సాక్షి, స్పోర్ట్స్ : రంజీ ట్రోఫీ చరిత్రలో విదర్భ జట్టు చరిత్ర సృష్టించింది. ఇండోర్‌లోని హోల్కర్ మైదానంలో జరిగిన రంజీ ట్రోఫీ 2017-18 సీజన్ ఫైనల్‌లో ఢిల్లీ జట్టును మట్టికరిపించింది. తద్వారా 83 ఏళ్ల రంజీ చరిత్రలో తొలిసారి ట్రోఫీని కైవసం చేసుకుంది.
తొలి ఇన్నింగ్స్‌లో ఢిల్లీ 295 పరుగులు సాధించగా.. అనంతరం బ్యాటింగ్ చేసిన విదర్భ జట్టు అక్షయ్ వినోద్ వాడ్కర్ అజేయ శతకంతో 547 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ఇక సెకండ్ ఇన్నింగ్స్ లో ఢిల్లీ 280 పరుగులు సాధించింది.
ఆపై స్వల్ఫ లక్ష్యంతో బరిలోకి దిగిన విదర్భ ఒక వికెట్ కోల్పోయి అలవోక విజయాన్ని, తొలిసారి రంజీ ట్రోఫీని సొంతం చేసుకుంది. టోర్నీ ప్రారంభం నుంచే సమిష్టి కృషితో విదర్భ జట్టు తన దూకుడును ప్రదర్శిస్తూ వస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment