మంత్రి ఇంటిపై దాడి చేస్తున్న ఆందోళనకారులు (ఇన్‌సెట్లో ఓం ప్రకాశ్)
లక్నో : బాధ్యతాయుతమైన రాష్ట్ర మంత్రి హోదాలో ఉన్న వ్యక్తి కొన్ని సామాజిక వర్గాలపై చేసిన వ్యాఖ్యలు ఉత్తరప్రదేశ్‌లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. రాజ్‌పుత్, యాదవ సామాజిక వర్గాలకు చెందిన కొందరు వ్యక్తులు రాష్ట్ర మంత్రి ఓం ప్రకాశ్ రాజ్‌భర్ ఇంటిపై శనివారం దాడికి పాల్పడ్డారు. రాళ్లు, కోడిగుడ్లు, టొమాటోలను మంత్రి ఇంటిపై రువ్వుతూ ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
యోగి ఆదిత్యనాథ్ కేబినెట్‌లో మంత్రి అయిన ఓం ప్రకాశ్ రాజ్‌భర్ శుక్రవారం జరిగిన ఓ సభలో మాట్లాడుతూ.. మద్యం గురించి చెబుతూ.. రాజ్‌పుత్‌లు, యాదవులు అధిక మోతాదులో మద్యం సేవిస్తారని పేర్కొన్నారు. ఇది వారికి పూర్వీకుల నుంచి వారసత్వంగా వస్తున్న వ్యాపారమని అందులో భాగంగా వీళ్లకు మద్యం అలవాటు ఎక్కువగా ఉంటుందని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇతర సామాజిక వర్గాల వారికి అలవాటున్నా.. అంతగా మద్యం సేవించరని అభిప్రాయపడ్డారు. దాంతో పాటుగా కాంగ్రెస్ పాలనతో విసుగెత్తిపోయిన ప్రజలు నరేంద్ర మోదీకి అధికారం కట్టబెట్టారని, ప్రస్తుతం మోదీ పాలనలో ప్రజలు సంతోషంగా లేరని వ్యాఖ్యలు చేయడం బీజేపీ అధిష్టానికి మింగుడు పడటం లేదు.
Comments
Please login to add a commentAdd a comment