ఆదుకున్న విహారి, సుమంత్‌ | Andhra 177/5 ∙ Ranji match with Madhya Pradesh | Sakshi
Sakshi News home page

ఆదుకున్న విహారి, సుమంత్‌

Published Fri, Nov 3 2017 12:07 AM | Last Updated on Fri, Nov 3 2017 12:07 AM

Andhra 177/5 ∙ Ranji match with Madhya Pradesh - Sakshi

సాక్షి, విజయనగరం: కెప్టెన్‌ హనుమ విహారి (77; 7 ఫోర్లు, ఒక సిక్స్‌), సుమంత్‌ (57; 9 ఫోర్లు) అర్ధ సెంచరీలతో రాణించడంతో... మధ్యప్రదేశ్‌తో జరుగుతున్న రంజీ ట్రోఫీ గ్రూప్‌ ‘సి’ మ్యాచ్‌లో రెండో రోజు ఆటముగిసే సమయానికి ఆంధ్ర జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్లకు 177 పరుగులు చేసింది. ఓపెనర్‌ ప్రశాంత్‌ కుమార్‌ (30; 5 ఫోర్లు) కూడా రాణించాడు. డీబీ రవితేజ 7 పరుగులతో, అశ్విన్‌ హెబ్బర్‌ పరుగులేమీ చేయకుండా క్రీజులో ఉన్నారు.

రెండో వికెట్‌కు ప్రశాంత్‌తో 73 పరుగులు జోడించిన విహారి... నాలుగో వికెట్‌కు సుమంత్‌తో 76 పరుగులు జతచేశాడు. అంతకుముందు ఓవర్‌నైట్‌ స్కోరు 219/5తో తొలి ఇన్నింగ్స్‌ కొనసాగించిన మధ్యప్రదేశ్‌ జట్టు 321 పరుగులకు ఆలౌటైంది. హర్‌ప్రీత్‌ సింగ్‌ (88; 9 ఫోర్లు) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. ఆంధ్ర బౌలర్లలో యెర్రా పృథ్వీరాజ్‌ నాలుగు వికెట్లు తీయగా... బండారు అయ్యప్ప, శశికాంత్‌ రెండేసి వికెట్లు పడగొట్టారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement