రాజ్‌కోట్: ఢిల్లీ, జబల్పూర్‌లను అతలాకుతలం చేసిన వర్షాలు గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లోనూ బీభత్సం సృష్టించాయి. ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ టరి్మనల్ కూలిన మరుసటి రోజే మరో ఎయిర్‌పోర్ట్ వర్షాల బారిన పడింది. రాజ్‌కోట్‌లో అక్కడి భారీ వర్షాలకు సోమవారం ఉదయం రాజ్‌కోట్ ఎయిర్‌పోర్ట్‌లో ప్రయాణికుల పికప్, డ్రాప్ ఏరియాపై నిర్మించిన భారీ టెంట్ కూలింది. అయితే ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదు. అయితే టెంట్ కూలిన ఘటనపై కాంగ్రెస్ విమర్శలు గుప్పించింది.
‘‘ ప్రధాని మోదీ స్వయంగా వచ్చి ఈ ఎయిర్‌పోర్ట్‌ను ప్రారంభించారు. 11 నెలలకే పైకప్పు కూలింది. అవినీతి ఏ స్థాయిలో ఉందో కూలిన ఘటన చాటిచెప్తోంది. ఢిల్లీ మాదిరి ఘటన వేళ అక్కడ ఎవరైనా ఉంటే జరిగే ప్రాణనష్టానికి ఎవరు బాధ్యులు?. తరచూ అవినీతిపై ప్రసంగాలు దంచే ప్రధాని అవినీతిరహిత పాలనపైనా దృష్టిసారించాలి’ అని గుజరాత్ కాంగ్రెస్ అధ్యక్షులు శక్తిసిన్హ్ గోహిల్ అన్నారు.
నెహ్రూను నిందించొద్దు: వ్యంగ్యంగా స్పందించిన బీజేపీ
రాజ్‌కోట్ ఘటనపై బీజేపీ వెటకారంగా స్పందించింది. ‘‘ నిన్నటి ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ టర్మినల్ కూటిన ఘటనతో రాజ్‌కోట్ ఘటనను పోల్చొద్దు. రాజ్‌కోట్‌లో పెనుగాలులకు టెంట్ వస్త్రం చిరిగి అది పీలికలై పడిపోయింది. తక్కువ ఎయిర్‌పోర్ట్‌లు నిర్మించారని మీరు జవహర్‌లాల్ నెహ్రూను నిందిస్తారేమో. అలా చేయకండి. ఎందుకంటే ఆయన ఇన్ని విమానాశ్రయాలు నిర్మించలేరు. ఆయనకే మనం అవకాశం ఇచ్చి ఉంటే ఇప్పటికీ మనం రక్షణ పరిశోధనాభివృద్ధి సంస్థ(డీఆర్‌డీఓ) అనుమతితో ఎడ్లబళ్లపై ప్రయాణాలు చేస్తూ ఉండేవాళ్లం’ అని బీజేపీ ఐటీ విభాగ సారథి అమిత్ మాలవీయ ‘ఎక్స్’లో ట్వీట్‌చేశారు.
Comments
Please login to add a commentAdd a comment