IPL 2023, SRH Vs RCB: Virat Kohli Hammers SRH Pacer For 103m Six, Du Plessis Reaction Video Viral - Sakshi
Sakshi News home page

#Virat Kohli: కోహ్లి భారీ సిక్సర్‌.. పాపం నితీశ్‌రెడ్డి! డుప్లెసిస్‌ రియాక్షన్‌ అదుర్స్‌.. వీడియో వైరల్‌

Published Fri, May 19 2023 10:23 AM | Last Updated on Fri, May 19 2023 10:52 AM

IPL 2023: Virat Kohli Hammers SRH Pacer For 103m Six Du Plessis Reaction Viral - Sakshi

విరాట్‌ కోహ్లి భారీ సిక్సర్‌- ఫాఫ్‌ డుప్లెసిస్‌ రియాక్షన్‌ వైరల్‌ (PC: IPL)

IPL 2023 SRH Vs RCB- Virat Kohli: సింహంతో ఆట.. పులి వేట ఎప్పుడూ ప్రమాదకరమే! అలాగే విరాట్‌ విశ్వరూపం ప్రదర్శిస్తే ప్రత్యర్థి జట్టు వణికిపోవాల్సిందే. ఒక్కసారి క్రీజులో కుదురుకున్నాడంటే ఎలాంటి బాల్‌ వేయాలో తెలియక బౌలర్లు తలలు పట్టుకోవాల్సిందే! ఐపీఎల్‌-2023లో భాగంగా ఆర్సీబీతో మ్యాచ్‌ సందర్భంగా సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ బౌలర్లకు ఈ విషయం అనుభవంలోకి వచ్చింది.

ఆకాశమే హద్దుగా చెలరేగిన కోహ్లి
ప్లే ఆఫ్స్‌ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ఆర్సీబీ స్టార్‌ విరాట్‌ కోహ్లి సెంచరీతో మెరిశాడు. 63 బంతులు ఎదుర్కొని 100 పరుగులు చేసిన కోహ్లి ఇన్నింగ్స్‌లో 12 ఫోర్లు, 4 సిక్సర్లు ఉన్నాయి. సన్‌రైజర్స్‌ విధించిన 187 పరుగుల లక్ష్య ఛేదనలో కెప్టెన్‌ ఫాఫ్‌ డుప్లెసిస్‌తో కలిసి ఈ ఓపెనర్‌ ఆకాశమే హద్దుగా చెలరేగాడు.

వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు, సిక్సర్లు బాదుతూ స్కోరు బోర్డును ముందుకు నడిపిస్తూ.. ప్రేక్షకులకు కావాల్సినంత వినోదం పంచాడు. ముఖ్యంగా సన్‌రైజర్స్‌ పేసర్‌ నితీశ్‌కుమార్‌ రెడ్డి బౌలింగ్‌లో కోహ్లి బాదిన భారీ సిక్సర్‌(103 మీటర్లు) హైలైట్‌గా నిలిచింది. 

అరంగేట్రం చేసిన నితీశ్‌రెడ్డి
ఆర్సీబీతో గురువారం నాటి మ్యాచ్‌ సందర్భంగా ఐపీఎల్‌లో అరంగేట్రం చేసిన 19 ఏళ్ల ఆంధ్ర ప్లేయర్‌ బౌలింగ్‌లో కోహ్లి తొమ్మిదో ఓవర్‌ తొలి బంతిని సిక్సర్‌గా మలిచాడు. కోహ్లి అద్భుతమైన షాట్‌కు ప్రేక్షకులే కాదు కోహ్లి ఓపెనింగ్‌ పార్ట్‌నర్‌ డుప్లెసిస్‌ కూడా సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యాడు. 

కోహ్లి భారీ సిక్సర్‌.. డుప్లెసిస్‌ రియాక్షన్‌ అదుర్స్‌
కోహ్లి ఈ మేరకు భారీ షాట్‌ బాదగానే.. ‘‘వావ్‌.. నమ్మలేకపోతున్నా’’ అన్నట్లు డుప్లెసిస్‌ ఇచ్చిన రియాక్షన్‌ నెట్టింట వైరల్‌ అవుతోంది. ఇదిలా ఉంటే ఈ మ్యాచ్‌లో డుప్లెసిస్‌ 47 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్‌ల సాయంతో 71 పరుగులు చేశాడు. కోహ్లి, డుప్లెసిస్‌ అద్భుత ప్రదర్శన కారణంగా 19.2 ఓవర్లలోనే టార్గెట్‌ను ఛేజ్‌ చేసింది. సన్‌రైజర్స్‌పై 8 వికెట్ల తేడాతో గెలుపొంది ప్లే ఆఫ్స్‌నకు చేరువైంది.

ప్లే ఆఫ్స్‌ రేసులో నిలిచిన ఆర్సీబీ
ఇక ఆర్సీబీతో మ్యాచ్‌తో అరంగేట్రం చేసిన నితీశ్‌కుమార్‌ రెడ్డికి ఈ మ్యాచ్‌లో రెండు ఓవర్లు బౌలింగ్‌ చేసే అవకాశం వచ్చింది. ఈ మ్యాచ్‌లో మొత్తంగా 19 పరుగులు ఇచ్చాడు ఈ యువ పేసర్‌. ఉప్పల్‌ మ్యాచ్‌లో విజయంతో బెంగళూరు జట్టు 14 పాయింట్లతో నాలుగో స్థానానికి చేరుకోగా.. ఓటమిపాలైన సన్‌రైజర్స్‌ అట్టడుగున పదో స్థానంలో కొనసాగుతోంది.

చదవండి: అవన్నీ చెత్త మాటలు.. నేను అస్సలు పట్టించుకోను! గర్వంగా ఉంది: కోహ్లి
వాళ్లిద్దరే మా ఓటమిని శాసించారు.. లేదంటేనా! చాలా బాధగా ఉంది: మార్కరమ్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement