సాక్షి, విశాఖపట్నం: సయ్యద్ ముస్తాక్ అలీ టి20 సౌత్‌జోన్ క్రికెట్ టోర్నమెంట్‌లో హైదరాబాద్ జట్టుకు తొలి ఓటమి ఎదురైంది. గురువారం ఇక్కడి వైఎస్ రాజశేఖర రెడ్డి ఏసీఏ వీడీసీఏ మైదానంలో జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కర్ణాటక 5 వికెట్లకు 205 పరుగులు చేసింది. అనంతరం బరిలోకి దిగిన హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి... 203 పరుగులకే పరిమితమైంది. ఓపెనర్లు అక్షత్ రెడ్డి (29 బంతుల్లో 70; 3 ఫోర్లు, 7 సిక్స్‌లు), తన్మయ్ అగర్వాల్ (23 బంతుల్లో 38; 1 ఫోర్, 4 సిక్స్‌లు) దుమ్మురేపడంతో ఓ దశలో హైదరాబాద్ సునాయాసంగా విజయం సాధిస్తుందనిపించినా.. కర్ణాటక బౌలర్లు చెలరేగి వరుస విరామాల్లో వికెట్లు తీయడంతో లక్ష్యానికి 2 పరుగుల దూరంలో నిలిచిపోయింది. చివర్లో సందీప్ (19 బంతుల్లో 34; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) ధాటిగా ఆడినా ఓటమిని తప్పించలేకపోయాడు. కర్ణాటక బౌలర్లలో స్టువర్ట్ బిన్నీకి 3 వికెట్లు దక్కాయి.
అంతకుమందు కరుణ్ నాయర్ (77; 10 ఫోర్లు, 1 సిక్స్), గౌతమ్ (57; 4 ఫోర్లు, 4 సిక్స్‌లు) చెలరేగడంతో కర్ణాటక భారీ స్కోరు చేసింది. హైదరాబాద్ బౌలర్లలో రవికిరణ్‌కు 2, మెహదీ హసన్, సిరాజ్‌లు చెరో వికెట్ పడగొట్టారు. కేరళతో జరిగిన మరో మ్యాచ్‌లో ఆంధ్ర జట్టు 6 వికెట్లతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన కేరళ 12 ఓవర్లలో 120 పరుగులకు ఆలౌటైంది. వినోద్ (45; 3 ఫోర్లు; 4 సిక్స్‌లు) ఆకట్టుకున్నాడు. ఆంధ్ర బౌలర్లలో హరిశంకర్ రెడ్డికి 4, అయ్యప్ప బండారుకు 3 వికెట్లు దక్కాయి. అనంతరం ఆంధ్ర 13 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 126 పరుగులు చేసి గెలుపొందింది. ఓపెనర్లు అశ్విన్ హెబ్బర్ (34 బంతుల్లో 64; 6 ఫోర్లు, 4 సిక్స్‌లు), విహారి (25; 4 ఫోర్లు) ఆకట్టుకున్నారు.
2 పరుగులతో...
Published Fri, Jan 12 2018 12:55 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment