రాత్రంతా టెంట్లోనే నేపాల్ ప్రెసిడెంట్ | Nepal president spends night in tent | Sakshi
Sakshi News home page

రాత్రంతా టెంట్లోనే నేపాల్ ప్రెసిడెంట్

Apr 26 2015 5:10 PM | Updated on Sep 3 2017 12:56 AM

రాత్రంతా టెంట్లోనే నేపాల్ ప్రెసిడెంట్

రాత్రంతా టెంట్లోనే నేపాల్ ప్రెసిడెంట్

నేపాల్ ప్రెసిడెంట్ రామ్ భరణ్ యాదవ్ సైతం రాత్రంతా ఆరుబయట ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఖాట్మాండూ: భారీ భూకంపం నేపాల్ను మరుభూమిగా మార్చింది. రెండు వేలమందికిపైగా ప్రాణాలు కోల్పోగా, వేలాదిమంది గాయపడ్డారు. పురాతన కట్టడాలు, ప్రభుత్వ కార్యాయాలు, ఇళ్లు వేలసంఖ్యలో నేలమట్టమయ్యాయి.  నేపాల్ ప్రెసిడెంట్ రామ్ భరణ్ యాదవ్ సైతం  రాత్రంతా ఆరుబయట ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.

నేపాల్ ప్రెసిడెంట్ అధికారిక నివాసంలో పగుళ్లు ఏర్పడ్డాయి. దీంతో శనివారం రాత్రి రామ్ భరణ్ యాదవ్ తన భద్రత సిబ్బందితో కలసి టెంట్లోనే బస చేశారు. నేపాల్ ప్రెసిడెంట్ కార్యాలయం 'శీతల్ నివాస్'ను 150 ఏళ్ల క్రితం నిర్మించారు. ఈ భవనంలో వంటగదితో పాటు ఇతర గదుల్లో పగుళ్లు ఏర్పడ్డాయి. నేపాల్ ప్రధాని సుశీల్ కొయిరాల నివాసం ప్రధాన ద్వారం భూప్రకంపనలకు దెబ్బతింది. భూకంపం వచ్చిన సమయంలో కొయిరాల ఇండోనేసియాలో ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement