నదులున్నా.. నీళ్లులేవు | No water in rivers says PM Modi | Sakshi
Sakshi News home page

నదులున్నా.. నీళ్లులేవు

Published Tue, May 16 2017 2:13 AM | Last Updated on Wed, Aug 15 2018 6:34 PM

నదులున్నా.. నీళ్లులేవు - Sakshi

నదులున్నా.. నీళ్లులేవు

దేశంలో నదుల దుస్థితిపై ప్రధాని నరేంద్ర మోదీ ఆవేదన

అమర్‌కంఠక్‌: దేశంలోని నదుల దుస్థితిపై ప్రధాని నరేంద్ర మోదీ ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో పలు నదులు మ్యాపుల్లో ఉన్నా.. వాటిల్లో నీరు లేదన్నారు. సోమవారం మధ్యప్రదేశ్‌లోని అన్నూపూర్‌ జిల్లాలో ‘నమామి దేవి నర్మదే సేవా యాత్ర’ ముగింపు కార్యక్రమంలో ప్రధాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా నర్మదా నది రక్షణకు నడుంకట్టిన మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ను అభినందించారు. నర్మదా నది సంరక్షణకు రోడ్‌మ్యాప్‌ను సిద్ధం చేయడాన్ని ‘భవిష్యత్‌ దృష్టితో చేసిన సరైన కార్యక్రమం’ అని అభివర్ణించారు. ఆ డాక్యుమెంట్‌ను ఇతర రాష్ట్రాలకు కూడా ఇవ్వాలని సూచించారు.

డాక్యుమెంట్‌ను తాను పరిశీలించానని, అన్నీ సవివరంగా ఉన్నాయని అభినందించారు. నర్మదా నదిని కాపాడే కార్యక్రమం చేపట్టిన మధ్యప్రదేశ్‌కు ఆ నది నీటిని వినియోగించుకునే గుజరాత్, రాజస్తాన్, మహారాష్ట్ర శుభాభినందనలు తెలపాలన్నారు. ఈ కార్యక్రమానికి ముందు నర్మదా నది జన్మస్థానమైన అమర్‌కంఠక్‌ వద్ద మోదీ పూజలు నిర్వహించారు. కాగా, నమామి దేవి నర్మదే సేవా యాత్రను 2016 డిసెంబర్‌ 11న అమర్‌కంఠక్‌లో ప్రారంభించారు. సుమారు 150 రోజుల పాటు సాగిన ఈ యాత్ర 1100 ఊళ్ల మీదుగా 3,344 కి.మీ., పాటు సాగింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement