచ్‌లు చాలాసేపు ఆగిపోవడం గత కొంతకాలంగా రంజీ మ్యాచ్‌ల్లో జరుగుతూ వస్తోంది. గతేడాది ఆంధ్ర-విదర్భ మ్యాచ్‌లో భాగంగా స్టేడియంలో పాములు రావడంతో కాసేపు ఆగిపోయింది. తాజాగా ముంబై-కర్ణాటక జట్ల మధ్య జరిగిన మరో రంజీ మ్యాచ్‌లో కూడా పాములు దర్శనమిచ్చాయి. ఆదివారం ఆటలో భాగంగా నగరంలోని బంద్ర కుర్లా కాంప్లెక్స్ స్టేడియంలో రెండు పాములు రావడంతో మ్యాచ్ చాలాసేపు నిలిచిపోయింది. చివరకు స్నేక్ క్యాచర్‌కు సమాచారం ఇవ్వడంతో వాటిని పట్టుకున్నాడు. ఆపై మ్యాచ్ జరగ్గా అందులో కర్ణాటక జట్టు ఐదు వికెట్ల తేడాతో గెలిచింది. ముంబై నిర్దేశించిన 126 పరుగుల టార్గెట్‌ను కర్ణాటక తన రెండో ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు కోల్పోయి ఛేదించింది. కర్ణాటక ఓపెనర్లు ఆర్ సమరత్(34), దేవ్‌దూత్ పడిక్కల్(50)లు మ్యాచ్‌కు చక్కటి ఆరంభాన్నిచ్చి కర్ణాటక గెలుపులో సహకరించారు. The highlight of the day at BKC: The snake-catcher displays his "second catch of the day". It's a non-venomous rat snake, btw #RanjiTrophy #MUMvKAR pic.twitter.com/3egfNgc34w — Amol Karhadkar (@karhacter) January 5, 2020 -
రంజీల్లో ప్రిక్వార్టర్ ఫైనల్స్!
న్యూఢిల్లీ: మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానున్న దేశవాళీ క్రికెట్ సీజన్ కొత్త మార్పులతో మన ముందుకు రాబోతుంది. భారత్‌లో అత్యున్నత దేశవాళీ క్రికెట్ టోర్నీ రంజీ ట్రోఫీలో కొత్తగా ప్రిక్వార్టర్ ఫైనల్ దశను చేర్చేందుకు బీసీసీఐ పెద్దలు మంతనాలు జరుపుతున్నారు. ఈ మేరకు సోమవారం కోల్‌కతాలో సమావేశమైన సౌరభ్ గంగూలీ సారథ్యంలోని బీసీసీఐ టెక్నికల్ కమిటీ, సుప్రీం కోర్టు నియమిత క్రికెట్ పాలకుల కమిటీ (సీఓఏ) చర్చించింది. దాదాపు రెండున్నర గంటల పాటు జరిగిన సమావేశంలో దేశవాళీ క్రికెట్‌ను రసవత్తరంగా మార్చేందుకు బీసీసీఐ టెక్నికల్ కమిటీ పలు ప్రతిపాదనలను సీఓఏ ముందుంచింది. రంజీల్లో ప్రస్తుతం వాడుతోన్న ఎస్జీ టెస్టు బంతుల స్థానంలో కూకాబురా బంతుల ఉపయోగించాలనే ప్రతిపాదనను తీసుకొచ్చింది. రాష్ట్ర జట్ల కెప్టెన్లు అభీష్టం మేరకు రంజీల్లో ప్రిక్వార్టర్ మ్యాచ్‌లను నిర్వహించాలని సూచించింది. వచ్చే ఏడాది బిహార్ జట్టు రంజీల్లో పునఃప్రవేశం చేసేందుకు అనుమతి ఇవ్వాలని కోరింది. అయితే బీసీసీఐ తాత్కాలిక కార్యదర్శి అమితాబ్ చౌదరి మాత్రం కూకాబురా బంతులకు బదులుగా ఎస్జీ టెస్టు బంతుల వైపే మొగ్గు చూపారు. ఈసారి కూడా దులీప్ ట్రోఫీ డేనైట్ పద్ధతితో పింక్ బంతితోనే నిర్వహిస్తామని స్పష్టం చేశారు. మరోవైపు ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో బిహార్ పునః ప్రవేశం చేయాలంటే నిబంధనల మేరకు జూనియర్ క్రికెట్లో రాణించాలని సీఓఏ పేర్కొంది. ఒకవేళ నిబంధనలకు విరుద్ధంగా బిహార్ జట్టును రంజీల్లో అనుమతిస్తే ఆసోసియేట్ సంఘాలైన మణిపూర్, మేఘాలయ, నాగాలాండ్ జట్లు కోర్టుకు వెళ్తాయని పేర్కొంది. విజయ్ హజారే జాతీయ వన్డే టోర్నీతో ఈ సీజన్ ప్రారంభం కానుంది. -
అనామక జట్టు నుంచి అజేయంగా...
ఫలితాన్ని ఒంటిచేత్తో మార్చేసే స్టార్లు లేరు...! ఒకరిద్దరు తప్ప మ్యాచ్‌ను తిప్పేసే వీరులు లేరు...! జట్టుగా, ఆటతీరుపరంగానూ పెద్దగా పేరు లేదు...! ...అయినా విదర్భ అద్భుతం చేసింది. రంజీ గెలిచింది..! సాక్షి క్రీడా విభాగం: ముంబై, మహారాష్ట్ర వంటి జట్లున్న మహారాష్ట్రలో మూడో జట్టుగా విదర్భ అనామకమైనదే. దీనికి తగ్గట్లే ఈ ప్రాంతం నుంచి టీమిండియాకు ఆడింది ఇద్దరే. మొదటివాడు పేసర్ ఉమేశ్‌యాదవ్ కాగా రెండో వ్యక్తి ప్రస్తుత విదర్భ కెప్టెన్ ఫైజ్ ఫజల్. ఉమేశ్ గురించి చెప్పేదేమీ లేకున్నా... ఫజల్ ప్రాతినిధ్యం వహించింది మాత్రం ఒక్క వన్డేలోనే. అదీ జింబాబ్వేతో. వీరుకాక సగటు క్రికెట్ అభిమానికి చూచాయగా తెలిసిన జట్టు సభ్యుడి పేరే లేదు. కానీ సమష్టిగా ఆడిన విదర్భ పటిష్ఠ జట్లనూ మట్టి కరిపించింది. టైటిల్ ఫేవరేట్లలో ఒకటిగా కాదు కదా... కనీస పోటీదారుగానైనా పరిగణించని దశ నుంచి విజేతగా నిలిచింది. పునాది అక్కడే... దాదాపు పదేళ్ల నుంచి విదర్భ క్రమక్రమంగా ఎదుగుతోంది. ఇందుకు పునాది వేసింది బీసీసీఐ, ఐసీసీ అధ్యక్షుడిగా వ్యవహరించిన శశాంక్ మనోహర్. ఈయన ఇక్కడివారే కావడంతో తమ ప్రధాన నగరమైన నాగ్‌పూర్‌లోని జామ్తాలో అత్యుత్తమ స్టేడియం నిర్మించడంలో కీలక పాత్ర పోషించారు. 2008లో స్టేడియం నిర్మాణం తర్వాత విదర్భ జట్టులో ప్రొఫెషనలిజం మరింత పెరిగింది. జూనియర్ స్థాయి క్రికెటర్లకు మంచి అవకాశాలు వచ్చాయి. వారిలో ప్రతిభ గలవారంతా రంజీ స్థాయి వరకు దూసుకొచ్చారు. ఇది జట్టుగా విదర్భకు ఎంతో మేలు చేసింది. రాతమార్చింది వారే... చంద్రకాత్ పండిట్, వసీం జాఫర్... భారత జట్టు మాజీ ఆటగాళ్లైన ఈ ముంబైకర్లు విదర్భ తాజా ప్రదర్శనలో కీలక పాత్ర పోషించారు. ఆటగాడిగా, కోచ్‌గా ముంబై రంజీ ట్రోఫీలు గెలవడంలో కీలక పాత్ర పోషించిన చంద్రకాంత్‌ను కొన్ని కారణాలతో గత సీజన్ తర్వాత ముంబై తప్పించింది. ఆ కసి నంతా అతను విదర్భను తీర్చిదిద్దడంపై చూపాడు. ఆటగాళ్లను ప్రోత్సహించడం, జట్టులో స్ఫూర్తినింపడంతో పాటు టైటిల్ గెలవాలన్న కోరికను మొదటి రోజు నుంచే నూరిపోశాడు. ఫైనల్లో 7వ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన వాడ్కర్ అద్భుత శతకం చేయడం, తమకంటే మెరుగైన కర్ణాటకను తీవ్ర ఉత్కంఠ మధ్య సెమీఫైనల్లో ఓడించిన తీరే విదర్భ మనోస్థైర్యాన్ని చాటిచెబుతోంది. ఇక ఆటగాడు–ప్రేరకుడిగా జట్టులోకి వచ్చిన వసీం జాఫర్, అయిదు శతకాలు చేసిన కెప్టెన్ ఫజల్ కీలక సమయాల్లో రాణించి తమ అనుభవానికి సార్థకత చేకూర్చారు. గెలుపు గుర్రం గుర్బానీ... 27... క్వార్టర్స్, సెమీస్, ఫైనల్స్‌లో పేసర్ రజనీష్ గుర్బానీ తీసిన వికెట్లు. ఇదే సమయంలో జట్టులోని మిగతా బౌలర్లు తీసిన వికెట్లు 32 కావడం గమనార్హం. ముఖ్యంగా సెమీస్, ఫైనల్స్‌లో అదరగొట్టి తురుపుముక్కగా నిలిచాడు. మూడు నాకౌట్ మ్యాచ్‌ల్లోనూ ఇతడే ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ కావడం విశేషం. ఈ జోరు చూస్తే 24 ఏళ్ల గుర్బానీకి ముందుముందు మంచి అవకాశాలు తలుపుతట్టడం ఖాయంగా కనిపిస్తోంది. మేల్కొలుపు... ప్రేరణ కలిసికట్టుగా ఆడితే ఏ జట్టైనా రంజీట్రోఫీని అందుకోవచ్చని విదర్భ విజయం నిరూపించింది. ఇదే సమయంలో అన్ని వనరులూ ఉండి ముందుకెళ్లలేకపోతున్న హైదరాబాద్, ఆంధ్రవంటి జట్లకు ఈ గెలుపు ఓ పాఠమే. మరోవైపు ట్రోఫీని పదులసార్లు సొంతం చేసుకుని రంజీ రారాజుగా పేరొందిన ముంబైని సవాల్ చేసే జట్లు క్రమంగా పెరుగుతున్నాయి. గత ఐదు సీజన్లలో ఒక్కసారి మాత్రమే ఆ జట్టు విజేతగా నిలవడమే ఇందుకు నిదర్శనం. -
విదర్భ అద్భుతం
ఇండోర్: ప్రత్యర్థి ఢిల్లీపై అన్ని విభాగాల్లో ఆధిపత్యం చాటిన విదర్భ తొలిసారి రంజీట్రోఫీ విజేతగా నిలిచింది. ఇక్కడి హోల్కర్ స్టేడియం ఆతిథ్యం ఇచ్చిన ఫైనల్‌ను నాలుగో రోజే ముగించి... ప్రతిష్ఠాత్మక దేశవాళీ కప్‌ను సొంతం చేసుకుంది. తమ జట్టు చరిత్రలో సువర్ణాధ్యాయం లిఖించుకుంది. మొదటి ఇన్నింగ్స్‌లో కీలకమైన 252 పరుగుల ఆధిక్యం సాధించిన విదర్భ... ఢిల్లీని రెండో ఇన్నింగ్స్‌లో 280 పరుగులకే ఆలౌట్ చేసింది. 29 పరుగుల లక్ష్యాన్ని ఒక వికెట్ కోల్పోయి ఛేదించింది. నాలుగో రోజు... 14 వికెట్లు సోమవారం ఆటలో ఏకంగా 14 వికెట్లు పతనమయ్యాయి. ఓవర్‌నైట్ స్కోరు 528/7తో బరిలో దిగిన విదర్భ మరో 19 పరుగులు మాత్రమే జోడించి 547కు ఆలౌటైంది. శతక వీరుడు అక్షయ్ వాడ్కర్ (133) ముందు రోజు స్కోరు వద్దే వెనుదిరిగాడు. సిద్దేశ్ నెరల్ (79), ఆదిత్య థాకరే (0)లను నవదీప్ సైనీ (5/135) అవుట్ చేశాడు. అనంతరం భారీ లోటుతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఢిల్లీ ఏమాత్రం ప్రతిఘటన చూపలేకపోయింది. ఓపెనర్ చండేలా (9) త్వరగానే నిష్క్రమించగా ఊపుమీద కనిపించిన గౌతమ్ గంభీర్ (36) అంపైర్ తప్పుడు నిర్ణయానికి బలయ్యాడు. ఈ దశలో ధ్రువ్ షోరే (62), నితీశ్ రాణా (64) మూడో వికెట్‌కు 114 పరుగులు జోడించారు. స్వల్ప వ్యవధిలో వీరిద్దరూ అవుటయ్యాక ఢిల్లీ కోలుకోలేకపోయింది. కెప్టెన్ రిషభ్ పంత్ (32), వికాస్ మిశ్రా (34) సహా మరో 91 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయింది. వాఖరే (4/95); ఆదిత్య సర్వతే (3/30); గుర్బానీ (2/92) ప్రత్యర్థి పతనాన్ని శాసించారు. స్వల్ప లక్ష్యాన్ని అందుకునే క్రమంలో విదర్భ కెప్టెన్ ఫైజ్ ఫజల్ (2) త్వరగానే అవుటైనా... సీనియర్ బ్యాట్స్‌మన్ వసీం జాఫర్ (17 నాటౌట్) ఒకే ఓవర్లో నాలుగు బౌండరీలు బాది తమ జట్టుకు మరుపురాని విజయాన్నందించాడు. హ్యాట్రిక్ సహా మొత్తం 8 వికెట్లు తీసిన గుర్బానీకే ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. ►18 రంజీ ట్రోఫీ టైటిల్‌ను గెలుచుకున్న 18వ జట్టు విదర్భ ►61 తొలి రంజీ మ్యాచ్ (1957–58) ఆడిననాటినుంచి విజేతగా నిలిచేందుకు విదర్భకు 61 సీజన్లు పట్టింది ►9 తొమ్మిదిసార్లు రంజీ నెగ్గిన జట్టులో సభ్యుడు వసీం జాఫర్. 8 సార్లు ముంబై తరఫున , ఈ సారి విదర్భ తరఫున గెలిచాడు ►ప్రైజ్‌మనీ కింద విదర్భకు రూ.2 కోట్లు దక్కగా, విదర్భ క్రికెట్ అసోసియేషన్ మరో రూ.3 కోట్లను ప్రోత్సాహకంగా ప్రకటించింది. -
చరిత్ర సృష్టించిన విదర్భ
సాక్షి, స్పోర్ట్స్ : రంజీ ట్రోఫీ చరిత్రలో విదర్భ జట్టు చరిత్ర సృష్టించింది. ఇండోర్‌లోని హోల్కర్ మైదానంలో జరిగిన రంజీ ట్రోఫీ 2017-18 సీజన్ ఫైనల్లో ఢిల్లీ జట్టును మట్టికరిపించింది. తద్వారా 83 ఏళ్ల రంజీ చరిత్రలో తొలిసారి ట్రోఫీని కైవసం చేసుకుంది. తొలి ఇన్నింగ్స్‌లో ఢిల్లీ 295 పరుగులు సాధించగా.. అనంతరం బ్యాటింగ్ చేసిన విదర్భ జట్టు అక్షయ్ వినోద్ వాడ్కర్ అజేయ శతకంతో 547 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ఇక సెకండ్ ఇన్నింగ్స్ లో ఢిల్లీ 280 పరుగులు సాధించింది. ఆపై స్వల్ఫ లక్ష్యంతో బరిలోకి దిగిన విదర్భ ఒక వికెట్ కోల్పోయి అలవోక విజయాన్ని, తొలిసారి రంజీ ట్రోఫీని సొంతం చేసుకుంది. టోర్నీ ప్రారంభం నుంచే సమిష్టి కృషితో విదర్భ జట్టు తన దూకుడును ప్రదర్శిస్తూ వస్తోంది. -
ముంబై ఎదురీత
నాగ్‌పూర్: అద్భుతంగా ఆడితే తప్ప ‘రంజీ రారాజు’ ముంబై ఈసారి సెమీస్‌కు చేరడం కష్టమే. తొలి ఇన్నింగ్స్‌లో కర్ణాటకకు 397 పరుగులు ఆధిక్యం సమర్పించుకుని... రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన ఆ జట్టు శనివారం ఆట ముగిసే సమయానికి 120 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. అంతకుముందు 395/6తో మూడో రోజును మొదలుపెట్టిన కర్ణాటక 570 పరుగులకు ఆలౌటైంది. ఓవర్‌నైట్ బ్యాట్స్‌మన్ శ్రేయస్ గోపాల్ (274 బంతుల్లో 150 నాటౌట్; 11 ఫోర్లు) భారీ శతకం సాధించాడు. 11వ నంబర్ ఆటగాడు శ్రీనాథ్ అరవింద్ (41 బంతుల్లో 51; 9 ఫోర్లు, ఒక సిక్స్) అర్ధసెంచరీ చేయడం విశేషం. భారీ లోటుతో రెండో ఇన్నింగ్స్‌కు దిగిన ముంబైకి మళ్లీ నిరాశే ఎదురైంది. యువ సంచలనం పృథ్వీషా (14)తో పాటు మరో ఓపెనర్ జే బిస్తా (20), అఖిల్ హెర్వాడ్కర్ (26) విఫలమయ్యారు. సూర్యకుమార్ యాదవ్ (55 బ్యాటింగ్) పోరాడుతున్నాడు. మరో రెండు రోజులు ఉన్నందున ఓటమి తప్పించుకోవడం ముంబైకి కష్టమే. మొదటి ఇన్నింగ్స్ ఆధిక్యంతో కర్ణాటక సెమీస్‌కు చేరే అవకాశాలే ఎక్కువ. బెంగాల్‌కు తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం జైపూర్: పేసర్లు అశోక్ దిండా (3/48), ఇషాన్ పొరెల్ (3/64), అమిత్ (3/53) సమష్టిగా రాణించడంతో బెంగాల్ తొలి ఇన్నింగ్స్‌లో డిఫెండింగ్ చాంపియన్ గుజరాత్‌ను 224 పరుగులకే కట్టడి చేసింది. కీలకమైన 130 పరుగుల ఆధిక్యం సాధించింది. రెండో ఇన్నింగ్స్‌లో బెంగాల్‌కు ఓపెనర్లు అభిమన్యు ఈశ్వరన్ (93 బ్యాటింగ్), రామన్ (33) తొలి వికెట్‌కు 99 పరుగులు జోడించారు. ఆట ముగిసే సమయానికి బెంగాల్ వికెట్ నష్టానికి 177 పరుగులు చేసింది. ఇప్పటికే బెంగాల్ 307 పరుగుల భారీ ఆధిక్యంలో ఉంది. మధ్యప్రదేశ్‌పై ఢిల్లీ పైచేయి సాక్షి, విజయవాడ: లెగ్ స్పిన్నర్ మిహిర్ హీర్వాణి (5/89) అద్భుత ప్రదర్శన చేసినా... ఢిల్లీపై మధ్యప్రదేశ్ ఆధిక్యం సాధించలేకపోయింది. విజయవాడలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో శనివారం 180/2తో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఢిల్లీ 405 పరుగులకు ఆలౌటైంది. కునాల్ చండేలా (81), ధ్రువ్ షరాయ్ (78), హిమ్మత్‌సింగ్ (71) అర్ధ శతకాలకు తోడు కెప్టెన్ రిషభ్ పంత్ (49) రాణించడంతో కీలకమైన 77 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సాధించింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన మధ్యప్రదేశ్ 47 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. కేరళ 176 ఆలౌట్ సూరత్: విదర్భ మీడియం పేసర్ రజనీష్ గుర్బానీ (5/38) ధాటికి కేరళ 176 పరుగులకే ఆలౌటైంది. ఓవర్‌నైట్ స్కోరు 32/2తో శనివారం ఆట ప్రారంభించిన ఆ జట్టు బ్యాట్స్‌మన్ వైఫల్యంతో ప్రత్యర్థికి 70 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కోల్పోయింది. జలజ్ సక్సేనా (40) టాప్ స్కోరర్. సంజూ శాంసన్ (32) విఫలమయ్యాడు. కెప్టెన్ ఫయాజ్ ఫజల్ (51 బ్యాటింగ్) రాణించడంతో రెండో ఇన్నింగ్స్‌లో విదర్భ 77/1 స్కోరుతో రోజు ముగించింది. ఇప్పటికి 147 పరుగుల ఆధిక్యంలో ఉంది. -
రవితేజకు 5 వికెట్లు
న్యూఢిల్లీ: రంజీ ట్రోఫీలో తొలి విజయం కోసం శ్రమి స్తున్న హైదరాబాద్ జట్టు అందుకు తగ్గ వేదికను సిద్ధం చేసుకుంది. రైల్వేస్‌తో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో హైదరాబాద్‌కు తొలి ఇన్నింగ్స్‌లో 228 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. ఓవర్‌నైట్ స్కోరు 35/1తో మూడో రోజు శుక్రవారం ఆట కొనసాగించిన రైల్వేస్ 246 పరుగులకే ఆలౌటైంది. అనురీత్ సింగ్ (60) అర్ధ సెంచరీ మినహా మిగతావారంతా విఫలమయ్యారు. ఈ మ్యాచ్‌తోనే ఫస్ట్ క్లాస్ క్రికెట్లో అరంగేట్రం చేసిన ఆల్‌రౌండర్ తెలుకుపల్లి రవితేజ 49 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టడం విశేషం. మెహదీ హసన్, ఆకాశ్ భండారి చెరో 2 వికెట్లు తీశారు. అనంతరం హైదరాబాద్ కెప్టెన్ రాయుడు రైల్వేస్‌కు ఫాల్ఆన్ ఇచ్చాడు. దాంతో మళ్లీ బ్యాటింగ్‌కు దిగిన రైల్వేస్ ఆట ముగిసే సరికి వికెట్ కోల్పోకుండా 13 పరుగులు చేసింది. ప్రస్తుతం ఆ జట్టు మరో 215 పరుగులు వెనుకబడి ఉంది. -
విజయంపై ఆంధ్ర గురి
సాక్షి, విజయనగరం: సొంతగడ్డపై విజయం సాధించి ఈ సీజన్ రంజీ ట్రోఫీలో బోణీ చేయాలని భావిస్తున్న ఆంధ్ర జట్టుకు మధ్యప్రదేశ్‌తో మ్యాచ్‌లో మరో అవకాశం లభించింది. గత మూడు మ్యాచ్‌ల్లో తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం పొందిన ఆంధ్ర నాలుగో మ్యాచ్‌లోనూ దానిని పునరావృతం చేసింది. అంతేకాకుండా విజయం సాధించేందుకు అనుకూల పరిస్థితిని సృష్టించుకుంది. పేసర్ బండారు అయ్యప్ప (3/26) సత్తా చాటడంతో మధ్య ప్రదేశ్ మూడో రోజు ఆట ముగిసే సమయానికి తమ రెండో ఇన్నింగ్స్‌లో 5 వికెట్ల నష్టానికి 67 పరుగులు మాత్రమే చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో ఆంధ్రకు 55 పరుగుల ఆధిక్యం కోల్పోయిన మధ్యప్రదేశ్ ప్రస్తుతం 12 పరుగులు మాత్రమే ముందంజలో ఉంది. చివరి రోజు కూడా ఆంధ్ర బౌలర్లు ఇదే జోరు కొనసాగిస్తే స్వల్ప లక్ష్యాన్ని ఛేదించే అవకాశం దక్కవచ్చు. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 177/5తో ఆట కొనసాగించిన ఆంధ్ర తొలి ఇన్నింగ్స్‌లో 376 పరుగులకు ఆలౌటైంది. అశ్విన్ హెబర్ (135 బంతుల్లో 77; 8 ఫోర్లు, 1 సిక్స్), ద్వారకా రవితేజ (167 బంతుల్లో 58; 4 ఫోర్లు) ఆరో వికెట్‌కు 143 పరుగులు జోడించి ఆంధ్రకు తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం దక్కడంలో కీలక పాత్ర పోషించారు. చివర్లో అయ్యప్ప (32 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) ధాటిగా ఆడాడు. -
ఆదుకున్న విహారి, సుమంత్
సాక్షి, విజయనగరం: కెప్టెన్ హనుమ విహారి (77; 7 ఫోర్లు, ఒక సిక్స్), సుమంత్ (57; 9 ఫోర్లు) అర్ధ సెంచరీలతో రాణించడంతో... మధ్యప్రదేశ్‌తో జరుగుతున్న రంజీ ట్రోఫీ గ్రూప్ ‘సి’ మ్యాచ్‌లో రెండో రోజు ఆటముగిసే సమయానికి ఆంధ్ర జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్లకు 177 పరుగులు చేసింది. ఓపెనర్ ప్రశాంత్ కుమార్ (30; 5 ఫోర్లు) కూడా రాణించాడు. డీబీ రవితేజ 7 పరుగులతో, అశ్విన్ హెబ్బర్ పరుగులేమీ చేయకుండా క్రీజులో ఉన్నారు. రెండో వికెట్‌కు ప్రశాంత్‌తో 73 పరుగులు జోడించిన విహారి... నాలుగో వికెట్‌కు సుమంత్‌తో 76 పరుగులు జతచేశాడు. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 219/5తో తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన మధ్యప్రదేశ్ జట్టు 321 పరుగులకు ఆలౌటైంది. హర్‌ప్రీత్ సింగ్ (88; 9 ఫోర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఆంధ్ర బౌలర్లలో యెర్రా పృథ్వీరాజ్ నాలుగు వికెట్లు తీయగా... బండారు అయ్యప్ప, శశికాంత్ రెండేసి వికెట్లు పడగొట్టారు. -
విహారి 302 నాటౌట్
సాక్షి, విజయనగరం: వరుసగా రెండో రోజు ఒడిషా బౌలర్లపై ఆంధ్ర బ్యాట్స్‌మెన్ ఆధిపత్యం చలాయించారు. ఫలితంగా రంజీ ట్రోఫీ గ్రూప్ ‘సి’ లీగ్ మ్యాచ్‌లో ఆంధ్ర జట్టు తమ తొలి ఇన్నింగ్స్‌ను 5 వికెట్లకు 584 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. కెప్టెన్ హనుమ విహారి (456 బంతుల్లో 302 నాటౌట్; 29 ఫోర్లు, 2 సిక్స్‌లు) అజేయ ట్రిపుల్ సెంచరీ చేశాడు. రికీ భుయ్ (100; 9 ఫోర్లు, 5 సిక్స్‌లు) వరుసగా రెండో శతకం సాధిం చాడు. విహారి, రికీ భుయ్ మూడో వికెట్‌కు 208 పరు గులు జోడించారు. భుయ్ అవుటయ్యాక మిగతా బ్యాట్స్‌మెన్ సహæకారంతో విహారి తన జోరు కొన సాగించాడు. 312 బంతుల్లో డబుల్ సెంచరీ పూర్తి చేసుకున్న విహారి, 453 బంతుల్లో ట్రిపుల్ సెంచరీని అందుకున్నాడు. విహారి త్రిశతకం పూర్తి కాగానే ఆంధ్ర జట్టు తమ ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. రంజీ ట్రోఫీ చరిత్రలో ‘ట్రిపుల్ సెంచరీ’ చేసిన 37వ బ్యాట్స్‌మన్‌గా, ఆంధ్ర తరఫున రెండో బ్యాట్స్‌మన్‌గా విహారి గుర్తింపు పొందాడు. రెండేళ్ల క్రితం ఒంగోలులో గోవాతో జరిగిన మ్యాచ్‌లో కేఎస్ భరత్ (308 నాటౌట్) ఆంధ్ర తరఫున తొలి ట్రిపుల్ సెంచరీ చేసిన బ్యాట్స్‌మన్‌గా ఘనత వహించాడు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఒడిషా తమ తొలి ఇన్నింగ్స్‌లో 12 ఓవర్లలో వికెట్ నష్టానికి 32 పరుగులు చేసింది. -
రంజీ పోరు నేడు షురూ
న్యూఢిల్లీ: టీమిండియా బిజీ షెడ్యూల్లో భాగమయ్యేందుకు ఎదురు చూస్తున్న ఆటగాళ్లకు చక్కని అవకాశం రానేవచ్చింది. వర్ధమాన క్రికెటర్లతో పాటు ఫామ్ కోల్పోయిన స్టార్ ఆటగాళ్లు రంజీ ట్రోఫీ బరిలోకి దిగేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా (సౌరాష్ట్ర), ఓపెనర్ మురళీ విజయ్ (తమిళనాడు), బ్యాట్స్‌మన్ చతేశ్వర్ పుజారా (సౌరాష్ట్ర), టెస్టు కీపర్ సాహా, పేసర్లు షమీ (బెంగాల్), ఇషాంత్ శర్మ (ఢిల్లీ) లు రంజింపచేసేందుకు సిద్ధంగా ఉన్నారు. తొలి రౌండ్ మ్యాచ్‌లు వివిధ రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి జరుగుతాయి. గత సీజన్లో ప్రయోగాత్మకంగా నిర్వహించిన తటస్థ వేదికల మ్యాచ్‌లను రద్దు చేశారు. ఆటగాళ్ల ప్రయాణ బడలిక, 28 జట్లకు సదుపాయాల కల్పన పనికి మించిన భారం కావడంతో బీసీసీఐ మళ్లీ పాత పద్ధతివైపే మొగ్గు చూపింది. అంటే ఇరు జట్లు ఇంటా బయటా మ్యాచ్‌ల్లో తలపడతాయి. భారత క్రికెట్లో రాహుల్ ద్రవిడ్ వారసుడిగా కితాబు అందుకుంటున్న చతేశ్వర్ పుజారా సౌరాష్ట్ర సారథిగా వ్యవహరించనున్నాడు. ఇదే జట్టులో జడేజా కూడా ఉండటం సౌరాష్ట్రను మరింత పటిష్టపరిచింది. తమిళనాడుకు ఇటు బ్యాటింగ్‌లో మురళీ విజయ్, బౌలింగ్‌లో అశ్విన్ బలమయ్యారు. తెలుగు జట్లు హైదరాబాద్ గ్రూప్ ‘ఎ’లో ఆంధ్ర ‘సి’లో పోటీపడతాయి. శుక్రవారం తమ తొలి లీగ్ మ్యాచ్‌ల్లో మహారాష్ట్రతో హైదరాబాద్; తమిళనాడుతో ఆంధ్ర తలపడతాయి. డిఫెండింగ్ చాంపియన్ గుజరాత్ తమ తొలి మ్యాచ్‌లో కేరళతో ఆడుతుంది. -
చెలరేగిన పార్థివ్.. చరిత్ర సృష్టించిన గుజరాత్
ఏడు దశాబ్దాల ఎదురుచూపులకు తెరదించాడు. కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడి తమ రాష్ట్ర జట్టు చరిత్రలో తొలిసారిగా రంజీ ట్రోఫీని అందించాడు. అవును.. పాలబుగ్గల పసివాడిగా టీమిండియాలోకి ప్రవేశించిన పార్థివ్ పటేల్ జాతీయ జట్టుకు దూరమైనా, దేశవాళీ మ్యాచ్‌లలో మాత్రం ఇరగదీస్తున్నాడు. రంజీట్రోఫీ మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు గుజరాత్ జట్టుకు అందని పండుగానే మిగిలిపోయిన విజయాన్ని అందించిపెట్టాడు. కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడి 143 పరుగులు చేసి ఒక రకంగా ఒంటిచేత్తో ట్రోఫీని ఇచ్చాడు. దాంతోపాటు 42వ సారి ఈ ట్రోఫీని కైవసం చేసుకుని చరిత్ర సృష్టించాలనుకున్న ముంబై ఆశల మీద నీళ్లు చల్లాడు. దాంతో డిఫెండింగ్ చాంపియన్స్ అయిన ముంబై జట్టు మీద 5 వికెట్ల తేడాతో గుజరాత్ నెగ్గి రంజీట్రోఫీని కైవసం చేసుకుంది. విజయానికి 312 పరుగులు కావల్సిన దశలో వికెట్ నష్టపోకుండా 47 పరుగుల స్కోరుతో ఆట ప్రారంభించిన గుజరాత్ జట్టులో అప్పటికి ప్రియాంక్ పాంచాల్ 34 పరుగులతోను, సమిత్ గోహిల్ 5 పరుగులతోను క్రీజ్‌లో ఉన్నారు. అయితే గోహిల్‌ను 21 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అభిషేక్ నాయర్ ఔట్ చేయడంతో ఇక కష్టమనుకున్నారు. కానీ అప్పుడు మన్‌ప్రీత్ జునేజాకు జోడీగా కెప్టెన్ పార్థివ్ పటేల్ బరిలోకి దిగాడు. వీళ్లిద్దరూ కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దడంతో పాటు మ్యాచ్‌నే గెలిపించాడు. ఈ మ్యాచ్‌లో రెండో హాఫ్ సెంచరీ పూర్తిచేసిన పార్థివ్‌కు జునేజా మంచి అండగా నిలిచాడు. వీరి భాగస్వామ్యాన్ని అఖిల్ హెర్వాద్కర్ విడగొట్టాడు. 54 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద జునేజా ఔటయ్యాడు. అయితే, సులభమైన క్యాచ్‌లను కూడా ముంబై ఫీల్డర్లు వదిలేయడంతో గుజరాత్ పని కొంతవరకు సులువైందని చెప్పుకోవచ్చు. చివర్లో వచ్చిన చిరాగ్ గాంధీ కూడా తనవంతు సాయం చేయడంతో గుజరాత్ రంజీట్రోఫీని సగర్వంగా ఎత్తుకుంది. నిజానికి రంజీట్రోఫీ కోసం ఏడు దశాబ్దాల నుంచి గుజరాత్ ఎదురుచూస్తోంది. అసలు ఇప్పటివరకు ఒక్కసారి మాత్రమే ఫైనల్‌కు చేరుకున్న ఆ జట్టు ఆ తర్వాత కనీసం రన్నరప్‌గా కూడా నిలవలేదు. 65 ఏళ్ల తర్వాత రాకరాక వచ్చిన అవకాశాన్ని పార్థివ్ బృందం సరిగ్గా ఉపయోగించుకుంది. రంజీ టైటిల్‌ను మంచినీళ్ల ప్రాయంలా తమ ఖాతాలో వేసుకోవడం అలవాటుగా చేసుకున్న డిఫెండింగ్ చాంపియన్ ముంబై జట్టును మట్టికరిపించింది. గత తొమ్మిది సార్లుగా గెలుస్తూ వచ్చిన ఆ జట్టును బోల్తా కొట్టించింది. స్కోర్లు: ముంబై 228, 411, గుజరాత్ 328, 313/5 -
చెలరేగిన పార్థివ్.. చరిత్ర సృష్టించిన గుజరాత్