Tent
-
నెల రోజుల్లో టెన్త్ సిలబస్ పూర్తి చేయాలి
సాక్షి, హైదరాబాద్: పదవ తరగతి సిలబస్‌ను జనవరి 10వ తేదీ నాటికి పూర్తి చేయాలని అన్ని పాఠశాలలకు విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. సిలబస్ అయిన వెంటనే పునశ్చరణ చేపట్టాలని సూచించింది. టెన్త్ పరీక్షల్లో వందశాతం ఫలితాలు సాధించేందుకు ప్రతీ హెచ్ఎం శ్రద్ధ తీసుకోవాలని కోరింది. మంచి ఫలితాలు సాధించే స్కూళ్లకు ఈసారి ప్రభుత్వం ప్రోత్సాహకాలు ఇచ్చే అవకాశం ఉందని విద్యాశాఖ ఉన్నతాధికారులు చెబుతున్నా రు. ప్రైవేటు బడులతో సమానంగా ప్రభుత్వ పాఠశాలల్లోనూ ఫలితాలు ఉండాలన్నది ప్రభుత్వ లక్ష్య మని విద్యాశాఖ పేర్కొంది. ఈ ఏడాది కొత్తగా 11,062 మంది టీచర్ల నియామకం కూడా చేపట్టారని, పుస్తకాలు కూడా సకాలంలో అందించామని, ఫలితాలు తక్కువగా వస్తే స్కూల్ హెచ్ఎంలు సమాధానం చెప్పాల్సి ఉంటుందని అధికారులు అంటున్నారు. 30 రోజుల పక్కా ప్రణాళిక.. మార్చి నెలలో టెన్త్ పరీక్షలు జరుగుతాయి. ప్రభు త్వ స్కూల్ విద్యార్థులను సన్నద్ధం చేసేందుకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలని విద్యాశాఖ సూచించింది. ఉదయం గంట, సాయంత్రం గంట ఇప్పటికే ఈ తరగతులు నిర్వహిస్తున్నారు. సిలబస్ పూర్తయిన తర్వాత పూర్తి స్థాయిలో రివిజన్‌పైనే దృష్టి పెట్టాల్సి ఉంటుంది. ఇందులో సబ్జెక్టులో ముఖ్యమైన, కష్టమైన చాప్టర్లపై దృష్టి పెట్టాలని హెచ్ఎంలను జిల్లా విద్యాశాఖ అధికారులు ఆదేశించారు. 30 రోజుల పాటు ప్రణాళిక బద్ధంగా రివిజన్ చేయాలని తెలిపారు. బదిలీలు, పదోన్నతులతోనే కాలం పూర్తి.. జనవరి 10 నాటికి సిలబస్ పూర్తి చేయడం ఎలా సాధ్యమని పలువురు టీచర్లు ప్రశి్నస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లోని స్కూళ్లలో కొంతమేర టీచర్ల కొరత లేదని, గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితి భిన్నంగా ఉందంటున్నారు. కొన్ని పాఠశాలల్లో 40 శాతం మేర సిలబస్ మాత్రమే పూర్తయిందని డీఈవోలు ఇటీవల విద్యాశాఖకు తెలిపారు. మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో 30 శాతానికి మించి సిలబస్ పూర్తవ్వలేదంటున్నారు.డీఎస్సీ నియామకాలు చేపట్టే వరకూ అనేక చోట్ల టీచర్ల కొరత ఉంది. అక్టోబర్‌లో టీచర్లు వచి్చనా బోధన వెంటనే చేపట్టడం సాధ్యం కాలేదంటున్నారు. ఈ ఏడాది విద్యారంభంలోనే బదిలీలు, పదోన్నతులు చేపట్టారు. దీంతో చాలా స్కూళ్లలో టెన్త్ బోధన ఆలస్యంగా మొదలైందని చెబుతున్నారు. జనవరి 10 నాటికే సిలబస్ పూర్తవ్వాలనే లక్ష్యం వల్ల విద్యార్థులకు నష్టం జరుగుతుందని వారంటున్నారు. -
వర్షాలకు కూలిన రాజ్‌కోట్ ఎయిర్పోర్ట్ పైకప్పు
రాజ్‌కోట్: ఢిల్లీ, జబల్పూర్లను అతలాకుతలం చేసిన వర్షాలు గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లోనూ బీభత్సం సృష్టించాయి. ఢిల్లీ ఎయిర్పోర్ట్ టరి్మనల్ కూలిన మరుసటి రోజే మరో ఎయిర్పోర్ట్ వర్షాల బారిన పడింది. రాజ్‌కోట్‌లో అక్కడి భారీ వర్షాలకు సోమవారం ఉదయం రాజ్‌కోట్ ఎయిర్‌పోర్ట్‌లో ప్రయాణికుల పికప్, డ్రాప్ ఏరియాపై నిర్మించిన భారీ టెంట్ కూలింది. అయితే ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదు. అయితే టెంట్ కూలిన ఘటనపై కాంగ్రెస్ విమర్శలు గుప్పించింది. ‘‘ ప్రధాని మోదీ స్వయంగా వచ్చి ఈ ఎయిర్‌పోర్ట్‌ను ప్రారంభించారు. 11 నెలలకే పైకప్పు కూలింది. అవినీతి ఏ స్థాయిలో ఉందో కూలిన ఘటన చాటిచెప్తోంది. ఢిల్లీ మాదిరి ఘటన వేళ అక్కడ ఎవరైనా ఉంటే జరిగే ప్రాణనష్టానికి ఎవరు బాధ్యులు?. తరచూ అవినీతిపై ప్రసంగాలు దంచే ప్రధాని అవినీతిరహిత పాలనపైనా దృష్టిసారించాలి’ అని గుజరాత్ కాంగ్రెస్ అధ్యక్షులు శక్తిసిన్హ్ గోహిల్ అన్నారు. నెహ్రూను నిందించొద్దు: వ్యంగ్యంగా స్పందించిన బీజేపీ రాజ్‌కోట్ ఘటనపై బీజేపీ వెటకారంగా స్పందించింది. ‘‘ నిన్నటి ఢిల్లీ ఎయిర్పోర్ట్ టర్మినల్ కూటిన ఘటనతో రాజ్‌కోట్ ఘటనను పోల్చొద్దు. రాజ్‌కోట్‌లో పెనుగాలులకు టెంట్ వస్త్రం చిరిగి అది పీలికలై పడిపోయింది. తక్కువ ఎయిర్‌పోర్ట్‌లు నిర్మించారని మీరు జవహర్లాల్ నెహ్రూను నిందిస్తారేమో. అలా చేయకండి. ఎందుకంటే ఆయన ఇన్ని విమానాశ్రయాలు నిర్మించలేరు. ఆయనకే మనం అవకాశం ఇచ్చి ఉంటే ఇప్పటికీ మనం రక్షణ పరిశోధనాభివృద్ధి సంస్థ(డీఆర్డీఓ) అనుమతితో ఎడ్లబళ్లపై ప్రయాణాలు చేస్తూ ఉండేవాళ్లం’ అని బీజేపీ ఐటీ విభాగ సారథి అమిత్ మాలవీయ ‘ఎక్స్’లో ట్వీట్‌చేశారు. -
అయోధ్యలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
శ్రీరాముడు జగదానందకారకుడు. అయోధ్యలో నూతనంగా నిర్మించిన ఆలయంలో కొలువైన రామ్‌లల్లా దేదీప్యమానంగా వెలుగొందుతున్నాడు. ఆలయ గర్భగుడిలో రామ్‌లల్లా ప్రతిష్ఠాపన జరిగి వారం రోజులు దాటినా భక్తుల రద్దీ నిరంతరం కొనసాగుతూనే ఉంది. రామ్‌లల్లాను తనివితీరా దర్శించాలనే కోరిక అయోధ్యకు వచ్చే ప్రతీ ఒక్కరిలోనూ కనిపిస్తోంది. తీవ్రమైన చలి గజగజా వణికిస్తున్నా భక్తులు రామ్‌లల్లా దర్శనం కోసం బారులు తీరుతున్నారు. పిల్లలు, పెద్దలు, ముఖ్యంగా యువత శ్రీరాముని దర్శించుకునేందుకు అమితమైన ఆసక్తి కనబరుస్తోంది. అయోధ్యకు వచ్చే భక్తుల కోసం పలు సేవా సంస్థలు వివిధ ప్రాంతాల్లో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. రామ్‌పథ్ తదితర మార్గాల నుంచి వస్తున్న భక్తుల కోసం ఉచిత భోజనశాలలు అందుబాటులో ఉన్నాయి. తాజాగా బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్ రామ్‌లల్లా సందర్శకుల కోసం నిర్మించిన టెంట్ సిటీని ప్రారంభించారు. దీనిలో 25 వేల మంది భక్తులు బస చేసేందుకు అవకాశం ఉంది. ఈ టెంట్ సిటీలోనూ ఉచిత భోజనశాలలు ఏర్పాటు చేశారు. -
టెన్త్ ఫెయిలైన 88,342 మంది తిరిగి బడికి..
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో విద్యార్థులందరూ ఉన్నత విద్య చదవాలన్నది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంకల్పం. అందుకే ఆయన పదవీ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి విద్యా రంగానికి ఎనలేని ప్రాధాన్యతనిస్తున్నారు. పలు సంస్కరణలు తెచ్చారు. అందులో భాగమే టెన్త్ ఫెయిలైన విద్యార్థులను తిరిగి స్కూళ్లలో ఎన్రోల్ చేయించి తరగతులకు పంపడం. వారు పదో తరగతి ఫెయిలైన తర్వాత చదువు మానేయకుండా ఈ చర్యలు చేపట్టారు. మధ్యలో చదువు మానేస్తే పిల్లల భవిష్యత్తు అస్తవ్యస్తమవుతుంది. దీంతో వారిని తిరిగి తరగతులకు పంపుతున్నారు. తిరిగి పదో తరగతిలో చేరిన వారికి విద్యా రంగంలో ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలన్నింటినీ ప్రభుత్వం అందిస్తోంది. గత విద్యా సంవత్సరంలో 1.23,680 మంది విద్యార్థులు టెన్త్ ఫెయిలయ్యారు. వారు తిరిగి స్కూల్స్‌లో చేరారా లేదా అనే వివరాలన్నింటినీ గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థ, వలంటీర్ల ద్వారా ప్రత్యేక ట్రాకింగ్ సాఫ్ట్‌వేర్‌తో ప్రభుత్వం సేకరించింది. వారిలో 88,342 మందిని ఇప్పటివరకు తిరిగి పదో తరగతిలో ఎన్రోల్ చేయించింది. ఇప్పుడు ఈ విద్యార్థులంతా తిరిగి తరగతులకు హాజరవుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) డా. కె.ఎస్.జవహర్ రెడ్డి జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఈ అంశంపై సమీక్షించారు. అదనంగా చేరికలు గత విద్యా సంవత్సరంతో పోల్చితే ఈ విద్యా సంవత్సరంలో పదో తరగతిలో 1,26,212 మంది అదనంగా చేరారు. గత విద్యా సంవత్సరంలో టెన్త్‌లో 6,64,511 మంది విద్యార్థులు ఉండగా ఈ ఏడాది 7,90,723 మంది ఎన్రోల్ అయ్యారు. అందరినీ బడిబాట పట్టించడంతో పాటు ఆ పిల్లలందరూ డిగ్రీ వరకు చదివేలా సూక్ష్మస్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణను అమలు చేయడమే ఇందుకు కారణమని అధికారులు వెల్లడించారు. పాస్ అయిన విద్యార్ధులు అంతటితో చదువు ఆపేయకుండా తదుపరి కోర్సుల్లో చేరుతున్నారా లేదా అనే వివరాలను కూడా రాష్ట్ర ప్రభుత్వం సూక్ష్మస్థాయిలో సేకరిస్తోంది. చదువు ఆపేసిన వారిని పై తరగతుల్లో చేరేలా ప్రోత్సహిస్తోంది. ప్రతి పేద విద్యార్ధి ఆరి్థక స్థోమత లేక మధ్యలో చదువు మానేయకుండా ఉన్నత విద్యను అభ్యసించేలా రాస్ట్ర ప్రభుత్వం పలు పథకాలు అమలు చేస్తోంది. జగనన్న అమ్మ ఒడి, జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన, జగనన్న విద్యా కానుక, జగనన్న గోరు ముద్ద, నాడు–నేడు కార్యక్రమాలన్నీ విద్యార్ధులకు నాణ్యమైన ఉన్నత విద్యను అందించే పథకాలే. -
ఓ బాలుడి సాహసం..మూడేళ్లుగా టెంట్లోనే నిద్రపోయి..
ఓ యువకుడు క్యాపంగ్ ద్వారా అత్యధిక డబ్బులు సేకరించిన వ్యక్తిగి రికార్డు సృష్టించాడు. ది బాయ్ ఇన్ ది టెన్త్‌గా పేరుగాంచి ఈ రికార్డు సాధించాడు. ఒక ఛారిటీ కోసం ఇంత పెద్ద మొత్తంలో నిధులు కూడ బెట్టిన తొలి వ్యక్తి ఆ టీనేజర్. వివరాల్లోకెళ్తే..యూకేకి చెందిన మాక్స్ వూసే అనే యువకుడు తమ పొరుగన ఉండే ఫ్యామిలీ స్నేహితుడిని క్యాన్సర్ వ్యాధి కారణంగా కోల్పోవడంతో..అలాంటి సమస్యను ఎదుర్కొనే వాళ్లకు సాయం చేయాలని నిర్ణయించుకున్నాడు. అందులో భాగంగానే నార్త్ డెవాన్ ఛారిటీ కోసం మూడేళ్లుగా క్యాంపింగ్ నిర్వహించి అత్యధికంగా డబ్బును సేకరించాడు. ఇలా అతను సుమారు రూ. 7.6 కోట్లను వసూలు చేశాడు. అందుకోసం పలుచోట్లకు టెంట్ తోసహా తిరిగేవాడు. అక్కడ క్యాంపింగ్ నిర్వహించి టెంట్లోనే నిద్రపోయేవాడు. అలా మూడేళ్లు అదే ధ్యాసలో గడిపాడు. దీంతో వూసే 'ది బాయ్ ఇన్ ది టెన్ట్'గా పేరుగాంచాడు. ఇలా వూసే తన ఫ్యామిలీ స్నేహితుడు రిక్ అబాట్ మరణించిన తర్వాత నుంచి అంటే.. వూసేకి 10 ఏళ్ల ప్రాయం నుంచి నిధుల సేకరణ ప్రారభించాడు. సరిగ్గా మార్చి 2020లో నిధుల సేకరించడం మొదలుపెట్టాడు. తన స్నేహితుడి రిక్కు వూసే కుటుంబం ఆర్థిక సాయం అందిచిన్పటికీ వైద్యులు అతన్ని రక్షించలేకపోయారు. ఆస్పత్రి కూడా అతడు బతకాలని ఎంతగానో కోరింది గానీ సఫలం కాలేదు. ఆ ఘటన ఫ్యామిలీ స్నేహితుడిలాంటి వారి కోసం ఏదో చేయమన్నట్లు తన మనసుకు బలంగా అనిపించిందని చెబుతున్నాడు. ఐతే వూసే నిధుల సేకరణ మొదలు పెట్టే సమయంలోనే కరోనా, తుపానులు పెద్ద సవాళ్లుగా మారాయి. తీవ్రమైన గడ్డకట్టే మంచుకుని సైతం అధిగమించి ఎన్నో ప్రయాసలకు ఓర్చి ఈ నిధులను సమకూర్చాడు. ఒకనొక సమయంలో తుపాను కారణంగా వూసే టెంట్ కూడా కూలిపోయింది. అయినా లెక్క చేయక మొక్కవోని దీక్షతో నిధులు సేకరించాడు. ఈ ప్రయాణంలో గొప్ప గొప్ప వ్యక్తులను కలుసుకున్నాను, ఎన్నో అద్భుతమైన అనుభవాలను పొందాను అని చెబుతున్నాడు వూసే. ఇక ఏప్రిల్ 2023 నాటికి తన నిదుల సేకరణను ఆపేసి తనకెంతో ఇష్టమైన రగ్బీపై దృష్టిపెట్టనున్నట్లు తెలిపాడు. ఇంత చిన్న వయసులో ఇంత నిబద్ధత, నిస్వార్థపూరితమైన అతని గొప్ప మనసుని చూసి అందరూ ఫిదా అవుతున్నారు. చిన్నపిల్లలైనా వారు కూడా ఇలాంటి సేవ కార్యక్రమాలు చేయగలరు అని నిరూపించాడు వూసే. (చదవండి: వెల్లువలా ఉత్తర కొరియా అరాచకాలు..వెలుగులోకి విస్తుపోయే దారుణాలు) -
ఈ టెంట్ ఉంటే అడవిలోనైనా హాయే! ప్రత్యేకతలు ఏంటంటే..
అడవుల్లోకి వెళ్లి అక్కడే టెంట్లు వేసుకుని గడపాలనే సరదా చాలామందికే ఉంటుంది. అడవుల్లో టెంట్లు వేసుకోవడం చాలా కష్టమైన పని. అడవుల్లో విద్యుత్తు సరఫరా ఉండదు. మరి టెంట్లలో మకాం చేసేవారి పరిస్థితి ఊహించుకోవాల్సిందే! ఇదివరకటి కాలంలో లాంతర్లు, విసనకర్రలు తీసుకువెళ్లేవారు. ఇటీవలి కాలంలో పోర్టబుల్ బ్యాటరీలు, రీచార్జబుల్ లైట్లు, ఫ్యాన్లు వంటివి తీసుకువెళుతున్నారు. ఇంత ఇబ్బంది లేకుండా, టెంట్లకు నేరుగా విద్యుత్తు సరఫరా ఉంటే పరిస్థితి మరింత సౌకర్యవంతంగా ఉంటుంది కదూ! ఇదే ఆలోచనతో అమెరికాకు చెందిన సోలార్ పరికరాల తయారీ సంస్థ ‘జాకెరీ’ ఏకంగా సోలార్ టెంట్‌ను రూపొందించింది. టెంట్ పైభాగంలో ఉన్న సోలార్ ప్యానెల్స్ సౌరశక్తిని గ్రహించి, ఇందులోని ‘ఫొటో వోల్టాయిక్ సోలార్ సెల్స్’లో 1200 వాట్ల విద్యుత్తును నిక్షిప్తం చేస్తాయి. ఈ విద్యుత్తుతో టెంట్లో లైట్లు, ఫ్యాన్లు వంటివి ఇంట్లో మాదిరిగానే వాడుకోవచ్చు. ఈ సోలార్ టెంట్లు నలుగురైదుగురు వరకు బస చేయడానికి అనువుగా రూపొందించారు. ఇటీవల జరిగిన కన్జూమర్ ఎలక్ట్రానిక్స్ షో (సీఈఎస్)–2023 ప్రదర్శనలో దీనిని ప్రదర్శించారు. ఇది ఇంకా మార్కెట్లోకి రావాల్సి ఉంది. (ఇదీ చదవండి: వెచ్చదనమే కాదు.. వేసవిలో చల్లగానూ ఉంచే దుప్పటి గురించి తెలుసా?) -
మ్యాచ్ జరుగుతుండగా గ్రౌండ్లో టెంట్ వేసుకొని నిద్రపోయాడు
లండన్: ఇంగ్లండ్, టీమిండియాల మధ్య జరిగిన రెండో టెస్టులో ఇంగ్లండ్ అభిమాని జార్వో చేసిన పని అందరికి గుర్తుండే ఉంటుంది. ఆట మూడోరోజు లంచ్ విరామం అనంతరం భారత ఆటగాళ్లు మైదానంలోకి వస్తుండగా జార్వో భారత జెర్సీ ధరించి వచ్చాడు. మొదట అతన్ని ఎవరు గుర్తుపట్టకపోయినా కొద్దిసేపటి తర్వాత సెక్యూరిటీ వచ్చి అతన్ని తీసుకెళ్లారు. ఈ సమయంలో..'' భారత్‌కు ఆడిన తొలి ఇంగ్లండ్ ఆటగాడిని తానేనంటూ గట్టిగా అరుస్తూ చెప్పడం ట్రెండింగ్‌గా మారింది. దీనికి సంబంధించిన వీడియో కూడా వైరల్ అయింది. అయితే జార్వోకు ఇది కొత్త కాదట.. ఇంతకముందు జరిగిన మ్యాచ్‌ల్లోనూ ఇలాంటివి చాలా చేశాడు. మ్యాచ్ జరుగుతుండగా జార్వో చేసిన మరోపని తాజాగా వెలుగుచూసింది. అది ఎప్పుడు జరిగిందన్నది తెలియకపోయినప్పటికి.. వీడియో ప్రకారం అది ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మధ్య జరిగిన టెస్టు మ్యాచ్ అని తెలుస్తోంది. విషయంలోకి వెళితే.. బౌలర్ బంతి విసిరిన తర్వాత జార్వో బౌండరీ లైన్‌ను క్రాస్ చేసి మైదానంలోకి వచ్చాడు. అనంతరం తనతో పాటు తెచ్చుకున్న టెంట్‌ను గ్రౌండ్లో వేసి లోపలికి వెళ్లి నిద్రపోయాడు. ఇదంతా గమనించిన ఆటగాళ్లు నవ్వాపుకోలేకపోయారు. కొన్ని సెకన్ల తర్వాత సెక్యూరిటీ సిబ్బంది టెంట్‌ను అక్కడి నుంచి తొలగించే ప్రయత్నం చేశారు. సరిగ్గా అప్పుడే జార్వో అందులోకి బయటికి వచ్చి తాను అనుకున్నది సాధించినట్టుగా చేతులెత్తి విక్టరీ సింబల్ చూపించాడు. ఆ తర్వాత జార్వోను అక్కడి నుంచి తీసుకెళ్లారు. దీనికి సంబంధించిన వీడియోపై ఒక లుక్కేయండి. ఇక లార్డ్స్ టెస్టులో 151 పరుగుల తేడాతో ఓడిన ఇంగ్లండ్ టీమిండియాపై ప్రతీకారం తీర్చుకోవడానికి సిద్ధమైంది. అయితే మూడో టెస్టుకు 8 రోజుల గ్యాప్ వచ్చింది. కాగా ఆగస్టు 25 నుంచి లీడ్స్ వేదికగా ఇరుజట్ల మధ్య మూడో టెస్టు జరగనుంది. చదవండి: నేను భారత ఆటగాడినే.. లార్డ్స్‌లో అజ్ఞాత వ్యక్తి హల్చల్ -
రాజస్తాన్‌లో ఘోర విషాదం
-
రాజస్తాన్‌లో కూలిన పందిరి
బెర్మర్/జైపూర్: రాజస్తాన్‌లోని బెర్మర్ జిల్లాలో ఘోరప్రమాదం చోటుచేసుకుంది. ఓ ఆలయం సమీపంలోని పాఠశాల మైదానంలో ఏర్పాటుచేసిన పందిరి ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో 14 మంది ప్రాణాలు కోల్పోగా, 50 మందికి పైగా భక్తులకు గాయాలయ్యాయి. జసోల్ ప్రాంతంలో ఉన్న రాణి భతియానీ ఆలయం వద్ద వేడుకలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా భారీ పందిరిని ఏర్పాటుచేసిన నిర్వాహకులు ‘రామకథ’ నాటకాన్ని ప్రదర్శించారు. దీంతో వేడుకకు హాజరైన వందలాది మంది ప్రజలు అక్కడే కూర్చుని రామకథను చూస్తుండగా బలమైన గాలులకు పందిరి ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఈ విషయమై ఏఎస్పీ రతన్‌లాల్ భార్గవ మాట్లాడుతూ.. ‘రామ కథ ప్రదర్శన జరుగుతుండగా ఒక్కసారిగా బలమైన గాలులు వీచాయి. దీంతో పందిరి ఓవైపు నుంచి కూలిపోవడం ఆరంభమైంది. ఈ నాటకానికి నేతృత్వం వహిస్తున్న మురళీధర్ మహరాజ్ దీన్ని గమనించి భక్తులను అప్రమత్తం చేశారు. దీంతో అక్కడినుంచి బయటపడేందుకు అందరూ ఒకేసారి ప్రయత్నించడంతో తొక్కిసలాటలాంటి పరిస్థితి నెలకొంది. చూస్తుండగానే ఈ పందిరి భక్తులపై కుప్పకూలిపోయింది’ అని తెలిపారు. ఇనుపరాడ్లు–టెంట్ల కింద చిక్కుకున్న ప్రజలను కాపాడేందుకు ప్రయత్నించిన తమకు విద్యుత్ షాక్ తగిలిందని ప్రత్యక్షసాక్షులు చెప్పారన్నారు. ఈ ప్రమాదంలో గాయపడ్డవారిని జిల్లాలోని వేర్వేరు ఆసుపత్రులకు తరలించామని చెప్పారు. 14 మంది చనిపోవడానికి గల కారణం పోస్ట్‌మార్టం తర్వాతే తెలుస్తుందని స్పష్టం చేశారు. ప్రధాని మోదీ దిగ్భ్రాంతి ఈ దుర్ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘రాజస్తాన్‌లోని బర్మర్లో పందిరి కూలిపోవడం నిజంగా దురదృష్టకరం. తమ కుటుంబ సభ్యులను కోల్పోయినవారికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నా. అలాగే ఈ ప్రమాదంలో గాయపడ్డవారు వీలైనంత త్వరగా కోలుకోవాలని ప్రార్ధిస్తున్నా’ అని ప్రధాని ట్వీట్ చేశారు. మరోవైపు రాజస్తాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ ఈ ప్రమాద విషయమై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ దుర్ఘటనలో చనిపోయినవారికి రూ.5 లక్షలు, గాయపడ్డవారికి రూ.2 లక్షల వరకూ నష్టపరిహారం అందజేస్తామని సీఎం తెలిపారు. ఈ ప్రమాదంపై జోధ్‌పూర్ డివిజినల్ కమిషనర్ బీఎల్ కోఠారి నేతృత్వంలో విచారణకు ఆదేశించామని చెప్పారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని యంత్రాంగాన్ని ఆదేశించారు.అనంతరం ఈ దుర్ఘటనపై విచారణ జరపాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. ఈ ప్రమాదంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ, పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. -
రాజస్తాన్‌లో టెంట్‌కూలి 14 మంది మృతి
-
ఘోరం: టెంట్‌కూలి 14 మంది భక్తులు మృతి
జైపూర్: రాజస్తాన్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. బార్మీర్ జిల్లాలో టెంట్ (గుడారాలు) కూలి 14 మంది మృతిచెందారు. మరో 50 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఓ ఆధ్యాత్మిక కార్యక్రమం కోసం తరలివచ్చిన భక్తుల కోసం అక్కడ పెద్ద ఎత్తున గుడారాలు ఏర్పాటు చేశారు. అదే సమయంలో గాలి, భారీ వర్షం సంభవించడంతో అవి ఒక్కసారిగా కుప్పకూలాయి. ఈ ఘటనలో అక్కడిక్కడే పలువురు భక్తులు మృతి చెందారు. అదే సమయంలో విద్యుత్ షాక్ కొట్టడంతో మరికొంతమంది మరణించినట్లు సమాచారం. ఘటన జరగిన సమయంలో దాదాపు వెయ్యి మంది భక్తులు ఉన్నట్లు తెలస్తోంది. గాయపడిన వారిని స్థానికులు దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలిలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తొంది. ప్రధాని మోడీ దిగ్ర్బాంతి బార్‌మీట్ ఘటనపై ప్రధాని మోదీ తీవ్ర దిగ్ర్బాంతి వ్యక్తం చేశారు. ఘటన జరగటం దురదృష్టకరమన్నారు. మృతి చెందిన వారి కుటుంబాకు అండగా ఉంటామని, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రధాని ఆకాంక్షించారు. -
గుడారమే ‘ఆధారం’
ములకలపల్లి: వారంతా రెక్కాడితేగానీ డొక్కాడని నిరుపేదశ్రామికులు.. ఆంధ్రాలోని నర్సీపట్నం, శ్రీకాకుళం తదితర ప్రాంతాల నుంచి జామాయిల్ తోటలు నరికేందుకు ఇక్కడకు వచ్చారు.. పనిచేసేచోటే తాత్కాలికంగా గుడారాలు వేసుకొని తోటలు నరుకుతున్నారు.. వానైనా, వరదైనా వారికి ఈ గుడారాలే జీవన ‘ఆధారం’.. ఒక్కో గుంపులో సుమారు యాభై మంది వరకూ నివసించే ఈ కష్టజీవుల జీవనానికి ఈ చిత్రం సజీవ సాక్ష్యం. -
సుడిగాలికి కూలిన టెంట్
–విద్యుత్ తీగ తెగి మంటలు –టెంట్ కర్రలు పడి ఇద్దరికి గాయాలు వాడపల్లి(మిర్యాలగూడ రూరల్): వాడపల్లిలోని పాత సిమెంట్ రోడ్డు పుష్కర ఘాట్ వద్ద టెంట్ కూలి ఇద్దరు భక్తులకు గాయాలైనాయి. ఎండ తీవ్రత అధికంగా ఉండడంతో సుమారు 80 మంది భక్తులు టెంటు కింద కూర్చున్నారు. కాగా ఒకేసారి బలమైనగాలి వీచడంతో టెంట్ పైకి లేచి కుప్పకూలింది. దీంతో టెంట్ కర్ర విద్యుత్ తీగలపై పడి మంటలులేశాయి. ఊహించని పరిణామానికి భక్తులు భయాందోళనలో పరుగులు తీశారు. కొందరు టెంటుకిందే ఉండిపోగా ప్రాణ భయంతో కేకలు వేశారు. అక్కడేlవిధులు నిర్వహిస్తున్న పోలీసు కానిస్టేబుల్ భాస్కర్ నాయక్ పరిగెత్తి టెంట్‌ను లేపి దూరంగా విరిరేశాడు. అప్పటికే టెంటుకు మంటలు అంటుకోవడంతో భక్తురాలి బ్యాగు కాలిపోయింది. టెంటు కర్రలు తగిలి గుండాల మండలం సీతారామపురం గ్రామానికి చెందిన మొగిలిపాక యాదమ్మకు తలకు తీవ్రగాయమైంది. ఆమె కుమారుడు రవికి గాయాలైనాయి. దీంతో వైద్య సిబ్బంది వెంటనే ఇద్దరికి ప్రథమ చికిత్స అందించారు. యాదమ్మను 108లో మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తర లించారు. టెంట్ కూలిన స్థలాన్ని జిల్లా వైద్యాధికారి భానుప్రసాద్ నాయక్, ఘాట్ రక్షణ ఇన్చార్జి డీఎస్పీ రామచందర్‌రావు పరిశీంచారు. సంఘటనకు కారణాలు అడిగి తెలుసుకొన్నారు. టెంటుకు మంటలు అంటుకున్నా సమయస్ఫూర్తిగా వ్యవహరించి ప్రమాద తీవ్రతను తగ్గించిన కానిస్టేబుల్ భాస్కర్ నాయక్ ను అధికారులు అభినందించారు. -
రాత్రంతా టెంట్లోనే నేపాల్ ప్రెసిడెంట్
ఖాట్మాండూ: భారీ భూకంపం నేపాల్‌ను మరుభూమిగా మార్చింది. రెండు వేలమందికిపైగా ప్రాణాలు కోల్పోగా, వేలాదిమంది గాయపడ్డారు. పురాతన కట్టడాలు, ప్రభుత్వ కార్యాయాలు, ఇళ్లు వేలసంఖ్యలో నేలమట్టమయ్యాయి. నేపాల్ ప్రెసిడెంట్ రామ్ భరణ్ యాదవ్ సైతం రాత్రంతా ఆరుబయట ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. నేపాల్ ప్రెసిడెంట్ అధికారిక నివాసంలో పగుళ్లు ఏర్పడ్డాయి. దీంతో శనివారం రాత్రి రామ్ భరణ్ యాదవ్ తన భద్రత సిబ్బందితో కలసి టెంట్లోనే బస చేశారు. నేపాల్ ప్రెసిడెంట్ కార్యాలయం 'శీతల్ నివాస్'ను 150 ఏళ్ల క్రితం నిర్మించారు. ఈ భవనంలో వంటగదితో పాటు ఇతర గదుల్లో పగుళ్లు ఏర్పడ్డాయి. నేపాల్ ప్రధాని సుశీల్ కొయిరాల నివాసం ప్రధాన ద్వారం భూప్రకంపనలకు దెబ్బతింది. భూకంపం వచ్చిన సమయంలో కొయిరాల ఇండోనేసియాలో ఉన్నారు. -
పోలీసులపై కూలిన టెంట్
ధారూరు: మెథడిస్ట్ జాతర ఆవరణలో ఏర్పాటు చేసిన టెంట్ బుధవారం రాత్రి కురిసిన వర్షానికి పోలీసులపై కూలిపడింది. ఆ సమయంలో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో పెను ప్రమాదం తప్పింది. వివరాలు.. స్టేషన్ ధారూరు సమీపంలోని మెథడిస్ట్ జాతర ఆవరణలో నిర్వాహకులు పోలీసుల కోసం ఓ టెంట్ ఏర్పాటు చేశారు. అందులో పోలీసులు సిగ్నలింగ్ కోసం ప్రత్యేకంగా టవర్ ఏర్పాటు చేసుకున్నారు. విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. బుధవారం రాత్రి 8 గంటల సమయంలో భారీ వర్షంతో కూడిన గాలిరావడంతో టెంట్ ఒక్కసారిగా కూలిపోయింది. ఈ ఘటనతో టెంట్ కింద ఉన్న పలువురు పోలీసులు భయాందోళనకు గురయ్యారు. టెంట్ కూలిన సమయంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని, లేకుంటే పెనుప్రమాదం జరిగేదని పోలీసులు తెలిపారు. ఈ ఘటనతో యాత్రికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.