ప్రధాని మోదీ వాటర్‌ గన్‌లకు ఆదరణ! | Shopping Narendra Modi Yogi Adityanath Water Guns | Sakshi
Sakshi News home page

Holi: ప్రధాని మోదీ వాటర్‌ గన్‌లకు ఆదరణ!

Published Sun, Mar 24 2024 11:53 AM | Last Updated on Sun, Mar 24 2024 11:53 AM

Shopping Narendra Modi Yogi Adityanath Water Guns - Sakshi

రంగుల పండుగ హోలీకి దేశవ్యాప్తంగా సన్నాహాలు  ఊపందుకున్నాయి. కొన్ని చోట్ల మార్కెట్‌లలో పండుగ కొనుగోళ్లు జరుగుతుండగా, మరోవైపు పూలతో ఇళ్లను అలంకరిస్తున్నారు. దేశవ్యాప్తంగా పలు మార్కెట్లలో కొనుగోలుదారుల రద్దీ పెరిగింది. 

ఈ హోలీ సందర్భంగా ప్రధాని మోదీ చిత్రాలతో కూడిన వాటర్‌ గన్‌లకు డిమాండ్ మరింతగా పెరిగింది. యూపీ, ఎంపీలతో సహా అనేక రాష్ట్రాల మార్కెట్లలో జనం మోదీ మాస్క్‌లను, వాటర్‌ గన్‌లను కొనుగోలు చేస్తున్నారు. లోక్‌సభ ఎన్నికల వాతావరణానికి ఈ హోలీ  వేడుకలు తోడై ఉత్సాహాన్ని రెట్టింపు చేశాయి. 

ఉత్తరప్రదేశ్‌లో సీఎం యోగి, ప్రధాని మోదీ చిత్రాలతో కూడిన వాటర్‌గన్‌ను జనం విరివిగా కొనుగోలు చేస్తున్నారు. దేశంలోని ఈశాన్య ప్రాంతం నుంచి దక్షిణాది వరకు అంతటా హోలీ సందడి కనిపిస్తోంది. అసోంలోని గౌహతిలో జనం ఉత్సాహంగా షాపింగ్ చేస్తున్నారు.  

కేరళలోని తిరువనంతపురంలో హోలీ సందర్భంగా పలువురు నృత్యాలు చేస్తూ కనిపిస్తున్నారు. హర్యానాలోని గురుగ్రామ్‌లో వివిధ దేశాల రాయబారులు పూలతో హోలీ వేడుకలు చేసుకున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ పార్లమెంటరీ నియోజకవర్గమైన వారణాసిలో దివ్యాంగుల కోసం ఒక ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. వారణాసిలోని ప్రసిద్ధ అస్సీ ఘాట్‌లో హోలీ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement