south zone cricket
-
2 పరుగులతో...
సాక్షి, విశాఖపట్నం: సయ్యద్ ముస్తాక్ అలీ టి20 సౌత్‌జోన్ క్రికెట్ టోర్నమెంట్లో హైదరాబాద్ జట్టుకు తొలి ఓటమి ఎదురైంది. గురువారం ఇక్కడి వైఎస్ రాజశేఖర రెడ్డి ఏసీఏ వీడీసీఏ మైదానంలో జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కర్ణాటక 5 వికెట్లకు 205 పరుగులు చేసింది. అనంతరం బరిలోకి దిగిన హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి... 203 పరుగులకే పరిమితమైంది. ఓపెనర్లు అక్షత్ రెడ్డి (29 బంతుల్లో 70; 3 ఫోర్లు, 7 సిక్స్‌లు), తన్మయ్ అగర్వాల్ (23 బంతుల్లో 38; 1 ఫోర్, 4 సిక్స్‌లు) దుమ్మురేపడంతో ఓ దశలో హైదరాబాద్ సునాయాసంగా విజయం సాధిస్తుందనిపించినా.. కర్ణాటక బౌలర్లు చెలరేగి వరుస విరామాల్లో వికెట్లు తీయడంతో లక్ష్యానికి 2 పరుగుల దూరంలో నిలిచిపోయింది. చివర్లో సందీప్ (19 బంతుల్లో 34; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) ధాటిగా ఆడినా ఓటమిని తప్పించలేకపోయాడు. కర్ణాటక బౌలర్లలో స్టువర్ట్ బిన్నీకి 3 వికెట్లు దక్కాయి. అంతకుమందు కరుణ్ నాయర్ (77; 10 ఫోర్లు, 1 సిక్స్), గౌతమ్ (57; 4 ఫోర్లు, 4 సిక్స్‌లు) చెలరేగడంతో కర్ణాటక భారీ స్కోరు చేసింది. హైదరాబాద్ బౌలర్లలో రవికిరణ్‌కు 2, మెహదీ హసన్, సిరాజ్‌లు చెరో వికెట్ పడగొట్టారు. కేరళతో జరిగిన మరో మ్యాచ్‌లో ఆంధ్ర జట్టు 6 వికెట్లతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన కేరళ 12 ఓవర్లలో 120 పరుగులకు ఆలౌటైంది. వినోద్ (45; 3 ఫోర్లు; 4 సిక్స్‌లు) ఆకట్టుకున్నాడు. ఆంధ్ర బౌలర్లలో హరిశంకర్ రెడ్డికి 4, అయ్యప్ప బండారుకు 3 వికెట్లు దక్కాయి. అనంతరం ఆంధ్ర 13 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 126 పరుగులు చేసి గెలుపొందింది. ఓపెనర్లు అశ్విన్ హెబ్బర్ (34 బంతుల్లో 64; 6 ఫోర్లు, 4 సిక్స్‌లు), విహారి (25; 4 ఫోర్లు) ఆకట్టుకున్నారు. -
కర్ణాటకపై ఆంధ్ర గెలుపు
సాక్షి, విజయనగరం: సయ్యద్ ముస్తాక్ అలీ టి20 సౌత్‌జోన్ క్రికెట్ టోర్నమెంట్లో ఆంధ్ర జట్టు తొలి విజయం నమోదు చేసింది. కర్ణాటకతో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో ఆంధ్ర జట్టు ఏడు వికెట్ల తేడాతో గెలిచింది. 157 పరుగుల లక్ష్యాన్ని ఆంధ్ర 18.2 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి అధిగమించింది. రికీ భుయ్ (34 బంతుల్లో 46 నాటౌట్; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు), అశ్విన్ హెబ్బర్ (25 బంతుల్లో 35; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), హనుమ విహారి (19 బంతుల్లో 26; 4 ఫోర్లు), రవితేజ (26 బంతుల్లో 33; 4 ఫోర్లు) ధాటిగా ఆడారు. అంతకుముందు కర్ణాటక 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లకు 156 పరుగులు చేసింది. స్టువర్ట్ బిన్నీ (32 బంతుల్లో 47 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఆంధ్ర బౌలర్లలో శశికాంత్ మూడు వికెట్లు... శివ కుమార్, బండారు అయ్యప్ప రెండేసి వికెట్లు తీశారు. వైజాగ్‌లో జరిగిన మరో మ్యాచ్‌లో హైదరాబాద్ జట్టు 19 పరుగుల తేడాతో గోవాను ఓడించి వరుసగా రెండో విజయాన్ని సొంతం చేసుకుంది. -
కడప విజయఢంకా
కడప స్పోర్ట్స్: కడప నగరంలోని వైఎస్ రాజారెడ్డి–ఏసీఏ క్రికెట్ మైదానంలో నిర్వహిస్తున్న ముండ్ల చంద్రశేఖరరెడ్డి స్మారక సౌత్‌జోన్ అంతర్ జిల్లాల అండర్–16 మహిళా క్రికెట్ పోటీల్లో శనివారం కర్నూలు, నెల్లూరు జట్లు విజయం సాధించాయి. ఉదయం నిర్వహించిన మ్యాచ్‌లో కర్నూలు, చిత్తూరు జట్లు తలపడ్డాయి. టాస్‌గెలిచిన కర్నూలు జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. నిర్ణీత 25 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 189 పరుగులు చేసింది. జట్టులోని ఎం. అనూష 90, షాజాది 42 పరుగులు చేశారు. చిత్తూరు బౌలర్ రేఖ 1 వికెట్ తీసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన చిత్తూరు జట్టు 24.4 ఓవర్లలో 68 పరుగులకు ఆలౌట్ అయింది. జట్టులోని అఖిల 26 పరుగులు చేసింది. కర్నూలు బౌలర్లు నరసమ్మ 3, లక్ష్మి, అరుణ, సుప్రజ తలా రెండు వికెట్లు తీశారు. దీంతో కర్నూలు జట్టు 121 పరుగుల భారీ ఆధిక్యంతో విజయం సాధించింది. దీంతో కర్నూలు జట్టుకు 4 పాయింట్లు లభించాయి. అనంతపురంపై నెల్లూరు ఘనవిజయం.. మధ్యాహ్నం నిర్వహించిన మ్యాచ్‌లో అనంతపురం–నెల్లూరు జట్లు తలపడ్డాయి. టాస్‌గెలిచిన అనంత జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. నిర్ణీత 25 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 144 పరుగులు చేసింది. జట్టులోని పి. పల్లవి 54 నాటౌట్, అనూష 29 పరుగులు చేశారు. నెల్లూరు బౌలర్లు రేణుక, హరిత, శ్రీదివ్య తలా ఒక వికెట్ తీశారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన నెల్లూరు జట్టు 20.3 ఓవర్లలోనే 2 వికెట్ల నష్టానికి 145 పరుగులు చేసి విజయం సాధించింది. జట్టులోని ఐశ్వర్యారాయ్ 68 నాటౌట్, సింధుజ 47 పరుగులు చేశారు. దీంతో నెల్లూరు జట్టు 8 వికెట్ల తేడాతో విజయం సాధించి 4 పాయింట్లు సాధించింది. -
అంతర్‌జిల్లాల మహిళా క్రికెట్ విజేత కర్నూలు
కడప స్పోర్ట్స్: కడప నగరంలో ఈనెల 18న ప్రారంభమైన సౌత్‌జోన్ అంతర్ జిల్లాల సీనియర్ మహిళా క్రికెట్ పోటీల విజేతగా కర్నూలు జట్టు నిలిచి కె.ఈ మదన్న స్మారక ట్రోఫీని అందుకుంది. రన్నరప్‌గా కడప జట్టు నిలిచింది. విజేతలకు ట్రోఫీ బహుకరణ కార్యక్రమం శనివారం సాయంత్రం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన సౌత్‌జోన్ కార్యదర్శి డి. నాగేశ్వరరాజు మాట్లాడుతూ ఈ పోటీల్లో చాలామంది క్రీడాకారిణులు తొలిసారి పాల్గొన్నారన్నారు. సీనియర్ క్రీడాకారుల నుంచి ఆటలో మెలుకువలు గ్రహించాలని సూచించారు. గతంతో పోల్చితే క్రికెట్లో మహిళలకు ఆదరణ గణనీయంగా పెరిగిందన్నారు. సౌత్‌జోన్ జట్టుకు ఎంపికకాని క్రీడాకారిణులు నిరుత్సాహానికి లోనుకాకుండా మరింత సాధన చేస్తే అవకాశాలు ఉంటాయని సూచించారు. సౌత్‌జోన్ జట్టుకు ఎంపికైన క్రీడాకారిణులు రాష్ట్రస్థాయి మ్యాచ్‌లలో రాణించాలని సూచించారు. ఇండియన్ ఉమన్ క్రికెటర్ రావి కల్పన మాట్లాడుతూ క్రీడాకారిణులు చక్కటి ప్రతిభతో జట్టులో స్థానం సుస్థిరం చేసుకోవాలని సూచించారు. అనంతరం విన్నర్స్టీం, రన్నర్స్‌గా నిలిచిన జట్లకు ట్రోఫీలు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా క్రికెట్ అసోసియేషన్ కోశాధికారి వై.శివప్రసాద్, సంయుక్త కార్యదర్శి నాగసుబ్బారెడ్డి, సభ్యులు మునికుమార్‌రెడ్డి, కోచ్‌లు ఖాజామైనుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. కడపపై కర్నూలు ఘన విజయం.. వైఎస్ రాజారెడ్డి–ఏసీఏ క్రికెట్ మైదానంలో శనివారం నిర్వహించిన మ్యాచ్‌లో కడప, కర్నూలు జట్లుతలపడ్డాయి. టాస్ గెలిచిన కర్నూలు జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 283 పరుగుల భారీ స్కోరు చేసింది. జట్టులోని చంద్రలేఖ 103 పరుగులతో నాటౌట్‌గా నిలిచింది. శరణ్య 43, అనూష 37 పరుగులు చేసింది. కడప బౌలర్ ఓబులమ్మ 3 వికెట్లు తీసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన కడప జట్టు 43.5 ఓవర్లలోనే 117 పరుగులకే ఆలౌట్ అయింది. జట్టులోని రోజా 46 పరుగులు చేసింది. కర్నూలు బౌలర్ అంజలి శర్వాణి 4 వికెట్లు, చంద్రలేఖ 2, సురేఖ 2 వికెట్లు తీశారు. దీంతో కర్నూలు జట్టు 166 పరుగుల ఆధిక్యంతో విజయం సాధించింది. దీంతో కర్నూలు జట్టు 4 పాయింట్లు పొంది పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. చిత్తూరుపై నెల్లూరు విజయం... కేఎస్ఆర్ఎం క్రీడామైదానంలో నెల్లూరు, చిత్తూరు జట్లు తలపడ్డాయి.టాస్ గెలిచిన చిత్తూరు జట్టు బ్యాటింగ్‌కు దిగింది. నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 140పరుగులు చేసింది. జట్టులోని డి. ప్రవళ్లిక 59, శరణ్య 28 పరుగులు చేశారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన నెల్లూరు జట్టు 41 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 143 పరుగులు చేసి విజయం సాధించింది. జట్టులోని మాధురి 78, ఐశ్వర్య 14, సింధుజ 9 పరుగులు చేశారు. దీంతో నెల్లూరు జట్టు 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో నెల్లూరుకు 4 పాయింట్లు లభించాయి