అహ్మదాబాద్: గుజరాత్‌లోని ఉనాలో దళిత యువకులపై దాడిని మర్చిపోకముందే ఆ రాష్ట్రంలో మరో దారుణం చోటుచేసుకుంది. దళిత యువకుడు ప్రదీప్ రాథోడ్(21) గుర్రాన్ని కొనుగోలుచేసి దానిపై తిరగడాన్ని తట్టుకోలేని కొందరు రాజ్‌పుత్ వర్గీయులు అతన్ని గురువారం దారుణంగా హత్యచేశారు. ఈ ఘటన భావ్‌నగర్‌లో జిల్లాలోని తింబీ గ్రామంలో చోటుచేసుకుంది.
ఇటీవల కొత్త గుర్రాన్ని కొనడంతో ప్రదీప్‌పై రాజపుజ్ వర్గీయులు కొందరు పగ పెంచుకున్నారనీ, గుర్రాన్ని అమ్మేయకుంటే చంపేస్తామని బెదిరించారని మృతుని తండ్రి కాలూభాయ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పొలం నుంచి గుర్రంపై తిరిగొస్తుండగా ప్రదీప్‌పై పదునైన ఆయుధాలతో దాడిచేసి హత్యచేశారన్నారు. కాలూభాయ్ ఫిర్యాదుతో ముగ్గురు నిందితుల్ని అదుపులోకి తీసుకున్నట్లు భావ్‌నగర్ డీఎస్పీ ఏఎం సయాద్ మీడియాకు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment