అడవిరాజాతో క్రికెట్ కింగ్! | Sachin Tendulkar visits Gujarat's Gir forest with family | Sakshi
Sakshi News home page

అడవిరాజాతో క్రికెట్ కింగ్!

Published Sun, Mar 23 2014 1:19 AM | Last Updated on Sat, Sep 2 2017 5:01 AM

అడవిరాజాతో క్రికెట్ కింగ్!

అడవిరాజాతో క్రికెట్ కింగ్!

గిర్ అడవుల్లో సచిన్ షికారు
 రాజ్‌కోట్: క్రికెట్‌కు వీడ్కోలు పలికిన మాస్టర్ బ్యాట్స్‌మన్ సచిన్ టెండూల్కర్ ఇప్పుడు పూర్తిగా కుటుంబ సభ్యులు, సన్నిహితులకే తన సమయాన్ని కేటాయిస్తున్నాడు. వారితో కలిసి వేర్వేరు ప్రాంతాల్లో షికారు చేస్తున్నాడు. శనివారం సచిన్ తన ఫ్యామిలీతో కలిసి ఆసియా సింహాలకు ప్రసిద్ధికెక్కిన గిర్ అడవులను సందర్శించాడు. అందులో సింహాలు ఎక్కువగా సంచరించే 15 చోట్లకు అధికారులు సచిన్‌ను తీసుకెళ్లారు.
 
 భార్య అంజలి, పిల్లలు అర్జున్, సారాలతో పాటు కొంత మంది స్నేహితులతో కలిసి సచిన్ సౌరాష్ట్ర ప్రాంతంలో రెండు రోజుల సందర్శనకు వచ్చాడు. శుక్రవారం కేంద్ర పాలిత ప్రాంతం డామన్ అండ్ డయ్యుకు అతను వెళ్లాడు. గిర్ అడవుల సందర్శన పట్ల సచిన్ సంతోషం వ్యక్తం చేశాడు. సింహాల సంరక్షణపై శ్రద్ధ తీసుకుంటున్న అధికారులను అభినందించాడు. ‘నాకు ఇదో మంచి అనుభవం. పాఠశాలలో చదువుకునే రోజుల్లో ఈ అడవులు, సింహాల గురించి చదివా. ఇన్నాళ్లకు రాగలిగా. ఇక్కడ సింహాల సంఖ్య ఎక్కువగా ఉండటానికి అధికారుల సమర్థ నిర్వహణే కారణం’ అని వ్యాఖ్యానించాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement