Rajputs
-
బీజేపీకి రాజ్‌పుత్‌ల హెచ్చరిక
గాంధీనగర్: లోక్‌సభ ఎన్నికల వేళ ప్రచారంలో దూసుకుపోతున్న బీజేపీకి గుజరాత్ రాజ్‌కోట్ సెగ్మెంట్లో పురుషోత్తం రూపాలా అభ్యర్థిత్వం తలనొప్పిగా మారింది. రాజ్‌కోట్‌లో బీజేపీ అభ్యర్థి పురుషోత్తం రూపాలాను.. అక్కడి నుంచి ఉపసంహరించుకోపోతే రాజ్‌పుత్ సామాజిక వర్గం సంఘాలు పెద్దఎత్తున నిరసన తెలుపుతామనిహెచ్చరిస్తున్నాయి. గుజరాత్‌లోని 26 లోక్‌సభ స్థానాల్లో తమ నిరసనలు తీవ్రతరం చేస్తామంటున్నాయి. ఏప్రిల్ 19 వరకు రాజ్‌కోట్ పార్లమెంట్ స్థానంలో బీజేపీ అభ్యర్థి పురుషోత్తం రూపాలాను ఉపసంహరించకోపోతే తమ నిరసన దేశంలోని మరికొన్ని ప్రాంతాలకు విస్తరిస్తామని రాజ్‌పుత్ సంకల్ఫ్ సమితి చైర్మన్ కరన్సిన్హ చద్వా హెచ్చరించారు. ఈ సమతి రాజ్‌కోట్‌లో ‘రాజ్‌పుత్ ఆత్మగౌరవ సభ’ను ఆదివారం నిర్వహించింది. ఏప్రిల్ 16న రూపాల నామినేషన్ దాఖలు చేయనున్న నేపథ్యంతో ఆయన అభ్యర్థిత్వాన్ని బీజేపీ ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తోంది. ఇక.. నామినేషన్‌కు చివరి తేదీ 19, అదే విధంగా నామినేషన్ల ఉపసంహరణ తేదీ 22 వరకు ఉంది. పటీదార్ సామాజిక వర్గానికి చెందిన రుపాలా మర్చి 22న వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. పూర్వపు మహారాజులు.. బ్రిటిష్ వారితో సహా విదేశి పాలకుల అణచివేతకు లొంగిపోయారు. అదీకాక.. వారితో కలిసి భోజనం చేసి మహారాజులు తమ కుమర్తెలను విదేశీయులకు ఇచ్చి వివాహం జరిపించారని వ్యాఖ్యానించారు.ఈ వ్యాఖ్యలపై రాజ్‌పుత్‌లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసనలు తెలిపారు. రూపాలా అభ్యర్థిత్వాన్ని రాజ్‌కోట్ పార్లమెంట్ స్థానం నుంచి ఉపసంహరించుకోవాలని బీజేపీని డిమాండ్ చేశారు. అయితే ఇప్పటికే రూపాలా రెండు సార్లు క్షమాపణలు చెప్పినా రాజ్‌పుత్ వర్గాలు నిరాకరించాయి. ఈ నేపథ్యంలో రూపాలాకు వ్యతిరేకంగా గుజరాత్ మొత్తం పోస్టర్లు వెలిశాయి. గుజరాత్లో మొత్తం 26 స్థానాలక మే 7 పోలింగ్ జరగనుంది. బీజేపీ రూపాలా అభ్యర్థిత్వాన్ని మార్చకపోతే.. వందల సంఖ్యలో నామినేషన్ల దాఖలు చేసి మరీ బీజేపీ అభ్యర్థిని ఓడిస్తామని హెచ్చరించారు. ‘బీజేపీలో విభేదాలు తలెత్తితే... రాత్రికిరాత్తే మంత్రులు, సీఎంను తొలగిస్తారు. కానీ, బీజేపీ నేత రాజ్‌పుత్ మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే మాత్రం ఎందుకు నిశ్శబ్దంగా ఉంటుంది? మేము పెద్ద ఎత్తున పోరాడుతాం. సమస్యలపై మేము ధ్యైరం చూపిస్తాం’ అని రాత్పుత్ల నేత తృప్తి బా తెలిపారు. కాగా.. కొంతమందిస్వార్థ ప్రయోజనాల కోసమే నిరసనలకు ఆజ్యం పోస్తున్నారని బీజేపీ పేర్కొంది. మరోవైపు.. కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి మనీష్ దోషి మాట్లాడుతూ.. ‘మేము చాలా విశ్వాసంతో ఉన్నాం. పాటీదార్, రాజ్‌పుత్‌లు అంతా కలిసి రూపాలాను ఓడిస్తారు’అని అన్నారు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి పరేష్ ధమాని పోటీ చేస్తున్నారు. -
Gujarat: కేంద్రమంత్రి నోటి దురుసు.. ఎన్నికల వేళ బీజేపీకి తలనొప్పి
అహ్మదాబాద్: లోక్‌సభ ఎన్నికల పోలింగ్ కొద్దిరోజుల్లో జరగనుండగా కేంద్రమంత్రి పర్షోత్తమ్ రూపాలా చేసిన వ్యాఖ్యలు గుజరాత్లో బీజేపీకి తలనొప్పిగా మారాయి. క్షత్రియులపై పర్షోత్తమ్ రూపాలా వ్యాఖ్యలతో రాజ్‌కోట్‌లో రాజ్‌పుత్ వర్గానికి చెందిన వారు పెద్ద ఎత్తున ఆందోళనలకు దిగారు. రూపాలా ఇంటి ముందు ఆయన దిష్టిబొమ్మను కాల్చారు. దీంతోపోలీసులు రూపాలా ఇంటి వద్ద భద్రత పెంచారు. క్షత్రియులపై తాను చేసిన వ్యాఖ్యలపై రూపాలా క్షమాపణలు చెప్పినప్పటికీ రాజ్‌పుత్‌లు వెనక్కి తగ్గడం లేదు. రాజ్‌కోట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న రూపాలాను లోక్‌సభ రేసు నుంచి డిమాండ్ చేస్తున్నారు. మార్చ్ 22 దళితులతో జరిగిన ఓ కార్యక్రమంలో రూపాల గతంలో మహారాజాలను ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బ్రిటీష్ వారితో ఒకే కంచంలో తినడంతో పాటు వారికి తమ కూతుళ్లనిచ్చి మహారాజాలు పెళ్లి చేశారని రూపాలా విమర్శించారు. దళితులు మాత్రం బ్రిటీష్ వారి వేధింపులు తట్టుకున్నారని, మతం మాత్రం మారలేదని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు గుజరాత్లో దుమారం రేపాయి. రాజ్‌పుత్ కమ్యూనిటీ ఓట్లు బీజేపీలో 17 శాతం మేర ఉంటాయి. ఇవన్నీ మొన్నటిదాకా బీజేపీ ఖాతాలో పడే ఓట్లే. రూపాలా నోటీ నుంచి వచ్చిన వివాదాస్పద వ్యాఖ్యలతో లోక్‌సభ ఎన్నికల్లో ఈ ఓట్లు తమ పార్టీకి పడతాయా లేదా అని బీజేపీ అధిష్టానం ఆందోళన చెందుతోంది. గుజరాత్‌లోని కచ్, సౌరాష్ట్ర ప్రాంతాల్లో రాజ్‌పుత్‌లు ఎన్నికల ఫలితాలను చాలా వరకు ప్రభావితం చేస్తారు. ఇదీ చదవండి.. వయనాడ్ నుంచి నామినేషన్ వేసిన రాహుల్ గాంధీ -
ఓ ఆదివాసి వీరనారి పోరాటం!
మొఘల్ సామ్రాజ్యాన్ని ఎదిరించి వీరమరణం పొందిన ఆదివాసీ వీరనారి రాణి దుర్గావతి. మధ్యప్రదేశ్‌లోని గోండు తెగకు చెందిన బుందేల్ ఖండ్ సంస్థానాధీశుడు చందవేల్‌కు 1524 అక్టోబర్ 5న దుర్గావతి జన్మించింది. దుర్గావతి భర్త దళపత్ షా గోండు రాజ్యాన్ని పాలిస్తూ మరణించాడు. కుమారుడు వీరనారాయణ్ మైనర్ కావడంతో దుర్గావతి గోండ్వానా రాజ్య పాలన చేపట్టింది. రాణి దుర్గావతి పైనా, ఆమె పాలిస్తున్న గోండ్వానా రాజ్య సంపద పైనా మనసు పారేసుకున్న అక్బర్ సేనాని ఖ్వాజా అబ్దుల్ మజీద్ అసఫ్ ఖాన్... అక్బర్ అనుమతిని తీసుకొని గోండ్వానాపై దండెత్తాడు. సుశిక్షితులైన వేలాది మొఘల్ సైనికులు ఒకవైపు, అసంఘ టితమైన ఆదివాసీ సైన్యం ఒకవైపు యుద్ధ రంగంలో తలపడ్డారు. మొఘల్ సైన్యానికి ఆధునిక ఆయుధాలు ఉన్నాయి. కానీ ఆదివాసీ సైనికులకు సంప్రదాయ ఆయుధాలే దిక్కయ్యాయి. మొఘల్ సైన్యం రాకను తెలుసుకున్న దుర్గావతి రక్షణాత్మకంగా ఉంటుందని భావించి ‘నరాయ్’ అనే ప్రాంతానికి చేరుకొంది. ఇక్కడ ఒకపక్క పర్వత శ్రేణులు ఉండగా మరోపక్క గౌర్, నర్మద నదులు ఉన్నాయి. ఈ లోయలోకి ప్రవేశించిన మొఘల్ సైన్యంపై గెరిల్లా దాడులకు దిగింది దుర్గావతి. ఇరువైపులా సైనికులు మరణించారు. దుర్గావతి ఫౌజ్దార్ అర్జున్ దాస్ వీరమరణం పొందాడు. ఆమె గెరిల్లా యుద్ధాన్ని కొనసాగించాలని ప్రయత్నిస్తే సైనికాధికారులు రాత్రి గుడ్డి వెలుతురులో ప్రత్యక్ష యుద్ధం చేయాలని సలహా ఇచ్చారు. మరుసటిరోజు ఉదయానికి పెద్ద తుపాకులను వాడమని మొఘల్ సైన్యాధికారి అసఫ్ ఖాన్ సైనికులను ఆదేశించాడు. రాణి ఏనుగునెక్కి మొఘల్ సైనికులపై విరుచుకుపడింది. యువరాజు వీర్ నారాయణ్ కూడా యుద్ధరంగంలోకి దూకి మొఘల్ సైనికులను మూడుసార్లు వైనక్కి తరిమాడు. కానీ అతడు తీవ్రంగా గాయపడడంతో సురక్షితమైన ప్రదేశానికి వెళ్లిపోయాడు. రాణి దుర్గావతికి కూడా చెవి దగ్గర బాణం తగిలి గాయపడింది. ఆ తర్వాత ఒక బాణం ఆమె గొంతును చీల్చివేసింది. వెంటనే ఆమె స్పృహ కోల్పోయింది. స్పృహ వచ్చిన తర్వాత ఆమె ఏనుగును తోలే మావటి యుద్ధ రంగం నుంచి సురక్షిత ప్రదేశానికి తప్పించుకు వెళదామని సలహా ఇచ్చాడు. ఆమెకు అపజయం ఖాయం అని అర్థమయ్యింది. శత్రువుకు భయపడి పారిపోవడం లేదా అతడికి చిక్కి మరణించడం అవమానకరం అని భావించి తన సురకత్తిని తీసుకుని పొడుచుకొని ప్రాణాలు వదిలింది రాణి. దీంతో ఒక మహోజ్వల ఆదివాసీ తార నేలకొరిగినట్లయ్యింది. – గుమ్మడి లక్ష్మీ నారాయణ, ఆదివాసీ రచయితల వేదిక వ్యవస్థాపక కార్యదర్శి (చదవండి: దేశంలోనే తొలి బధిర మహిళా అడ్వకేట్ సారా! చివరికి సుప్రీం కోర్టు..) -
రాజపుత్రుల చిత్ర విచిత్రాలు
రాజకోట రహస్యాలు ఎవరినైనా ఇట్టే ఆకర్షిస్తాయి. పూర్వపు చక్రవర్తుల విపరీత మనస్తత్వాలు, విచారకర గుణాలు, దోషాలు, చిన్నపాటి పాపాలు, మహాపరాధాలు, చిలిపి చేష్టలు, సిగ్గుపడవలసిన ప్రవర్తనలు, వారి అపకీర్తుల గురించి ఎప్పుడో దివాన్ జర్మనీ దాస్ ఆసక్తికరంగా రాశారు. అందులో ఉన్నవన్నీ, ఒకవేళ అవి నిజమే అయినా, నమ్మశక్యంగా లేనివి! అయితే భారత రాజపుత్రుల లాగానే పాకిస్తాన్ రాజపుత్రులు కూడా ఉండేవారా? వారికీ వీరికీ ఏమాత్రం తేడా లేదని వెల్లడిస్తుంది ‘డీథ్రోన్డ్’ పుస్తకం. భారత చరిత్ర మీద పరిశోధించిన ఆస్ట్రేలియా రచయిత జాన్ జుబ్రిచికీ రాసిన ఈ పుస్తకం ఎన్నో వింత సంగతులను వెల్లడిస్తుంది. రాజకోట రహస్యాలు నన్ను అమితంగా సమ్మోహన పరుస్తాయి. పూర్వపు చక్రవర్తుల విపరీత మనస్తత్వాలు, విచారకర గుణాలు, దోషాలు, చిన్నపాటి పాపాలు, మహాపరాధాలు, చిలిపి చేష్టలు, సిగ్గుపడవలసిన ప్రవర్త నలు, వారి అపకీర్తుల పట్ల నాలో ఆసక్తి జనించడానికి కారణమైన వారు మహారాజా దివాన్ జర్మనీ దాస్. నేను కౌమార ప్రాయంలో ఉండగా తొలిసారి ఆయన పుస్తకం చదువుతూ వదల్లేకపోయాను. అందులో ఉన్నవన్నీ, ఒకవేళ అవి నిజమే అయినా, నమ్మశక్యంగా లేనివి! ఉదాహరణకు పటియాలా మహారాజులలో ఒకరు తమ రాచ ఠీవికి చిహ్నంగా స్తంభించిన తమ పురుషాంగాన్ని పురవీధులలో ప్రదర్శించుకుంటూ ఊరేగింపుగా ముందుకు సాగిపోయేవారట. ఉక్క పోతల వేసవి రాత్రులలో ఆయన మహారాణులు, ఉంపుడుగత్తెలు అంతఃపుర కొలనులో తేలియాడే భారీ మంచు దిబ్బలపై శృంగార నాట్య విన్యాసాలతో విహరించేవారట. పాకిస్తాన్ వైపున ఉన్న రాజ కుటుంబీకులు కూడా ఇలానే ఉండేవారా, లేకుంటే ఇందుకు భిన్నంగానా అని అప్పుడు నాకొక ఆశ్చర్యంతో కూడిన సందేహం కలిగేది. అర్ధ శతాబ్దం తర్వాత ఇప్పుడు, ఆనాటి నా ఆశ్చర్యంతో కూడిన సందేహం జాన్ జుబ్రిచికీ పుస్తకం ‘డీథ్రోన్డ్’తో నివృత్తి జరిగింది. వారికీ వీరికీ ఏమాత్రం తేడా లేదు. కాబట్టి వారి చిత్ర విచిత్రాలతో ఈ ఉదయం నన్ను మీకు వేడుకను చేయనివ్వండి. నాల్గవ సాదిఖ్ ముహమ్మద్ ఖాన్... బహావల్‌పుర్ నవాబు. ఆయన తన మూలాలు ముహమ్మద్ ప్రవక్త సంతతిలో ఉన్నాయని చెప్పు కొంటారు. అయితే ఆయన బూట్లు, ప్యాంట్లు, సుతిమెత్తని నూలు గుడ్డతో నేసిన మందపాటి చొక్కాలు ధరించి రాజప్రాసాద క్రికెట్ మైదానంలో కనిపిస్తూ తనకు గల ఆ ప్రత్యేక ఐరోపా క్రీడా వస్త్రధారణ అభిరుచుల పట్ల గర్వభూయిష్టంగా ఉండేవారని జుబ్రిచికీ రాశారు. ‘‘మహా ధన సంపన్నుడై, తెల్లజాతి మగువల పట్ల అమిత మక్కు వను కలిగిన ఈ నవాబు (ఆయన భార్యలలో ముగ్గురు యూరోపి యన్లు) 1882లో అత్యంత గోప్యంగా పర్షియాలో ప్రసిద్ధి చెందిన ‘లా మేజన్ క్రిస్టోఫ్లా’ గృహ సామగ్రి సంస్థ నుంచి ఖరీదైన కలపమంచాన్ని 290 కిలోల నాణ్యమైన వెండి అలంకరణలతో తన అభీష్టానికి అనుగుణంగా తయారు చేయించుకున్నారు. మంచానికి నలువైపులా మంచంకోళ్ల స్థానంలో సహజమైన జుట్టు; కదలిక కలిగిన కళ్లూ, చేతులూ; ఆ చేతులతో విసనకర్రలు, గుర్రపు తోకలు పట్టుకుని ఉన్న నగ్న స్త్రీల జీవమెత్తు కాంస్య విగ్రహాలు ఉండేవి. ఆ నలుగురు నగ్న స్త్రీలు ఫ్రాన్స్, స్పెయిన్, ఇటలీ, గ్రీసు దేశాలకు ప్రాతినిధ్యం వహించేవారు. యంత్ర శక్తి కలిగిన ఆ మంచం... నవాబు ఆదేశాలను అనుసరించి ఆ నగ్న దేహాలలో చలనం తెప్పించేది. ఫ్రెంచి సంగీతకారుడు గునోద్ సృష్టించిన ప్రఖ్యాత సంగీత రూపకం ‘ఫౌద్’ తన ముప్పై నిముషాల నిడివిని పూర్తి చేస్తుండగా మాగన్నుగా పడుతున్న నిద్రలో నవాబు సరసంగా కన్ను గీటగానే ఆ నగ్న యువతుల హస్తాలలోని విసన కర్రలు మెల్లగా వీచడం మొదలయ్యేది. అందుకు తగిన సాంకేతికత ఆ చెక్క మంచం లోపల ఉండేది’’ అని జుబ్రిచికీ వర్ణించారు. సింద్‌లోని ఖైర్పూర్లో ఇద్దరు పాలకులు కూడా జుబ్రిచికీ దృష్టిని ఆకర్షించారు. వారిలో ఒకరు విపరీతమైన ఊబకాయం కలిగిన మీర్ అలీ నవాజ్ ఖాన్. ‘‘అమెరికన్ జర్నలిస్ట్ వెబ్ మిల్లర్ 1930లో సిమ్లా లోని సిసిల్ హోటల్లో మీర్ అలీని కలిశారు. మీర్ అలీ భోజనం చేస్తున్న సమయంలో ఆయన నోటికి, చేతికి మధ్య గల ప్రయాణ మార్గంలో పులుసు ఒలికి ఆయన భారీ ఉదరం అంతటా చింది పడింది’’ అని ‘డీథ్రోన్డ్’లో మీర్ అలీని గుర్తు చేసుకున్నారు జుబ్రిచికీ. మీర్ అలీ నవాజ్ ఖాన్ కుమారుడు ఫైజ్ ముహమ్మద్ ఖాన్‌కు స్కిజోఫ్రెనియా గానీ, లేదంటే ఏదైనా చిన్న మనోవైకల్యం గానీ ఉండి ఉండాలి. ‘‘అనుకోకుండా తన తొమ్మిది నెలల కుమారుడిని తుపా కీతో కాల్చినప్పుడు తొలిసారి ఆయన మానసిక స్థితి సందేహాస్పదం అయింది. బులెట్ శిశువు కడుపులోంచి ఊపిరి తిత్తులలోకి దూసుకెళ్లి కుడి భుజం నుంచి బయటికి వచ్చేసింది.’’ నమ్మలేని విధంగా బాలుడు బతికి, తండ్రి మరణానంతరం ఆయనకు వారసుడయ్యాడు. పాకిస్తాన్‌కు వాయవ్య దిశలో ఉంటుంది దిర్. 1947లో ఆ ప్రాంతానికి పాలకుడు నవాబ్ షా జహాన్. రచయిత జుబ్రిచికీ ఆ ప్రాంతాన్ని ‘ఒక నిలువనీటి కయ్య’ అంటాడు. ‘‘అక్కడ ఆసుపత్రి పడకల కంటే నవాబు వేటకుక్కల కోసం కట్టిన గృహాలే ఎక్కువగా ఉంటాయి. పాఠశాలలను నిర్మించడానికి ఆయన నిరాకరించాడు. చదువు ఎక్కువైతే తన పాలనను అంతం చేస్తుందని ఆయన నమ్మాడు’’ అని రాశారు జుబ్రిచికీ. కలాత్ అనేది పాకిస్తాన్‌లోని ఒక సమస్యాత్మక ప్రాంతం. ఆ ప్రాంతం కథ మన హైదరాబాద్, కశ్మీర్లకు పోలిక లేనిదేమీ కాదు. ఆ వివరాలను మీరు గూగుల్‌లో, వికీపీడియాలో వెతికి తెలుసుకోవచ్చు. కలాత్ నవాబు ఖాన్ తన రాష్ట్ర విలీనానికి సంబంధించిన సంప్రతింపుల కోసం పాకిస్తాన్ గవర్నర్ జనరల్ ముహమ్మద్ అలీ జిన్నాను కలిసినప్పుడు ఏం జరిగిందనేది మాత్రం నేను వివరిస్తాను. కశ్మీర్లో మాదిరిగానే 1947 ఆగస్టు తర్వాత కలాత్ లో స్వాతంత్య్ర సంస్థాపన జరిగింది. ఆశ్చర్యకరంగా, ‘‘కరాచీలో ఒక రాయబారిని నియమించుకోడానికీ, ఆకుపచ్చ రంగు గుడ్డపై ఎరుపు రంగు ‘పవిత్ర యుద్ధ’ ఖడ్గం ఉన్న బలూచీ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించేందుకూ కలాత్ ప్రాంతానికి అనుమతి లభించింది.’’ కలాత్ విదేశాంగ మంత్రిగా ఐ.సి.ఎస్. అధికారి డగ్లాస్ ఫెల్ నియమితులయ్యారు. ఫెల్ తన జ్ఞాపకాలలో... కలాత్ నవాబు – జిన్నాల మధ్య సమావేశం తిన్నగా సాగకపోవడంపై ఇచ్చిన వివరణను జుబ్రిచికీ పుస్తకంలో చదువుతున్నప్పుడు పొట్ట చెక్కలయ్యేంతగా నేను నవ్వేశాను. ‘‘కలాత్ నవాబు ఖాన్ అనర్గళమైన ఉర్దూలో గంభీరంగా మాట్లాడుతున్నారు. జిన్నా కూడా అంతే అనర్గళంగా, గంభీరంగా ఇంగ్లిషులో మాట్లాడుతున్నారు. జిన్నాను ఒప్పిస్తున్నానని ఖాన్, ఖాన్ని ఒప్పిస్తున్నానని జిన్నా అత్యంత ఆత్మవిశ్వాసంతో చర్చల్ని నడిపి స్తున్నారు. అయితే పాకిస్తాన్ విదేశాంగ కార్యదర్శి గమనించినదే మిటంటే ఒకరు మాట్లాడుతున్నది ఒకరికి ఒక్క ముక్కా అర్థం కావడం లేదని...’’ అని రాశారు జుబ్రిచికీ. ఆ విదేశాంగ కార్యదర్శి మొహమ్మద్ ఇక్రముల్లా మన మాజీ ఉపరాష్ట్రపతి, భారత ప్రధాన న్యాయమూర్తి మొహమ్మద్ హిదయతుల్లాకు సోదరుడు. ఇక్రముల్లా జోర్డాన్ యువ రాణి సర్వత్ తండ్రి. నిజమైన రాజవంశీకుడైన ఏకైక పాకిస్తానీ, నాకు ప్రియమైన స్నేహితుడు కూడా! కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
ఆ కులాల ఓటే శాసనం
రెండు పార్టీలు, రెండు కుటుంబాలు, రెండు కులాలు.. హిమాచల్ ప్రదేశ్ రాజకీయాలు వీటి చుట్టూనే తిరుగుతుంటాయి. రాజ్పుట్లు, బ్రాహ్మణులు ఈ రెండు కులాలే హిమాచల్ ప్రదేశ్ రాజకీయాలను శాసిస్తున్నాయి. రాజ్పుట్లు కింగ్‌లుగా అవతరిస్తే, బ్రాహ్మణులు కింగ్మేకర్లుగా తమ సత్తా చాటుతున్నారు. హిమాచల్ ప్రదేశ్ రాజకీయాల్లో ప్రాంతం, కులం అత్యంత కీలక పాత్ర పోషిస్తాయి. రాజ్పుట్లు, బ్రాహ్మణులు రాష్ట్రాన్ని తమ గుప్పిట్లో పెట్టుకొని రాజకీయాలు చేస్తున్నారు. రాష్ట్రం ఏర్పడిన 55 ఏళ్లలో ఐదుగురు ముఖ్యమంత్రులు రాజ్పుట్లైతే, ఒకే ఒక్క బ్రాహ్మిణ్ సీఎంగా శాంతకుమార్ రికార్డు సృష్టించారు. 1993–2017కాలంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన వీరభద్రసింగ్ , బీజేపీకి చెందిన ప్రేమ్ కుమార్ ధుమాల్ కుటుంబాలే రాజకీయాల్లో చట్రం తిప్పాయి. వీరు రాజ్పుట్ కుటుంబానికి చెందిన నాయకులే. బీజేపీకి చెందిన బ్రాహ్మణుడైన శాంతకుమార్ రెండు సార్లు రాష్ట్ర సీఎంగా సేవలందించడంతో ప్రధానంగా ఈ రెండు కులాలే రాజకీయాలపై ఆధిక్యత ప్రదర్శించాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి రాజ్పుట్గా ఉంటే, పార్టీలో సంస్థాగత వ్యవహారాలు చూసే వ్యక్తి బ్రాహ్మిణ్‌గా ఉండడం ఇక్కడ రివాజుగా మారింది. 50% జనాభా ఆ రెండు కులాలే రాష్ట జనాభాలో రాజ్పుట్లు 32% ఉంటే, ఆ తర్వాత ఎస్సీలు 25% అధికంగా ఉన్నారు. ఇక బ్రాహ్మణులు 18%తో మూడో స్థానంలో ఉన్నారు. రాజ్పుట్లు, బ్రాహ్మణులు కలిపి జనాభాలో 50% వరకూ ఉండడంతో రాజకీయాలను వారే శాసిస్తున్నారు. రాజ్‌పుట్‌లో ఒక్కోసారి ఒక్కో పార్టీకి అండగా ఉంటూ ఉంటే బ్రాహ్మణులు ఎప్పుడూ బీజేపీవైపే నిలిచారు. ఇక ఎస్సీలలో ప్రజాకర్షణ కలిగిన నాయకుడు లేకపోవడంతో వారు బీజేపీ, కాంగ్రెస్ మధ్య ఊగిసలాడుతూ ఉంటారని రాజకీయ విశ్లేషకుడు ప్రొఫెసర్ చౌహాన్ అభిప్రాయపడ్డారు. రాష్ట్ర ముఖ్యమంత్రుల్లో అయిదుగురు వైఎస్ పర్మార్, ఠాకూర్ రామ్ లాల్, వీరభద్ర సింగ్, ప్రేమ్‌కుమార్ ధుమాల్, ప్రస్తుత ముఖ్యమంత్రి జైరామ్ ఠాకూర్ రాజ్పుట్లు కాగా రెండు సార్లు సీఎంగా చేసిన శాంత కుమార్ ఒక్కరే బ్రాహ్మిణ్‌గా ఉన్నారు. తొలిసారిగా హిమాచల్ బరిలో దిగి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న ఆమ్ ఆద్మీ పార్టీ దిగువ హిమాచల్ ప్రాంతంలో ఉండే పంజాబీ ఓట్లను కొల్లగొట్టడానికి చూస్తోంది. వీరంతా వ్యాపారంలోనే ఉన్నారు. బీసీ, ఎస్టీలపై బీజేపీ వల రాష్ట్రంలో అయిదేళ్లకొకసారి ప్రభుత్వాన్ని మార్చే సంప్రదాయానికి ఎదురొడ్డి వరసగా రెండోసారి నెగ్గాలని వ్యూహాలు పన్నుతున్న బీజేపీ ఎస్సీలు, ఓబీసీల ఓట్లు కొల్లగొట్టడానికి వ్యూహాలు పన్నుతోంది. రాష్ట్రంలోని హాతీ సామాజిక వర్గానికి ఎస్టీ హోదాను కల్పించే బిల్లును కూడా ఆమోదించింది. గత 50 ఏళ్లుగా హాతీలు ఎస్టీ హోదాల కోసం డిమాండ్ చేస్తున్నారు. సిర్మార్ గిరి ప్రాంతంలోని హాతీలకు ఎస్టీ హోదాను కల్పిస్తూ సెప్టెంబర్ 14న కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. దీనివల్ల 1.6 లక్షల మందికి ప్రయోజనం చేకూరుతుంది. ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం రద్దు సమయంలో ఈ ప్రాంతంలోనే దళితులు అత్యధికులు నిరసనలు చేపట్టారు. వారిలో అసంతృప్తిని చల్లార్చడానికి హాతీలకు ఎస్టీ హోదా కల్పిస్తూ బీజేపీ నిర్ణయం తీసుకుంది. ఈ సారి బీజేపీ రాజ్‌పుట్‌లకు ఇచ్చే టికెట్లను కాస్త తగ్గించి ఇతర కులాల వైపు మొగ్గు చూపించింది. కాంగ్రెస్ పార్టీ నలుగురు ఓబీసీలకు టికెట్లు ఇస్తే, బీజేపీ ఆరుగురుని నిలబెట్టింది. అందులోనూ ఓబీసీల్లో ప్రాబల్యమున్న ఘిర్త్ వర్గానికి టికెట్లు ఇచ్చింది. ఇక ఎస్టీల నాన్ రిజర్వ్ నియోజకవర్గాల్లో కూడా ముగ్గురు ఎస్టీలకు టికెట్లు ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ రాజ్పుట్లు, బ్రాహ్మణుల్ని నిలబెట్టిన నాలుగు నియోజకవర్గాల్లో ఓబీసీ నాయకులకు టికెట్లు ఇచ్చింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
సిసోడియా ‘రాజ్‌పుత్’ వ్యాఖ్యలపై ‘ది కశ్మీర్ ఫైల్స్’ డైరెక్టర్ ఫైర్!
న్యూఢిల్లీ: బీజేపీలో చేరితే కేసులన్నీ ఎత్తివేస్తామని తనకు సందేశాలు వచ్చాయని ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా పేర్కొన్నారు. ఈ సందర్భంగా తాను రాజ్‌పుత్ కమ్యూనిటీకి చెందిన వాడనని.. ఎవరి ముందు తలవంచనని తెలిపారు. మనీష్ సిసోడియా ‘రాజ్‌పుత్’ వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు ‘ది కశ్మీర్ ఫైల్స్’ డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి. రాజ్‌పుత్‌లు మినహా ఇతర కులాల వారు ఎదుటివారి ముందు తలవంచుతారని మనీష్ సిసోడియా ఉద్దేశమా? ఇది ఎలాంటి కులవాదం? అని ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు. ‘దీనర్థం ఆయన రాజ్‌పుత్ కాకపోతే లొంగిపోయేవారా? ఢిల్లీలోని బ్రాహ్మణులు, యాదవులు, గుజ్జార్లు, జాట్స్, సిక్కులు వంటి వారి సంగతేంటి? వారంతా ఇతరులకు లొంగిపోయే స్వభావం కలిగి ఉన్నారా? ముస్లింలు, క్రిస్టియన్లు, దళితుల సంగతేంటి?’ అని ట్విట్టర్లో రాసుకొచ్చారు డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి. మనీష్ సిసోడియా చేసిన ప్రకటనను తన ట్వీట్‌కు జోడించారు డైరెక్టర్. ఢిల్లీ లిక్కర్ పాలసీలో అవకతవకలపై ఇటీవల మనీష్ సిసోడియా నివాసాల్లో సీబీఐ సోదాలు నిర్వహించిన నేపథ్యంలో బీజేపీ, ఆప్ మధ్య మాటల యుద్ధం మొదలైంది. 2024 ఎన్నికల్లో ప్రధాని మోదీకి ప్రధాన ప్రత్యర్థి కేజ్రీవాల్ కానున్నారనే కారణంగానే ఆమ్ ఆద్మీ పార్టీ నేతలపై ఒత్తిడి తెస్తున్నారని ఆప్ నేతలు ఆరోపించారు. ఈ క్రమంలోనే బీజేపీలో చేరితే కేసులు ఎత్తివేస్తామంటూ బీజేపీ నుంచి తనకు సందేశాలు వచ్చాయని బాంబు పేల్చారు సిసోడియా. ఆ సందేశాలకు ప్రతిస్పందనగా మాట్లాడుతూ తాను రాజ్‌పుత్‌నని, మహారాణా ప్రతాప్ వంశస్థుడినని, అవసరమైతే తల నరుక్కుంటా కానీ, ఎవరి ముందు తల వంచనంటూ వ్యాఖ్యానించారు. यह कैसा जातिवादी तर्क है? यानी अगर जनाब @msisodia जो राजपूत नहीं होते तो झुक जाते, कट जाते। यानी दिल्ली में जो ब्राह्मण,, यादव, गुज्जर, जाट, सिख इत्यादि रहते हैं वो सब झुकने वाले लोग हैं? मुस्लिम, ईसाई, दलित… क्या यह सब झुकने वाली क़ौम हैं? https://t.co/sahqNzcRM2 — Vivek Ranjan Agnihotri (@vivekagnihotri) August 22, 2022 ఇదీ చదవండి: Manish Sisodia: ‘ఆప్‌ని వదిలేసి బీజేపీలో చేరమని మెసేజ్ పంపారు’ -
పెళ్లి ఊరేగింపుపై పాశవిక దాడి
జైపూర్ : రాజస్ధాన్‌లో ఓ దళిత పోలీస్ పెళ్లి ఊరేగింపుపై అగ్రవర్ణాలు దాడికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దుగార్ గ్రామంలోకి శనివారం తన పెళ్లి ఊరేగింపు ప్రవేశించిన సమయంలో కొందరు రాజ్పుట్ వర్గీయులు తమపై దాడిచేశారని వరుడు సవాయి రామ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దుండగులను అడ్డుకునేందుకు ప్రయత్నించగా వారు పదునైన ఆయుధాలతో దాడికి తెగబడటంతో పలువురికి గాయాలయ్యాయని బాధితుడు తెలిపారు. కాగా, కులదురహంకారంతోనే ఈ దాడి జరిగిందని దళిత సంఘాలు ఆరోపిస్తూ బాధ్యులపై కఠిన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశాయి. కాగా బాధితుడి స్టేట్మెంట్ను నమోదు చేశామని, కేసు దర్యాప్తు చేపట్టి నిందితులను అదుపులోకి తీసుకుంటామని పోలీస్ ఇన్స్పెక్టర్ అజిత్ సింగ్ తెలిపారు. గతంలోనూ దళితుల పెళ్లి ఊరేగింపులు తమ వీధుల నుంచి వెళ్లరాదంటూ పలు చోట్ల దాడులు జరిగాయి. -
వాళ్ల అంతు చూస్తా
‘మణికర్ణిక’ సినిమా మొదలైనప్పటి నుంచి ఏదో ఓ వివాదం నడుస్తోంది. దర్శకులు మారడం.. నటుడు సోనూసూద్ తప్పుకోవడం.. తాజాగా సినిమాలో ఝాన్సీ లక్ష్మీభాయ్‌ను తప్పుగా చిత్రీకరించారంటూ కర్ణిసేన నిరసన తెలియజేస్తున్నారు. ఈ విషయంపై కంగనా రనౌత్ స్పందిస్తూ– ‘‘మా సినిమాను నలుగురు చరిత్రకారులు చూసి సర్టిఫై చేశారు. సెన్సార్ బృందం కూడా చూసింది. కర్ణిసేనకు కూడా ఈ విషయాన్ని తెలియజేశాం. ఇంకా మా సినిమా మీద అనవసరమైన వివాదాన్ని సృష్టిస్తున్నారు వాళ్లు. ఆ పనులు ఆపకపోతే వాళ్లు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే.. నేనూ రాజ్‌పుత్‌నే.. వాళ్ల అంతు చూస్తాను’’ అని ఘాటుగా పేర్కొన్నారు. -
ఏ పార్టీది విజయమో చెప్పేది ‘మెవధ్’
సాక్షి, న్యూఢిల్లీ : రాజస్థాన్ దక్షణ మధ్య ప్రాంతమైన మెవర్ లేదా మెవధ్‌లో శుక్రవారం ఉదయం నుంచే పోలింగ్ జోరుగా సాగుతోంది. ఈ ప్రాంతం విజయానికి రహదారి అని, ఏ పార్టీ విజయం సాధించి ఐదేళ్లపాటు అధికారంలో ఉంటుందో నిర్ణయించేది ఈ ప్రాంతం ఓటర్లేనన్నది రాజకీయ విశ్లేషకులు విశ్వాసం. ఇక్కడి ఓటర్లకు ఓ విచిత్రమైన ఆనవాయితీ ఉంది. 1998 నుంచి ఈ మెవధ్ ప్రాంతం ఓటర్లు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేశారు తప్ప, ఏనాడు ప్రభుత్వానికి అనుకూలంగా ఓటేసిన దాఖలాలే లేవు. అందుకనే 1998 నుంచి ఐదేళ్లకోసారి ప్రభుత్వం మారుతూ వస్తోందని రాజకీయ పరిశీలకుల అవగాహన. మెవధ్ పరిధిలోకి రాజస్థాన్‌లోని భిల్వారా, చిత్తోర్‌గఢ్, ప్రతాప్‌గఢ్, దుంగార్పూర్, బాన్స్వాడా, ఉదయ్‌పూర్ జిల్లాలు, ఝలావర్ జిల్లాలోని పిరవ తెహసిల్‌తోపాటు మధ్యప్రదేశ్, గుజరాత్‌లోని కొన్ని ప్రాంతాలు వస్తాయి. రాజస్థాన్‌లోని 200 సీట్లకుగాను రాజస్థాన్‌లోని మెవ«ద్ ప్రాంతంలో 28 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. 2013 అసెంబ్లీ ఎన్నికల్లో పాలకపక్ష భారతీయ జనతా పార్టీకి ఏకంగా 25 సీట్లు వచ్చాయి. కాంగ్రెస్ పార్టీ రెండు సీట్లను గెలుచుకోగా, మరో సీటులో స్వతంత్య్ర అభ్యర్థి విజయం సాధించారు. అంతకుముందు ఐదేళ్ల క్రితం, అంటే 2008లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మెవద్‌లో కాంగ్రెస్ పార్టీ అఖండ విజయం సాధించింది. ఈ ప్రాంతం ఓటర్లు ఈ రోజు కూడా పాలకపక్షానికి వ్యతిరేకంగా ఓటేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేయడం ఆనవాయితీగా మారిందిగదా అని ఓటేస్తున్నారా లేదా నిజంగా ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉందా? అంటూ ఈ ప్రాంతం ఓటర్లను మీడియా కదిలించగా, తామేమి గుడ్డిగా ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ రావడం లేదని, ఈసారి వ్యతిరేకించడానికి సవాలక్ష కారణాలు ఉన్నాయని వారన్నారు. ‘రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగలేదు. నిరుద్యోగం బాగా పెరిగింది. పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ వల్ల వ్యాపారులే కాకుండా సామాన్య ప్రజలు కూడా బాగా నష్టపోయారు. ముఖ్యంగా రైతులు ఎక్కువగా నష్టపోతున్నారు. విత్తనాలు, ఎరువులు, డీజిల్, కరెంట్ ధరలు బాగా పెరిగిపోయాయి’ అని వారన్నారు. ‘మా నాన్నది ఇంట్లో ఉన్నదంతా ఊడ్చి వ్యవసాయంపై పెట్టారు. కనీసం పెట్టుబడి కూడా లేదు. అందుకనే నేను పొరపాటున కూడా వ్యవసాయం జోలికి వెళ్లదల్చుకోలేదు. ప్రస్తుతం డిగ్రీ చదువుతున్నాను. ప్రభుత్వం ఉద్యోగం చేయాలనుకుంటున్నాను. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఏనాడు వ్యవసాయాన్ని పట్టించుకోలేదు. ఏటా రెండు కోట్ల మందికి ఉద్యోగాలిస్తామంది. నేను చదువుకోవాలనుకోవడానికి ఒక కారణం మోదీ ఇచ్చిన హామీనే. అయితే ఆయన ప్రభుత్వం ఏం చేయలేకపోయింది’ చిత్తోర్‌గఢ్‌కు చెందిన 18 ఏళ్ల యువకుడు మాన్సింగ్ తెలిపారు. ఓ పక్క రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే బీజేపీ హనుమంతుడి కులం గురించి చర్చిస్తోందని బేగు అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన బాబూ రామ్ విమర్శించారు. ‘2013 అసెంబ్లీ ఎన్నికల్లో నేను బీజేపీకే ఓటేశాను. ఎంతో అభివృద్ధి జరుగుతుందని ఆశించాను. ఏం జరిగిందీ? పాలకులు కుల గోత్రాల గురించి, జాతి, మతాల గురించి, పటేల్, రాముడి విగ్రహాలు గురించి మాట్లాడుతున్నారు. విగ్రహాలేమైనా ప్రజలకు తిండి పెడతాయా?’ అని ఆయన వ్యాఖ్యానించారు. ఓపియం పంటకు కొత్త లైసెన్సులూ కారణమే! గంజాయి (ఓపియం) పంటకు 2017లో కేంద్రంలోని మోదీ ప్రభుత్వం లైసెన్స్ నిబంధనలను మార్చిందని, ఫలితంగా ఇక్కడ ఎంతో మంది రైతులు లైసెన్సులు కోల్పోయారని, అది కూడా తమ ఆగ్రహానికి కారణమని ఓటర్లు చెబుతున్నారు. దేశంలో లైసెన్స్‌లతో ఉత్పత్తవుతున్న గంజాయితో 60 శాతం మెవధ్‌లోనే పండిస్తున్నారు. రాష్ట్ర జనాభాలో 12 శాతం ఉన్న రాజ్‌పుత్‌లు కూడా ఈసారి బీజేపీ ప్రభుత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. 2017లో దీపికా పదుకోన్ నటించిన ‘పద్మావత్’ సినిమాను నిషేధించాల్సిందిగా తాము దేశవ్యాప్తంగా ఆందోళన చేసినా వసుంధర రాజె ప్రభుత్వం తమకు న్యాయం చేయలేక పోయిందని, దాంతో తమ ప్రతిష్ట దెబ్బతిన్నదని ‘మెవర్ క్షత్రియ మహాసభ సంస్థాన్’ అధ్యక్షుడు తన్వీర్ సింగ్ కృష్ణావత్ తెలిపారు. మేవధ్ ప్రాంతంలోని 16 అసెంబ్లీ సీట్లలో ఆదివాసీలు 73 శాతం ఉన్నారు. వారంతా కూడా పాలకపక్షాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఈ ప్రాంతంలోని 11 సీట్లలో కొత్తగా ఆవిర్భవించిన ‘భారతీయ ట్రైబల్ పార్టీ’ పోటీ చేస్తోంది. ఈ అభ్యర్థుల వల్ల పాలకపక్ష ఓట్లే చీలుతాయని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. -
బీజేపీకి తిరుగు‘పోట్లు’.. కాంగ్రెస్‌కు ‘చేరిక’ కష్టాలు
ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రాజస్థాన్‌లో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. పోలింగ్ దగ్గరపడుతున్న నేపథ్యంలో వివిధ పార్టీల ఓటు బ్యాంకులు తారుమారవుతున్నాయి. గత ఎన్నికల్లో అధికారం కట్టబెట్టిన వివిధ వర్గాల ఓటర్లు ఇప్పుడాపార్టీకి దూరమవుతోంటే, మరోవైపు సొంత నేతల నుంచి తిరుగుబాట్లను ఎదుర్కొంటోంది బీజేపీ. వీటన్నిటి ఫలితంగా విపక్ష కాంగ్రెస్‌కు అనుకూల పవనాలు వీస్తున్నట్టు ఎన్నికల సర్వేలు చెబుతున్నాయి. అయితే, కొత్త చేరికలు కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందులు కలిగిస్తుండటం విశేషం. మరోవైపు మాజీ ప్రధాని దేవెగౌడ నాయకత్వంలో ఏర్పాటయిన ఏడు పార్టీల కూటమి –లోక్తాంత్రిక్ మోర్చా– ఈ ఎన్నికల్లో 200 స్థానాల్లో పోటీ చేస్తామని తాజాగా ప్రకటించింది. ఈ కూటమి గెలుపోటములు ఎలా ఉన్నా విజయావకాశాలున్న అభ్యర్థుల ఓట్లను గణనీయంగా చీల్చుతుందని విశ్లేషకులు అంటున్నారు. ఆయన రాకతో పార్టీకి ఇబ్బందులా..? ఏదేమైనా రాజస్థాన్‌లో అధికారం నిలుపుకోవడం బీజేపీకి అంత సులభం కాదని తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. ఒకవైపు ప్రభుత్వ వ్యతిరేకత బలంగా కనిపిస్తోంటే మరోవైపు కీలక నేతలు పార్టీకి దూరమవుతున్నారు. ఘనశ్యాం తివారి, హనుమాన్ బెనివాల్, కిరోరి సింగ్ బైంస్లా వంటి నేతలు మొదలుకుని తాజాగా జస్వంత్ సింగ్ కుమారుడు మానవేంద్ర సింగ్ వరకు బీజేపీకి రాంరాం చెప్పారు. రాష్ట్రంలో రాజ్‌పుత్, జాట్ వంటి కులాలకు చెందిన ఈ నేతలు తమ వర్గీయులపై గణనీయమైన పట్టు ఉన్నవారు. పది పదిహేను నియోజకవర్గాల్లో అభ్యర్థుల గెలుపోటములను ప్రభావితం చేయగల శక్తిమంతులు. వీరి తిరుగుబాటు బీజేపీకి పెద్ద దెబ్బేనని చెప్పాలి. ఇదిలా ఉంటే, ఈ సారి ఎన్నికల్లో సగానికిపైగా బీజేపీ సిట్టింగులకు టికెట్లు రావన్న ప్రచారం జరుగుతోంది. టికెట్లు రానివారిలో కొందరైనా తిరుగుబాటు అభ్యర్థులుగా బరిలో నిలిచే అవకాశం ఉంది. ఇంకోవైపు ముఖ్యమంత్రి వసుంధర రాజే తీరుపై పార్టీలో పలువురు అసంతప్తితో ఉన్నారు. ఇవన్నీ బీజేపీ విజయావకాశాలపై ప్రభావం చూపుతాయని పరిశీలకులు అంటున్నారు. కాంగ్రెస్‌కు కొత్త సమస్య అధికార పార్టీ పరిస్థితి ఇలా ఉంటే, విపక్ష కాంగ్రెస్ మరో సమస్యతో సతమతమవుతోంది. మానవేంద్ర సింగ్ బీజేపీ నుంచి వచ్చేసి కాంగ్రెస్‌లో చేరారు. ఆయన చేరిక పార్టీకి రాజకీయంగా మేలు కలిగించాలి. అయితే, పార్టీలో జాట్ నేతలు రాజ్‌పుత్ వర్గానికి చెందిన మానవేంద్ర సింగ్ రాకను వ్యతిరేకిస్తున్నారు. ఆయన రాక వల్ల తమకు ప్రాధాన్యం తగ్గిపోతుందని హరీశ్‌చౌదరి వంటి సీనియర్‌కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. ఆయన తన అసంతప్తిని బాహాటంగానే వ్యక్తం చేశారు. హరీశ్వర్గీయుల (జాట్లు) అసంతప్తి బర్మార్, జైసల్మేర్ జిల్లాల్లో కనీసం 9 నియోజకవర్గాల్లో ప్రభావం చూపుతుందని కాంగ్రెస్ పరిశీలకులు ఆందోళన చెందుతున్నారు. తెరపైకి లోక్ తాంత్రిక్ మోర్చా సిపీఐ, సీపీఎం, సీపీఐఎంఎల్, ఎంసీపీఐ, సమాజ్‌వాది పార్టీ, రాష్ట్రీయ లోక్‌దళ్, జనతాదళ్‌లతో కూడిన ఫ్రంట్ ‘లోక్ తాంత్రిక్ మోర్చా’ ఈ ఎన్నికల్లో 200 స్థానాల్లో పోటీ చేస్తున్నట్టు ప్రకటించింది. తమ కూటమి అధికారంలోకి వస్తే అమ్రా రామ్ ముఖ్యమంత్రి అవుతారని కూడా ప్రకటించింది. కాంగ్రెస్, బీజేపీలకు ప్రత్యామ్నాయంగా తాము రంగంలోకి దిగుతున్నట్టు తెలిపింది. దూరమవుతున్న రాజ్‌పుత్‌లు జన్‌సంఘ్ కాలం నుంచి బీజేపీకి సంప్రదాయక మద్దతు దారులుగా ఉన్న రాజ్‌పుత్‌లు 25కుపైగా నియోజకవర్గాల్లో అభ్యర్థుల విజయావకాశాలను ప్రభావితం చేయగలరు. ప్రస్తుత ప్రభుత్వంలో ముగ్గురు కేబినెట్, ఒక జూనియర్ మంత్రి రాజ్‌పుత్‌లకు చెందినవారు. వసుంధర తీరుపై రాజ్‌పుత్‌లకు ఏర్పడిన అసంతప్తి రాణి పద్మావతి సినిమా వివాదంతో తీవ్రమయింది. మానవేంద్ర సింగ్ పార్టీని వీడటంతో రాజ్‌పుత్‌లు బీజేపీకి దూరమయ్యారన్నది వాస్తమమని తేలిపోయింది. రాజ్‌పుత్‌లు తమ నాయకుడిగా గౌరవించే జస్వంత్సింగ్కు 2014లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ టికెట్ నిరాకరించడం, స్వతంత్రంగా నిలబడ్డ ఆయన తరపున ప్రచారం చేసిన మానవేంద్ర సింగ్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేయడంతో బీజేపీ–రాజ్‌పుత్‌ల బంధం ఒడిదుడుకుల్లో పడింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా రాజ్పుత్నేత గజేంద్ర షెకావత్‌ను కాదని ఓబిసీ నేత మదన్‌లాల్‌ను వసుంధర నియమించడం, పద్మావతి సినిమా విడుదలకు వసుంధర అనుమతించడం, రాజ్‌పుత్ వర్గానికి చెందిన అనందపాల్ సింగ్ అనే గూండాను ప్రభుత్వం ఎన్కౌంటర్లో హతమార్చడం వంటి పరిణామాలు రాజ్‌పుత్‌లకు బీజేపీ మధ్య దూరాన్ని పెంచాయి. అక్రమ నిర్మాణాల కూల్చివేత పేరుతో రాష్ట్ర ప్రభుత్వం 2016లో జైపూర్‌లోని రాజమహల్ ప్రవేశద్వారాన్ని మూసివేసింది. ఇది కూడా రాజవంశీయులకు తీవ్ర ఆగ్రహం కలిగించింది. ఈ పరిణామలతో రాజ్‌పుత్‌లు వసుంధర ప్రభుత్వానికి దూరమవుతూ వచ్చారు. రాష్ట్ర జనాభాలో89 శాతం హిందువులు, 9శాతం ముస్లింలు, 2 శాతం ఇతరులు ఉన్నారు. వీరిలో ఎస్సీలు 18 శాతం, ఎస్టీలు 13 శాతం, జాట్లు 12 శాతం, గుజ్జార్లు,రాజ్‌పుత్‌లు 9 శాతం ఉంటే, బ్రాహ్మణులు, మినాలు ఏడు శాతం చొప్పున ఉన్నారు. జైపూర్ సంస్థానం భారత్‌లో విలీనమైనప్పటి నుంచీ రాజ్‌పుత్‌లు, జాట్లు ప్రత్యర్థులుగా ఉంటున్నారు. 1952 అసెంబ్లీ ఎన్నికల్లో 160 సీట్లకుగాను 54 సీట్లను రాజ్‌పుత్‌లు గెలుచుకుంటే 12 సీట్లు జాట్లకు, ఎస్సీలు పది సీట్లు గెలుచుకున్నారు. తర్వాత కాలంలో జాట్లు, బిష్ణోయిలు బలపడ్డారు. ఫలితంగా తర్వాతి అసెంబ్లీ ఎన్నికల్లో రాజ్‌పుత్‌ల సీట్లు 26కు పడిపోతే, జాట్లు 23 సీట్లు దక్కించుకున్నారు. దాంతో ఈ రెండు వర్గాలను ఆకట్టుకోవడం ద్వారా 60 సీట్లు గెలుచుకోవడానికి కాంగ్రెస్, బీజేపీలు ప్రయత్నాలు చేస్తున్నాయి. రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో ఉన్న గుజ్జార్లు కూడా ఓబీసి జాబితా విషయమై ప్రభత్వం పట్ల అసంతప్తితో ఉన్నారు. రాజకీయంగా తమకు తగిన ప్రాతినిధ్యం లేదని వారు భావిస్తున్నారు. ఐటీ బందాల ఏర్పాటు రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ఎన్నికల ప్రచారానికి ఫేస్బుక్, ట్విట్టర్ వంటి సామాజిక మాధ్యమాలను వేదికగా చేసుకుంటున్నాయి. 2004 ఎన్నికల్లో బీజేపీ విజయంలో సామాజిక మాధ్యమాలు కీలక భూమిక పోషించడంతో అన్ని పార్టీలు అటే దష్టి పెట్టాయి. రాష్ట్ర వ్యాప్తంగా 51వేల పోలింగ్ బూత్‌లకు ఒక ఐటీ కార్యకర్త చొప్పున నియమించినట్టు బీజేపీ సోషల్ మీడియా సెల్ ఇన్చార్జి హీరేంద్ర కౌశిక్ తెలిపారు. డివిజన్ స్థాయిలో 10 మందితో ఐటీ బందాలను కూడా ఏర్పాటు చేశామన్నారు. వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్‌స్ట్రాగామ్‌ల ద్వారా ప్రచారం సాగిస్తామని ఆయన చెప్పారు. తమ పార్టీ తరఫున కూడా సామాజిక మాధ్యమాల బందాలను ఏర్పాటు చేస్తున్నట్టు కాంగ్రెస్ మీడియా సెల్ ఇన్చార్జి అర్చన శర్మ చెప్పారు.ఈ ఎన్నికల్లో మొదటి సారి పోటీ చేస్తున్న ఆప్ పార్టీ కూడా తమ అభ్యర్థుల తరఫున సామాజిక మీడియా మేనేజర్లను నియమించింది. -
‘మహేశ్వరి ముక్కు, చెవులు కోస్తాం...’
జైపూర్ : రాజ్‌పుత్ కర్ణిసేన మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచింది. రాజస్థాన్ విద్యా శాఖ మంత్రి కిరణ్ మహేశ్వరి రాజ్‌పుత్‌లను ఎలుకలతో పోల్చినందుకు వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసింది. అలా జరగని పక్షంలో ఆమె ముక్కు, చెవులు కోస్తామని కర్ణిసేన బెదిరింపులకు పాల్పడింది. వివరాలు... సోమవారం జరిగిన మీడియా సమావేశంలో మహేశ్వరి విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా... వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ‘సర్వ్ రాజ్‌పుత్ సమాజ్ సంఘర్ష్ సమితి బీజేపీకి వ్యతిరేకంగా ప్రచారం నిర్వహించబోతున్న వార్తలు నిజమేనా’ అన్న ప్రశ్నకు బదులుగా.. ‘వర్షాకాలంలో కలుగు నుంచి బయటికి వచ్చే ఎలుకల లాంటి కొందరు వ్యక్తులు ఎన్నికల సమయంలో బయటకు వస్తారంటూ’ ఆమె వ్యాఖ్యానించారు. మహేశ్వరి వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసిన కర్ణిసేన... ‘దీపికా పదుకొనె ‘పద్మావతి వివాదాన్ని’ మహేశ్వరి మర్చిపోయినట్టున్నారు. రాజ్‌పుత్‌ల వల్లే బీజేపీకి రాజస్థాన్‌లో బలం చేకూరింది. మహేశ్వరి అన్నట్లే ఆమె నియోజక వర్గంలో ఉన్న 40 వేల ఎలుకల వల్లే గత ఎన్నికల్లో గెలుపొందారు. వచ్చే ఎన్నికల్లో ఆమెకు తప్పక బుద్ధి చెప్తామంటూ’ మండిపడింది. ‘మహేశ్వరి వెంటనే క్షమాపణలు చెప్పాలి. ప్రభుత్వం కూడా ఈ విషయంలో జోక్యం చేసుకోవాలి. మేము మహిళలకు గౌరవం ఇస్తాం. కానీ హద్దులు దాటి మాట్లాడే మహిళలను ఎన్నటికీ సహించబోమంటూ’ కర్ణిసేన చీఫ్ మహిపాల్ మక్రానా వీడియో విడుదల చేశారు. కాగా ఈ విషయంపై స్పందించిన మహేశ్వరి మాట్లాడుతూ...తాను రాజ్‌పుత్‌ల గురించి ఎటువంటి అనుచిత వ్యాఖ్యలు చేయలేదని వివరణ ఇచ్చారు. రాజకీయ ప్రత్యర్థులను(కాంగ్రెస్ పార్టీని) ఉద్దేశించే అలా మాట్లాడానని చెప్పారు. క్షమాపణలు చెప్పాల్సిందే : సచిన్ పైలట్ రాజ్‌పుత్‌లను అవమానించిన మహేశ్వరి వెంటనే క్షమాపణలు చెప్పాలని రాజస్థాన్ కాంగ్రెస్ చీఫ్ సచిన్ పైలట్ డిమాండ్ చేశారు. ప్రజల మనోభావాలకు విలువ ఇచ్చే సంస్కృతి బీజేపీకి లేదని విమర్శించారు. తమను తాము రక్షించుకోవడానికి బీజేపీ నేతలు ఎంతకైనా దిగజారుతారంటూ వ్యాఖ్యానించారు. -
మా ముందే కుర్చీలో కూర్చుంటావా?
అహ్మదాబాద్: గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఓ దళిత మహిళ తమముందు కుర్చీపై కూర్చుని పనిచేయడం నచ్చని రాజ్‌పుత్ వర్గీయులు ఆమెపై దాడికి పాల్పడ్డారు. బాధితురాలి కుటుంబ సభ్యులపై దాడికి పాల్పడి వారిని సజీవదహనం చేసేందుకు యత్నించారు. అహ్మదాబాద్ జిల్లా వాల్తేరాలోని అంగన్వాడీ కేంద్రంలో పల్లవిబెన్ జాదవ్(45) పనిచేస్తున్నారు. గ్రామస్తులకు మంజూరైన ఆధార్ కార్డుల్ని పంచే బాధ్యతను అధికారులు ఆమెకు అప్పగించారు. దీంతో పల్లవిబెన్ బుధవారం గ్రామంలో ఆధార్‌కార్డులు పంచుతుండగా అక్కడికి చేరుకున్న కరదియా రాజ్‌పుత్ వర్గానికి చెందిన జయరాజ్ వేగద్ ‘దళితురాలివైన నువ్వు మాముందే కుర్చీలో కూర్చుంటావా?’ అని తిడుతూ దాడికి పాల్పడ్డాడు. అదేరోజు రాత్రి జయరాజ్ నేతృత్వంలో 25 మంది దుండగులు పల్లవి ఇంటివద్ద ఆమె కుటుంబ సభ్యులపై కర్రలు, పదునైన ఆయుధాలతో దాడికి దిగారు. ఆమె కుటుంబ సభ్యుల్ని సజీవదహనం చేసేందుకు యత్నించారు. ఈ ఘటనలో ముగ్గురు నిందితుల్ని పోలీసులు అరెస్టుచేశారు. -
మంత్రి ఇంటిపై కోడిగుడ్లు, టొమాటోలతో దాడి
-
మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు.. దుమారం
లక్నో : బాధ్యతాయుతమైన రాష్ట్ర మంత్రి హోదాలో ఉన్న వ్యక్తి కొన్ని సామాజిక వర్గాలపై చేసిన వ్యాఖ్యలు ఉత్తరప్రదేశ్‌లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. రాజ్‌పుత్, యాదవ సామాజిక వర్గాలకు చెందిన కొందరు వ్యక్తులు రాష్ట్ర మంత్రి ఓం ప్రకాశ్ రాజ్‌భర్ ఇంటిపై శనివారం దాడికి పాల్పడ్డారు. రాళ్లు, కోడిగుడ్లు, టొమాటోలను మంత్రి ఇంటిపై రువ్వుతూ ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. యోగి ఆదిత్యనాథ్ కేబినెట్లో మంత్రి అయిన ఓం ప్రకాశ్ రాజ్‌భర్ శుక్రవారం జరిగిన ఓ సభలో మాట్లాడుతూ.. మద్యం గురించి చెబుతూ.. రాజ్‌పుత్‌లు, యాదవులు అధిక మోతాదులో మద్యం సేవిస్తారని పేర్కొన్నారు. ఇది వారికి పూర్వీకుల నుంచి వారసత్వంగా వస్తున్న వ్యాపారమని అందులో భాగంగా వీళ్లకు మద్యం అలవాటు ఎక్కువగా ఉంటుందని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇతర సామాజిక వర్గాల వారికి అలవాటున్నా.. అంతగా మద్యం సేవించరని అభిప్రాయపడ్డారు. దాంతో పాటుగా కాంగ్రెస్ పాలనతో విసుగెత్తిపోయిన ప్రజలు నరేంద్ర మోదీకి అధికారం కట్టబెట్టారని, ప్రస్తుతం మోదీ పాలనలో ప్రజలు సంతోషంగా లేరని వ్యాఖ్యలు చేయడం బీజేపీ అధిష్టానికి మింగుడు పడటం లేదు. -
మాముందే గుర్రంపై తిరుగుతావా
అహ్మదాబాద్: గుజరాత్‌లోని ఉనాలో దళిత యువకులపై దాడిని మర్చిపోకముందే ఆ రాష్ట్రంలో మరో దారుణం చోటుచేసుకుంది. దళిత యువకుడు ప్రదీప్ రాథోడ్(21) గుర్రాన్ని కొనుగోలుచేసి దానిపై తిరగడాన్ని తట్టుకోలేని కొందరు రాజ్‌పుత్ వర్గీయులు అతన్ని గురువారం దారుణంగా హత్యచేశారు. ఈ ఘటన భావ్‌నగర్‌లో జిల్లాలోని తింబీ గ్రామంలో చోటుచేసుకుంది. ఇటీవల కొత్త గుర్రాన్ని కొనడంతో ప్రదీప్‌పై రాజపుజ్ వర్గీయులు కొందరు పగ పెంచుకున్నారనీ, గుర్రాన్ని అమ్మేయకుంటే చంపేస్తామని బెదిరించారని మృతుని తండ్రి కాలూభాయ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పొలం నుంచి గుర్రంపై తిరిగొస్తుండగా ప్రదీప్‌పై పదునైన ఆయుధాలతో దాడిచేసి హత్యచేశారన్నారు. కాలూభాయ్ ఫిర్యాదుతో ముగ్గురు నిందితుల్ని అదుపులోకి తీసుకున్నట్లు భావ్‌నగర్ డీఎస్పీ ఏఎం సయాద్ మీడియాకు తెలిపారు. -
కర్ణిసేన యూటర్న్.. ‘పద్మావత్ ఓ అద్భుతం’
సాక్షి, ముంబై : పద్మావత్ చిత్రంపై శ్రీరాజ్‌పుత్ కర్ణి సేన ఎట్టకేలకు వెనక్కి తగ్గింది. ఈ చిత్రంపై ఆందోళనలను విరమించుకుంటున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ క్రమంలో పద్మావత్ అమోఘం అంటూ విపరీతమైన పొగడ్తలు గుప్పించింది. శుక్రవారం ముంబైలో పలువురు కర్ణిసేన నేతలు ఈ చిత్రాన్ని వీక్షించారు. అనంతరం కర్ణిసేన ముంబై చీఫ్ యోగంద్ర సింగ్ కటార్ మీడియాతో మాట్లాడారు. ‘‘చిత్రంలో అభ్యంతరకర సన్నివేశాలు ఏం లేవు. ఇందులో రాజ్‌పుత్‌ల గురించి చాలా గొప్పగా చూపించారు. పద్మావత్ చూశాక ప్రతీ రాజ్‌పుత్ కూడా గర్వపడతారు’’ అంటూ కటార్ తెలియజేశారు. ఇక కర్ణిసేన జాతీయాధ్యక్షుడు సుఖ్‌దేవ్ సింగ్ గోగామడి ఆదేశాలను అనుసరించి కర్ణిసేన ఓ ప్రకటన కూడా విడుదల చేసింది. ‘‘సినిమాలో రాణి పద్మినీ, ఖిల్జీ మధ్య ఎలాంటి అభ్యంతరకర సన్నివేశాలు కూడా లేవు. రాజ్‌పుత్‌ల మనోభావాలు చిత్రం దెబ్బతీయలేదు. పైగా చాలా గొప్పగా చూపించారు. అందుకే ఆందోళనలు విరమిస్తున్నాం. రాజస్థాన్, మధ్యప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాలతోపాటు మిగతా చోట్ల కూడా చిత్రం ఆడేందుకు దోహదం చేస్తాం’’ అని పేర్కొంది. కాగా, చిత్ర షూటింగ్ ప్రారంభం నుంచే అభ్యంతరాలు లేవనెత్తుతూ విడుదలను అడ్డుకునేందుకు కర్ణిసేన శతవిధాల ప్రయత్నించింది. ఆందోళనలు, ధర్నాలు, దాడులు, నిరసనలు, భన్సాలీ-దీపిక తలలపై నజరానాల ప్రకటనలు, పలు రాష్ట్ర ప్రభుత్వాల(బీజేపీ పాలిత) నిషేధం... ఇలా ఏవీ కూడా చిత్ర విడుదలను అడ్డుకోలేకపోయాయి. చివరకు న్యాయస్థానాలు కూడా పద్మావత్ విడుదలకు క్లియరెన్స్ ఇవ్వటంతో కాస్త వెనక్కి తగ్గింది. ఇప్పుడు సినిమాలో అలాంటి అంశాలేవీ లేవని నిర్ధారణ కావటంతో యూటర్న్ తీసుకుని మద్ధతు ప్రకటించింది. -
దేశంలో కనీవినీ ఎరుగని నిరసన
జైపూర్/అహ్మదాబాద్ : దేశ చరిత్రలోనే ఊహించని మలుపు. ఒక సినిమాకు వ్యతిరేకంగా ఏకంగా 2వేల మంది మహిళలు ఆత్మార్పణకు సిద్ధమైన అరుదైన ఘట్టం. ‘‘మా మాట కాదని సినిమాను ప్రదర్శిస్తే థియేటర్ల ముందు చితిపేర్చుకుని ఆ మంటల్లో దూకి చస్తాం..’’ అని రాజ్‌పుత్ మహిళలు శపథంపూనారు. మహిళలకు తోడు పురుషులు కూడా పెద్ద ఎత్తున నిరసనల్లో పాలుపంచుకుంటున్నారు. మరికొద్ది గంటల్లో ‘పద్మావత్’ విడుదలకానున్న నేపథ్యంలో గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాల్లో పరిస్థితి నివురుగప్పిన నిప్పులా ఉంది. మరో ఐదు రాష్ట్రాల్లో ఉద్రిక్తతలు తలెత్తే అవకాశం ఉంది. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా గుజరాత్ ప్రభుత్వం బస్సు సర్వీసులను రద్దు చేసింది. దీంతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆత్మాహుతికి పేర్లు నమోదు చేసుకున్న 2వేల మంది మహిళలు : రాజ్‌పుత్ కులానికి చెందిన రాణి పద్మావతిది గొప్ప చరిత్ర అని, సినిమాలతో ఆమె పరువును మంటగలుపుతుంటే చూస్తూ ఊరుకోబోమని ఆ కులానికి చెందిన మహిళలు నినదించారు. ఆదివారం రాజస్థాన్‌లోని చిత్తోర్ఘర్ పట్టణంలో నిర్వహించిన భారీ ర్యాలీలో సుమారు 3వేల మంది రాజ్‌పుత్ మహిళలు పాల్గొన్నారు. సినిమాను ప్రవర్శిస్తే తామంతా మంటల్లోకి దూకి ఆత్మార్పణ(జౌహార్) చేసుకుంటామని జిల్లా కలెక్టర్‌కు అల్టిమేటం ఇచ్చారు. జౌహార్‌కు సిద్ధమంటూ ఇప్పటికే 2వేల మంది మహిళలు తమ పేర్లను రిజిస్టర్ చేయించుకున్నారు. ఆ జాబితాను కూడా కలెక్టర్‌కు అందించారు. బస్సులు బంద్.. మంత్రి అనూహ్య వ్యఖ్యలు : గుజరాత్లో రాజ్‌పుత్‌ల ప్రాబల్యం ఎక్కువగా ఉన్న హెహసానా రీజియన్‌లో కొద్ది గంటలుగా ఉద్రిక్తతలు కొనసాగుతూనేఉన్నాయి. పలుచోట్ల గుజరాత్ ఆర్టీసీకి చెందిన బస్సులను నిరసనకారులు ధ్వంసం చేశారు. దీంతో సోమవారం నుంచి బస్సు సర్వీసుల్ని రద్దు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఇదిలా ఉంటే, రాష్ట్రంలో పరిస్థితులపై మంత్రి భూపేంద్రసింహ్ మాట్లాడుతూ.. ‘ఇలాంటివి చాలా సహజం’ అని అన్నారు. సినిమా విడుదలను అడ్డుకోరాదంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను అమలుచేయడంపైనే తాము దృష్టిపెట్టినట్లు చెప్పుకొచ్చారు. 25న దేశవ్యాప్త ఆందోళన : పద్మావత్ సినిమాను మొదటి నుంచీ వ్యతిరేకిస్తోన్న కర్ణిసేన.. సినిమా విడుదలయ్యేరోజు దేశవ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చింది. ‘‘ఇప్పటికే థియేటర్ యాజామాన్యాలతో మాట్లాడాం. పద్మావతిని ప్రదర్శించొద్దన్న మా డిమాండ్‌కు చాలా మంది ఒప్పుకున్నారు. ఒకవేళ ఎవరైనా సినిమాను ప్రదర్శిస్తే జరగబోయే పరిణామాలకు వారిదే బాధ్యత. పద్మావతి విడుదలయ్యే జనవరి 25న దేశవ్యాప్తంగా ఆందోళనలు చేస్తాం’’ శ్రీరాజ్‌పుత్ కర్ణిసేన అధికార ప్రతినిధి విజేంద్ర సింగ్ మీడియాతో అన్నారు. -
ఏకమవుతున్న రాజ్‌పుత్‌లు.. పూర్తిగా బ్యాన్!
జైపూర్ : పద్మావతి చిత్ర వివాదం సమసిపోయిందనుకుంటున్న సమయంలో మరోసారి శ్రీ రాజ్‌పుత్ కర్ణిసేన కన్నెర్ర చేసింది. సెన్సార్ బోర్డు ప్యానెల్ కమిటీ సూచనలు.. అందుకు మేకర్లు కూడా దాదాపు అంగీకరించారనే వార్తల నేపథ్యంలో ఆందోళనకారులు అప్రమత్తమయ్యారు. చిత్రాన్ని పూర్తిగా నిషేధించేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే దిశగా ప్రయత్నాలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. కర్ణిసేన చీఫ్ లోకేంద్ర సింగ్ కల్వి మీడియాతో మాట్లాడుతూ... ఈ విషయంపై దేశంలోని రాజ్‌పుత్ తెగకు చెందిన వారంతా జనవరి 27న చిత్తోర్‌ఘడ్‌లో సమావేశం కాబోతున్నట్లు చెప్పారు. ఆ భేటీలో చిత్ర విడుదలను అడ్డుకునేలా ఓ కీలక నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ‘‘రాణి పద్మావతి త్యాగం వెలకట్టలేనిది.. అలాంటి వ్యక్తిని అభాసుపాలు చేసేలా చిత్రీకరిస్తే చూస్తూ ఊరుకుంటామా?. సినిమా విషయంలో భన్సాలీకే స్పష్టత కొరవడినట్లుంది. ఓసారి చరిత్ర అంటాడు.. మరోసారి కల్పితం అంటాడు. సెన్సార్ బోర్డు నిర్ణయం కూడా సముచితంగా లేదు. ఆరు నూరైనా చిత్రాన్ని అడ్డుకుని తీరతాం. ఈ విషయంలో చట్టాలు కూడా మమల్ని అడ్డుకోలేవు. అవసరమైతే ప్రాణ త్యాగానికైనా సిద్ధం’’ అని ఆయన హెచ్చరించారు. చరిత్రను భ్రష్టు పట్టిస్తుంటే నేతలు చూస్తూ ఊరుకోవటం సరికాదని.. ఈ విషయంలో ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి తీసుకొస్తామని లోకేంద్ర స్పష్టం చేశారు. కాగా, డిసెంబర్ 30న సెన్సార్ బోర్డు పద్మావతి చిత్రం గురించి ఓ ప్రకటన విడుదల చేసిన సంగతి విదితమే. టైటిల్‌ను పద్మావత్‌గా మార్చటంతోపాటు పలు సూచనలు పాటిస్తే యూ బై ఏ సర్టిఫికెట్ తో చిత్ర విడుదలకు లైన్ క్లియర్ చేస్తామని సెన్సార్ బోర్డు వెల్లడించింది. ఈ నేపథ్యంలో నిర్మాతలు కూడా అంగీకరించారని.. ఫిబ్రవరి 9న చిత్రం విడుదల కాబోతుందని ఓ వార్త కూడా చక్కర్లు కొడుతోంది. -
బ్రిటన్‌లోనూ నిరసన సెగ
లండన్: వివాదాస్పద చారిత్రక మూవీ పద్మావతికి బ్రిటన్‌లోనూ నిరసన సెగలు తాకాయి. పద్మావతికి ఎలాంటి కట్స్ లేకుండా బ్రిటిష్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్(బీబీఎఫ్‌సీ) క్లియరెన్స్ లభించినా అక్కడ సినిమాను బహిష్కరిస్తున్నట్టు రాజ్పుట్ సమాజ్ పిలుపు ఇచ్చింది. బ్రిటన్‌లోనూ పద్మావతి విడుదలను నిలిపివేసేలా సినిమా సర్టిపికేషన్ను పునసమీక్షించాలని రాజ్పుట్ సమాజ్ బ్రిటిష్ బోర్డుకు లేఖ రాసినట్టు సమాచారం. పద్మావతి సినిమా భారతీయ చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలను వక్రీకరిస్తూ తెరకెక్కడంతో భారత్‌లోని పలు రాష్ట్రాలు సినిమాను బహిష్కరించాయని, దిక్కుతోచని నిర్మాతలు బ్రిటన్‌లో విడుదలకు సన్నాహాలు చేస్తున్నారని రాజ్పుట్ సమాజ్(యూకే) అధ్యక్షుడు మహేంద్రసింగ్ జడేజా వ్యాఖ్యానించారు. మరోవైపు రాజ్పుట్ సమాజ్ విజ్ఞప్తిపై బీబీఎఫ్‌సీ ఇప్పటివరకూ స్పందించలేదు. -
కొనసాగుతున్న పద్మావతి ప్రకంపనలు
సాక్షి,న్యూఢిల్లీ: సంజయ్ లీలా భన్సాలీ చెక్కిన చారిత్రక దృశ్యకావ్యం పద్మావతి ప్రకంపనలు కొనసాగుతున్నాయి. సినిమాకు సీబీఎఫ్సీ సర్టిఫికేషన్ నిలిచిపోయిన క్రమంలో పాలక రాజస్ధాన్, యూపీ, గుజరాత్ బీజేపీ సర్కార్ల తీరుపై బాలీవుడ్ ప్రముఖులు మండిపడుతున్నారు. బీజేపీ ప్రభుత్వాలే పద్మావతి చిత్ర విడుదలలో జాప్యానికి కారణమని నటి, సామాజిక కార్యకర్త షబనా అజ్మీ ఆరోపించారు. పద్మావతి విషయంలో చిత్ర పరిశ్రమ ఏకతాటిపై నిలిచి గోవాలో సోమవారం ప్రారంభమవుతున్న అంతర్జాతీయ చలన చిత్రోత్సవాన్ని బహిష్కరించాలని పిలుపు ఇచ్చారు. పద్మావతి మూవీపై రగడ జరుగుతుంటే రాజస్ధాన్ ముఖ్యమంత్రి వసుంధరా రాజె మౌన ప్రేక్షకురాలిలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. పద్మావతి మూవీని విడుదల చేస్తే హింసకు దిగుతామని హెచ్చరించిన వారిపై ఎలాంటి చర్యలూ చేపట్టలేదని ఆరోపించారు. రాష్ట్రంలో అసాంఘిక శక్తులను ఏరివేస్తామని ప్రకటించిన యూపీ ప్రభుత్వం శాంతిభద్రతల పేరుతో డిసెంబర్ 1న సినిమా విడుదలకు మోకాలడ్డుతోందని విమర్శించారు.పద్మావతి మూవీని కొన్ని లాంఛనాలు పూర్తికాలేదనే సాకుతో సీబీఎఫ్సీ తిప్పిపంపడాన్ని షబనా అజ్మీ తప్పుపట్టారు. దీనివెనుక గుజరాత్ ఎన్నికల్లో ఓట్లు దండుకునే రాజకీయం దాగున్నదన్నారు. మరోవైపు రాజ్పుట్ల ప్రాబల్యం కలిగిన రాజస్ధాన్‌లో పద్మావతి మూవీపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ పెద్ద ఎత్తున ఆందోళనలు చోటుచేసుకుంటున్న విషయం తెలిసిందే. పద్మావతి మూవీలో ఏ వర్గం వారినీ కించపరిచే సన్నివేశాలు లేకుండా మార్పులు చేసేంతవరకూ సినిమా విడుదల చేయరాదని రాజస్ధాన్ సీఎం వసుంధరా రాజే కేంద్రాన్ని కోరారు. చరిత్రకారులు, సినీ వర్గాలు, రాజ్పుట్ ప్రతినిధులతో కూడిన ప్రత్యేక కమిటీతో చిత్ర కథ గురించి చర్చించిన తర్వాతే సినిమాను విడుదల చేయాలని, అప్పటివరకూ విడుదల వాయిదా వేయాలని కేంద్ర సమాచార ప్రసార మంత్రి స్మృతీ ఇరానీకి వసుంధర రాజే లేఖ రాశారు. -
ఖజురహో దేవాలయాన్ని నిర్మించినవారు?
రాజపుత్రులు యుద్ధ ప్రియులు. వీరు ధైర్య, సాహసాలకు పేరు పొందారు. శత్రువులకు వెన్ను చూపడం, ఆశ్రయం కోరి వచ్చిన శత్రువులను హింసించడం లాంటివి యుద్ధ ధర్మానికి విరుద్ధంగా భావించేవారు. హిందూ సాంస్కృతిక వికాసానికి, పటిష్టతకు ఎక్కువగా కృషి చేశారు. ఆత్మాభిమానం, దేశభక్తి, నిరాడంబరత ఎక్కువగా ఉన్న రాజపుత్రులు చాలా పురాణ గాథల్లో కథానాయకులుగా ఉన్నారు. రాజపుత్ర యుగం హర్షవర్ధనుడి మరణానంతరం క్రీ.శ. 647 నుంచి ఢిల్లీలో మహ్మదీయ సుల్తానులు అధికారంలోకి వచ్చే వరకు (క్రీ.శ. 1206) ఉన్న కాలాన్ని భారతదేశ చరిత్రలో రసపుత్ర (రాజపుత్ర) యుగంగా వ్యవహరిస్తారు. రాజపుత్రులు ప్రధానంగా ఉత్తర భారతదేశంలో చిన్న చిన్న రాజ్యాలను నెలకొల్పారు. వీరిలో కొందరు విదేశాల నుంచి వచ్చి స్థిరపడిన వారు కూడా ఉన్నారు. స్వజాతి పట్ల తమ సంకుచిత దురభిమానం వల్ల ఇతర రాజపుత్ర వంశ రాజులతో శత్రుత్వం పెరిగి వీరిలో ఐకమత్యం లోపించింది. ఇదే వారి బలహీనతకు కారణమై భారతదేశంలో తురుష్కుల పాలనకు ద్వారాలు తెరిచింది. ముఖ్యమైన రాజపుత్ర వంశాలు ప్రతీహారులు: వీరు ‘ఘార్జర’ జాతికి చెందినవారు. రాజపుత్రుల్లో మొదటగా రాజకీయాధికారాన్ని పొందింది వీరే. వీరు జోధ్‌పూర్ (రాజస్థాన్)లో స్థిరపడ్డారు. వీరి రాజధాని ‘కనోజ్’. రాజ్యస్థాపకుడు నాగబట్టుడు. మిహీర భోజుడు ప్రతీహారుల్లో ముఖ్యమైన రాజు. గహద్వాలులు: వీరినే ‘రాథోడ్’ (రాఠోర్)లని కూడా పిలుస్తారు. ప్రతీహార రాజ్య పతనం తర్వాత క్రీ.శ. 1085లో కనోజ్ కేంద్రంగా పాలించారు. ఈ వంశ మూల స్థాపకుడు చంద్రదేవుడు. తురుష్కుల దాడులను తిప్పికొట్టడానికి కావాల్సిన సైన్య పోషణకు అయ్యే ఖర్చు కోసం ప్రజల నుంచి ‘తురకదండు’ అనే పన్నును వసూలు చేసేవారు. రాఠోరుల్లో సుప్రసిద్ధుడు జయచంద్రుడు. చౌహాన్ వంశానికి చెందిన పృథ్వీరాజ్ చౌహాన్‌తో ఈయనకు బద్ధ శత్రు త్వం ఉండేది. చందవార్ యుద్ధం (క్రీ.శ.1193) లో ఘోరీ మహ్మద్ చేతిలో జయచంద్రుడు ఓడిపోవడంతో వీరి పాలన అంతమైంది. చౌహాన్లు: క్రీ.శ. 956లో సింహారాజ చౌహాన్ స్థాపించిన చౌహాన్ రాజ్యం రాజస్థాన్‌లోని సాంబారు ప్రాంతాల్లో విస్తరించింది. ‘అజ్మీర్’ నగరాన్ని నిర్మించిన అజయ్ చౌహాన్ ఈ వంశానికి చెందినవాడే. పృథ్వీరాజ్ చౌహాన్ మొత్తం రాజపుత్ర రాజుల్లోనే అగ్రగణ్యుడిగా గుర్తింపు పొందాడు. ఇతడు హిందూ జాతీయ వీరుడిగా గౌరవం పొందాడు. చాంద్ బర్దాయ్ రాసిన ‘పృథ్వీరాజ్ రాసో’ అనే గ్రంథం పృథ్వీరాజ్ చౌహాన్ గొప్పతనాన్ని తెలియజేస్తుంది. ఇతడు మొదటి తరైన్ యుద్ధంలో (క్రీ.శ. 1191) మహ్మద్ ఘోరీపై గెలిచాడు. రెండో తరైన్ యుద్ధంలో (క్రీ.శ. 1192) ఘోరీ చేతిలో ఓడిపోవడం వల్ల చౌహాన్ వంశం అంతరించింది. పారమారులు: ఉపేంద్రుడు క్రీ.శ. 950లో ‘ధారా’ నగరాన్ని రాజధానిగా చేసుకొని పారమార రాజ్యాన్ని నెలకొల్పాడు. వీరిలో సుప్రసిద్ధుడు ముంజరాజు. ఇతడి ఆస్థానంలో ‘పద్మగుప్తుడు’ అనే కవి ఉండేవాడు. ఈ కవి ‘నవసాహసాంక చరిత్ర’ను రాశాడు. సాంస్కృతిక సాహిత్య చరిత్రలో ప్రముఖంగా చెప్పుకునే ‘భోజరాజు’ ఈ వంశానికి చెందినవాడే. ఇతడు భోజ్‌పూర్ సరస్సును, ‘భోజ్‌పురి’ నగరాన్ని నిర్మించాడు. చందేలులు: బుందేల్‌ఖండ్ ప్రాంతంలో విలసిల్లిన చందేల రాజ్య స్థాపకుడు మనోవర్మ. వీరి రాజధాని ‘ఖజురహో’. చందేలరాజుల్లో ప్రధానమైనవాడు విద్యాధరుడు. ఇతడు గజనీ మహ్మద్‌ను రెండుసార్లు ప్రతిఘటించాడు. చివరికి ఢిల్లీ సుల్తాన్ అల్లావుద్దీన్ ఖిల్జీ దాడి వల్ల వీరి పాలన అంతమైంది. కాలచూరులు: నర్మదా, గోదావరి నదుల మధ్య భాగంలోని కొంత ప్రాంతాన్ని వీరు పాలించారు. వీరి రాజ్యాన్ని ‘చేది’ రాజ్యమని పిలిచేవారు. వీరి రాజధాని ‘త్రిపుర నగరం’. సోలంకీలు: అన్హిల్వాడ్ (గుజరాత్) రాజధానిగా క్రీ.శ. 945లో మూలరాజు సోలంకి రాజ్యాన్ని నెలకొల్పాడు. వీరి కాలంలోనే గజనీ మహ్మద్ సోమనాథ దేవాలయాన్ని (గుజరాత్) ధ్వంసం చేశాడు. సోలంకీ వంశానికి చెందిన జయసింహుడు ‘సింహశకాన్ని’ ప్రారంభించాడు. పాలరాజులు: బెంగాల్లో స్థానిక ప్రభువులైన పాలవంశీయులు ‘ఉద్ధంతపురి’ రాజధానిగా పరిపాలించారు. మూలపురుషుడు గోపాలుడు. వీరు ఎక్కువగా బౌద్ధమతాన్ని అవలంభించారు. ధర్మ పాలుడు అనే రాజు ‘విక్రమశిల విశ్వ విద్యాలయాన్ని’ స్థాపించాడు. టిబెట్‌లో బౌద్ధమత ప్రచారానికి ఆద్యుడైన ‘అతిదీ పంకరుడు’ ఈ విశ్వవిద్యాలయానికి అధ్యక్షుడిగా పని చేశాడు. పాలరాజులు వేయించిన శిల్పాలు భారతీయ శిల్పకళా సౌందర్యాన్ని ఉన్నత స్థాయికి తీసుకువెళ్లాయి. సేన వంశస్థుల వల్ల వీరి పాలన కనుగమరుగైంది. సేన వంశరాజులు: ఈ రాజ్యస్థాపకుడు విజయసేనుడు. సేనులు కర్ణాటక ప్రాంతం నుంచి వెళ్లి బెంగాల్లో స్థిరపడ్డారు. సేన వంశస్థుల్లో సుప్రసిద్ధుడు లక్ష్మణసేనుడు. ఇతడు స్వయంగా కవి. ఇతడి ఆస్థానంలో ‘పంచరత్నాల’నే కవులుండేవారు. ‘గీతా గోవిందం’ రాసిన జయదేవుడు వీరిలో ఒకరు. రసపుత్ర యుగ సామాజిక పరిస్థితులు క్షేమేంద్రుడు రాసిన ‘బృహత్కథామంజరి’, కల్హణుడి ‘రాజతరంగిణి’ రాజపుత్రుల రాజకీయ, సాంఘిక పరిస్థితుల గురించి తెలియజే స్తున్నాయి. ‘కాయస్థ’ అనే ప్రభుత్వ అధికారులు ఉండేవారు. కాలక్రమంలో వీరు ప్రత్యేక సామాజికవర్గంగా మారారు. రాజపుత్రుల పాలనా కాలంలో ఆడశిశువుల పుట్టుకను తల్లిదండ్రులు భారంగా భావించేవారు. స్త్రీల విషయంలో కొన్ని కఠినమైన నిబంధనలున్నట్లు తెలుస్తోంది. అంతఃపుర స్త్రీలు కనీసం సూర్యున్ని కూడా చూడకూడదనే నిబంధన ఉండేది. ‘పరదా పద్ధతి’ వాడుకలో ఉండేది. యుద్ధ సమయాల్లో మహిళలు ‘జౌహార్’ను ఆచరించేవారు. భర్తలు యుద్ధంలో మరణించినప్పుడు అగ్నిలో దూకి పరపురుషుల నుంచి రక్షించుకునేందుకు స్త్రీలు ‘జౌహార్’ పద్ధతిని పాటించేవారు. రాజులు యుద్ధాలపై అతిగా దృష్టి పెట్టి పాలనను నిర్లక్ష్యం చేసేవారు. భారతీయ ఆర్థిక వ్యవస్థ భూస్వామ్య ఆర్థిక వ్యవస్థగా మారడానికి అంకురార్పణ వీరికాలంలోనే జరిగినట్లుగా చరిత్రకారులు చెబుతారు. సాహిత్యం - కళలు: ‘కల్హణుడు’ భారతదేశ మొదటి చరిత్రకారుడిగా ప్రసిద్ధి చెందాడు. ఇతడు రచించిన ‘రాజతరంగిణి’ భారతదేశంలో మొట్టమొదటి చారిత్రక గ్రంథంగా గుర్తింపు పొందింది. రాజపుత్రులు కోటలను, భవనాలను శత్రుదుర్భేద్యంగా, అతి సుందరంగా నిర్మించారు. రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్‌లలో వీరు నిర్మించిన కోటలు ఇప్పటికీ పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తున్నాయి. వీరు అనేక ఆలయాలను వినూత్న శైలిలో నిర్మించి తమ ప్రత్యేకతను నిలుపుకున్నారు. ముఖ్యమైన ఆలయాలు: సోమనాథ్ ఆలయం (గుజరాత్) లింగరాజ్ ఆలయం (భువనేశ్వర్) జగన్నాథాలయం (పూరీ) సూర్య దేవాలయం (కోణార్క) ఖజురాహో ఆలయం (మధ్యప్రదేశ్) అబూ ఆలయం (రాజస్థాన్) రాజపుత్ర యుగానికి చెందిన ముఖ్యమైన కవులు - వారి రచనలు: భట్టి - రావణవధ మేఘుడు - శిశుపాలవధ శ్రీహర్షుడు - నైషద చరిత్ర పద్మగుప్తుడు - నవశశాంకచరిత్ర జయదేవుడు - గీతా గోవిందం దండి - దశకుమార చరిత్ర బాణుడు - హర్షచరిత్ర భవభూతి - మాలతీ మాధవం రాజశేఖరుడు - కర్పూర మంజరి కల్హణుడు - రాజతరంగిణి బిల్హణుడు - విక్రమాంక చరిత్ర జయనకుడు - పృథ్వీరాజ విజయం క్షేమేంద్రుడు - బృహత్కథామంజరి సోమదేవుడు - కథాసరిత్సాగరం సారంగదేవుడు - సంగీత రత్నాకరం వాగ్భటుడు - అష్టాంగ సంగ్రహం భాస్కరాచార్యుడు - సిద్ధాంత శిరోమణి చాంద్ బర్దాయ్ - పృథ్వీరాజ్ రాసో మాదిరి ప్రశ్నలు 1. రాజపుత్ర రాజుల పాలన అంతమవ్వడానికి ప్రధాన కారణం? 1) ముస్లిం దండయాత్రలు 2) రాజపుత్రులు యుద్ధ బలహీనులు కావడం 3) రాజపుత్రుల మధ్య ఐక్యత లేకపోవడం 4) రాజపుత్ర రాజులపై ప్రజలకున్న వ్యతిరేకత 2. ఖజురహో దేవాలయాన్ని నిర్మించినవారు? 1) పాలరాజులు 2) చందేలులు 3) చౌహానులు 4) ప్రతీహారులు 3. ‘పృథ్వీరాజ్ రాసో’ గ్రంథకర్త? 1) పృథ్వీరాజ్ చౌహాన్ 2) చాంద్ బర్దాయ్ 3) మిహీర భోజుడు 4) జయనకుడు 4. ‘తురకదండు’ అనే పన్నును ప్రజల నుంచి వసూలు చేసిన రాజపుత్ర రాజులు? 1) గహాద్వాలులు 2) సోలంకీలు 3) పారమారులు 4) చౌహానులు 5. చందావార్ యుద్ధం (క్రీ.శ.1193)లో ఘోరీ ఎవరిని ఓడించాడు? 1) పృథ్వీరాజ్ చౌహాన్ 2) హేమచంద్రుడు 3) జయచంద్రుడు 4) భోజుడు 6. తరైన్ యుద్ధాలు (క్రీ.శ. 1191, 1192) ఎవరెవరికి మధ్య జరిగాయి? 1) గజనీ మహ్మద్, జయసేనుడు 2) గజనీ మహ్మద్, ధర్మపాలుడు 3) ఘోరీ మహ్మద్, జయచంద్రుడు 4) ఘోరీ మహ్మద్, పృథ్వీరాజ్ చౌహాన్ 7. కావ్య మీమాంస, హర విలాసం అనే గ్రంథాల రచయిత? 1) కాళిదాసు 2) కల్హణుడు 3) రాజశేఖరుడు 4) బిల్హణుడు 8. భవభూతి అనే నాటక రచయిత ఎవరి ఆస్థానంలో ఉండేవాడు? 1) యశోవర్మ 2) మిహీర భోజుడు 3) ధర్మపాలుడు 4) జయచంద్రుడు 9. మౌంట్ అబూ (రాజస్థాన్)లోని దిల్వారా జైన దేవాలయాన్ని నిర్మించినవారు? 1) సోలంకీ మొదటి భీముడు 2) ప్రతీహార ఘార్జారుడు 3) ధర్మపాలరాజు 4) విజయసేనరాజు 10. అరబ్బు యాత్రికుడు సులేమాన్ ఏ రాజపుత్ర రాజు రాజ్యాన్ని సందర్శించాడు? 1) పృథ్వీరాజ్ చౌహాన్ 2) ధర్మపాలుడు 3) నాగభట్టు 4) మిహీర భోజుడు 11. పంచరత్నాలనే కవులు ఎవరి ఆస్థానంలో ఉండేవారు? 1) పాలరాజులు 2) సేనరాజులు 3) కాలచూర రాజులు 4) సోలంకీ రాజులు 12. ‘కనోజ్ దర్బార్’ను ఘనంగా నిర్వహించినవారు? 1) పృథ్వీరాజ్ చౌహాన్ 2) యశోవర్మ 3) ధర్మపాలుడు 4) మిహీర భోజుడు 13. కాళిదాసుతో పోల్చదగిన ప్రముఖ నాటక రచయిత? 1) కల్హణుడు 2) రాజశేఖరుడు 3) భవభూతి 4) సారంగదేవుడు 14. నైషధ చరిత్ర అనే గ్రంథాన్ని రాసిన శ్రీహర్షుడు ఎవరి ఆస్థానంలో ఉండేవాడు? 1) జయచంద్రుడు 2) విద్యాధరుడు 3) జయసేనుడు 4) విద్యాసేనుడు 15. కోణార్కలోని సూర్యదేవాలయాన్ని నిర్మించిన రాజవంశం? 1) పాలరాజులు 2) రాష్ట్రకూటులు 3) గజపతులు 4) కళింగ గాంగులు సమాధానాలు 1) 3; 2) 2; 3) 2; 4) 1; 5) 3; 6) 4; 7) 3; 8) 1; 9) 1; 10) 4; 11) 2; 12) 3; 13) 3; 14) 1; 15) 4.