Purushottam Rupala
-
బీజేపీకి రాజ్‌పుత్‌ల హెచ్చరిక
గాంధీనగర్: లోక్‌సభ ఎన్నికల వేళ ప్రచారంలో దూసుకుపోతున్న బీజేపీకి గుజరాత్ రాజ్‌కోట్ సెగ్మెంట్లో పురుషోత్తం రూపాలా అభ్యర్థిత్వం తలనొప్పిగా మారింది. రాజ్‌కోట్‌లో బీజేపీ అభ్యర్థి పురుషోత్తం రూపాలాను.. అక్కడి నుంచి ఉపసంహరించుకోపోతే రాజ్‌పుత్ సామాజిక వర్గం సంఘాలు పెద్దఎత్తున నిరసన తెలుపుతామనిహెచ్చరిస్తున్నాయి. గుజరాత్‌లోని 26 లోక్‌సభ స్థానాల్లో తమ నిరసనలు తీవ్రతరం చేస్తామంటున్నాయి. ఏప్రిల్ 19 వరకు రాజ్‌కోట్ పార్లమెంట్ స్థానంలో బీజేపీ అభ్యర్థి పురుషోత్తం రూపాలాను ఉపసంహరించకోపోతే తమ నిరసన దేశంలోని మరికొన్ని ప్రాంతాలకు విస్తరిస్తామని రాజ్‌పుత్ సంకల్ఫ్ సమితి చైర్మన్ కరన్సిన్హ చద్వా హెచ్చరించారు. ఈ సమతి రాజ్‌కోట్‌లో ‘రాజ్‌పుత్ ఆత్మగౌరవ సభ’ను ఆదివారం నిర్వహించింది. ఏప్రిల్ 16న రూపాల నామినేషన్ దాఖలు చేయనున్న నేపథ్యంతో ఆయన అభ్యర్థిత్వాన్ని బీజేపీ ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తోంది. ఇక.. నామినేషన్‌కు చివరి తేదీ 19, అదే విధంగా నామినేషన్ల ఉపసంహరణ తేదీ 22 వరకు ఉంది. పటీదార్ సామాజిక వర్గానికి చెందిన రుపాలా మర్చి 22న వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. పూర్వపు మహారాజులు.. బ్రిటిష్ వారితో సహా విదేశి పాలకుల అణచివేతకు లొంగిపోయారు. అదీకాక.. వారితో కలిసి భోజనం చేసి మహారాజులు తమ కుమర్తెలను విదేశీయులకు ఇచ్చి వివాహం జరిపించారని వ్యాఖ్యానించారు.ఈ వ్యాఖ్యలపై రాజ్‌పుత్‌లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసనలు తెలిపారు. రూపాలా అభ్యర్థిత్వాన్ని రాజ్‌కోట్ పార్లమెంట్ స్థానం నుంచి ఉపసంహరించుకోవాలని బీజేపీని డిమాండ్ చేశారు. అయితే ఇప్పటికే రూపాలా రెండు సార్లు క్షమాపణలు చెప్పినా రాజ్‌పుత్ వర్గాలు నిరాకరించాయి. ఈ నేపథ్యంలో రూపాలాకు వ్యతిరేకంగా గుజరాత్ మొత్తం పోస్టర్లు వెలిశాయి. గుజరాత్లో మొత్తం 26 స్థానాలక మే 7 పోలింగ్ జరగనుంది. బీజేపీ రూపాలా అభ్యర్థిత్వాన్ని మార్చకపోతే.. వందల సంఖ్యలో నామినేషన్ల దాఖలు చేసి మరీ బీజేపీ అభ్యర్థిని ఓడిస్తామని హెచ్చరించారు. ‘బీజేపీలో విభేదాలు తలెత్తితే... రాత్రికిరాత్తే మంత్రులు, సీఎంను తొలగిస్తారు. కానీ, బీజేపీ నేత రాజ్‌పుత్ మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే మాత్రం ఎందుకు నిశ్శబ్దంగా ఉంటుంది? మేము పెద్ద ఎత్తున పోరాడుతాం. సమస్యలపై మేము ధ్యైరం చూపిస్తాం’ అని రాత్పుత్ల నేత తృప్తి బా తెలిపారు. కాగా.. కొంతమందిస్వార్థ ప్రయోజనాల కోసమే నిరసనలకు ఆజ్యం పోస్తున్నారని బీజేపీ పేర్కొంది. మరోవైపు.. కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి మనీష్ దోషి మాట్లాడుతూ.. ‘మేము చాలా విశ్వాసంతో ఉన్నాం. పాటీదార్, రాజ్‌పుత్‌లు అంతా కలిసి రూపాలాను ఓడిస్తారు’అని అన్నారు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి పరేష్ ధమాని పోటీ చేస్తున్నారు. -
కేంద్ర మంత్రికి తృటిలో తప్పిన ప్రమాదం..
భువనేశ్వర్: కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాలా ప్రయాణించిన పడవ చిలుకా సరస్సులో సుమారు రెండు గంటల పాటు చిక్కుకుపోయింది. ఈ ఘటన ఆదివారం సాయంత్రం చోటు చేసుకుంది. వెంటనే స్పందించిన అక్కడి సబ్బంది సరస్సులోకి మరో పడవను పంపి మంత్రిని సురక్షితంగా ఒడ్డుకు తీసుకువచ్చారు. మంత్రితో పాటు ఆ పడవలో బీజేపీ జాతీయ ప్రతినిధి సంబిత్ పాత్రా మరో ఇద్దరు నేతలు ఉన్నారు. మంత్రి రూపాల ఖుర్దా జిల్లాలోని బార్కుల్ నుంచి పూరీ జిల్లాలోని సతపదాకు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ‘సాయంత్రం కావటంతో చికటిపడింది. పడవ నడిపే వ్యక్తి కొత్త దారిలో పడవను తీసుకెళ్లాడు. దీంతో అసలు వెళ్లాల్సిన దారి తప్పిపోయాం. సతపద చేరుకోవడానికి మరో రెండు గంటలు పట్టింది’ అని మంత్రి రూపాలా తెలిపారు. ଚିଲିକା ମଝିରେ ୨ ଘଣ୍ଟା ଫସିଲେ କେନ୍ଦ୍ରମନ୍ତ୍ରୀ । କେନ୍ଦ୍ର ମତ୍ସ୍ୟମନ୍ତ୍ରୀ ପୁରୁଷୋତ୍ତମ ରୁପାଲା ଚିଲିକାରେ ୨ ଘଣ୍ଟା ଧରି ଫସିରହିଥିଲେ ବୋଲି ସୂଚନା ମିଳିଛି। #Chilika #UnionMinister #ParshottamRupala #OTV pic.twitter.com/9stpN2Yfvm — ଓଟିଭି (@otvkhabar) January 7, 2024 సరస్సులో పడవ చిక్కుకోవడానికి మత్స్య కారులు వేసిన చేపలు పట్టే వల అని అనుమానించామని తెలిపారు. కానీ, పడవ దారి తప్పిపోవడమే.. కారణమని మంత్రి మీడియాకు వెల్లడించారు. ఈ ఘటనతో కృష్ణా ప్రసాద్ ప్రాంతంలో మంత్రి పాల్గొనాల్సిన ఓ కార్యక్రమాన్ని రద్దు చేసుకున్నారు. చదవండి: Delhi: కాస్త ఎండ.. అంతలోనే విపరీతమైన చలి! -
మత్స్య రంగంలో ఏపీ అద్భుత ప్రగతి
సాక్షి, అమరావతి/తాడేపల్లిగూడెం: మత్స్య రంగంలో ఆంధ్రప్రదేశ్ అద్భుత ప్రగతి సాధించిందని కేంద్ర మత్స్య, పశు సంవర్ధక శాఖ మంత్రి పురుషోత్తమ్ రూపాల కితాబిచ్చారు. ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పులు, సంస్కరణలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు. 2023లో బెస్ట్ మెరైన్ స్టేట్‌గా ఎంపికైన ఆంధ్రప్రదేశ్‌ను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ప్రపంచ మత్స్యకార దినోత్సవం సందర్భంగా మంగళవారం అహ్మదాబాద్‌లో జరిగిన గ్లోబల్ ఫిషరీస్ కాన్ఫరెన్స్ ఇండియా–2023లో కేంద్రమంత్రి రూపాల చేతుల మీదుగా ప్రతిష్టాత్మక బెస్ట్ మెరైన్ స్టేట్ అవార్డును రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏపీ స్టేట్ ఆక్వా కల్చర్ డెవలప్మెంట్ అథారిటీ (ఆప్సడా) కో–వైస్ చైర్మన్ వడ్డి రఘురామ్, మత్స్యశాఖ అడిషనల్ కమిషనర్ అంజలి అందుకున్నారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి రూపాల మాట్లాడుతూ.. మత్స్య ఉత్పత్తుల దిగుబడులు, ఎగుమతుల్లో ఏపీ అగ్రస్థానంలో ఉందన్నారు. ఈ రంగంలో వైఎస్ జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలు దేశానికే ఆదర్శంగా ఉన్నాయన్నారు. ఆక్వా ఆధారిత రాష్ట్రాలు ఆంధ్రలో తీసుకొచ్చిన చట్టాలు, మార్పులపై అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందన్నారు. కేంద్రం ఇస్తున్న చేయూతతో నాణ్యమైన ఉత్పత్తుల సాధనకు మార్కెటింగ్ సౌకర్యాలు మరింత మెరుగు పర్చాలని సూచించారు. సీఎం వైఎస్ జగన్ కృషి ఫలితమే ఈ సందర్భంగా అప్సడా కో–వైస్ చైర్మన్ రఘురామ్ మాట్లాడుతూ.. నాలుగేళ్లలో రెండోసారి బెస్ట్ మెరైన్ స్టేట్‌గా ఏపీ నిలవడం ఆనందంగా ఉందన్నారు. రాష్ట్రంలో మత్స్యరంగ సుస్థిరాభివృద్ధికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకొచ్చిన సంస్కరణలు, విప్లవాత్మక మార్పులే కారణమన్నారు. ఆక్వా కార్యకలాపాలన్నీ ఒకే గొడుగు కిందకు తీసుకురావడంతో పాటు ఆక్వా రైతులకు భరోసా, భద్రత కల్పించేందుకు అప్సడా చట్టంతో పాటు నాణ్యమైన సీడ్, ఫీడ్ సరఫరా కోసం ఏపీ స్టేట్ సీడ్, ఫీడ్ యాక్టులను తీసుకొచ్చిందన్నారు. అడిషనల్ కమిషనర్ అంజలి మాట్లాడుతూ.. ప్రభుత్వం తీసుకున్న చర్యల ఫలితంగా 2018–19లో 39 లక్షల టన్నులున్న దిగుబడులు 2022–23లో ఏకంగా 52 లక్షల టన్నులకు పెరిగిందన్నారు. -
గంగపుత్రుల సంక్షేమం కోసమే ‘సాగర్ పరిక్రమ’
ముత్తుకూరు: గంగపుత్రుల సంక్షేమం కోసమే ‘సాగర్ పరిక్రమ’ కార్యక్రమం చేపట్టినట్లు కేంద్ర మత్స్య, పశుసంవర్థక, పాడిపరిశ్రమల శాఖ మంత్రి పురుషోత్తం రూపాల చెప్పారు. సముద్ర తీర ప్రాంతంలో మత్స్యకారుల స్థితిగతులు, జీవన ప్రమాణాలు పరిశీలించడానికి ఆయన శనివారం చెన్నై నుంచి ప్రత్యేక నౌకలో నెల్లూరు జిల్లాలోని అదాని కృష్ణపట్నం పోర్టుకు వచ్చారు. ఆయనకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్థనరెడ్డి, రాష్ట్ర మత్స్య శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు, పోర్టు సీఈవో జీజే రావు స్వాగతం పలికారు. రూపాల పోర్టులో పర్యటించి అక్కడ జరుగుతోన్న అభివృద్ధి, ఎగుమతి దిగుమతుల వివరాలను తెలుసుకున్నారు. సముద్రతీర ప్రాంతంలో ఫిషింగ్ జెట్టీల నిర్మాణాన్ని చేపట్టినట్టు మంత్రి కాకాణి ఆయనకు వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోన్న మత్స్యకార భరోసాపై మంత్రి అప్పలరాజు కేంద్ర మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. అంతకుముందు ఎంపీ బీద మస్తాన్‌రావు, మత్స్యశాఖ కమిçషనర్ కన్నబాబు, ఎంపీ జీవీఎల్‌తో కలిసి కృష్ణపట్నం ఆర్కాట్పాళెంలోని మత్స్యకార గ్రామాలను రూపాల సందర్శించారు. -
పసుపు బోర్డు ఏర్పాటుపై కేంద్రం సంచలన వ్యాఖ్యలు
సాక్షి, న్యూఢిల్లీ: నిజామాబాద్‌లో పసుపు బోర్డు ఏర్పాటు అవసరం లేదని కేంద్రం మరోసారి స్పష్టం చేసింది. ఇప్పటికే పసుపు సాగు, మార్కెటింగ్‌కు ఉపయోగపడేందుకు నిజామాబాద్‌లో మసాలా బోర్డు డివిజనల్ కార్యాలయాన్ని రీజనల్ కార్యాలయంగా మార్చి ఎక్స్టెన్షన్ సెంటర్ ఏర్పాటు చేశామని కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి పురుషోత్తమ్ రూపాలా తెలిపారు. మసాలా బోర్డు పరిధిలో పసుపుతో పాటు మొత్తం 50 పంటలు ఉన్నాయని, నిజామాబాద్ జిల్లాలో సాగయ్యే పసుపు కోసమే ఈ ఎక్స్టెన్షన్ సెంటర్ ప్రత్యేకంగా పనిచేస్తుందని స్పష్టం చేశారు. స్పైసెస్ పార్క్ కూడా ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. మంగళవారం నిజామాబాద్‌లో పసుపు బోర్డు ఏర్పాటు అంశంపై లోక్‌సభలో ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు పురుషోత్తమ్ రూపాలా ఇచ్చిన సమాధానంతో సభలో కొద్దిసేపు రసాభాస జరిగింది. పేరేదైనా పని జరుగుతోంది కదా అంటూ పసుపు బోర్డు ఏర్పాటుపై ప్రశ్న అడిగిన ఉత్తమ్‌కు రూపాలా ఎదురు ప్రశ్న వేశారు. కాగా, పసుపు బోర్డు ఏర్పాటు చేసే ప్రతిపాదన గురించి అడిగితే, మంత్రి సూటిగా సమాధానం చెప్పకుండా స్పైసెస్ బోర్డు గురించి చెబుతున్నారని మంత్రిపై ఉత్తమ్ అసహనం వ్యక్తం చేశారు. 2019 ఎన్నికల ప్రచారంలో బీజేపీ అగ్ర నేతలు రాజ్‌నాథ్ సింగ్, ప్రకాశ్ జవదేకర్, రాంమాధవ్‌లు నిజామాబాద్‌లో పసుపు బోర్డు ఏర్పా టు చేస్తామంటూ ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. హామీ ఇచ్చాక పసుపు బోర్డు ఏర్పాటు చేయడానికి ఇబ్బందేంటని కేంద్రాన్ని నిలదీశారు. -
రైతులతో చర్చలు కొనసాగుతాయ్
న్యూఢిల్లీ: కేవలం చర్చల ద్వారానే సమస్యకు పరిష్కారం లభిస్తుందని తాను నమ్ముతున్నట్లు కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి పరిషోత్తం రూపాల చెప్పారు. కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రైతులతో చర్చలు కొనసాగించేందుకు ప్రభుత్వం సుముఖంగా ఉందని అన్నారు. 15వ తేదీన 9వ దఫా చర్చలు నిర్వహించాలని ప్రభుత్వం ఇంతకుముందే నిర్ణయించింది. ఈ మేరకు షెడ్యూల్ విడుదల చేసింది. వివాదాస్పదంగా మారిన మూడు నూతన వ్యవసాయ చట్టాల ప్రతులను రైతులు లోహ్రీ(భోగీ) మంటల్లో దహనం చేశారు. ఈ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ శివారులో రైతన్నలు ఆందోళన కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. సింఘు బోర్డర్ వద్ద బుధవారం లక్ష ప్రతులను దహనం చేసినట్లు సంయుక్త కిసాన్ మోర్చా ప్రతినిధి పరమ్‌జిత్‌సింగ్ చెప్పారు. పంజాబ్, హరియాణా రాష్ట్రాల్లో లోహ్రీ పంటల పండుగ. మూడు కొత్త చట్టాలను కేంద్ర సర్కారు రద్దు చేసిన రోజే తాము పండుగ జరుపుకుంటామని హరియాణా రైతు గురుప్రీత్‌సింగ్ పేర్కొన్నారు. ఢిల్లీ–హరియాణా రహదారిపై పలుచోట్ల నిరసనకారులు లోహ్రీ మంటలు వెలిగించారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. 26న కిసాన్ పరేడ్ 26న వేల ట్రాక్టర్లతో ఢిల్లీ శివార్లలో పరేడ్ నిర్వహిస్తామని ఆలిండియా కిసాన్ సంఘర్‡్ష కో–ఆర్డినేషన్ కమిటీ ప్రకటించింది. ఢిల్లీకి చుట్టూ 300 కిలోమీటర్లలోపు ఉన్న అన్ని జిల్లాల ప్రజలు ఒకరోజు ముందే నగర శివార్లకు చేరుకోవాలని పిలుపునిచ్చింది. -
ఏపీ రైతుల్ని ఆదుకుంటాం: బీజేపీ
సాక్షి, న్యూఢిల్లీ/సాక్షి, అమరావతి: ఏపీలో వరదలతో నష్టపోయిన రైతుల్ని అన్ని విధాలా ఆదుకుంటామని కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి పురుషోత్తం రూపాలా హామీ ఇచ్చారు. శుక్రవారం మంత్రి రూపాలాతో వెబినార్ ద్వారా వివిధ ప్రాంతాల నుంచి భాజపా ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు, ఎంపీలు జీవీఎల్ నరసింహారావు, సుజనా చౌదరి, సీఎం రమేశ్, టీజీ వెంకటేశ్, భాజపా జాతీయ కార్యదర్శి దగ్గుబాటి పురందేశ్వరి, రావెల కిశోర్‌బాబు, విష్ణువర్ధన్‌రెడ్డి, సూర్యనారాయణరాజు, ఏపీ కిసాన్‌మోర్చా అధ్యక్షుడు శశిభూషణ్‌రెడ్డి తదితరులు మాట్లాడారు. ఏపీలో ఇటీవల భారీగా కురిసిన వర్షాల వల్ల నదులు, వాగులు, చెరువులు పొంగి గ్రామాలు, పొలాలు మునిగిపోయాయని వీర్రాజు వివరించారు. పలు పంటలు చేతికొచ్చే సమయంలో నీట మునగడంతో రైతులు నష్టపోయారని చెప్పారు. పార్టీ బృందాలు వరద ప్రాంతాల్లో పర్యటించి నష్టాన్ని అంచనా వేశాయని, ఆ నివేదిక పంపుతామని, నష్టపోయిన రైతుల్ని ఆదుకోవాలని వీర్రాజు కోరారు. ఏపీలో ప్రస్తుత వరద పరిస్థితి, పంట నష్టంపై పురందేశ్వరి, జీవీఎల్, శశిభూషణ్‌రెడ్డి వివరించగా కేంద్ర బృందాలను పంపాలని సుజనాచౌదరి, సీఎం రమేశ్‌లు కోరారు. -
రైతు రాబడికి చట్టబద్ధతే రక్షణ
ఎన్నికల మేనిఫెస్టోలో బీజేపీ హామీ ఇచ్చినట్లుగా రెండు లేదా మూడేళ్ల వ్యవధిలో భారతీయ రైతుల ఆదాయాన్ని రెండురెట్లకు పెంచడం అసాధ్యమని కేంద్రమంత్రే పార్లమెంటులో ప్రకటించి సమస్యనుంచి పక్కకు తప్పుకున్నారు. వచ్చే అయిదేళ్లకాలానికి వ్యవసాయరంగంలో వాస్తవ ఆదాయాలు సంవత్సరానికి అర్థశాతం కంటే తక్కువ మాత్రమే పెరుగుతాయని నీతిఅయోగ్ అంచనా వేసింది. మన పాలకులు, విధాన నిర్ణేతలు ఉద్దేశపూర్వకంగానే వ్యవసాయ రంగాన్ని నిర్లక్ష్యపర్చడమే దీనికి కారణం. ఈ నేపథ్యంలో రైతుల ఆదాయ వృద్ధిపై వ్యర్థ చర్చలు మాని, కనీస మద్దతు ధరకు చట్టప్రతిపత్తిని కల్పించడమే పాలకుల తక్షణకర్తవ్యం కావాలి. వ్యవసాయరంగంలో పెట్టుబడుల పెంపుదల ఆర్థికవ్యవస్థనే సంక్షోభం నుంచి బయటబడేస్తుంది. సబ్కా సాత్, సబ్కా వికాస్ సాగవలసిన మార్గం ఇదేమరి. ఎట్టకేలకు కేంద్రప్రభుత్వానికి తత్వం బోధపడినట్లుంది. తాజా పార్లమెంటు సమావేశాల సందర్భంగా, 2022 నాటికి వ్యవసాయరంగ ఆదాయాన్ని రెట్టింపు చేయడం సాధ్యం కాదని కేంద్రం పార్లమెంటులో అంగీకరించింది. సమాజ్‌వాదీ పార్టీ నాయకుడు రామ్ గోపాల్ యాదవ్ రాజ్యసభలో సంధించిన ప్రశ్నకు వ్యవసాయశాఖ సహాయ మంత్రి పురుషోత్తం రూపాలా స్పష్టంగా సమాధానమిచ్చారు. ‘రామ్ గోపాల్జీ ప్రశ్నతో మేము ఏకీభవిస్తున్నాం. వ్యవసాయ రంగంలో ప్రస్తుత వృద్థి రేటు ప్రకారం రైతు ఆదాయాన్ని రెట్టింపు చేయడం సాధ్యం కాదు.’’ ఏటా వ్యవసాయరంగం 4 కంటే తక్కువ శాతం వృద్ధిరేటు కనబరుస్తుండటంతో, వచ్చే మూడేళ్లలో రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడం సాధ్యం కాదని మంత్రి స్పష్టంచేశారు. 2016 ఏప్రిల్‌లో ఏర్పడిన దళవాయి కమిటీ (డిఎఫ్ఐ) రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలంటే సంవత్సరానికి రైతుల ఆదాయ వృద్ధి రేటు 10.4 శాతానికి పెరగాల్సి ఉందని అంచనా వేశారు. ఇది సాధ్యపడాలంటే దేశం అత్యధిక ఆర్థిక వృద్ధి రేటును సాధించాల్సి ఉందని పలువురు ఆర్థిక వేత్తలు అభిప్రాయపడ్డారు. ఇది ప్రస్తుత పరిస్థితుల్లో పేరాశే అవుతుందన్న విషయాన్ని దృష్టిలో ఉంచుకుంటూనే, రైతురాబడి వృద్ధిపై ప్రభుత్వం ఇచ్చిన హామీ అమలు కావడం అంత సులభం కాదని కేంద్రమంత్రి స్వయంగా అంగీకరించినందుకు ధన్యవాదాలు. సాక్షాత్తూ కేంద్రమంత్రి పార్లమెంటులో చేసిన ప్రకటన తర్వాత అయినా, రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడం ఎలా అనే అంశంపై దేశంలోని యూనివర్సిటీలు, విద్యాసంస్థలు, కాలేజీలు, పౌరసమాజ సంస్థలు రెండేళ్లుగా సాగించిన అంతులేని సెమినార్లు, కాన్ఫరెన్సులు, వర్క్‌షాపుల తతంగానికి ముగింపు పలకాల్సిన అవసరముంది. వ్యవసాయరంగ ఆదాయంలో నిజమైన వృద్ధి గత రెండేళ్లలో సున్నకు సమీపంలో కొనసాగుతున్న సమయంలో వచ్చే అయిదేళ్లకాలానికి వ్యవసాయరంగంలో నిజ ఆదాయం సంవత్సరానికి అర్థశాతం కంటే తక్కువ మాత్రమే పెరుగు తుందని నీతిఅయోగ్ అంచనా వేసింది. ఈ పరిస్థితుల్లో కూడా వ్యవసాయ రంగానికి తప్పనిసరైన మౌలిక వ్యవస్థాపనా పరివర్తన గురించి ఎవరూ మాట్లాడటం లేదు. నేల సంరక్షణ కార్డులు, వేపకలిపిన యూరియా, ఫసల్ బీమా యోజన, జాతీయ వ్యవసాయ మార్కెట్లు, మరిన్ని పంట నిల్వ వసతులు వంటి పథకాలేవీ రైతు ఆదాయాన్ని రెట్టింపు చేస్తాయని హామీ ఇవ్వలేరు. ఇప్పుడు తక్షణం కావలసింది ప్రత్యక్ష ఆదాయ మద్దతు. రైతు ఆదాయాన్ని క్రమబద్ధం చేయటానికి ఇదే ఉత్తమమార్గం. కేంద్ర ప్రభుత్వం 2018 సెప్టెంబర్‌లో రైతు ఆదాయ పెంపు కమిటీ (డీఎఫ్ఐ) సమర్పించిన నివేదిక చేసిన సిఫార్సుల అమలు, పర్యవేక్షణకోసం ఒక సాధికారక కమిటీని ఏర్పర్చినప్పటికీ వచ్చే రెండేళ్లలోపు రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడం సాధ్యపడకపోవచ్చు అని అర్థమవుతూనే ఉంది. అందుకే వ్యవసాయ రంగంలో దీర్ఘకాలిక సంస్కరణలను ప్రారంభించడంలో ఇది తప్పక తోడ్పడుతుంది. దీనికి అనుగుణంగా ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించాల్సి ఉంది. ఈ దీర్ఘకాలిక సంస్కరణల్లో మొట్టమొదటిది ఏమిటంటే వ్యవసాయరంగంలో ప్రభుత్వ రంగ మదుపును బాగా ప్రోత్సహించడమే. 2011–12, 2016–17 మధ్యకాలంలో వ్యవసాయంలో ప్రభుత్వరంగ మదుపు మొత్తం జీడీపీలో 0.4 శాతం వద్దే సాగిలపడిపోయిందని అర్బీఐ గణాంకాలు సూచిస్తున్నాయి. దేశ జనాభాలో దాదాపు సగంమంది నేటికీ వ్యవసాయ రంగంపై ఆధారపడి ఉన్నారని గ్రహించినట్లయితే, మన పాలకులు, విధాన నిర్ణేతలు ఉద్దేశపూర్వకంగానే వ్యవసాయ రంగాన్ని నిర్లక్ష్యపరుస్తూ వస్తున్నారని బోధపడుతుంది. తగినంత పెట్టుబడి తరలిరాకుండా దేశీయ వ్యవసాయరంగంలో అద్భుతాలు సృష్టించవచ్చని ఏ ఆర్థిక వేత్త అయినా ప్రకటిస్తారని నేనయితే భావించడం లేదు. జీడీపీలో అరశాతం కూడా వ్యవసాయరంగంలో మదుపు చేయలేదన్నది స్పష్టమే. దీనిక్కారణం.. వ్యవసాయాన్ని ఒక ఆర్థిక కార్యాచరణగా మనదేశంలోని ఆర్థిక చింతనాపరులు గుర్తించకపోవడమే. దీనితో వ్యవసాయాన్ని లాభదాయకమైన, నిలకడకలిగిన పరిశ్రమగా చేయడంపై దృష్టి పెట్టడానికి బదులుగా విధాన నిర్ణేతలు రైతులను, అనుబంధ వృత్తి జీవులను మరింతగా వ్యవసాయ రంగం నుండి బయటకు నెట్టివేయడంపైనే కేంద్రీకరించారు. ఇలాంటి ధోరణి ఇకనైనా మారాలి. ఈ మార్పునకు సంబంధించిన సంకేతాన్ని మనం బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోలో చూడవచ్చు. దేశీయ వ్యవసాయ రంగంలో 25 లక్షల కోట్లను పెట్టుబడిగా పెడతామని ఆ మేనిఫెస్టోలో పేర్కొన్నారు. అయితే 2019–20 సంవత్సరానికిగానూ కేంద్ర బడ్జెట్లో వ్యవసాయరంగానికి రూ. 1,30,485 కోట్లను కేటాయిస్తున్నట్లు ప్రతిపాదించారు. పీఎమ్ కిసాన్ పథకంలో మిగిలిన మూడు ఇన్స్టాల్మెంట్ల చెల్లింపుకోసం కేటాయించిన రూ. 75,000 కోట్లను కూడా దీంట్లో భాగంగా చేశారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, వ్యవసాయరంగంలో నిజ ఆదాయాలను పెంచడం, రైతులు కోల్పోయిన గౌరవాన్ని పునరుద్ధరించడం వంటివాటికోసం వ్యవసాయంలో మౌలిక సంస్కరణలు కావాలని ప్రతిపాదించడానికి కూడా మన వ్యవసాయ శాస్త్రవేత్తలు, ఆర్థికవేత్తలు ఇచ్చగించని తరుణంలో పంజాబ్, హరియాణా హైకోర్టు ఇటీవలే సంచలనాత్మక తీర్పును వెలువరించింది. భారతీయ రైతులను ఆర్థిక దుస్థితి నుంచి కాపాడాలంటే వ్యవసాయ ఉత్పత్తి ధరకు మూడురెట్లు అధికంగా కనీస మద్దతు ధరను ప్రకటించాలని కోర్టు వ్యాఖ్యానించింది. ‘కనీస మద్దతు ధరను 1965లో ప్రకటించినప్పటికీ, చేదువాస్తవం ఏమిటంటే, తీవ్ర దారిద్య్రం నుంచి రైతులను బయటపడేలా వారి ఆదాయాలను ఈ పథకం కల్పించలేకపోయింది. కనీసం రైతులను ప్రోత్సహించలేకపోయింది. రైతులు పండించిన పంటలకు న్యాయమైన ధర పొందేలా న్యాయపరమైన హక్కులను కల్పిస్తూ కనీస మద్దతు ధరకు చట్టబద్ధతను ఇవ్వాల్సిన సమయం ఆసన్నమైంది’. తగిన చట్టం రూపకల్పన ద్వారా కనీస మద్దతు ధరకు న్యాయ ప్రతిపత్తిని అందచేయాలని ఆదేశిస్తూ జస్టిస్ రాజీవ్ శర్మ, జస్టిస్ హెచ్ఎస్ సిద్ధుతోకూడిన డివిజన్ బెంచ్ తీర్పుచెప్పింది. తమ తీర్పులోభాగంగా న్యాయమూర్తులు.. వ్యవసాయరంగంలో దళారులను తొలగించడం, గిడ్డంగులను నెలకొల్పడం, వాతావరణ ప్రాతిపదికన పంటల బీమా పథకాలు, ఇంటర్నెట్ టెక్నాలజీని ఉపయోగించడం, రుణ కల్పన, రైతుల ఆత్మహత్యల నివారణ వంటి పలు సంస్కరణ చర్యలను సాగించాలని ఈ తీర్పులో పేర్కొన్నారు. గతంలో వ్యవసాయ ఖర్చులు, ధరల కమిటీ కూడా కనీస మద్దతు ధరకు చట్టప్రతిపత్తి కల్పించాలని పిలుపునిచ్చింది. సుదూరప్రాంతాలకు చెందిన రైతులు వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ కమిటీలను చేరలేకపోతున్నారని, దీంతో తమ ఉత్పత్తులను కనీస మద్దతు ధరకంటే ఎంతో తక్కువ ధరకే స్థానిక మార్కెట్లకు అమ్మేయాల్సి వస్తోందని ఈ కమిటీ ప్రత్యేకించి పేర్కొంది. కనీస మద్దతు ధరకు చట్టప్రతిపత్తిని కల్పించడం వల్ల రైతుల్లో ఆత్మవిశ్వాసం పెరగడమే కాకుండా రైతులకు కనీస ధరకు హామీ పడుతుంది. తద్వారా వారి ఆదాయాలు మెరుగుపడతాయి, రుణభారం తగ్గుతుంది, వ్యవసాయ దుస్థితి తగ్గుముఖం పడుతుందికూడా. వీటికి అదనంగా వ్యవసాయ ఉత్పత్తి ఖర్చుకు మూడు రెట్లు అధికంగా కనీస మద్దతు ధరను పెంచడం వల్ల ఇదొక్కటే వ్యవసాయరంగం పనితీరు గణనీయంగా పెరగడానికి వీలవుతుంది. నా ఉద్దేశంలో రెండు రకాల ధరల విధానం ఉండాలి. అవేమిటంటే కనీస మద్దతు ధరతో ధాన్యసేకరణ జరపటం, రైతుకు చెల్లించవలసిన వాస్తవ ధరను ఆచరణలో అమలు చేయడం. ఇప్పుడు రైతులందరికీ జన్‌ధన్ బ్యాంకు ఖాతాలు ఉన్నాయి కాబట్టి ఈ రెండు ధరల విధానాల మధ్యలో తలెత్తే వ్యత్యాసాన్ని రైతు బ్యాంకు ఖాతాకే నేరుగా బదలాయించవచ్చు. వ్యవసాయరంగంలో వృద్ధి గణాంకాలు తమ్ముతాము నిరోధిం చుకునే పరిస్థితులనుంచి బయటపడాల్సిన సమయం వచ్చింది. మానవ వనరులపై మదుపు చేయడానికి ఇది చక్కటి తరుణం. వ్యవసాయ రాబడులను పెంచేందుకు మరిన్ని పెట్టుబడులు పెట్టడం వల్ల వ్యవసాయ టెక్నాలజీని మెరుగుపర్చుకునేందుకు రైతులుపెట్టే డబ్బు కూడా పెరుగుతుంది. ఇలా గ్రామీణ డిమాండును అధిక మదుపుల ద్వారా కేటాయించిన రోజు, పారిశ్రామికాభివృద్ధి కూడా వేగం పుంజు కుంటుంది. ఆర్థిక వ్యవస్థ మందగిస్తున్న తరుణంలో సరకులకు మరింత డిమాండును సృష్టించడం వ్యవసాయరంగం వల్లే సాధ్యపడుతుంది. కాబట్టి వ్యవసాయ రంగంలో పెట్టుబడులు పెట్టడం అనేది మొత్తం ఆర్థిక వ్యవస్థనే సంక్షోభం నుంచి బయటపడేస్తు్తంది. సబ్కా సాత్, సబ్కా వికాస్ సాగవలసిన మార్గం ఇదేమరి. వ్యాసకర్త : దేవీందర్ శర్మ, వ్యవసాయ నిపుణులు ఈ–మెయిల్ : hunger55@gmail.com -
మరో 7 కోట్ల కిసాన్ క్రెడిట్ కార్డులు
న్యూఢిల్లీ: దేశంలోని రైతులందరికీ కిసాన్ క్రెడిట్ కార్డులను పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వ్యవసాయ శాఖ సహాయ మంత్రి పురుషోత్తం రుపాలా రాజ్యసభకు తెలిపారు. దేశవ్యాప్తంగా ఉన్న 6.5 కోట్ల మంది రైతులకు ఇప్పటికే కిసాన్ క్రెడిట్ కార్డులను అందజేశామని, మిగతా 7 కోట్ల మందికి కూడా వీటిని అందజేసేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నట్లు వివరించారు. రైతులందరికీ సంస్థాగత రుణ సదుపాయం కల్పించే లక్ష్యంతో ఈ పథకాన్ని ముఖ్యమైందిగా ప్రభుత్వం భావిస్తోందన్నారు. రైతు సమస్యలపై ప్రవేశపెట్టిన ఓప్రైవేట్ బిల్లుపై చర్చ సందర్భంగా ఆయన ఈ వివరాలు వెల్లడించారు. ఈ పథకానికి ప్రభుత్వం రూ.14 లక్షల కోట్లను కేటాయించిందన్నారు. చిన్న కమతాల పెరుగుదల, దిగుబడులు తగ్గడంపై ఆయన మాట్లాడుతూ.. దీనికి విరుగుడుగా ఉమ్మడి సేద్యం వైపు రైతులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించిందని చెప్పారు. జన్యు పంటలు ప్రమాదకరమనేందుకు ఆధారాల్లేవు: కేంద్రం జన్యు పంటలు ప్రమాదకరమని చెప్పేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పర్యావరణ సహాయ మంత్రి బాబుల్ సుప్రియో లోక్‌సభకు తెలిపారు. మనుషులకు ప్రమాదకరంగా పరిణమించే జన్యు పంటలను చట్ట విరుద్ధంగా పండించే వారిపై చర్యలు తీసుకోవాలంటూ రాష్ట్రాలలకు సూచించామన్నారు. ఆగస్టు 2 వరకు పార్లమెంట్! పార్లమెంట్ సమావేశాలను మరికొద్ది రోజులు పొడిగించాలని ప్రభుత్వం యోచిస్తోంది. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 26వ తేదీతో సమావేశాలు ముగియాల్సి ఉంది. అయితే, ముందుగా అనుకున్న ప్రకారం అన్ని బిల్లులను ప్రవేశపెట్టేందుకు వీలుగా సమావేశాలను ఆగస్టు 2వ తేదీ వరకు పొడిగించాలని భావిస్తున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. కొన్ని ప్రతిపక్ష పార్టీలు ఈ ప్రతిపాదనకు సానుకూలంగా లేనప్పటికీ అధికార పక్షం నిర్ణయమే అంతిమం కానుంది. ప్రభుత్వ షెడ్యూల్ ప్రకారం ట్రిపుల్ తలాక్ సహా మరో 13 బిల్లులను లోక్‌సభలో ప్రవేశపెట్టాల్సి ఉంది. జూన్ 17వ తేదీ నుంచి కొనసాగుతున్న పార్లమెంట్ సమావేశాలు గత 20 ఏళ్లలోనే అత్యంత ఫలప్రదంగా సాగాయని పీఆర్ఎస్ లెజిస్లేటివ్ రీసెర్చ్ అనే సంస్థ తెలిపింది. -
కొత్తగా 9 మందికి ఛాన్స్!
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ కేంద్ర మంత్రివర్గ విస్తరణకు రంగం సిద్ధం చేశారు. కేబినెట్ పునర్వ్యవస్థీకరణలో 9 మందికి అవకాశం కల్పించనున్నారని సమాచారం. వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఉత్తరప్రదేశ్ కు పెద్దపీట వేసే అవకాశముందని బీజేపీ వర్గాలు వెల్లడించాయి. యూపీకి చెందిన భాగస్వామ్య పక్షం అప్నా దళ్ కు చెందిన బీసీ ఎంపీ అనుప్రియ పటేల్ కు కేబినెట్లో స్థానం కల్పించనున్నట్టు తెలుస్తోంది. యూపీకి చెందిన పలువురు బీజేపీ నాయకులకు కూడా కేబినెట్ బెర్త్ ఖాయమంటున్నారు. మంత్రిపదవులు వస్తాయని భావిస్తున్న యూపీ బీజేపీ నేతలు సోమవారం అమిత్ షాను కలిశారు. రాజస్థాన్ బికనీర్ లోక్ స్థానానికి ప్రాతినిథ్యం వహిస్తున్న దళితనేత పీపీ చౌధురి కూడా కేబినెట్ లో చేర్చుకుంటారని సమాచారం. ఎస్ఎస్ ఆహ్లువాలియా, రాజ్యసభ సభ్యుడు విజయ్ గోయల్, ఉత్తరాఖండ్ దళిత ఎంపీ అజయ్ తమ్తా, గుజరాత్ రాజ్యసభ ఎంపీ పురుషోత్తం రూపాల, మహారాష్ట్ర ఆర్పీఐ ఎంపీ రామదాస్ అథవాలే, యూపీ ఎంపీ మహేంద్ర నాథ్ పాండే, యూపీ దళిత ఎంపీ క్రిషన్ రాజ్ లకు మంత్రి పదవులు దక్కనున్నాయని తెలుస్తోంది. కొంత మంది మంత్రులను తప్పించే అవకాశముందంటున్నారు. అయితే సీనియర్ మంత్రులకు పదవీగండం లేదని సమాచారం. మంగళవారం ఉదయం 11 గంటలకు కేబినెట్ విస్తరణ ఉంటుందని ప్రభుత్వ ప్రధాన సమాచార ప్రతినిధి ఫ్రాంక్ నొరొన్హా ట్వీట్ చేశారు.