Chilika Lake
-
కేంద్ర మంత్రికి తృటిలో తప్పిన ప్రమాదం..
భువనేశ్వర్: కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాలా ప్రయాణించిన పడవ చిలుకా సరస్సులో సుమారు రెండు గంటల పాటు చిక్కుకుపోయింది. ఈ ఘటన ఆదివారం సాయంత్రం చోటు చేసుకుంది. వెంటనే స్పందించిన అక్కడి సబ్బంది సరస్సులోకి మరో పడవను పంపి మంత్రిని సురక్షితంగా ఒడ్డుకు తీసుకువచ్చారు. మంత్రితో పాటు ఆ పడవలో బీజేపీ జాతీయ ప్రతినిధి సంబిత్ పాత్రా మరో ఇద్దరు నేతలు ఉన్నారు. మంత్రి రూపాల ఖుర్దా జిల్లాలోని బార్కుల్ నుంచి పూరీ జిల్లాలోని సతపదాకు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ‘సాయంత్రం కావటంతో చికటిపడింది. పడవ నడిపే వ్యక్తి కొత్త దారిలో పడవను తీసుకెళ్లాడు. దీంతో అసలు వెళ్లాల్సిన దారి తప్పిపోయాం. సతపద చేరుకోవడానికి మరో రెండు గంటలు పట్టింది’ అని మంత్రి రూపాలా తెలిపారు. ଚିଲିକା ମଝିରେ ୨ ଘଣ୍ଟା ଫସିଲେ କେନ୍ଦ୍ରମନ୍ତ୍ରୀ । କେନ୍ଦ୍ର ମତ୍ସ୍ୟମନ୍ତ୍ରୀ ପୁରୁଷୋତ୍ତମ ରୁପାଲା ଚିଲିକାରେ ୨ ଘଣ୍ଟା ଧରି ଫସିରହିଥିଲେ ବୋଲି ସୂଚନା ମିଳିଛି। #Chilika #UnionMinister #ParshottamRupala #OTV pic.twitter.com/9stpN2Yfvm — ଓଟିଭି (@otvkhabar) January 7, 2024 సరస్సులో పడవ చిక్కుకోవడానికి మత్స్య కారులు వేసిన చేపలు పట్టే వల అని అనుమానించామని తెలిపారు. కానీ, పడవ దారి తప్పిపోవడమే.. కారణమని మంత్రి మీడియాకు వెల్లడించారు. ఈ ఘటనతో కృష్ణా ప్రసాద్ ప్రాంతంలో మంత్రి పాల్గొనాల్సిన ఓ కార్యక్రమాన్ని రద్దు చేసుకున్నారు. చదవండి: Delhi: కాస్త ఎండ.. అంతలోనే విపరీతమైన చలి! -
వికాసం పేరుతో..వినాశం
బరంపురం ఒరిస్సా : ప్రకృతి అందాలతో అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా గుర్తింపు పొందిన చిలికా సరస్సు వికాసం పేరుతో వినాశానికి ఒడిగట్టేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు వెంటనే అపాలని ప్రకృతి బంధు ప్రఫుల్ల సామంతరాయ్ కోరారు. మంగళవారం హల్పట్నా మెయిన్ రోడ్లో గల ప్రఫుల్ల సామంత్ రాయ్ నివాసంలో లోక్ శక్తి అభియాన్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా లోక్‌శక్తి అభియాన్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రఫుల్ల సామంత్ రాయ్ మాట్లాడుతూ రెండు రోజుల క్రితం చిలికా సరస్సులో జల విమానాశ్రయం నిర్మాణానికి కేంద్ర పౌర విమాయానన శాఖ లాంచనంగా నిర్ణయించినట్లు ప్రకటించిందని గుర్తు చేశారు. అయితే చిలికా సరస్సులో ఇటువంటి జల విమానాశ్రయం నిర్మాణం చేపడితే సహజ ప్రకృతి సౌందర్యం కోల్పోవడమే కాకుండా చిలికా సరస్సులో కలుషిత వాతవరణం ఏర్పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా ప్రతి ఏడాదీ లక్షలాది విదేశీ విహంగాలు చిలికా సరస్సులో ఉన్న దీవుల్లో పాటుపడే సంతాన అభివృద్ధికి ఆటంకం ఏర్పడే ప్రమాదం ఉందని ఆందోళన వెలిబుచ్చారు. ఈ నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి సారించి వెంటనే చిలికా సరస్సులో జల విమానాశ్రయం నిర్మాణం ఆపివేయాలని కోరారు. లేనిపక్షంలో లోక్‌శక్తి అభియాన్ ఆధ్వర్యంలో ప్రజాందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షుడు మధుసూదన్ శెట్టి, లక్ష్మీనరసింహ శెట్టి, సుధామ్ శెట్టి, శ్రీకాంత్ శెట్టిలు పాల్గొన్నారు. -
వావ్..త్వరలో చిలికా కనువిందు
బరంపురం: ఆసియాలోనే అతి పెద్దదైన రాష్ట్రంలోని చిలికా సరస్సు ఇకపై పర్యాటకులకు కొత్త అందాలతో కనువిందు చేయనుంది. ఈ మేరకు చిలికా సరస్సు అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ తయారైంది. గంజాం జిల్లాలో గల చిలికా సరస్సు అంతర్జాతీయ పర్యాటక మ్యాప్‌లో ఇటీవల గుర్తింపు పొందడంతో చిలికా సరస్సు అభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యే దృష్టి సారించింది. పర్యాటకులకు మరింత కనువిందుచేసేందుకు త్వరలో చిలికా సరస్సు కొత్త అందాలతో రూపు దిద్దుకోనుంది. ప్రకృతి పర్యావరణ పరిరక్షణ అభివృద్ధి(ఈకో–టూరిజం)కోసం రాష్ట్ర ప్రభుత్వం ఈ అభివృద్ధి పథకాన్ని చేపట్టనుంది. ఈ మేరకు చిలికాసరస్సు అభివృద్ధిని చేపట్టేందుకు ఢిల్లీకి చెందిన ఓ గ్లోబల్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు టెండర్ ఖరారు చేసింది. ఆధునిక హంగులతో హోటల్స్ పర్యాటకుల సౌకర్యార్థం చిలికా సరస్సులో గల 24 ఐలాండ్స్‌లో కాటేజెస్, హోటల్స్ ఆధునిక అందాలతో రూపుదిద్దుకోనున్నాయి. పర్యాటకులను అకట్టుకునేందుకు ఈ చిలికా మధ్యలో ఉన్న ఈ ద్వీపాలకు బ్రేక్‌ఫాస్ట్, హనీమూన్ అని నామకరణం చేయనున్నారు. 24 ఐలాండ్స్ మధ్య పర్యాటకులు రాత్రి బసచేసేందుకు సౌకర్యాలు కూడా ఏర్పాటు కానున్నాయి. అయితే ప్రతి ఏడాదీ చలికాలంలో విదేశీ అతిథి పక్షులు విడిది ఏర్పర్చుకుంటున్న చిలికా సరస్సు మధ్యలో ఉన్న నలబన దీవి కి ఎటువంటి అటంకం, అడ్డు రాకుండా విదేశీ పక్షుల రక్షణకు ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నట్లు రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి అశోక్పండా ఇటీవల మీడియాకు వెల్లడించారు. చిలికా సరస్సు అంతర్జాతీయ పర్యాటక స్థలంగా గుర్తింపు పొందేందుకు మాస్టర్ ప్లాన్ సిద్ధమైందని, చిలికా> మత్స్యకారులకు కూడా ప్రత్యేక ప్యాకేజీ ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్ ప్రేమ్‌చంద్ చౌదరి కూడా స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన చిలికా అభివృద్ధి సంస్థ, పర్యాటక, సాంస్కృతిక విభాగం అటవీ విభాగం ఉన్నతాధికారులతో ఇటీవల సమావేశమయ్యారు. చిలికా అభివృద్ధికి అయ్యే ఖర్చు కోసం ప్రంపంచ బ్యాంక్ నిధులు అందించనుంది. ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్ కోస్టల్ జోన్ మేనేజ్మెంట్ ప్లాన్ ఆధ్వర్యంలో చిలికా అభివృద్ధి జరుగుతుందని కలెక్టర్ ప్రేమ్‌చంద్ తెలియజేశారు. కేరళ తరహాలో అభివృద్ధి 125 కిలోమీటర్ల విస్తీర్ణం గల చిలికా సరస్సు కొత్తఅందాలను సంతరించుకోనుంది. పర్యాటకులను అకట్టుకునేందుకు కేరళ తరహా హౌస్‌బోట్ సౌకర్యాలు, మోటార్ బోట్లపై నీటి మధ్య ఉన్న మత్స్యకార దీవులను సందర్శించి చేపల వేట ఏ విధంగా జరుగుతుందో చూసేందుకు అవకాశం కల్పిస్తారు. చిలికా మధ్య ఉన్న ఐలాండ్స్ అందాలు పర్యాటకుల కనుందు చేసే విధంగా అభివృద్ధి జరగనుంది. చిలికా మత్య్సుకారులు చేపల సాగు చేసేందుకు తీరాల్లో చెరువుల ఏర్పాట్లు జరగనున్నాయి. చేపల సాగు కోసం మత్స్యకారుల సౌకర్యార్థం కోఆపరేటివ్ సొసైటీ ఏర్పాటు చేసి రుణాలు ఇవ్వనున్నట్లు కలెక్టర్ చెప్పారు. చిలికా సరస్సు పర్యాటక అభివృద్ధి కోసం మత్స్యకారులు, స్థానికులను చైతన్య పరిచేందుకు త్వరలో చిలికా చుట్టు పక్కల గ్రామాల్లో సబంధిత అధికారులు త్వరలో చైతన్య శిబిరాలు నిర్వహించి చిలికా అభివృద్ధి, మత్స్యకారులకు అమలు జరిగే పథకాలను వివరించనున్నామని కలెక్టర్ స్పష్టం చేశారు.