బ్రిటన్‌లోనూ నిరసన సెగ | Padmavati now faces protest by Rajput Samaj in the UK | Sakshi
Sakshi News home page

బ్రిటన్‌లోనూ నిరసన సెగ

Published Fri, Nov 24 2017 6:59 PM | Last Updated on Fri, Nov 24 2017 6:59 PM

Padmavati now faces protest by Rajput Samaj in the UK - Sakshi

లండన్‌: వివాదాస్పద చారిత్రక మూవీ పద్మావతికి బ్రిటన్‌లోనూ నిరసన సెగలు తాకాయి. పద్మావతికి ఎలాంటి కట్స్‌ లేకుండా బ్రిటిష్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఫిల్మ్‌ సర్టిఫికేషన్‌(బీబీఎఫ్‌సీ) క్లియరెన్స్‌ లభించినా అక్కడ సినిమాను బహిష్కరిస్తున్నట్టు రాజ్‌పుట్‌ సమాజ్‌ పిలుపు ఇచ్చింది. బ్రిటన్‌లోనూ పద్మావతి విడుదలను నిలిపివేసేలా సినిమా సర్టిపికేషన్‌ను పునసమీక్షించాలని రాజ్‌పుట్‌ సమాజ్‌ బ్రిటిష్‌ బోర్డుకు లేఖ రాసినట్టు సమాచారం.

పద్మావతి సినిమా భారతీయ చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలను వక్రీకరిస్తూ తెరకెక్కడంతో భారత్‌లోని పలు రాష్ట్రాలు సినిమాను బహిష్కరించాయని, దిక్కుతోచని నిర్మాతలు బ్రిటన్‌లో విడుదలకు సన్నాహాలు చేస్తున్నారని రాజ్‌పుట్‌ సమాజ్‌(యూకే) అధ్యక్షుడు మహేంద్రసింగ్‌ జడేజా వ్యాఖ్యానించారు. మరోవైపు రాజ్‌పుట్‌ సమాజ్‌ విజ్ఞప్తిపై బీబీఎఫ్‌సీ ఇప్పటివరకూ స్పందించలేదు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement