అగ్నికి ఆహుతైన కరోనా పేషెంట్లు | Fire Accident At Gujarat Rajkot Covid Hospital ICU | Sakshi
Sakshi News home page

కోవిడ్‌ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం.. ఐదురుగు మృతి

Published Fri, Nov 27 2020 8:22 AM | Last Updated on Fri, Nov 27 2020 10:40 AM

Fire Accident At Gujarat Rajkot Covid Hospital ICU - Sakshi

అహ్మదాబాద్‌: గుజరాత్‌లో విషాదం చోటుచేసుకుంది. రాజ్‌కోట్‌లోని కోవిడ్‌ ఆస్పత్రిలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఐదురుగు కరోనా పేషెంట్లు మృతి చెందారు. వివరాలు... మాద్వీ ప్రాంతంలోని ఉదయ్‌ శివానంద్‌ ఆస్పత్రిలో సుమారు 33 మంది కోవిడ్‌ పేషెంట్లు చికిత్స పొందుతున్నారు. వీరిలో 11 మంది పరిస్థితి విషమంగా ఉండటంతో ఐసీయూలో ఉంచి ట్రీట్‌మెంట్‌ అందిస్తున్నారు. ఈ క్రమంలో గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత రెండో అంతస్తులో ఉన్న ఐసీయూలో మంటలు అంటుకున్నాయి. (చదవండి: అస్ట్రాజెనెకా సురక్షితం)

దీంతో పేషెంట్లు హాహాకారాలు చేయడంతో అప్రమత్తమైన ఆస్పత్రి సిబ్బంది పోలీసులు, అగ్నిమాపక దళానికి సమాచారమిచ్చారు. ఘటనాస్థలికి చేరుకున్న రక్షణ బృందం ఐసీయూలోని ఆరుగురు పేషెంట్లను మాత్రమే సురక్షితంగా బయటికి తీసుకురాగలిగారు.  మిగతా ఐదుగురు అగ్నికి ఆహుతి అయ్యారు. కాగా షార్ట్‌సర్క్యూట్‌ కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement