గంభీర్‌ సెంచరీ సెమీస్‌లో ఢిల్లీ | Gautam Gambhir leads Delhi to Vijay Hazare semis | Sakshi
Sakshi News home page

గంభీర్‌ సెంచరీ సెమీస్‌లో ఢిల్లీ

Published Mon, Oct 15 2018 5:10 AM | Last Updated on Mon, Oct 15 2018 5:10 AM

Gautam Gambhir leads Delhi to Vijay Hazare semis - Sakshi

బెంగళూరు: తన 37వ పుట్టిన రోజున అద్భుత సెంచరీతో అలరించిన గౌతమ్‌ గంభీర్‌ (72 బంతుల్లో 104; 16 ఫోర్లు)... విజయ్‌ హజారే ట్రోఫీ దేశవాళీ వన్డే టోర్నమెంట్‌లో ఢిల్లీ జట్టును సెమీఫైనల్‌కు చేర్చాడు. హరియాణాతో ఆదివారం జరిగిన క్వార్టర్‌ ఫైనల్లో గంభీర్‌ సారథ్యంలోని ఢిల్లీ జట్టు ఐదు వికెట్ల తేడాతో గెలిచింది. తొలుత హరియాణా 49.1 ఓవర్లలో 229 పరుగులకు ఆలౌటైంది. ఢిల్లీ బౌలర్‌ కుల్వంత్‌ ఖెజ్రోలియా (6/31) ‘హ్యాట్రిక్‌’ సహా ఆరు వికెట్లు తీశాడు. ఇన్నింగ్స్‌ 39వ ఓవర్‌లో కుల్వంత్‌ వరుస బంతుల్లో చైతన్య బిష్ణోయ్, ప్రమోద్‌ చండీలా, అమిత్‌ మిశ్రాలను ఔట్‌ చేసి ‘హ్యాట్రిక్‌’ సాధించాడు. గంభీర్‌ చెలరేగడంతో 230 పరుగుల లక్ష్యాన్ని ఢిల్లీ 39.2 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి అధిగమించింది. నేడు జరిగే క్వార్టర్‌ ఫైనల్లో ఆంధ్రతో హైదరాబాద్‌ తలపడనుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement