Nitish Reddy
-
విధ్వంసం సృష్టించిన తెలుగు కుర్రాడు.. ఎవరీ నితీష్ రెడ్డి?
ఐపీఎల్లో ఛాన్నళ్ల తర్వాత ఓ తెలుగు కుర్రాడు తన సత్తా ఏంటో చూపించాడు. ఐపీఎల్-2024లో భాగంగా పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు, ఆంధ్ర ఆల్‌రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి ఆకాశమే హద్దుగా చెలరేగాడు. క్లాసెన్, మార్క్రమ్ వంటి వరల్డ్ క్లాస్ ఆటగాళ్లు విఫలమైన చోట ఈ ఆంధ్ర ఆటగాడు సత్తాచాటాడు. 28 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయిన సమయంలో క్రీజులోకి వచ్చిన నితీష్ ప్రత్యర్ధి బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. తొలుత ఆచితూచి ఆడిన నితీష్.. క్రీజులో కాస్త సెట్ అయ్యాక భీబత్సం సృష్టించాడు. ఓవైపు వికెట్లు పడుతున్నప్పటికి నితీష్ మాత్రం భారీ సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. ఓవరాల్‌గా ఈ మ్యాచ్‌లో 37 బంతులు ఎదుర్కొన్న నితీష్.. 4 ఫోర్లు, 5 సిక్స్‌లతో 64 పరుగులు చేశాడు. అద్బుత ఇన్నింగ్స్‌తో జట్టుకు 182 పరుగుల భారీ స్కోర్‌ను అందించాడు. కాగా నితీష్ కుమార్‌కు తన ఐపీఎల్ కెరీర్లో ఇదే తొలి హాఫ్ సెంచరీ కావడం గమనార్హం. అదే విధంగా బౌలింగ్‌లో కూడా నితీష్ ఓ వికెట్ పడగొట్టాడు. ఎవరీ నితీష్ కుమార్ రెడ్డి..? 20 ఏళ్ల కాకి నితీష్ కుమార్ రెడ్డి 2003, మే 26న విశాఖపట్నంలో జన్మించాడు. నితీశ్ రెడ్డి తండ్రి ముత్యాల రెడ్డి, హిందుస్తాన్ జింక్‌లో పనిచేసి రిటైర్ అయ్యారు. నితీష్‌కు చిన్నతనం నుంచే క్రికెట్‌పై మక్కువ ఎక్కువ. నితీష్‌కు 14 ఏళ్ల వయస్సులో విజయ్ మర్చంట్ ట్రోఫీ(2017-18)లో ఆంద్ర జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. తనకు వచ్చిన అవకాశాన్ని నితీష్ సద్వినియోగ పరుచుకున్నాడు. విజయ్ మర్చంట్ ట్రోఫీలో 176.41 యావరేజ్‌తో 1237 పరుగులు, బౌలింగ్‌లో 26 వికెట్లు తీశాడు. బీసీసీఐ నుంచి 2017-18 ఏడాదికి గాను ‘బెస్ట్ క్రికెటర్ ఇన్ ది అండర్16’ జగన్మోహియా దాల్మియా అవార్డు గెలుచుకున్నాడు. ఆ తర్వాత 2020 రంజీ ట్రోఫీ సీజన్లో ఆంధ్ర జట్టు తరపున ఫస్ట్‌క్లాస్ క్రికెట్లోకి అడుగుపెట్టాడు. అనంతరం 2021లో లిస్ట్-ఏ క్రికెట్ అరంగేట్రం చేశాడు. అదే ఏడాది టీ20ల్లో కూడా నితీష్ ఎంట్రీ ఇచ్చాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో ఇప్పటివరకు 17 మ్యాచ్‌లు ఆడిన రెడ్డి.. 566 పరుగులతో పాటు 52 వికెట్లు పడగొట్టాడు. అదే విధంగా లిస్ట్-ఏ క్రికెట్లో 403 పరుగులతో పాటు 14 వికెట్లు సాధించారు. కాగా టీ20ల విషయానికి వస్తే.. ఆంధ్రా జట్టు తరపున 8 మ్యాచ్‌లు ఆడిన నితీష్ 106 పరుగులు సాధించాడు. ఈ క్రమంలో దేశీవాళీ క్రికెట్లో అద్బుతమైన ప్రదర్శన కనబరుస్తుండడంతో నితీశ్ రెడ్డిని ఐపీఎల్ 2023 వేలంలో రూ.20 లక్షల బేస్ ప్రైజ్‌కి సన్‌రైజర్స్ హైదరాబాద్ కొనుగోలు చేసింది. గతేడాది సీజన్లో ఆర్సీబీతో మ్యాచ్‌లో నితీష్ ఐపీఎల్ అరంగేట్రం చేశాడు. కాగా ఐపీఎల్లో హాఫ్ సెంచరీ నాలుగో ఆంధ్రా క్రికెటర్‌గా నితీశ్ రెడ్డి నిలిచాడు. ఇంతకుముందు వేణుగోపాల రావు, అంబటి రాయుడు, శ్రీకర్ భరత్ మాత్రమే ఈ ఫీట్ సాధించారు. 