Ind vs Eng: సర్ఫరాజ్‌ ఖాన్‌ అరుదైన రికార్డు.. గిల్‌ను దాటేసి! | Ind vs Eng 3rd Test Sarfaraz Khan Creates Histroy Surpasses Gill On Debut | Sakshi
Sakshi News home page

Sarfaraz Khan: సర్ఫరాజ్‌ ఖాన్‌ అరుదైన రికార్డు.. గిల్‌ను దాటేసి!

Published Thu, Feb 15 2024 11:40 AM | Last Updated on Thu, Feb 15 2024 12:31 PM

Ind vs Eng 3rd Test Sarfaraz Khan Creates Histroy Surpasses Gill On Debut - Sakshi

India vs England, 3rd Test: రాజ్‌కోట్‌ టెస్టు సందర్భంగా టీమిండియా యువ క్రికెటర్‌ సర్ఫరాజ్‌ ఖాన్‌ చరిత్ర సృష్టించాడు. క్రికెట్‌ పుటల్లో అరుదైన జాబితాలో తన పేరును నమోదు చేసుకున్నాడు. కాగా ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా టీమిండియా- ఇంగ్లండ్‌ తొలి రెండో మ్యాచ్‌లలో చెరొకటి గెలిచి ప్రస్తుతం 1-1తో సమంగా ఉన్నాయి. 

ఈ క్రమంలో ఇరు జట్ల మధ్య గురువారం(ఫిబ్రవరి 15) మూడో టెస్టు మొదలైంది. ఇక ఈ మ్యాచ్‌ ద్వారా ముంబై బ్యాటర్‌ సర్ఫరాజ్‌ ఖాన్‌ ఎట్టకేలకు టీమిండియా తరఫున అరంగేట్రం చేశాడు.

రంజీల్లో పరుగుల వరద పారించి
తొలి టెస్టు తర్వాత గాయం కారణంగా జట్టుకు దూరమైన కేఎల్‌ రాహుల్‌ ఇంకా కోలుకోకపోవడంతో సర్ఫరాజ్‌కు తుదిజట్టులో చోటు దక్కింది. తద్వారా.. రంజీల్లో పరుగుల వరద పారించిన ఈ 26 ఏళ్ల కుడిచేతి వాటం బ్యాటర్‌ టెస్టు క్యాప్‌ అందుకున్నాడు. కాగా అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టేనాటికి సర్ఫరాజ్‌ ఖాన్‌ ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో సగటు 69.85తో 3,912 పరుగులు రాబట్టాడు. 

సెంచరీల వీరుడు
తద్వారా టీమిండియా తరఫున అరంగేట్రం చేసే నాటికి ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో అత్యధిక సగటు కలిగి ఉన్న బ్యాటర్లలో ఆరో స్థానంలో నిలిచాడు. ఈ క్రమంలో స్టార్‌ బ్యాటర్‌ శుబ్‌మన్‌  గిల్‌ను అధిగమించి.. క్రికెట్‌ గాడ్‌ సచిన్‌ టెండుల్కర్‌ తర్వాతి స్థానాన్ని ఆక్రమించాడు. కాగా ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో ఇప్పటి వరకు 45 మ్యాచ్‌లు ఆడిన సర్ఫరాజ్‌ ఖాన్‌ ఖాతాలో 14 సెంచరీలు, 11 అర్ధ శతకాలు ఉన్నాయి.

భారత్‌ తరఫున అరంగేట్రం నాటికి ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో అత్యధిక బ్యాటింగ్‌ సగటు కలిగి ఉన్న బ్యాటర్లు
88.37 - వినోద్ కాంబ్లీ (27 మ్యాచ్‌లు)
81.23 - ప్రవీణ్ ఆమ్రే (23)
80.21 - యశస్వి జైస్వాల్ (15)
71.28 - రుషి మోదీ (38)
70.18 - సచిన్ టెండుల్కర్ (9)
69.85 - సర్ఫరాజ్ ఖాన్ (45)
68.78 - శుబ్‌మన్‌ గిల్ (23) .

చదవండి: Rohit Sharma: అతి వద్దు రోహిత్‌!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement