టీమిండియాతో టెస్టు సిరీస్‌లో ఇంగ్లండ్ స్టార్ జానీ బెయిర్ స్టో పేలవ ప్రదర్శన కొనసాగిస్తున్నాడు. తొలి రెండు టెస్టుల్లో దారుణంగా విఫలమైన బెయిర్ స్టో.. తాజాగా రాజ్‌కోట్ వేదికగా జరుగుతున్న మూడో టెస్టులో సైతం అదే తీరును కనబరిచాడు. తొలి ఇన్నింగ్స్‌లో బెయిర్ స్టో ఖాతా తెరవకుండానే పెవిలియన్‌కు చేరాడు.
భారత స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో జానీ వికెట్ల ముందు దొరికిపోయాడు. దీంతో బెయిర్ స్టో డకౌట్‌గా వెనుదిరిగాడు. తద్వారా అత్యంత చెత్త రికార్డును బెయిర్ స్టో తన పేరిట లిఖించుకున్నాడు. టెస్టు క్రికెట్‌లో భారత్‌పై అత్యధిక సార్లు డకౌటైన ఆటగాడిగా బెయిర్ స్టో నిలిచాడు.
ఈ ఇంగ్లీష్ బ్యాటర్ ఇప్పటివరకు టెస్టుల్లో భారత్‌పై 8 సార్లు డకౌటయ్యాడు. కాగా అంతకుముందు ఈ చెత్త రికార్డు పాకిస్తాన్ మాజీ ఆటగాడు డనేష్ కనేరియా పేరిట ఉండేది. కనేరియా 7 సార్లు భారత్‌పై డకౌటయ్యాడు. ఇక తాజా మ్యాచ్‌తో కనేరియాను బెయిర్ స్టో అధిగమించాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఇంగ్లండ్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 319 పరుగులకు ఆలౌటైంది.
207/2 ఓవర్ నైట్ స్కోరుతో మూడో రోజు ఆటను ప్రారంభించిన ఇంగ్లండ్.. అదనంగా 112 పరుగులు చేసి తమ ఇన్నింగ్స్‌ను ముగించింది. ఇంగ్లండ్ బ్యాటర్లలో బెన్ డకెట్(153) అద్బుతమైన సెంచరీతో చెలరేగాడు. భారత బౌలర్లలో సిరాజ్‌తో పాటు కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా తలా రెండు వికెట్లు పడగొట్టారు. కాగా తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియాకు 126 పరుగుల ఆధిక్యం లభించింది. అనంతరం రెండో ఇన్నింగ్స్‌లో భారత్ వికెట్ నష్టానికి 30 ఓవర్లలో 116 పరుగులు చేసింది.
Jonny Bairstow has a habit of getting out early vs India in Tests ☹️#INDvENG pic.twitter.com/G0QkGteI5q
— ESPNcricinfo (@ESPNcricinfo) February 17, 2024
Comments
Please login to add a commentAdd a comment