
హోలీ వేడుకలకు రాజకీయ రంగు పులుముకుంది. దేశంలోని పలు ప్రాంతాలలో ప్రధాని మోదీ చిత్రాలతో కూడిన వాటర్ గన్‌లు కనిపిస్తున్నాయి. వీటిని వినియోగిస్తూ జనం హోలీ వేడుకలు చేసుకుంటున్నారు. అయితే ఈ వాటర్ గన్‌ల వినియోగంపై కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.
మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫోటో, కమలం గుర్తు కలిగిన వాటర్ గన్‌లు విరివిగా విక్రయమవుతున్నాయి. ఇది కాంగ్రెస్ నేతలను కలవరపాటుకు గురి చేస్తోంది. కాంగ్రెస్ అధికార ప్రతినిధి ఆర్‌పీ సింగ్ బీజేపీ వైఖరిపై పలు విమర్శలు చేశారు.
ప్రజా సమస్యలను పరిష్కరించడం కంటే బ్రాండింగ్‌పై బీజేపీ దృష్టి పెట్టిందని ఆరోపించారు. మోదీ చిత్రాలతో కూడిన వాటర్ గన్స్, ఇతర హోలీ సామగ్రి తయారీకి అయ్యే ఖర్చును మోదీ ప్రభుత్వం భరిస్తున్నట్లుందని ఆయన ఆరోపించారు. తమ పార్టీ నేతలు, కార్యకర్తలు మోదీ చిత్రాలతో కూడిన వాటర్ గన్‌లను వినియోగించరని స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment