ప్రస్తుతం జరుగుతున్న లోక్‌సభ ఎన్నికల్లో ఏడవ దశకు జూన్ ఒకటిన ఓటింగ్ జరగనుంది. ఈ దశలో దేశంలోని మొత్తం 57 స్థానాలకు పోలింగ్ నిర్వహించనున్నారు. ఉత్తరప్రదేశ్‌లో ప్రధాని మోదీ పోటీ చేస్తున్న వారణాసికి కూడా ఈ దశలోనే ఎన్నికలు జరగనున్నాయి.
చివరి దశలో అంటే జూన్ ఒకటిన యూపీలోని మహారాజ్‌గంజ్, గోరఖ్‌పూర్, ఖుషీనగర్, డియోరియా, బన్స్‌గావ్, ఘోసి, సలేంపూర్, బల్లియా, ఘాజీపూర్, చందౌలీ, వారణాసి, మీర్జాపూర్, రాబర్ట్స్‌గంజ్‌లలో మొత్తం 13 స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఈ దశలో ఎన్నికలు జరిగే 13 స్థానాల్లో ఐదు యోగి ఆదిత్యనాథ్ సొంత జిల్లా గోరఖ్‌పూర్ చుట్టూ ఉండగా, నాలుగు ప్రధాని మోదీ నియోజకవర్గం వారణాసిని ఆనుకుని ఉన్నాయి. 2019లో ఈ 13 స్థానాలలో 11 స్థానాల్లో బీజేపీ కూటమి విజయం సాధించింది. మిగిలిన రెండు స్థానాలను బీఎస్‌పీ దక్కించుకుంది.
వారణాసి
వారణాసి లోక్‌సభ స్థానం నుంచి హ్యాట్రిక్ విజయం సాధించేందుకు ప్రధాని మోదీ పోటీకి దిగారు. ఇక్కడ పోటీ ఏకపక్షంగానే కనిపిస్తోంది. 2003లో మినహా 1991 నుంచి ఈ సీటును బీజేపీనే సొంతం చేసుకుంటోంది.
గోరఖ్‌పూర్
గోరఖ్‌పూర్‌ను బీజేపీ సంప్రదాయ స్థానంగా పరిగణిస్తారు. ఇక్కడి నుంచి బీజేపీ సిట్టింగ్ ఎంపీ రవికిషన్‌ను మరోసారి బరిలోకి దింపింది. 2018 ఉప ఎన్నిక మినహా 1989 నుంచి బీజేపీ ఈ స్థానాన్ని దక్కించుకంటూ వస్తోంది.
డియోరియా
డియోరియా సీటుకు బీజేపీ, కాంగ్రెస్ మధ్య ప్రత్యక్ష పోటీ నెలకొంది. ఈ సీటు టిక్కెట్టు ఇప్పుడు ఇండియా కూటమిలోని కాంగ్రెస్‌కు దక్కింది. మాజీ ఎంపీ శ్రీప్రకాష్ మణి త్రిపాఠి కుమారుడు శశాంక్ మణి త్రిపాఠిని బీజేపీ ఇక్కడి నుంచి రంగంలోకి దింపింది. కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే, ఆ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి అఖిలేష్ ప్రతాప్‌సింగ్‌కు టికెట్ ఇచ్చింది. డియోరియా నుంచి బీఎస్పీ నుంచి సందేశ్ యాదవ్ అభ్యర్థిగా బరిలోకి దిగారు.
మీర్జాపూర్
యూపీ అసెంబ్లీలో అప్నా దళ్ (ఎస్) మూడో అతిపెద్ద పార్టీ. ఈ పార్టీ నుంచి అనుప్రియ మరోసారి ఇక్కడి నుంచి ఎన్నికల బరిలోకి దిగారు. ఇక్కడ బీజేపీ, ఎస్పీ, బీఎస్పీ మధ్య త్రిముఖ పోరు నెలకొంది.
Comments
Please login to add a commentAdd a comment