సాక్షి, హైదరాబాద్: కర్ణాటక రంజీ ట్రోఫీ గెలుచుకోవడం ఇది ఏడోసారి. మరో ఆరుసార్లు ఆ జట్టు రన్నరప్‌గా నిలిచింది. అత్యధిక టైటిల్స్ జాబితాలో ఆ జట్టు ఢిల్లీ (7)తో సమంగా రెండో స్థానంలో నిలిచింది.
తాజా సీజన్‌లో ఆ జట్టు సరిగ్గా ఏడు విజయాలు నమోదు చేయడం విశేషం. 2009-10 సీజన్ ఫైనల్లో ముంబై చేతిలో ఓడిన జట్టులో రాబిన్ ఉతప్ప, వినయ్ కుమార్, సతీశ్, మనీశ్ పాండే, వర్మ, గౌతమ్, మిథున్, అరవింద్ ఉన్నారు. ఇప్పుడు ఈ ఎనిమిది మంది విజేత జట్టులో భాగమయ్యారు. కర్ణాటక ఆఖరిసారిగా 1998-99 సీజన్‌లో సునీల్ జోషి కెప్టెన్సీలో టైటిల్ నెగ్గింది. అప్పటి టీమ్‌లో సభ్యులైన జె. అరుణ్ కుమార్, మన్సూర్ అలీఖాన్ ప్రస్తుత టీమ్‌కు బ్యాటింగ్, బౌలింగ్ కోచ్‌లుగా ఉండటం విశేషం. విజయానంతరం కర్ణాటక ఆటగాళ్ల సంబరాలు మిన్నంటాయి.
డ్రెస్సింగ్ రూమ్‌లో పెద్ద ఎత్తున వారు సంబరాలు చేసుకున్నారు. ముఖ్యంగా రాబిన్ ఉతప్ప బకెట్ల నిండా నీళ్లు తెచ్చి ఆటగాళ్లపై గుమ్మరిస్తూ అదో తరహా ఆనందాన్ని వ్యక్త పరిచాడు. ఇదే జోష్‌లో ప్రసారకర్తలకు సంబంధించిన లైవ్ యు అనే సాంకేతిక పరికరాన్ని కూడా నీటితో ముంచెత్తాడు. ఫలితంగా దాదాపు రూ. 15 లక్షల విలువ చేసే ఆ పరికరంలో కొంత భాగం పని చేయకుండా ఆగిపోయింది. దానిని కొంత వరకు సరైన స్థితిలోకి తెచ్చేందుకు వారు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది.
తన స్నేహితురాలితో కలిసి సాక్షి దినపత్రికను చూస్తున్న కర్ణాటక జట్టు కెప్టెన్ వినయ్ కుమార్ భార్య రిచా (ఎడమ)
నాడు సభ్యులు... నేడు కోచ్‌లు...
Published Mon, Feb 3 2014 12:08 AM | Last Updated on Tue, Oct 30 2018 5:51 PM
Advertisement