Delhi team
-
ఒకే జట్టులో 11 మందితో బౌలింగ్.. టీ20 క్రికెట్ చరిత్రలోనే తొలిసారి
పురుషుల టీ20 క్రికెట్ చరిత్రలో కనివినీ ఎరుగని రికార్డు నమోదైంది. ఒకే మ్యాచ్‌లో జట్టులోని మొత్తం 11 మంది బౌలింగ్ చేసి అందరిని ఆశ్చర్యపరిచారు. ఈ అరుదైన ఫీట్‌కు సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ-2024 వేదికైంది.ఈ టోర్నీలో భాగంగా శుక్రవారం వాంఖడే స్టేడియంలో మణిపూర్‌తో జరిగిన జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ జట్టులోని మొత్తం 11 మంది బౌలింగ్ చేశారు. ఢిల్లీ కెప్టెన్ ఆయుష్ బదోని జట్టులో ప్రతీ ఒక్కరితో బౌలింగ్ చేయించాడు. ఆఖరికి వికెట్ కీపర్‌గా ఉన్న బదోని సైతం ఈ మ్యాచ్‌లో బౌలింగ్ చేశాడు. తద్వారా టీ20 క్రికెట్లో ఒకే ఇన్నింగ్స్‌లో మొత్తం 11 మంది బౌలర్లను ఉపయోగించిన తొలి జట్టుగా ఢిల్లీ రికార్డులకెక్కింది. టీ20ల్లోఒకే ఇన్నింగ్స్‌లో ఇప్పటి వరకు అత్యధికంగా 9 మంది మాత్రమే బౌలింగ్ చేశారు. ఐపీఎల్లో దక్కన్ ఛార్జర్స్, ఆర్సీబీ జట్లు తొమ్మిది మంది బౌలర్లను ఉపయోగించాయి. తాజా మ్యాచ్‌తో ఈ అల్‌టైమ్ రికార్డును ఢిల్లీ బ్రేక్ చేసింది.కాగా ఢిల్లీ జట్టుకు సంబంధించి స్కోర్ కార్డ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఢిల్లీ బౌలర్లు ఆయుష్ సింగ్, అఖిల్ చౌదరి, ఆయుష్ బదోని రెండేసి ఓవర్లు బౌలింగ్ చేయగా.. . హర్ష్ త్యాగీ, దిగ్వేష్, మయాంక్ రావత్ తలా మూడు ఓవర్లు బౌలింగ్ చేశారు. వీరితో పాటు ఆర్యన్ రానా, హిమ్మంత్ సింగ్, ప్రియాన్ష్ ఆర్య, యశ్ దుల్, రావత్ కూడా ఒక ఓవర్ బౌలింగ్ చేశారు. త్యాగీ, దిగ్వేష్ తలా రెండు వికెట్లు సాధించగా.. బదోని, అయూష్ సింగ్, ప్రియాన్షూ ఆర్య చెరో వికెట్ పడగొట్టారు.చదవండి: Asia Cup 2024: రేపే భారత్-పాకిస్తాన్ మ్యాచ్.. లైవ్ ఎక్కడో తెలుసా? -
డగౌట్ పై రిషబ్ పంత్ జెర్సీ..ఢిల్లీ కి షాక్ ఇచ్చిన బీసీసీఐ
-
43 ఏళ్లలో తొలిసారి.. ముంబై జట్టుకు ఘోర అవమానం
రంజీ ట్రోఫీ 2022-23 సీజన్లో ఢిల్లీ జట్టు తమ తొలి విజయాన్ని నమోదు చేసింది. 41సార్లు రంజీ చాంపియన్‌గా నిలిచిన ముంబైని ఢిల్లీ జట్టు 8 వికెట్ల తేడాతో చిత్తు చేసింది. 43 ఏళ్లలో ముంబై జట్టుపై ఢిల్లీకిదే తొలి విజయం కావడం విశేషం. తాజా మ్యాచ్‌తో కలిపి ఢిల్లీ ఈ సీజన్లో ఇప్పటివరకు ఆరు మ్యాచ్‌లకు గానూ మూడింటిని డ్రా చేసుకొని.. రెండింటిలో ఓటమిపాలైంది. తాజాగా ముంబైపై విజయంతో సీజన్లో తొలి విజయాన్ని ఖాతాలో వేసుకుంది. 88 ఏళ్ల రంజీ ట్రోఫీ చరిత్రలో ముంబై, ఢిల్లీ చేతిలో ఓడిపోవడం ఇది రెండోసారి మాత్రమే. గ్రూప్-బిలో ఉన్న ఢిల్లీ ప్రస్తుతం ఏడో స్థానంలో ఉంది. ఢిల్లీలోని అరుణ్‌జైట్లీ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై తొలి ఇన్నింగ్స్‌లో 293 పరుగులకు ఆలౌట్ కాగా.. ఢిల్లీ తొలి ఇన్నింగ్స్‌లో 369 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో ఢిల్లీకి 76 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. ఇక రెండో ఇన్నింగ్స్‌లో ముంబై 170 పరుగులకే కుప్పకూలింది. దీంతో ఢిల్లీ ముందు 97 పరుగుల స్వల్ప టార్గెట్ ఉండడంతో రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి చేధించింది. ముంబై తరపున సర్ఫరాజ్ ఖాన్ ఒక్కడే మెరుగ్గా రాణించాడు. తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ చేసిన సర్ఫరాజ్ రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం డకౌట్ అయ్యాడు.ముంబై కెప్టెన్ అజింక్యా రహానే సహా ఓపెనర్ పృథ్వీ షాలు మ్యాచ్‌లో ఏమాత్రం ఆకట్టుకోలేకపోయారు. ఇక ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఢిల్లీ బ్యాటర్ వైభవ్ రవాల్ నిలిచాడు. Delhi successfully chase down the target in the fourth innings and complete a clinical 8️⃣-wicket win over Mumbai 👏👏#RanjiTrophy | #DELvMUM | @mastercardindia pic.twitter.com/NCyK8kn9zU — BCCI Domestic (@BCCIdomestic) January 20, 2023 చదవండి: స్లో ఓవర్ రేట్.. టీమిండియాకు పడింది దెబ్బ కౌంటీల్లో ఆడనున్న స్మిత్! ద్రోహులు అంటూ ఫైర్! తప్పేముంది? -
గంభీర్ సెంచరీ సెమీస్‌లో ఢిల్లీ
బెంగళూరు: తన 37వ పుట్టిన రోజున అద్భుత సెంచరీతో అలరించిన గౌతమ్ గంభీర్ (72 బంతుల్లో 104; 16 ఫోర్లు)... విజయ్ హజారే ట్రోఫీ దేశవాళీ వన్డే టోర్నమెంట్లో ఢిల్లీ జట్టును సెమీఫైనల్‌కు చేర్చాడు. హరియాణాతో ఆదివారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో గంభీర్ సారథ్యంలోని ఢిల్లీ జట్టు ఐదు వికెట్ల తేడాతో గెలిచింది. తొలుత హరియాణా 49.1 ఓవర్లలో 229 పరుగులకు ఆలౌటైంది. ఢిల్లీ బౌలర్ కుల్వంత్ ఖెజ్రోలియా (6/31) ‘హ్యాట్రిక్’ సహా ఆరు వికెట్లు తీశాడు. ఇన్నింగ్స్ 39వ ఓవర్లో కుల్వంత్ వరుస బంతుల్లో చైతన్య బిష్ణోయ్, ప్రమోద్ చండీలా, అమిత్ మిశ్రాలను ఔట్ చేసి ‘హ్యాట్రిక్’ సాధించాడు. గంభీర్ చెలరేగడంతో 230 పరుగుల లక్ష్యాన్ని ఢిల్లీ 39.2 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి అధిగమించింది. నేడు జరిగే క్వార్టర్ ఫైనల్లో ఆంధ్రతో హైదరాబాద్ తలపడనుంది. -
చరిత్ర సృష్టించిన విదర్భ
సాక్షి, స్పోర్ట్స్ : రంజీ ట్రోఫీ చరిత్రలో విదర్భ జట్టు చరిత్ర సృష్టించింది. ఇండోర్‌లోని హోల్కర్ మైదానంలో జరిగిన రంజీ ట్రోఫీ 2017-18 సీజన్ ఫైనల్లో ఢిల్లీ జట్టును మట్టికరిపించింది. తద్వారా 83 ఏళ్ల రంజీ చరిత్రలో తొలిసారి ట్రోఫీని కైవసం చేసుకుంది. తొలి ఇన్నింగ్స్‌లో ఢిల్లీ 295 పరుగులు సాధించగా.. అనంతరం బ్యాటింగ్ చేసిన విదర్భ జట్టు అక్షయ్ వినోద్ వాడ్కర్ అజేయ శతకంతో 547 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ఇక సెకండ్ ఇన్నింగ్స్ లో ఢిల్లీ 280 పరుగులు సాధించింది. ఆపై స్వల్ఫ లక్ష్యంతో బరిలోకి దిగిన విదర్భ ఒక వికెట్ కోల్పోయి అలవోక విజయాన్ని, తొలిసారి రంజీ ట్రోఫీని సొంతం చేసుకుంది. టోర్నీ ప్రారంభం నుంచే సమిష్టి కృషితో విదర్భ జట్టు తన దూకుడును ప్రదర్శిస్తూ వస్తోంది. -
గంభీర్ తప్పుకున్నాడు!
న్యూఢిల్లీ: ఢిల్లీ రంజీ జట్టు కెప్టెన్సీ పదవి నుంచి గౌతం గంభీర్ వైదొలిగాడు. గత నాలుగేళ్లుగా ఢిల్లీ జట్టుకు సారథిగా వ్యవహరిస్తున్న గంభీర్ ఎట్టకేలకు తన పదవికి గుడ్ బై చెప్పాడు. అయితే జట్టులో సభ్యుడిగా కొనసాగుతానని స్పష్టం చేశాడు. ఈ మేరకు ఢిల్లీ డిస్ట్రిక్ట్స్ క్రికెట్ అసోసియేషన్(డీడీసీసీ) పరిపాలకుడు విక్రమ్ జిత్ కు లేఖ రాశారు. ఇక తాను కెప్టెన్సీకి వీడ్కోలు చెప్పే సమయం ఆసన్నమైందని లేఖలో స్పష్టం చేసిన గంభీర్.. మరొకరి ఆ బాధ్యతను అప్పజెప్పాలని కోరాడు. జట్టుకు ఆటగాడిగా సేవలందిస్తానని గంభీర్ పేర్కొన్నాడు. దాంతో అతని స్థానంలో ఇషాంత్ శర్మను ఢిల్లీ రంజీ కెప్టెన్ గా నియమిస్తూ డీడీసీఏ నిర్ణయం తీసుకుంది. గత విజయ్ హజారే ట్రోఫీ సీజన్ లో గంభీర్ స్థానంలో రిషబ్ పంత్ ను ఢిల్లీ కెప్టెన్ గా నియమించిన సంగతి తెలింసిందే. ఈ ట్రోఫీ సందర్భంగా ఢిల్లీ కోచ్ కేపీ భాస్కర్ ను గంభీర్ తీవ్రంగా దూషించాడు. కోచ్ చెత్త నిర్ణయాల వల్లే ఢిల్లీ జట్టు పేలవ ప్రదర్శన చేసిందంటూ మండిపడ్డాడు. ఈ క్రమంలోనే కోచ్ పై అసభ్య పదజాలాన్ని ఉపయోగించాడు. దాంతో అతనిపై నాలుగు మ్యాచ్ ల నిషేధం పడింది. అప్పట్నుంచి డీడీసీఏతో సఖ్యత కోల్పోయిన గంభీర్.. తాజాగా కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. -
ఇండో–జర్మన్ ప్రాజెక్టుపై ఆరా
బుక్కపట్నం : మండలంలోని బుక్కపట్నం, అగ్రహారం పంచాయతీ పరిధిలో ఇండో–జర్మ¯ŒS ప్రాజెక్టు ఆధ్వర్యంలో జరుగుతున్న పనుల్లో ప్రజల భాగస్వామ్యంపై ఢిల్లీ ప్రతినిధి బృందం సభ్యులు గురువారం ఆరా తీశారు. స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీడీఓ విజయలక్ష్మి, ఉపాధి సిబ్బందితో సమావేశమయ్యారు. బృంధం సభ్యులు వివేకానంద, నీతు తదితరులు ఎంపిౖకెన పల్లెల్లో గ్రామసభలు నిర్వహించి ప్రజల భాగస్వామ్యం కల్పిస్తున్నారా? అని ఉపాధి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా పనులకు సంబంధించిన సాఫ్ట్‌వేర్‌ను పరిశీలించారు. కార్యక్రమంలో ఏపీఓ అనిల్‌కుమార్‌రెడ్డి, సర్పంచ్ యశోద తదితరులు పాల్గొన్నారు. -
జువ్వలదిన్నెలో ఢిల్లీ బృందం
మినీ ఫిషింగ్ హార్బర్ నిర్మాణంపై ఆరా బిట్రగుంట: బోగోలు మండలం జువ్వలదిన్నెలో మినీ ఫిషింగ్ హార్బర్ నిర్మించే ప్రాంతాన్ని ఢిల్లీకి చెందిన వ్యాప్కోస్ అధికారులు మంగళవారం పరిశీలించారు. వ్యాప్కోస్ చీఫ్ ఇంజనీర్ రమణతో కూడిన అధికారుల బృందం మినీ ఫిషింగ్‌హార్బర్ నిర్మించే ప్రాంతంలోని వాతావరణ పరిస్థితులు, తీరంలోని వృక్ష సంపద, పర్యావరణ పరిస్థితులపై ఆరా తీసింది. సుమారు రూ.300 కోట్లతో ప్రత్యక్షంగా, పరోక్షంగా ఐదువేల మందికి ఉపాధి కల్పించే లక్ష్యంతో 550 పడవల సామర్ధ్యంతో మినీ ఫిషింగ్ హార్బర్ నిర్మాణానికి జువ్వలదిన్నెలో ఏడాదిన్నర నుంచి అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే మట్టి పరీక్షలతో పాటు హైడ్రోగ్రాఫికల్, ఆర్థిక, సామాజిక సర్వేలు కూడా పూర్తయ్యాయి. వాతావరణ పరిస్థితులను అధ్యయనం చేసేందుకు ప్రత్యేక పరికరాలు కూడా ఏర్పాటు చేసి విశ్లేషిస్తున్నారు. ఈక్రమంలో ఫిషింగ్ హార్బర్ నిర్మాణం కారణంగా పర్యావర ణ సంబంధిత అంశాలను అధికారులు పరిశీలించారు. మరో పది రోజుల్లో మరో బృందం పరిశీలించి తుది నివేదికను ప్రభుత్వానికి అందించనున్నట్లు ఈసందర్భంగా వ్యాప్కోస్ అధికారులు తెలిపారు. వారి వెంట కావలి మత్స్యశాఖ అధికారి ప్రసాద్ ఉన్నారు. -
యు ముంబా డబుల్ హ్యాట్రిక్
న్యూఢిల్లీ: ప్రొ కబడ్డీ లీగ్‌లో యు ముంబా జట్టు దూకుడు కనబరుస్తోంది. గురువారం బెంగళూరు బుల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 39-18తో ఘనవిజయం సాధిం చింది. ఈ జట్టుకు ఇది వరుసగా ఆరో విజయం కావడం విశేషం. దీంతో ఆడిన పది మ్యాచ్‌ల్లో ఎనిమిది విజయాలందుకున్న ముంబా 40 పాయింట్లతో రెండో స్థానానికి ఎగబాకింది. ప్రథమార్ధంలో 16-5తో ఆధిక్యంలో ఉన్న ముంబాకు ఆ తర్వాత కూడా ప్రత్యర్థి నుంచి ఎలాంటి అడ్డంకి ఎదురుకాలేదు. కెప్టెన్ అనూప్ కుమార్, రిశాంక్ దేవడిగ ఆరేసి రైడింగ్ పాయింట్లు సాధించారు. బెంగళూరు నుంచి పవన్ కుమార్ నాలుగు రైడింగ్ పాయింట్లు సాధించాడు. పట్నా జోరు: ప్రొ కబడ్డీ లీగ్‌లో తమ అగ్రస్థానాన్ని పట్నా పైరేట్స్ జట్టు మరింత పటిష్టం చేసుకుంది. ఇప్పటిదాకా ఒక్క మ్యాచ్ మాత్రమే ఓడిన ఈ జట్టు... గురువారం దబాంగ్ ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో 67-34 తేడాతో తిరుగులేని విజయాన్ని అందుకుంది. లీగ్‌లో అట్టడుగున ఉన్న ఢిల్లీ ఆటగాళ్లు ఏస్థాయిలోనూ ఆకట్టుకోలేకపోయారు. ప్రారంభం నుంచే చెలరేగిన పట్నా ఆటగాళ్లు వరుసగా పాయింట్లు సాధిస్తూ ఢిల్లీపై పైచేయి సాధించారు. దీంతో ప్రథమార్ధం ముగిసే సరికి 37-17తో జోరు మీదుంది. పట్నా తరఫున కెప్టెన్ రోహిత్ కుమార్ అత్యధికంగా 15 రైడ్ పాయింట్లు సాధించగా ఢిల్లీ జట్టులో సుర్జీత్ సింగ్ 12 రైడ్ పాయింట్లు సాధించాడు. -
ఢిల్లీని వదిలేయనున్న వీరూ!
డాషింగ్ బ్యాట్స్‌మన్ వీరేంద్ర సెహ్వాగ్ ఢిల్లీ క్రికెట్ జట్టుతో తన సుదీర్ఘ అనుబంధానికి ముగింపు పలికే ఆలోచనలో ఉన్నాడు. ఢిల్లీ జట్టులో కొత్త కుర్రాళ్లకు అవకాశాలు దక్కేందుకు గాను తాను మరో క్రికెట్ జట్టును ఎంచుకోవాలని భావిస్తున్నాడు. వీరూకు ఇప్పటికే పలు రాష్ట్రాల రంజీ జట్ల నుంచి ఆఫర్లు ఉన్నాయి. ఢిల్లీ తరఫున అత్యంత విజయవంతమైన క్రికెటర్‌గా సెహ్వాగ్‌కు పేరుంది. మూడు ఫార్మాట్లలో కలిపి 17 వేలకు పైగా పరుగులు సాధించాడు. -
ద్రవిడ్ ‘స్కూల్ ఆఫ్ క్రికెట్’
రాజస్థాన్‌కు దిగ్గజం అండ మెంటర్‌గా ద్రవిడ్ భిన్నమైన శైలి రాయల్స్ పురోగతిలో కీలక పాత్ర సాక్షి క్రీడావిభాగం ఐపీఎల్లో ఢిల్లీ జట్టుతో మ్యాచ్‌కు ముందు రోజు రాజస్థాన్ రాయల్స్ ప్రాక్టీస్ సెషన్...అందరికంటే ముందుగా మైదానంలోకి జట్టు మెంటర్ రాహుల్ ద్రవిడ్ వచ్చాడు. అతడిని అనుసరించిన ఆటగాళ్లు వార్మప్‌లో మునిగిపోయారు. ఆలోగా గ్రౌండ్లో ఒక మూలకు వెళ్లిన ద్రవిడ్... వైట్ బోర్డు, మార్కర్‌తో సిద్ధమయ్యాడు. ప్లేయర్లు ఎక్సర్సైజ్ చేసి తిరిగొచ్చే సరికి అది ఒక మ్యాథమెటిక్స్ క్లాస్‌లాగా కనిపించింది. దానిపై స్పష్టంగా నెట్ సెషన్ వివరాలు రాసి ఉన్నాయి. అందుబాటులో ఉన్న నాలుగు పిచ్‌లపై ఎవరెవరు బౌలింగ్ చేయాలో, ఎంత సేపు బ్యాటింగ్ ప్రాక్టీస్ చేయాలో రాశాడు. అలాగే స్పిన్నర్ కొరకు, పేసర్ కొరకు ప్రత్యేకంగా సూచనలు అన్నీ ఆ బోర్డుపై రాసి ఉన్నాయి. సాధారణంగా ప్రాక్టీస్ సెషన్లో మనకు ఇలాంటిది ఎక్కడా కనిపించదు. కోచ్‌లు నోటిమాటతో ఇలాంటివి చెబుతూ ప్రాక్టీస్‌లో భాగమవుతారు. కానీ మిస్టర్ పర్ఫెక్ట్కు అన్నీ పక్కాగా ఉండాలి మరి! మార్గదర్శకత్వం వాస్తవానికి రాయల్స్ జట్టుకు ప్యాడీ ఆప్టన్ రూపంలో పూర్తి స్థాయి కోచ్ ఉన్నారు. ఇక ఇతర ఐపీఎల్ జట్లలో ఉన్న మెంటర్లను చూస్తే ఒక సీనియర్ ఆటగాడికి మర్యాదపూర్వక హోదా కోసమే నియమించినట్లు అనిపిస్తుంది. కానీ ద్రవిడ్ మాత్రం అందరికంటే భిన్నం. గతంలో ఇదే జట్టుకు ఆడిన సమయంలో ఎంత అంకితభావం కనబర్చాడో ఇప్పుడు మెంటర్‌గా కూడా రాజస్థాన్‌కు అన్నీ తానై వ్యవహరిస్తున్నాడు. మొత్తం జట్టు ఎంపిక, తుది 11 మంది కూర్పు, విదేశీ ఆటగాళ్లను తగిన విధంగా వాడుకోవడం, వ్యూహాలు, కుర్రాళ్లకు నైతిక విలువలపై క్లాస్‌లతో బిజీ బిజీ...ఇలా ద్రవిడ్ చుట్టూనే రాయల్స్ ఉందంటే అతిశయోక్తి కాదు. దీని ఫలితంగానే రాజస్థాన్ మరో సారి మంచి విజయాలు సాధిస్తోంది. ఈ సీజన్లో ఆరు మ్యాచుల్లో ఆ జట్టు నాలుగు గెలిచింది. ఒక మ్యాచ్‌లో చెన్నైని తక్కువ స్కోరుకే కట్టడి చేయగా, మరో మ్యాచ్‌లో 191 పరుగులు చేసినా, మ్యాక్స్‌వెల్ సంచలన ఇన్నింగ్స్ రాయల్స్‌కు గెలుపును దూరం చేసింది. స్టార్ల అవరం లేకుండానే... ఈ సీజన్ ఆరంభానికి ముందు వేలంలోనూ ద్రవిడ్ ముద్ర స్పష్టంగా కనిపించింది. ఐదుగురు ఆటగాళ్లను కొనసాగించేందుకు భారీ మొత్తం ఖర్చు చేసిన తర్వాత కూడా రాజస్థాన్ ఖాతాలో చివరకు డబ్బులు మిగలడం విశేషం. ఐపీఎల్ తొలి ఏడాదినుంచి రాజస్థాన్ అండర్‌డాగ్స్‌గానే బరిలోకి దిగుతోంది. వాట్సన్ మినహా భారీ షాట్లతో విరుచుకు పడే ఆటగాళ్లు ఆ జట్టులో లేరు. అయితే ఈ సారి కూడా పరిమిత వనరులతోనే జట్టును సిద్ధం చేయడంలో భారత మాజీ కెప్టెన్ తన అనుభవాన్నంతా ఉపయోగిస్తున్నాడు. తనను కోల్‌కతా సరిగా ఉపయోగించుకోలేకపోయిందన్న రజత్ భాటియా ఇప్పుడు రాజస్థాన్ విజయాల్లో కీలకంగా మారాడు. ఇక 43 ఏళ్ల వయసులోనూ అద్భుతాలు చేస్తున్న ప్రవీణ్ తాంబే తన ప్రదర్శనకు ద్రవిడే కారణంగా చెప్పాడు. ఇక రంజీ ట్రోఫీ నాకౌట్ దశలో వరుసగా మూడు సెంచరీలు సాధించినా ఎవరికీ తెలీని కరుణ్ నాయర్...ఇప్పుడు ఒక్క ఐపీఎల్ మ్యాచ్‌తో అందరికీ పరిచయమయ్యాడు. ఈ కర్ణాటక క్రికెటర్‌ను జట్టులోకి తెచ్చింది ద్రవిడే. కివీస్ ఆటగాడు కేన్ రిచర్డ్సన్ ప్రతిభను కూడా గుర్తించి ద్రవిడ్ అతనికి వరుస అవకాశాలు ఇచ్చాడు. మున్ముందు సవాల్ ఒకే తుది జట్టుకు పరిమితం కాకుండా ఈ సారి లీగ్‌లో ఎక్కువ మంది ఆటగాళ్లను ఆడించిన జట్టు రాజస్థాన్. అయినా సరే, గతంలో రాజస్థాన్ విజయాల్లో కీలక పాత్ర పోషించిన బ్రాడ్ హాడ్జ్, కెవాన్ కూపర్లు ఇంకా ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. అండర్-19 ప్రపంచకప్ కెప్టెన్ ఉన్ముక్త్ చంద్, ఇటీవల భారత అండర్-19కు ఆడిన అంకుశ్ బైన్స్, దీపక్ హుడా రాజస్థాన్ జట్టులోనే ఉన్నారు. వీరందరినీ తగిన విధంగా వచ్చే మ్యాచుల్లో వాడుకోవాలనేది ద్రవిడ్ వ్యూహం కావచ్చు. గత ఏడాది వివాదాల బారినుంచి దూరంగా ఈ సారి జట్టుకు ద్రవిడ్ విజయవంతంగా మార్గనిర్దేశనం చేశాడు. అయితే చివరకు ఐపీఎల్ విజేతగా నిలవడమే ఏ జట్టు లక్ష్యమైనా. ఇప్పుడు ద్రవిడ్ ఆ బాధ్యతను తాను తీసుకున్నాడు. మైదానంలో బరిలోకి దిగకపోయినా అతని సాహచర్యం ఆ జట్టుకు అమూల్యం. ఇక చెన్నై సూపర్ పవర్‌గా కనిపిస్తుంటే, పంజాబ్ ఒక్కసారిగా బలంగా మారింది. ఈ నేపథ్యంలో టైటిల్ గెలిస్తే ఆ ఘనతలో అగ్ర భాగం ద్రవిడ్‌కే దక్కుతుంది. అన్నట్లు... గతంలో ఒక సారి భారత కోచ్ పదవి గురించి ప్రస్తావిస్తే ద్రవిడ్ సమయం లేదన్నాడే గానీ, చేయననలేదు. ఇప్పుడు అతని కోచింగ్ శైలి, దూరదృష్టి చూస్తే భారత్‌కు అతను కోచ్ అయ్యే రోజు దగ్గరలోనే ఉందనిపిస్తోంది! -
నాడు సభ్యులు... నేడు కోచ్‌లు...
సాక్షి, హైదరాబాద్: కర్ణాటక రంజీ ట్రోఫీ గెలుచుకోవడం ఇది ఏడోసారి. మరో ఆరుసార్లు ఆ జట్టు రన్నరప్‌గా నిలిచింది. అత్యధిక టైటిల్స్ జాబితాలో ఆ జట్టు ఢిల్లీ (7)తో సమంగా రెండో స్థానంలో నిలిచింది. తాజా సీజన్లో ఆ జట్టు సరిగ్గా ఏడు విజయాలు నమోదు చేయడం విశేషం. 2009-10 సీజన్ ఫైనల్లో ముంబై చేతిలో ఓడిన జట్టులో రాబిన్ ఉతప్ప, వినయ్ కుమార్, సతీశ్, మనీశ్ పాండే, వర్మ, గౌతమ్, మిథున్, అరవింద్ ఉన్నారు. ఇప్పుడు ఈ ఎనిమిది మంది విజేత జట్టులో భాగమయ్యారు. కర్ణాటక ఆఖరిసారిగా 1998-99 సీజన్లో సునీల్ జోషి కెప్టెన్సీలో టైటిల్ నెగ్గింది. అప్పటి టీమ్‌లో సభ్యులైన జె. అరుణ్ కుమార్, మన్సూర్ అలీఖాన్ ప్రస్తుత టీమ్‌కు బ్యాటింగ్, బౌలింగ్ కోచ్‌లుగా ఉండటం విశేషం. విజయానంతరం కర్ణాటక ఆటగాళ్ల సంబరాలు మిన్నంటాయి. డ్రెస్సింగ్ రూమ్‌లో పెద్ద ఎత్తున వారు సంబరాలు చేసుకున్నారు. ముఖ్యంగా రాబిన్ ఉతప్ప బకెట్ల నిండా నీళ్లు తెచ్చి ఆటగాళ్లపై గుమ్మరిస్తూ అదో తరహా ఆనందాన్ని వ్యక్త పరిచాడు. ఇదే జోష్‌లో ప్రసారకర్తలకు సంబంధించిన లైవ్ యు అనే సాంకేతిక పరికరాన్ని కూడా నీటితో ముంచెత్తాడు. ఫలితంగా దాదాపు రూ. 15 లక్షల విలువ చేసే ఆ పరికరంలో కొంత భాగం పని చేయకుండా ఆగిపోయింది. దానిని కొంత వరకు సరైన స్థితిలోకి తెచ్చేందుకు వారు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. తన స్నేహితురాలితో కలిసి సాక్షి దినపత్రికను చూస్తున్న కర్ణాటక జట్టు కెప్టెన్ వినయ్ కుమార్ భార్య రిచా (ఎడమ) -
ఫైనల్లో ఢిల్లీ, తమిళనాడు
సాక్షి, హైదరాబాద్: మొయినుద్దౌలా గోల్డ్‌కప్ క్రికెట్ టోర్నమెంట్లో హైదరాబాద్ జట్టు సెమీస్‌లోనే వెనుదిరిగింది. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో ఢిల్లీ జట్టు తుదిపోరుకు అర్హత సంపాదించింది. చివరి రోజు ఆటకు వర్షం అడ్డంకిగా మారింది. రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో జరిగిన మూడో రోజు ఆటలో ఢిల్లీ జట్టు రెండో ఇన్నింగ్స్‌లో 40 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 307 పరుగుల భారీ స్కోరు చేసింది. మిలింద్ కుమార్ (74 బంతుల్లో 101 నాటౌట్, 10 ఫోర్లు, 1 సిక్స్) మెరుపు సెంచరీ చేశాడు. మోహిత్ శర్మ (60 బంతుల్లో 57, 4 ఫోర్లు), పునీత్ బిస్త్ (44 బంతుల్లో 60, 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధసెంచరీలు సాధించారు. హైదరాబాద్ బౌలర్లలో సీవీ మిలింద్, ప్రజ్ఞాన్ ఓజా, ఆశిష్ రెడ్డి తలా 2 వికెట్లు తీశారు. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం 4 పరుగులు కలుపుకొని ఆతిథ్య హైదరాబాద్ ముందు 312 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. దీన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన హైదరాబాద్ ఇన్నింగ్స్‌కు వరుణుడు అడ్డంకిగా మారాడు. వర్షంతో ఆట నిలిచే సమయానికి హైదరాబాద్ రెండో ఇన్నింగ్స్‌లో 3.2 ఓవర్లలో వికెట్ నష్టానికి 11 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్‌ల్లో ఢిల్లీ 387, హైదరాబాద్ 383/8 స్కోరు చేశాయి. మరోసారి ఫైనల్‌కు తమిళనాడు డిఫెండింగ్ చాంపియన్ తమిళనాడు... ఢిల్లీతో అమీతుమీకి సిద్ధమైంది. కర్ణాటకతో జరిగిన రెండో సెమీస్‌లో తమిళనాడు జట్టు తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో ముందంజ వేసింది. ఈసీఐఎల్ మైదానంలో జరిగిన ఈ మ్యాచ్‌లో చివరి రోజు కర్ణాటక రెండో ఇన్నింగ్స్‌లో 38.4 ఓవర్లలో 242 పరుగులకు ఆలౌటైంది. రాహుల్ (104 బంతుల్లో 102, 9 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీ చేశాడు. తమిళ బౌలర్లు రాహిల్ షా, రోహిత్ చెరో 3 వికెట్లు తీశారు. తర్వాత 238 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన తమిళనాడు వర్షంతో ఆట నిలిచే సమయానికి 3 ఓవర్లలో వికెట్ కోల్పోకుండా 13 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్‌ల్లో కర్ణాటక 387, తమిళనాడు 392 పరుగులు చేశాయి. ఫైనల్ మ్యాచ్ 10 నుంచి ఉప్పల్ స్టేడియంలో జరగనుంది.