భువనేశ్వర్: కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాలా ప్రయాణించిన పడవ చిలుకా సరస్సులో సుమారు రెండు గంటల పాటు చిక్కుకుపోయింది. ఈ ఘటన ఆదివారం సాయంత్రం చోటు చేసుకుంది. వెంటనే స్పందించిన అక్కడి సబ్బంది సరస్సులోకి మరో పడవను పంపి మంత్రిని సురక్షితంగా ఒడ్డుకు తీసుకువచ్చారు.
మంత్రితో పాటు ఆ పడవలో బీజేపీ జాతీయ ప్రతినిధి సంబిత్ పాత్రా మరో ఇద్దరు నేతలు ఉన్నారు. మంత్రి రూపాల ఖుర్దా జిల్లాలోని బార్కుల్ నుంచి పూరీ జిల్లాలోని సతపదాకు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ‘సాయంత్రం కావటంతో చికటిపడింది. పడవ నడిపే వ్యక్తి కొత్త దారిలో పడవను తీసుకెళ్లాడు. దీంతో అసలు వెళ్లాల్సిన దారి తప్పిపోయాం. సతపద చేరుకోవడానికి మరో రెండు గంటలు పట్టింది’ అని మంత్రి రూపాలా తెలిపారు.
ଚିଲିକା ମଝିରେ ୨ ଘଣ୍ଟା ଫସିଲେ କେନ୍ଦ୍ରମନ୍ତ୍ରୀ । କେନ୍ଦ୍ର ମତ୍ସ୍ୟମନ୍ତ୍ରୀ ପୁରୁଷୋତ୍ତମ ରୁପାଲା ଚିଲିକାରେ ୨ ଘଣ୍ଟା ଧରି ଫସିରହିଥିଲେ ବୋଲି ସୂଚନା ମିଳିଛି। #Chilika #UnionMinister #ParshottamRupala #OTV pic.twitter.com/9stpN2Yfvm
— ଓଟିଭି (@otvkhabar) January 7, 2024
సరస్సులో పడవ చిక్కుకోవడానికి మత్స్య కారులు వేసిన చేపలు పట్టే వల అని అనుమానించామని తెలిపారు. కానీ, పడవ దారి తప్పిపోవడమే.. కారణమని మంత్రి మీడియాకు వెల్లడించారు. ఈ ఘటనతో కృష్ణా ప్రసాద్ ప్రాంతంలో మంత్రి పాల్గొనాల్సిన ఓ కార్యక్రమాన్ని రద్దు చేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment