నెల రోజుల్లో టెన్త్‌ సిలబస్‌ పూర్తి చేయాలి | tent syllabus should be completed in december: telangana | Sakshi
Sakshi News home page

నెల రోజుల్లో టెన్త్‌ సిలబస్‌ పూర్తి చేయాలి

Published Sat, Dec 7 2024 6:06 AM | Last Updated on Sat, Dec 7 2024 6:06 AM

tent syllabus should be completed in december: telangana

తర్వాత రివిజన్‌ మొదలు పెట్టాలి

ప్రభుత్వ పాఠశాలలకు విద్యాశాఖ ఉత్తర్వులు... అదెలా సాధ్యమని ప్రశ్నిస్తున్న టీచర్లు  

సాక్షి, హైదరాబాద్‌: పదవ తరగతి సిలబస్‌ను జనవరి 10వ తేదీ నాటికి పూర్తి చేయాలని అన్ని పాఠశాలలకు విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. సిలబస్‌ అయిన వెంటనే పునశ్చరణ చేపట్టాలని సూచించింది. టెన్త్‌ పరీక్షల్లో వందశాతం ఫలితాలు సాధించేందుకు ప్రతీ హెచ్‌ఎం శ్రద్ధ తీసుకోవాలని కోరింది. మంచి ఫలితాలు సాధించే స్కూళ్లకు ఈసారి ప్రభుత్వం ప్రోత్సాహకాలు ఇచ్చే అవకాశం ఉందని విద్యాశాఖ ఉన్నతాధికారులు చెబుతున్నా రు. ప్రైవేటు బడులతో సమానంగా ప్రభుత్వ పాఠశాలల్లోనూ ఫలితాలు ఉండాలన్నది ప్రభుత్వ లక్ష్య మని విద్యాశాఖ పేర్కొంది. ఈ ఏడాది కొత్తగా 11,062 మంది టీచర్ల నియామకం కూడా చేపట్టారని, పుస్తకాలు కూడా సకాలంలో అందించామని, ఫలితాలు తక్కువగా వస్తే స్కూల్‌ హెచ్‌ఎంలు సమాధానం చెప్పాల్సి ఉంటుందని అధికారులు అంటున్నారు.  

30 రోజుల పక్కా ప్రణాళిక..  
మార్చి నెలలో టెన్త్‌ పరీక్షలు జరుగుతాయి. ప్రభు త్వ స్కూల్‌ విద్యార్థులను సన్నద్ధం చేసేందుకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలని విద్యాశాఖ సూచించింది. ఉదయం గంట, సాయంత్రం గంట ఇప్పటికే ఈ తరగతులు నిర్వహిస్తున్నారు. సిలబస్‌ పూర్తయిన తర్వాత పూర్తి స్థాయిలో రివిజన్‌పైనే దృష్టి పెట్టాల్సి ఉంటుంది. ఇందులో సబ్జెక్టులో ముఖ్యమైన, కష్టమైన చాప్టర్లపై దృష్టి పెట్టాలని హెచ్‌ఎంలను జిల్లా విద్యాశాఖ అధికారులు ఆదేశించారు. 30 రోజుల పాటు ప్రణాళిక బద్ధంగా రివిజన్‌ చేయాలని తెలిపారు.  

బదిలీలు, పదోన్నతులతోనే కాలం పూర్తి.. 
జనవరి 10 నాటికి సిలబస్‌ పూర్తి చేయడం ఎలా సాధ్యమని పలువురు టీచర్లు ప్రశి్నస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లోని స్కూళ్లలో కొంతమేర టీచర్ల కొరత లేదని, గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితి భిన్నంగా ఉందంటున్నారు. కొన్ని పాఠశాలల్లో 40 శాతం మేర సిలబస్‌ మాత్రమే పూర్తయిందని డీఈవోలు ఇటీవల విద్యాశాఖకు తెలిపారు. మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో 30 శాతానికి మించి సిలబస్‌ పూర్తవ్వలేదంటున్నారు.

డీఎస్సీ నియామకాలు చేపట్టే వరకూ అనేక చోట్ల టీచర్ల కొరత ఉంది. అక్టోబర్‌లో టీచర్లు వచి్చనా బోధన వెంటనే చేపట్టడం సాధ్యం కాలేదంటున్నారు. ఈ ఏడాది విద్యారంభంలోనే బదిలీలు, పదోన్నతులు చేపట్టారు. దీంతో చాలా స్కూళ్లలో టెన్త్‌ బోధన ఆలస్యంగా మొదలైందని చెబుతున్నారు. జనవరి 10 నాటికే సిలబస్‌ పూర్తవ్వాలనే లక్ష్యం వల్ల విద్యార్థులకు నష్టం జరుగుతుందని వారంటున్నారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement