Puri district
-
కేంద్ర మంత్రికి తృటిలో తప్పిన ప్రమాదం..
భువనేశ్వర్: కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాలా ప్రయాణించిన పడవ చిలుకా సరస్సులో సుమారు రెండు గంటల పాటు చిక్కుకుపోయింది. ఈ ఘటన ఆదివారం సాయంత్రం చోటు చేసుకుంది. వెంటనే స్పందించిన అక్కడి సబ్బంది సరస్సులోకి మరో పడవను పంపి మంత్రిని సురక్షితంగా ఒడ్డుకు తీసుకువచ్చారు. మంత్రితో పాటు ఆ పడవలో బీజేపీ జాతీయ ప్రతినిధి సంబిత్ పాత్రా మరో ఇద్దరు నేతలు ఉన్నారు. మంత్రి రూపాల ఖుర్దా జిల్లాలోని బార్కుల్ నుంచి పూరీ జిల్లాలోని సతపదాకు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ‘సాయంత్రం కావటంతో చికటిపడింది. పడవ నడిపే వ్యక్తి కొత్త దారిలో పడవను తీసుకెళ్లాడు. దీంతో అసలు వెళ్లాల్సిన దారి తప్పిపోయాం. సతపద చేరుకోవడానికి మరో రెండు గంటలు పట్టింది’ అని మంత్రి రూపాలా తెలిపారు. ଚିଲିକା ମଝିରେ ୨ ଘଣ୍ଟା ଫସିଲେ କେନ୍ଦ୍ରମନ୍ତ୍ରୀ । କେନ୍ଦ୍ର ମତ୍ସ୍ୟମନ୍ତ୍ରୀ ପୁରୁଷୋତ୍ତମ ରୁପାଲା ଚିଲିକାରେ ୨ ଘଣ୍ଟା ଧରି ଫସିରହିଥିଲେ ବୋଲି ସୂଚନା ମିଳିଛି। #Chilika #UnionMinister #ParshottamRupala #OTV pic.twitter.com/9stpN2Yfvm — ଓଟିଭି (@otvkhabar) January 7, 2024 సరస్సులో పడవ చిక్కుకోవడానికి మత్స్య కారులు వేసిన చేపలు పట్టే వల అని అనుమానించామని తెలిపారు. కానీ, పడవ దారి తప్పిపోవడమే.. కారణమని మంత్రి మీడియాకు వెల్లడించారు. ఈ ఘటనతో కృష్ణా ప్రసాద్ ప్రాంతంలో మంత్రి పాల్గొనాల్సిన ఓ కార్యక్రమాన్ని రద్దు చేసుకున్నారు. చదవండి: Delhi: కాస్త ఎండ.. అంతలోనే విపరీతమైన చలి! -
వారాహీమాత ఆలయం
అరుదైన శాక్తేయ ఆలయాల్లో ఒకటైన వారాహీమాత ఆలయం ఒడిశాలోని పూరీ జిల్లా చౌరాసి గ్రామంలో ఉంది. క్రీస్తుశకం తొమ్మిదో శతాబ్దిలో సోమవంశ రాజులు నిర్మించిన ఈ ఆలయం కళింగ శిల్పకళా వైభవానికి నిదర్శనంగా నేటికీ నిలిచి ఉంది. రెండు ఎకరాల విస్తీర్ణంలోని ప్రాంగణంలో వెలసిన ఈ ఆలయం ఎత్తు 15 మీటర్లకు పైబడే ఉంటుంది. లలితాసన భంగిమలో కనిపించే వారాహీమాతను స్థానికులు మత్స్యవారాహిగా ఆరాధిస్తారు. వరాహ ముఖంతో కుడిచేత మత్స్యం, ఎడమచేత కుంభం ధరించి కనిపించే వారాహిమాత మూలవిరాట్టు ఉగ్రరూపంలో కనిపిస్తుంది. తాంత్రిక పద్ధతిలో ఇక్కడ రోజువారీ పూజలు చేస్తారు. అలాగే అమ్మవారికి అనుదినం చేపలను నైవేద్యంగా సమర్పిస్తారు. అయితే, పూరీలోని శ్రీజగన్నాథ ఆలయంలో రోజూ జరిగే మహానైవేద్యాలను ఈ ఆలయానికి పంపడం తరతరాలుగా ఆచారంగా కొనసాగుతుండటం విశేషం. వారాహీమాత వెలసిన చౌరాసి గ్రామం సుప్రసిద్ధ సూర్యక్షేత్రం కోణార్క్ నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఒడిశా రాజధాని భువనేశ్వర్ వరకు అన్ని ప్రాంతాల నుంచి విమాన, రైలు సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. అక్కడి నుంచి ఇక్కడకు రోడ్డు మార్గంలో రావాల్సి ఉంటుంది.