( ఫైల్ ఫోటో )
Andhra won by an innings and 157 runs: రంజీ ట్రోఫీ క్రికెట్ టోర్నీ ఎలైట్ డివిజన్‌లో భాగంగా బిహార్ జట్టుపై గ్రూప్ ‘బి’ మ్యాచ్‌లో ఆంధ్ర భారీ విజయం సాధించింది. ప్రత్యర్థిని ఏకంగా ఇన్నింగ్స్ 157 పరుగుల తేడాతో చిత్తు చేసింది. ఈ మ్యాచ్‌లో మూడు వికెట్లు తీయడంతో పాటు సెంచరీతో చెలరేగిన నితీశ్ రెడ్డి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు.
పట్నా వేదికగా శుక్రవారం మొదలైన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆంధ్ర తొలుత బౌలింగ్ చేసింది. ఈ క్రమంలో బౌలర్ గిరినాథ్‌రెడ్డి ఏకంగా ఐదు వికెట్లతో చెలరేగి బిహార్ బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని శాసించాడు. ఈ నేపథ్యంలో 182 పరుగులకే బిహార్ తొలి ఇన్నింగ్స్‌లో ఆలౌట్ అయింది.
ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన ఆంధ్ర జట్టు షేక్ రషీద్(91) అద్భుత అర్ధ శతకం, నితీశ్ రెడ్డి సూపర్ సెంచరీ(159; 16 ఫోర్లు, 5 సిక్స్‌లు) కారణంగా మొదటి ఇన్నింగ్స్‌లో 463 పరుగుల భారీ స్కోరు చేసింది.
ఈ నేపథ్యంలో 352 పరుగులతో వెనుకబడి రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన బిహార్ మూడోరోజు(ఆదివారం) ఆట ముగిసే సమయానికి 8 వికెట్లు కోల్పోయి 111 పరుగులు చేసింది. అయితే, సోమవారం నాటి ఆటలో కేవలం కేవలం పదమూడు పరుగులు మాత్రమే జతచేసి బిహార్ ఆలౌట్ అయింది.
దీంతో ఆంధ్ర ఇన్నింగ్స్ 157 రన్స్ తేడాతో గెలుపు జెండా ఎగురవేసింది. లలిత్ మోహన్‌కు నాలుగు, కేవీ శశికాంత్‌కు మూడు వికెట్లు దక్కగా.. నితీశ్‌రెడ్డి, షోయబ్ మహ్మద్ ఖాన్, ప్రశాంత్ కుమార్ ఒక్కో వికెట్ తీశారు.
చదవండి: Ind vs Eng: దెబ్బకు దెబ్బ.. ఘాటుగానే బదులిచ్చాడు! ఫొటో వైరల్
Comments
Please login to add a commentAdd a comment