5️⃣0️⃣ up for Nitish Reddy 💪 The local lad is turning it up 🔥#IPLonJioCinema #TATAIPL #PBKSvSRH pic.twitter.com/GguSBFYiFc — JioCinema (@JioCinema) April 9, 2024 -
శతక్కొట్టిన నితీశ్‌రెడ్డి.. చెలరేగిన బౌలర్లు! ఆంధ్ర ఘన విజయం
Andhra won by an innings and 157 runs: రంజీ ట్రోఫీ క్రికెట్ టోర్నీ ఎలైట్ డివిజన్లో భాగంగా బిహార్ జట్టుపై గ్రూప్ ‘బి’ మ్యాచ్‌లో ఆంధ్ర భారీ విజయం సాధించింది. ప్రత్యర్థిని ఏకంగా ఇన్నింగ్స్ 157 పరుగుల తేడాతో చిత్తు చేసింది. ఈ మ్యాచ్‌లో మూడు వికెట్లు తీయడంతో పాటు సెంచరీతో చెలరేగిన నితీశ్ రెడ్డి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. పట్నా వేదికగా శుక్రవారం మొదలైన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆంధ్ర తొలుత బౌలింగ్ చేసింది. ఈ క్రమంలో బౌలర్ గిరినాథ్‌రెడ్డి ఏకంగా ఐదు వికెట్లతో చెలరేగి బిహార్ బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని శాసించాడు. ఈ నేపథ్యంలో 182 పరుగులకే బిహార్ తొలి ఇన్నింగ్స్‌లో ఆలౌట్ అయింది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన ఆంధ్ర జట్టు షేక్ రషీద్(91) అద్భుత అర్ధ శతకం, నితీశ్ రెడ్డి సూపర్ సెంచరీ(159; 16 ఫోర్లు, 5 సిక్స్‌లు) కారణంగా మొదటి ఇన్నింగ్స్‌లో 463 పరుగుల భారీ స్కోరు చేసింది. ఈ నేపథ్యంలో 352 పరుగులతో వెనుకబడి రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన బిహార్ మూడోరోజు(ఆదివారం) ఆట ముగిసే సమయానికి 8 వికెట్లు కోల్పోయి 111 పరుగులు చేసింది. అయితే, సోమవారం నాటి ఆటలో కేవలం కేవలం పదమూడు పరుగులు మాత్రమే జతచేసి బిహార్ ఆలౌట్ అయింది. దీంతో ఆంధ్ర ఇన్నింగ్స్ 157 రన్స్ తేడాతో గెలుపు జెండా ఎగురవేసింది. లలిత్ మోహన్‌కు నాలుగు, కేవీ శశికాంత్‌కు మూడు వికెట్లు దక్కగా.. నితీశ్‌రెడ్డి, షోయబ్ మహ్మద్ ఖాన్, ప్రశాంత్ కుమార్ ఒక్కో వికెట్ తీశారు. చదవండి: Ind vs Eng: దెబ్బకు దెబ్బ.. ఘాటుగానే బదులిచ్చాడు! ఫొటో వైరల్ -
బ్యాట్‌తో రాణించిన నితీశ్ రెడ్డి.. ఆంధ్ర 188 ఆలౌట్
Ranji Trophy 2023-24- Assam vs Andhra, Elite Group B- దిబ్రూగఢ్: అస్సాం జట్టుతో శుక్రవారం మొదలైన రంజీ ట్రోఫీ ఎలైట్ డివిజన్ గ్రూప్ ‘బి’ లీగ్ మ్యాచ్‌లో ఆంధ్ర జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 72.1 ఓవర్లలో 188 పరుగులకు ఆలౌటైంది. 70 పరుగులకే 6 వికెట్లు చేజార్చుకొని కష్టాల్లో పడిన ఆంధ్ర జట్టును షోయబ్ మొహమ్మద్ ఖాన్ (63; 3 ఫోర్లు), నితీశ్ కుమార్ రెడ్డి (49; 4 ఫోర్లు) ఏడో వికెట్‌కు 113 పరుగులు జోడించి ఆదుకున్నారు. ఆంధ్ర జట్టు చివరి 4 వికెట్లను ఐదు పరుగుల తేడాలో కోల్పోయింది. అస్సాం బౌలర్లలో రాహుల్ సింగ్ (6/46), ముక్తార్ (2/45), ఆకాశ్ సేన్‌గుప్తా (2/37) రాణించారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన అస్సాం ఆట ముగిసే సమయానికి 15 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 43 పరుగులు చేసింది. మెరిసిన తనయ్, తన్మయ్, మిలింద్ సాక్షి, హైదరాబాద్: రంజీ ట్రోఫీ ప్లేట్ డివిజన్లో హైదరాబాద్ క్రికెట్ జట్టు తమ జోరు కొనసాగిస్తోంది. ఇప్పటికే నాగాలాండ్, మేఘాలయ జట్లపై ఇన్నింగ్స్ విజయాలు నమోదు చేసిన హైదరాబాద్ వరుసగా మూడో విజయంపై కన్నేసింది. సిక్కిం జట్టుతో శుక్రవారం మొదలైన మూడో మ్యాచ్‌లో తొలి రోజు ఆట ముగిసే సమయానికి హైదరాబాద్ 302 పరుగుల ఆధిక్యాన్ని సంపాదించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సిక్కిం జట్టును హైదరాబాద్ బౌలర్లు తనయ్ త్యాగరాజన్ (6/25), సీవీ మిలింద్ (4/30) హడలెత్తించారు. ఎడంచేతి వాటం స్పిన్నర్ తనయ్, మీడియం పేసర్ మిలింద్ దెబ్బకు సిక్కిం తొలి ఇన్నింగ్స్‌లో 27.4 ఓవర్లలో కేవలం 79 పరుగులకే ఆలౌటైంది. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన హైదరాబాద్ ఆట ముగిసే సమయానికి 62 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 381 పరుగులు సాధించింది. ఓపెనర్ తన్మయ్ అగర్వాల్ (125 బంతుల్లో 137; 11 ఫోర్లు, 5 సిక్స్‌లు) సెంచరీ చేయగా... రాహుల్ సింగ్ గహ్లోత్ (64 బంతుల్లో 83; 10 ఫోర్లు, 5 సిక్స్‌లు), రోహిత్ రాయుడు (111 బంతుల్లో 75; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధ సెంచరీలు సాధించారు. తన్మయ్, రాహుల్ తొలి వికెట్‌కు 18 ఓవర్లలో 132 పరుగులు జో డించడం విశేషం. తన్మయ్, రోహిత్ రాయుడు రెండో వికెట్‌కు 138 పరుగులు జత చేశారు. ప్రస్తుతం కెప్టెన్ తిలక్ వర్మ (66 బంతుల్లో 70 బ్యాటింగ్; 5 ఫోర్లు, 3 సిక్స్‌లు), చందన్ సహని (8 బ్యాటింగ్; 1 సిక్స్) క్రీజులో ఉన్నారు. -
కోహ్లి భారీ సిక్సర్.. పాపం నితీశ్‌రెడ్డి! డుప్లెసిస్ రియాక్షన్ వైరల్
IPL 2023 SRH Vs RCB- Virat Kohli: సింహంతో ఆట.. పులి వేట ఎప్పుడూ ప్రమాదకరమే! అలాగే విరాట్ విశ్వరూపం ప్రదర్శిస్తే ప్రత్యర్థి జట్టు వణికిపోవాల్సిందే. ఒక్కసారి క్రీజులో కుదురుకున్నాడంటే ఎలాంటి బాల్ వేయాలో తెలియక బౌలర్లు తలలు పట్టుకోవాల్సిందే! ఐపీఎల్-2023లో భాగంగా ఆర్సీబీతో మ్యాచ్ సందర్భంగా సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్లకు ఈ విషయం అనుభవంలోకి వచ్చింది. ఆకాశమే హద్దుగా చెలరేగిన కోహ్లి ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ఆర్సీబీ స్టార్ విరాట్ కోహ్లి సెంచరీతో మెరిశాడు. 63 బంతులు ఎదుర్కొని 100 పరుగులు చేసిన కోహ్లి ఇన్నింగ్స్‌లో 12 ఫోర్లు, 4 సిక్సర్లు ఉన్నాయి. సన్‌రైజర్స్ విధించిన 187 పరుగుల లక్ష్య ఛేదనలో కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్‌తో కలిసి ఈ ఓపెనర్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు, సిక్సర్లు బాదుతూ స్కోరు బోర్డును ముందుకు నడిపిస్తూ.. ప్రేక్షకులకు కావాల్సినంత వినోదం పంచాడు. ముఖ్యంగా సన్‌రైజర్స్ పేసర్ నితీశ్‌కుమార్ రెడ్డి బౌలింగ్‌లో కోహ్లి బాదిన భారీ సిక్సర్(103 మీటర్లు) హైలైట్‌గా నిలిచింది. అరంగేట్రం చేసిన నితీశ్‌రెడ్డి ఆర్సీబీతో గురువారం నాటి మ్యాచ్ సందర్భంగా ఐపీఎల్లో అరంగేట్రం చేసిన 19 ఏళ్ల ఆంధ్ర ప్లేయర్ బౌలింగ్‌లో కోహ్లి తొమ్మిదో ఓవర్ తొలి బంతిని సిక్సర్‌గా మలిచాడు. కోహ్లి అద్భుతమైన షాట్‌కు ప్రేక్షకులే కాదు కోహ్లి ఓపెనింగ్ పార్ట్నర్ డుప్లెసిస్ కూడా సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యాడు. కోహ్లి భారీ సిక్సర్.. డుప్లెసిస్ రియాక్షన్ అదుర్స్ కోహ్లి ఈ మేరకు భారీ షాట్ బాదగానే.. ‘‘వావ్.. నమ్మలేకపోతున్నా’’ అన్నట్లు డుప్లెసిస్ ఇచ్చిన రియాక్షన్ నెట్టింట వైరల్ అవుతోంది. ఇదిలా ఉంటే ఈ మ్యాచ్‌లో డుప్లెసిస్ 47 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్‌ల సాయంతో 71 పరుగులు చేశాడు. కోహ్లి, డుప్లెసిస్ అద్భుత ప్రదర్శన కారణంగా 19.2 ఓవర్లలోనే టార్గెట్‌ను ఛేజ్ చేసింది. సన్‌రైజర్స్‌పై 8 వికెట్ల తేడాతో గెలుపొంది ప్లే ఆఫ్స్‌నకు చేరువైంది. ప్లే ఆఫ్స్ రేసులో నిలిచిన ఆర్సీబీ ఇక ఆర్సీబీతో మ్యాచ్‌తో అరంగేట్రం చేసిన నితీశ్‌కుమార్ రెడ్డికి ఈ మ్యాచ్‌లో రెండు ఓవర్లు బౌలింగ్ చేసే అవకాశం వచ్చింది. ఈ మ్యాచ్‌లో మొత్తంగా 19 పరుగులు ఇచ్చాడు ఈ యువ పేసర్. ఉప్పల్ మ్యాచ్‌లో విజయంతో బెంగళూరు జట్టు 14 పాయింట్లతో నాలుగో స్థానానికి చేరుకోగా.. ఓటమిపాలైన సన్‌రైజర్స్ అట్టడుగున పదో స్థానంలో కొనసాగుతోంది. చదవండి: అవన్నీ చెత్త మాటలు.. నేను అస్సలు పట్టించుకోను! గర్వంగా ఉంది: కోహ్లి వాళ్లిద్దరే మా ఓటమిని శాసించారు.. లేదంటేనా! చాలా బాధగా ఉంది: మార్కరమ్ The Beauty (& the Beast) of #TATAIPL 😎#SRHvRCB #IPLonJioCinema #Kohli https://t.co/qfCZLvS2f6 pic.twitter.com/Ju0rBsfEIA — JioCinema (@JioCinema) May 18, 2023 ICYMI! A treat for the #RCB fans right here in Hyderabad.@imVkohli goes big with a maximum.#TATAIPL #SRHvRCB pic.twitter.com/KbojxpdFvG — IndianPremierLeague (@IPL) May 18, 2023 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4381453179.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } });