కడప విజయఢంకా | kadapa won by chittore | Sakshi
Sakshi News home page

కడప విజయఢంకా

Published Sat, Aug 27 2016 10:10 PM | Last Updated on Mon, Sep 4 2017 11:10 AM

కడప విజయఢంకా

కడప విజయఢంకా

కడప స్పోర్ట్స్‌:
కడప నగరంలోని వైఎస్‌ రాజారెడ్డి–ఏసీఏ క్రికెట్‌ మైదానంలో నిర్వహిస్తున్న ముండ్ల చంద్రశేఖరరెడ్డి స్మారక సౌత్‌జోన్‌ అంతర్‌ జిల్లాల అండర్‌–16 మహిళా క్రికెట్‌ పోటీల్లో శనివారం కర్నూలు, నెల్లూరు జట్లు విజయం సాధించాయి. ఉదయం నిర్వహించిన మ్యాచ్‌లో కర్నూలు, చిత్తూరు జట్లు తలపడ్డాయి. టాస్‌గెలిచిన కర్నూలు జట్టు బ్యాటింగ్‌ ఎంచుకుంది. నిర్ణీత 25 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 189 పరుగులు చేసింది. జట్టులోని ఎం. అనూష 90, షాజాది 42 పరుగులు చేశారు. చిత్తూరు బౌలర్‌ రేఖ 1 వికెట్‌ తీసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన చిత్తూరు జట్టు 24.4 ఓవర్లలో 68 పరుగులకు ఆలౌట్‌ అయింది. జట్టులోని అఖిల 26 పరుగులు చేసింది. కర్నూలు బౌలర్లు నరసమ్మ 3, లక్ష్మి, అరుణ, సుప్రజ తలా రెండు వికెట్లు తీశారు. దీంతో కర్నూలు జట్టు 121 పరుగుల భారీ ఆధిక్యంతో విజయం సాధించింది. దీంతో కర్నూలు జట్టుకు 4 పాయింట్లు లభించాయి.
 
అనంతపురంపై నెల్లూరు ఘనవిజయం..
మధ్యాహ్నం నిర్వహించిన మ్యాచ్‌లో అనంతపురం–నెల్లూరు జట్లు తలపడ్డాయి. టాస్‌గెలిచిన అనంత జట్టు బ్యాటింగ్‌ ఎంచుకుంది. నిర్ణీత 25 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 144 పరుగులు చేసింది. జట్టులోని పి. పల్లవి 54 నాటౌట్, అనూష 29 పరుగులు చేశారు. నెల్లూరు బౌలర్లు రేణుక, హరిత, శ్రీదివ్య తలా ఒక వికెట్‌ తీశారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన నెల్లూరు జట్టు 20.3 ఓవర్లలోనే 2 వికెట్ల నష్టానికి 145 పరుగులు చేసి విజయం సాధించింది. జట్టులోని ఐశ్వర్యారాయ్‌ 68 నాటౌట్, సింధుజ 47 పరుగులు చేశారు. దీంతో నెల్లూరు జట్టు 8 వికెట్ల తేడాతో విజయం సాధించి 4 పాయింట్లు సాధించింది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement