గాంధీనగర్: లోక్‌సభ ఎన్నికల వేళ ప్రచారంలో దూసుకుపోతున్న బీజేపీకి గుజరాత్ రాజ్‌కోట్ సెగ్మెంట్‌లో పురుషోత్తం రూపాలా అభ్యర్థిత్వం తలనొప్పిగా మారింది. రాజ్‌కోట్‌లో బీజేపీ అభ్యర్థి పురుషోత్తం రూపాలాను.. అక్కడి నుంచి ఉపసంహరించుకోపోతే రాజ్‌పుత్ సామాజిక వర్గం సంఘాలు పెద్దఎత్తున నిరసన తెలుపుతామనిహెచ్చరిస్తున్నాయి.
గుజరాత్‌లోని 26 లోక్‌సభ స్థానాల్లో తమ నిరసనలు తీవ్రతరం చేస్తామంటున్నాయి. ఏప్రిల్ 19 వరకు రాజ్‌కోట్ పార్లమెంట్ స్థానంలో బీజేపీ అభ్యర్థి పురుషోత్తం రూపాలాను ఉపసంహరించకోపోతే తమ నిరసన దేశంలోని మరికొన్ని ప్రాంతాలకు విస్తరిస్తామని రాజ్‌పుత్ సంకల్ఫ్ సమితి చైర్మన్ కరన్‌సిన్హ చద్వా హెచ్చరించారు.
ఈ సమతి రాజ్‌కోట్‌లో ‘రాజ్‌పుత్ ఆత్మగౌరవ సభ’ను ఆదివారం నిర్వహించింది. ఏప్రిల్ 16న రూపాల నామినేషన్ దాఖలు చేయనున్న నేపథ్యంతో ఆయన అభ్యర్థిత్వాన్ని బీజేపీ ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తోంది. ఇక.. నామినేషన్‌కు చివరి తేదీ 19, అదే విధంగా నామినేషన్ల ఉపసంహరణ తేదీ 22 వరకు ఉంది.
పటీదార్ సామాజిక వర్గానికి చెందిన రుపాలా మర్చి 22న వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. పూర్వపు మహారాజులు.. బ్రిటిష్ వారితో సహా విదేశి పాలకుల అణచివేతకు లొంగిపోయారు. అదీకాక.. వారితో కలిసి భోజనం చేసి మహారాజులు తమ కుమర్తెలను విదేశీయులకు ఇచ్చి వివాహం జరిపించారని వ్యాఖ్యానించారు.ఈ వ్యాఖ్యలపై రాజ్‌పుత్‌లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసనలు తెలిపారు. రూపాలా అభ్యర్థిత్వాన్ని రాజ్‌కోట్ పార్లమెంట్ స్థానం నుంచి ఉపసంహరించుకోవాలని బీజేపీని డిమాండ్ చేశారు. అయితే ఇప్పటికే రూపాలా రెండు సార్లు క్షమాపణలు చెప్పినా రాజ్‌పుత్ వర్గాలు నిరాకరించాయి.
ఈ నేపథ్యంలో రూపాలాకు వ్యతిరేకంగా గుజరాత్ మొత్తం పోస్టర్లు వెలిశాయి. గుజరాత్‌లో మొత్తం 26 స్థానాలక మే 7 పోలింగ్ జరగనుంది. బీజేపీ రూపాలా అభ్యర్థిత్వాన్ని మార్చకపోతే.. వందల సంఖ్యలో నామినేషన్ల దాఖలు చేసి మరీ బీజేపీ అభ్యర్థిని ఓడిస్తామని హెచ్చరించారు. ‘బీజేపీలో విభేదాలు తలెత్తితే... రాత్రికిరాత్తే మంత్రులు, సీఎంను తొలగిస్తారు. కానీ, బీజేపీ నేత రాజ్‌పుత్ మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే మాత్రం ఎందుకు నిశ్శబ్దంగా ఉంటుంది? మేము పెద్ద ఎత్తున పోరాడుతాం. సమస్యలపై మేము ధ్యైరం చూపిస్తాం’ అని రాత్‌పుత్‌ల నేత తృప్తి బా తెలిపారు.
కాగా.. కొంతమందిస్వార్థ ప్రయోజనాల కోసమే నిరసనలకు ఆజ్యం పోస్తున్నారని బీజేపీ పేర్కొంది. మరోవైపు.. కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి మనీష్ దోషి మాట్లాడుతూ.. ‘మేము చాలా విశ్వాసంతో ఉన్నాం. పాటీదార్, రాజ్‌పుత్‌లు అంతా కలిసి రూపాలాను ఓడిస్తారు’అని అన్నారు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి పరేష్ ధమాని పోటీ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment