Padmavathi movie
-
నిజమెంత? నిజాయతీ ఎంత?
‘నిజజీవిత ఘటనల నుంచి ప్రేరణ పొంది తీశామ’ని అంటున్న సినిమాలో నిజాలు ఉంటాయనే ఆశిస్తాం. నిజాయతీగా ఉంటుందనే భావిస్తాం. కానీ అవే లోపిస్తే? శుక్రవారం విడుదలవుతున్న హిందీ చిత్రం ‘ది కేరళ స్టోరీ’ సరిగ్గా అవే ఆరోపణల్ని ఎదుర్కొంటోంది. విషయం మద్రాస్, కేరళ హైకోర్ట్‌ల మొదలు సర్వోన్నత న్యాయస్థానం దాకా వెళ్ళాల్సి వచ్చింది. దాదాపు 10 కట్స్‌తో సెన్సార్ బోర్డ్ పచ్చజెండా ఊపిన ఈ వివాదాస్పద చిత్ర ప్రదర్శనను ఆపడానికి కానీ, కనీసం ‘కల్పిత పాత్రలతో అల్లుకున్న కథ’ అని టైటిల్స్‌లో వేయడానికి కానీ గడచిన మూడు రోజుల్లో 3 సార్లు సుప్రీమ్ ససేమిరా అనడంతో, బంతి ఇప్పుడు థియేటర్లలోని ప్రజాకోర్టులో పడింది. ‘సంఘ్ పరి వార్ వారి అసత్యాల కర్మాగారంలో తాజా ఉత్పత్తి’ అంటూ కేరళ సీఎం ఈ చిత్రాన్ని గర్హించారు. కేరళలో జెండా పాతాలని ప్రయత్నిస్తున్న బీజేపీ మినహా ప్రతిపక్షాలూ ఆ మాటే అంటున్నాయి. బహిష్కరణ పిలుపుతో సహా కేరళ సర్కార్ వివిధ మార్గాలు అన్వేషిస్తున్న నేపథ్యంలో కల్పనను నిజమని నమ్మించే ప్రమాదభరిత సృజనాత్మక స్వేచ్ఛ విపరిణామాలపై కచ్చితంగా చర్చ అవసరం. ఏప్రిల్ ద్వితీయార్ధంలో ట్రైలర్ వచ్చినప్పటి నుంచి ‘కేరళ స్టోరీ’ వివాదాలకు కేంద్రబిందువైంది. తీవ్రవాద ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) ప్రభావం పతాకస్థాయిలో ఉన్నవేళ కేరళ నుంచి ‘దాదాపు 32 వేల మంది స్త్రీలు’ కనిపించకుండాపోయారనీ, వారి తెర వెనుక కథల్ని ‘బహిర్గతం’ చేసే యత్నమే మత మార్పిడి అంశం ఇతివృత్తమైన ఈ చిత్రమనీ దర్శక, నిర్మాతల మాట. ‘లవ్ జిహాద్’లో భాగంగా 32 వేల మందినీ ముస్లిమ్‌లుగా మార్చి, అత్యధికులను ఐఎస్ పాలనలోని సిరియాకు తీసుకువెళ్ళారనేది ఈ చిత్ర వాదన. సాక్ష్యాధారాలు లేని ఈ కాకుల లెక్కతో కేరళను తీవ్రవాదానికి పట్టుగొమ్మ అన్నట్టు చిత్రించడంపై సహజంగానే అభ్యంతరాలు వెల్లువెత్తాయి. ఇది ముస్లిమ్‌లపట్ల ద్వేషం పెంచే దుర్మార్గ ప్రయత్నమనే వాదన బలపడింది. ‘లవ్ జిహాద్’ లేదని నాటి కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రే పార్లమెంట్లో చెప్పినప్పుడు కేరళపై బురద చల్లేలా ఇలాంటి సినిమా ఎలా తీస్తారన్నది ప్రశ్న. కేరళలో హిందువుల జనాభా దాదాపు 55 శాతమైతే, ఆ తర్వాత అత్యధికంగా ముస్లిమ్‌లు 26 శాతం పైగా, క్రైస్తవులు 18 శాతం ఉన్నట్టు లెక్క. దశాబ్దాల క్రితమే సంపూర్ణ అక్షరాస్యత సాధించి, నిత్యం చైతన్యం నిండిన ఆలోచనాపరుల సమాజంగా దేశంలో మలయాళ సీమది ప్రత్యేక స్థానం. సాహిత్యం, సంస్కృతి, కళలు, సినిమాలు సహా అనేక రంగాల్లో దిక్సూచిగా నిలిచిన ఘనత దానిది. మానవాభివృద్ధి సూచిలో ముందుంది. అలాంటి రాష్ట్రాన్ని పచ్చి తీవ్రవాదానికి పట్టుగొమ్మ అన్నట్టు చిత్రించడం కించపరచడమే. విమర్శలు పెరిగి, వివాదం ముదిరేసరికి సినీరూపకర్తలు సైతం సర్దు కోవాల్సి వచ్చింది. కేరళలోని ‘32 వేల మంది మహిళల కథల ఆధారంగా తీశా’మంటూ మొదట ట్రైలర్లో తొడకొట్టినవాళ్ళు చివరకు మే మొదట్లో దాన్ని ముగ్గురంటే ‘ముగ్గురు యువతులు’గా మార్చేశారు. కడుపులో ఏదో పెట్టుకొని కథ రాసుకున్నప్పటికీ కోట్లు పెట్టి సినిమా తీసినవారికి మూడుకూ, 32 వేలకూ తేడా తెలీదా? ఒకటీ అరా ఘటనలు జరిగాయేమో తెలీదు కానీ దాన్ని పట్టుకొని కేరళలోని ప్రబలమైన ధోరణి అన్నట్టు చిత్రించాలనుకోవడం ఏ రకంగా సమర్థనీయం? మొత్తం కేరళ కథ అన్నట్టు సినిమాకు పేరు పెట్టి, బురద జల్లడం ఎవరిచ్చిన సృజనాత్మక స్వేచ్ఛ? భావప్రకటన స్వేచ్ఛను కాపాడాల్సిందే. సృజనాత్మక స్వాతంత్య్రం కావాల్సిందే! కానీ ట్రైలర్‌ను బట్టి చూస్తే... వాస్తవాలను చూపుతున్నామనే పేరుతో, నిజాలను వక్రీకరించి సంచలనాత్మకం చేయడం ‘కేరళ స్టోరీ’లోని అతి పెద్ద ఇబ్బంది. ఇలా లెక్కలతో సహా అన్నిటినీ అతి చేస్తున్నప్పడు ఈ చిత్ర రూపకల్పన వెనుక ఉన్న ఉద్దేశాలపై, సాధించదలచిన లక్ష్యాలపై తప్పక అనుమానాలు తలెత్తుతాయి. పైగా, కేరళలో ముస్లిమ్, ముస్లిమేతరులుగా ప్రజలను రెండు ప్రత్యర్థి వర్గాలుగా ఏకీకృతం చేసే ప్రయత్నాలు పెరుగుతున్న సమయంలో సినిమా రావడం సందేహాల్ని పెంచుతోంది. ఆ మధ్య ‘పద్మావత్’ నుంచి ఇటీవలి ‘పఠాన్’ దాకా సినిమాలపై నిషేధపు డిమాండ్లు, కోర్టు కేసులు చూశాం. అప్పుడైనా ఇప్పుడైనా నిషేధాలు పరిష్కారం కావు. కానీ సెంటిమెంట్లను దెబ్బతీసి, ఉద్రి క్తత సృష్టించి, విద్వేషాన్ని పెంచే ప్రయత్నాలను తప్పక అడ్డుకోవాల్సిందే. శాంతిభద్రతలకు భంగం వాటిల్లినప్పుడు భావప్రకటన స్వేచ్ఛపై నిర్బంధాలు తప్పవని ఆర్టికల్ 19 (2) అనుమతిస్తోంది. శాంతిభద్రతలేమో కానీ, మనోఫలకంపై నిలిచి ఆలోచనల్లోకి ఇంకిపోయే భావోద్వేగాల ప్రభావమే అర్ధసత్య చిత్రాలతో అతి ప్రమాదం. బ్రిటిష్ వారి వద్దే మన్యం వీరుడు అల్లూరి పోలీసుగా పని చేశాడని భావితరాలు నమ్మేలా సినిమా తీసి, ఆస్కార్ల దాకా వెళ్ళిన మన కథలే అందుకు సాక్ష్యం. ‘కేరళ స్టోరీ’కీ కనీసం కల్పితపాత్రల కథనమని పేర్కొనమంటూ పిటిషనర్లు కోరిందీ అందుకే. సెకనుకు 24 ఫ్రేమ్‌ల చొప్పున తెరపై చూపే సత్యం సినిమా అనే సూక్తికి ‘కేరళ స్టోరీ’ లాంటివి నిలబడతాయా అన్నది సందేహమే! సామాన్య ప్రజలు తాము తెరపై చూసేదంతా సత్యమని భ్రమ పడితే, సమాజంలో పెచ్చరిల్లే విద్వేషాగ్నికి బాధ్యులెవరు? ‘కశ్మీర్ ఫైల్స్’తో దేశం ఆ చివరన మొద లైన అర్ధసత్య, అసత్య ప్రచార చిత్రాలు ఇప్పుడు ‘కేరళ స్టోరీ’తో ఈ చివరన కన్యాకుమారికి విస్తరించడం దేనికి సంకేతం? భావప్రకటన స్వేచ్ఛ ఓకే కానీ, నిజాన్ని వక్రీకరించి చూపడంపై గళమెత్తా ల్సిందే! ఈ రొచ్చుకు అడ్డుకట్ట ఏమిటో కనిపెట్టాల్సిందే! రాజకీయ ప్రయోజనాల కోసం సినిమాను వాడుకొనేందుకు పెరుగుతున్న ప్రాపగాండా ప్రయత్నాలను గమనించాలి. గత తొమ్మిదేళ్ళలో ఎన్నికల ముందే ఇలాంటి చిత్రాలు ఎందుకు, ఎవరి ప్రాపుతో వస్తున్నాయో ఆలోచించాలి. -
‘ఖిల్జీని చూస్తే అజంఖాన్ గుర్తొచ్చాడు’
రాయ్‌పూర్: సమాజ్‌వాదీ పార్టీ నాయకుడు అజంఖాన్‌ను ఉద్దేశించి మాజీ ఎంపీ జయప్రద సంచలన వ్యాఖ్యలు చేశారు. పద్మావత్ సినిమాలో అల్లావుద్దీన్ ఖిల్జీ పాత్రను చూస్తే తనకు అజంఖానే గుర్తొచ్చాడని ఆమె వ్యాఖ్యానిం చారు. ‘‘అజంఖాన్‌ను నేను సోదరునిగా భావించాను. కానీ అతను నాపై ప్రతీకారం తీర్చుకునేందుకు అనేక విధాలుగా ప్రయత్నించాడు’ అని రాయ్‌పూర్‌లో వ్యాఖ్యానించారు. -
ఆ విధిని నెరవేర్చని ప్రభుత్వాలు ఎందుకు?
♦ ఆదిత్య హృదయం పద్మావత్ సినిమాను నిషేధించాలని బీజేపీ రాష్ట్రప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీంకోర్టు తిప్పికొట్టడంతో తాను శిక్షకు గురైనట్లు బీజేపీ భావిస్తుం డటం చూస్తుంటే నాకు ఆశ్చర్యం కలుగుతోంది. బీజేపీకి చెందిన 6 రాష్ట్ర ప్రభుత్వాలు ఈ సినిమాపై సంపూర్ణ నిషేధాన్ని ప్రకటించాయి లేక ప్రతిపాదిం చాయి. ఇది రాజ్యాంగ విరుద్ధమని భావించిన సుప్రీంకోర్టు సిని మాను ఆయా రాష్ట్రాల్లో ప్రదర్శించాల్సిందిగా ఆదేశించింది. మరే రాష్ట్ర ప్రభుత్వమూ ఈ సినిమాపై నిషేధం విధించకూడదని కూడా ఆదేశించింది. ఇది కచ్చితంగా బీజేపీకి ఘోర పరాభవమే కాకుండా దాని రాజకీయ సంకట స్థితిని కూడా సూచిస్తుంది. పద్మావత్ సినిమాను ప్రదర్శనకు అనుమతిస్తే శాంతిభద్రతలకు భంగం కలుగుతుందని, తాము నియంత్రించలేమని బీజేపీ ప్రభుత్వాలు తొలి నుంచీ వాదిస్తూ వచ్చాయి. సినిమాను విడుదల చేస్తే కలిగే విపత్తును, హింసాత్మక స్థితిని ఎదుర్కొనడం కంటే నిషేధిస్తే సరిపోతుందని అవి భావించాయి. కానీ ఈ వాదన ఆమోదనీయం కాదు. ఎందుకంటే శాంతిభద్రతలను కాపాడటం ప్రభుత్వాల వాస్తవ బాధ్యతే కాకుండా వాటి ప్రాథమిక కర్తవ్యం కూడా. కాబట్టి ఇలాంటి వాదన ప్రభుత్వాల మెడకే చుట్టుకుంటుంది. రాజ్యాంగం ప్రకారం, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ అత్యున్నతమైన విలువ. శాంతిభద్రతలకు భంగం కలిగించేవారికి వ్యతిరేకంగా పౌరులను కాపాడవలసిన ప్రభుత్వ బాధ్యతను ఇది నిర్దేశిస్తుంది. పౌరుల భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను ఎత్తిపట్టి, కాపాడడంలో తమ అసమర్థతను చాటిచెబుతూ, బీజేపీ ప్రభుత్వాలు తమ ప్రాథమిక విధినే తిరస్కరిస్తున్నాయి. వాస్తవానికి, తాము నిర్వర్తించాల్సిన విధిని నెరవేర్చలేకపోతే, ప్రభుత్వాలు రాజీనామా చేయాలి. సిని మాను ప్రదర్శించాలని, ప్రేక్షకులకు రక్షణ కల్పించాలని తాను ఆదేశిస్తున్నప్పుడు అలా చేయకుంటే రద్దు చేస్తానని న్యాయస్థానం బెదిరించకపోవచ్చు కానీ, ప్రభుత్వాలు తమ రాజ్యాంగ విధిని ఉల్లంఘిస్తున్నాయని మాత్రం గుర్తు చేయవచ్చు. హింసకు దారితీసే ఘటన.. దాని నిషేధానికి కారణం కాకూడదన్న అంశాన్ని బీజేపీ ప్రభుత్వాలు విస్మరిస్తున్నాయి. అయినా.. ఇతరులను చీకాకు పెట్టే, ఇబ్బందిపెట్టే హక్కు లేకుంటే భావ వ్యక్తీకరణ స్వేచ్ఛకు ఇక అర్థం ఏమిటి? వాస్తవానికి హింసాప్రవృత్తిని అలవాటుగా చేసుకున్న వారు సాగించే దుర్మార్గ చర్యలకు, హింసకు వ్యతిరేకంగా వాక్ స్వేచ్ఛను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాలపైనే ఉంది. ప్రజాస్వామిక విలువలను ఎత్తిపట్టడానికే తప్ప, ఆ విలువలకు తిలోదకాలు ఇవ్వడానికి ప్రభుత్వాలను ఎన్నుకోరు కదా. విషాదకరంగా, పద్మావత్ సినిమాను ప్రదర్శించే స్థితి ఇప్పటికీ ఉన్నట్లు కనిపించడం లేదు. కర్ణి సేన ఇప్పటికీ చిత్ర పంపిణీదారులను, ప్రేక్షకులను బెదరగొట్టే పనులకు సిద్ధమవుతోంది. తెగించి సినిమాను ప్రదర్శిస్తే తమ థియేటర్లకు ఏం జరుగుతుందో అనే భయంతో చాలామంది పంపిణీదారులు పద్మావత్ సినిమాను ప్రదర్శించకూడదని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అలాగే చాలామంది ప్రేక్షకులు కూడా సినిమాకు దూరం కావచ్చు. నిజానికి, బీజేపీ తన రాజకీయనేతల పిరికితనం లేక మద్దతు ద్వారా కర్ణిసేన రాజ్యాంగ విరుద్ధమైన డిమాండ్లకు అనుకూలంగా వ్యవహరిస్తోంది. ఈ వివాదం మొదట్లోనే దృఢంగా స్పందించి ఉంటే కర్ణిసేన చర్యలకు అడ్డుకట్ట వేసి ఉండవచ్చు. కానీ అలా జరిగి ఉండలేదు. ఇప్పుడు, తీవ్ర అసమ్మతి లేక నిరసన నేప థ్యంలో శాంతిభద్రతలను అమలు చేయడం భారత్‌లో అంత సులువైన విషయం కాదని నేను ఒప్పుకుంటాను. అదే సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు మన స్వేచ్ఛా స్వాతంత్య్రాలకు చాలా అరుదుగా విలువ ఇచ్చాయనే అభిప్రాయంతో కూడా నేను ఏకీభవిస్తాను. భారత్ గడ్డమీదికి చేరకముందే సల్మాన్ రష్దీ పుస్తకం ‘శాటనిక్ వెర్సెస్’ని నిషేధించాలని మన శ్రీమాన్ రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్నసమయంలో నిర్ణయించారు కదా మరి. అలాగే, పద్మావత్– పై పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ మొదట్లో ప్రదర్శించిన సందిగ్ధత కూడా బీజేపీ విచారకరమైన వైఖరికి ప్రతిరూపంగానే ఉండిందంటే సందేహమే లేదు. కాని ఇదంతా అతి పెద్ద సమస్యను ఎత్తి చూపుతుంది. మన రాజకీయనేతలు వారు ఎదుర్కొనే సవాళ్లకు ఎక్కువగా భయపడతారు కానీ వారిని ఎన్నుకున్న ప్రజల హక్కులు, స్వేచ్ఛలను పరిరక్షించడానికి బాధ్యత వహించరు. కాబట్టి, సుప్రీంకోర్టుకు అభినందనలు. దాని లోపాలు, అసంపూర్ణతలు, వైరుధ్యాలను పక్కనబెట్టి, ఈ ఉదంతంలో అది ప్రజాస్వామ్యంలో అత్యంత ప్రాథమిక హక్కు అయిన వాక్ స్వేచ్ఛకు తన మద్దతును తెలియజేసింది. అయితే సుప్రీంకోర్టు ఆదేశానికి రాజ స్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోని బీజేపీ ప్రభుత్వాల తక్షణ స్పందన ఏమంత ఆశాజనకంగా లేదు. సుప్రీం ఆదేశంపై సమీక్ష కోరతానని రాజస్థాన్ ప్రభుత్వం చెప్పగా, మధ్యప్రదేశ్ ప్రభుత్వం సుప్రీం కోర్టునే నిలదీసింది. హద్దుల్లేని ఈ తిరస్కారానికి సుప్రీంకోర్టు చరమగీతం పాడాల్సిన అవసరం ఉంది. ఉన్నత న్యాయస్థానం అతి త్వరలోనే దీనికి సిద్ధపడుతుందని నా విశ్వాసం. కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు, ఈ–మెయిల్ : karanthapar@itvindia.net -
అందుకే నచ్చావ్..
సాక్షి,పాట్నా: బీజేపీ అగ్రనాయకత్వంపై ధిక్కార స్వరం వినిపించే ఎంపీ, నటుడు శత్రుజ్ఞ సిన్హా వివాదాస్పద చిత్రం పద్మావతి విషయంలో మాత్రం పార్టీ వైఖరినే అనుసరించారు. పద్మావతి మూవీని వ్యతిరేకించడంతో రాజ్పుట్ కర్ణిసేన ఆయనను ఘనంగా సన్మానించింది. దీపికా పదుకోన్, షాహిద్ కపూర్, రణ్‌వీర్‌సింగ్‌లు నటించిన వివాదాస్పద చారిత్రక చిత్రం పద్మావతిని వ్యతిరేకించిన శత్రుజ్ఞ సిన్హాకు రాజ్పుట్ కర్ణిసేన బీహార్ శాఖ రాణి పద్మిని చిత్రపటం బహుకరించి సముచితంగా సత్కరించింది. ఓవైపు పద్మావతి వివాదంపై బాలీవుడ్ అంతా దర్శకుడు భన్సాలీ వైపు నిలవగా, చిత్రపరిశ్రమకు చెందిన సిన్హా భిన్నమైన వైఖరి తీసుకుని చరిత్రను వక్రీకరించారనే ఆరోపణలపై పద్మావతిని వ్యతిరేకించారు. ఇప్పటికే రాజస్ధాన్, యూపీ, గుజరాత్ సహా పలు బీజేపీ పాలిత రాష్ట్రాలు ఈ చిత్రంపై నిషేధం విధించిన సంగతి తెలిసిందే.మరోవైపు సినిమాలో మార్పులు చేసినా తాము పద్మావతి విడుదలకు అంగీకరించబోమని రాజ్పుట్ సంఘాలు హెచ్చరించాయి. -
సంక్రాంతి బరిలో పద్మావతి
సాక్షి,ముంబయి: వివాదాలు చుట్టుముట్టి వాయిదా పడిన సంజయ్ లీలా భన్సాలి చారిత్రక దృశ్యకావ్యం పద్మావతి విడుదలపై త్వరలో స్పష్టత రానుంది. దీపికా పదుకోన్, రణ్‌వీర్‌సింగ్, షాహిద్ కపూర్లు నటించిన పద్మావతి డిసెంబర్ 1న విడుదల కావాల్సి ఉండగా నిరసనకారుల ఆందోళనలు, పలు రాష్ట్ర ప్రభుత్వాలు మూవీపై నిషేధం విధించడంతో సినిమా రిలీజ్‌ను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్టు నిర్మాతలు ప్రకటించారు. అయితే జనవరి మొదటి వారం లేదా రెండోవారంలో పద్మావతి విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు. గుజరాత్ ఎన్నికలు ముగిసిన వెంటనే విడుదల తేదీని ప్రకటించాలని నిర్మాతలు భావిస్తున్నట్టు సమాచారం.ఈలోగా సీబీఎఫ్సీ స్పందన వెల్లడయ్యే అవకాశం ఉంది. ఎన్నికలు పూర్తయి, సీబీఎఫ్సీ సర్టిఫికేషన్ రాగానే ప్రపంచవ్యాప్తంగా పద్మావతిని అత్యధిక స్క్రీన్లలో విడుదల చేసేందుకు నిర్మాతలు ప్రయత్నిస్తున్నట్టు సమాచారం.జనవరి మొదటి, రెండవ వారంలో భారీ సినిమాలు లేకపోవడంతో ఆ వ్యవధిలో పద్మావతిని థియేటర్లలోకి దింపేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నట్టు తెలిసింది. -
దీపికకు మద్దతుపై క్వీన్ నో
సాక్షి,ముంబయి: పద్మావతి మూవీ విషయంలో దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ, దీపికా పదుకోన్‌కు బాలీవుడ్ నటులు బాసటగా నిలిస్తే దీపికకు మద్దతిచ్చేందుకు వివాదాస్పద నటి కంగనా రనౌత్ ముందుకు రాకపోవడం బాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారింది. పద్మావతి చిత్రం చరిత్రను వక్రీకరిస్తూ రూపొందిందని రాజ్పుట్లు, హిందూ సంస్ధలు చిత్ర మేకర్లు, నటీనటులపై కత్తులు దూస్తున్న క్రమంలో బాలీవుడ్ నటులు చిత్ర బృందానికి మద్దతుగా నిలిచారు. పద్మావతి పాత్ర పోషించిన దీపికా పదుకోన్‌ను హతమారుస్తామని నిరసనకారులు హెచ్చరించిన క్రమంలో దీపికకు భద్రత కల్పించాలని కోరుతూ బాలీవుడ్ ప్రముఖుల సంతకాలతో కూడిన పిటిషన్‌ను ప్రధానికి సమర్పించేందుకు షబనా అజ్మీ చొరవ తీసుకున్నారు. ఈ పిటిషన్‌పై బాలీవుడ్ నటులు సంతకాలు చేస్తుండగా, ప్రముఖ నటి కంగనా రనౌత్ మాత్రం పిటిషన్‌పై సంతకానికి నో చెప్పినట్టు సమాచారం.దీపికకు భద్రత కల్పించాలని కోరుతూ రూపొందిన పిటిషన్‌పై సంతకం చేసేందుకు కంగనా నిరాకరించడబంతో షబనా అజ్మి విస్తుపోయారని దిక్వింట్ వెబ్సైట్ వెల్లడించింది. కంగనా, దీపిక మధ్య సంబంధాలు అంతంతమాత్రంగా ఉన్న క్రమంలో తాజా ఉదంతంతో వీరిద్దరి మధ్య దూరం మరింత పెరిగిందని చెబుతున్నారు. హ్యాపీన్యూఇయర్ మూవీకి తాను గెలుచుకున్న అవార్డును క్వీన్‌లో కంగనా పెర్ఫార్మెన్స్కు ముగ్దురాలై ఆమెకు అంకితం చేస్తున్నట్టు దీపిక ప్రకటించడం కంగనా ఆగ్రహానికి కారణమైంది. క్వీన్‌లో తన పెర్ఫామెన్స్‌పై తనను నేరుగా ప్రశంసించకుండా ఈ రకంగా బహిరంగంగా దీపిక ప్రకటించడం పట్ల కంగనా అసంతృప్తితో ఉంది.మరోవైపు హృతిక్‌తో తాను న్యాయపోరాటం చేస్తుంటే బాలీవుడ్ సెలబ్రిటీలంతా హృతిక్ వైపు ఉండటం పట్ల కూడా కంగనా ఆగ్రహంతో ఉన్నారు. -
భన్సాలీపై ప్రశ్నల వర్షం
న్యూఢిల్లీ: ‘పద్మావతి’ సినిమా వివాదంపై వివరణ ఇచ్చేందుకు ఆ చిత్ర దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ.. సమాచార సాంకేతిక శాఖ పార్లమెంటరీ స్థాయీ సంఘం ముందు హాజరయ్యారు. ఈ సందర్భంగా భన్సాలీపై కమిటీ ప్రశ్నల వర్షం కురిపిం చింది. ‘సీబీఎఫ్సీ (సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్)కి నవంబర్ 11న దరఖాస్తు చేసుకుని.. డిసెంబర్ 1న సినిమా విడుదల చేస్తామని ఎలా అనుకుంటారు. సినిమా టోగ్రఫీ చట్టం ప్రకారం.. ఓ చిత్రానికి సర్టిఫికెట్ ఇచ్చేందుకు సీబీఎఫ్సీ 68 రోజుల సమయం తీసుకుంటుందని తెలియదా? ఎంపిక చేసిన కొన్ని మీడియాలకే సినిమా చూపించడం న్యాయమా?’ అంటూ ప్రశ్నించింది. మరోవైపు పార్లమెంటరీ కమిటీ ముందు సీబీఎఫ్సీ చీఫ్ ప్రసూన్ జోషి కూడా హాజరయ్యారు. నిపుణులను సంప్రదించిన తర్వాతే సినిమా సర్టిఫికెట్‌పై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. -
‘పద్మావతి’పై పిచ్చి మాటలొద్దు!
న్యూఢిల్లీ: ‘ఉన్నతస్థాయి పదవుల్లో ఉన్న వ్యక్తులు పద్మావతి చిత్రానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయడాన్ని మానుకోవాలి. ఇలాంటి వ్యాఖ్యలు రూల్ ఆఫ్ లా (సమ న్యాయపాలన)ను అతిక్రమించినట్లే. ఆ వ్యాఖ్యలు సెన్సార్ బోర్డు నిర్ణయంపైనా ప్రతికూల ప్రభావం చూపే వీలుంది’ అని సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. దీపికా పదుకోన్ ముఖ్యపాత్రలో నటించిన పద్మావతి చిత్రాన్ని ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు నిషేధించాయి. చిత్రానికి వ్యతిరేకంగా సీఎంలు, రాజకీయ నేతలు బహిరంగ ప్రకటనలు చేస్తున్నారు. దీనిపై ధర్మాసనం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇలాంటి వ్యాఖ్యలతో రూల్ ఆఫ్ లా నియమాలను అతిక్రమించినట్లేనని, ఈ విషయాన్ని సదరు వ్యక్తులకు తెలియజేయాలని అదనపు సొలిసిటర్స్ జనరల్ మనిందర్, పీఎస్ నరసింహాలను ఆదేశించింది. ‘సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (సీబీఎఫ్‌ఎసీ) ముందు సినిమా పెండింగ్‌లో ఉంది. ఈసమయంలో సీబీఎఫ్‌ఎసీ తన సర్టిఫికెట్ ఇవ్వాలో, వద్దో ప్రజాక్షేత్రంలో ఉన్నతస్థాయి పదవుల్లో ఉన్న వారు ఎలా చెబుతారు. ఇది సీబీఎఫ్సీ నిర్ణయంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది.’ అని సీజేఐ జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని బెంచ్ వ్యాఖ్యానించింది. విదేశాల్లో పద్మావతి సినిమాను విడుదల చేయకుండా చిత్ర నిర్మాతలను ఆదేశించాలని కోరుతూ దాఖలైన తాజా పిటిషన్‌ను న్యాయమూర్తులు జస్టిస్ ఖన్విల్కర్, జస్టిస్ చంద్రచూడ్‌ల ధర్మాసనం కొట్టివేసింది. సీబీఎఫ్సీ నిష్పాక్షిక నిర్ణయం తీసుకోవాలి ‘సీబీఎఫ్సీ తమ చట్టపరమైన బాధ్యతను నిర్వర్తిస్తుందనే ఉద్దేశంతో కోర్టులు బోర్డుపై ఎలాంటి పర్యవేక్షణ ఉంచవు. అలాగే ఉన్నత పదవుల్లో ఉన్న వ్యక్తులు కూడా వ్యాఖ్యలు చేయడం మానుకోవాలి’ అని స్పష్టం చేసింది. సర్టిఫికెట్ ఇవ్వడంపై సీబీఎఫ్సీ అత్యంత నిష్పాక్షికంగా నిర్ణయం తీసుకోవాలని సూచించింది. అపఖ్యాతిపాలు చేసేందుకు ప్రయత్నించడం, సినిమాటోగ్రఫీ చట్ట ఉల్లంఘన తదితర నేరాలపై దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ, ఇతర వ్యక్తులపై కేసు నమోదు చేసేలా సీబీఐని ధర్మాసనం ఆదేశించాలని న్యాయవాది ఎంఎల్ శర్మ తన పిటిషన్లో పేర్కొన్నారు. ఈ పిటిషన్లో పేర్కొన్న అంశాలపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ధర్మాసనం.. అందులో అభ్యంతరకర విషయాలు ఉన్నాయని, వాటిని తొలగించాలని ఆదేశించింది. కోర్టులో శర్మ న్యాయవాదిగా ప్రాక్టీసు చేస్తున్న విషయాన్ని పరిగణనలోకి తీసుకుని ఆయనపై ఎలాంటి జరిమానా విధించడం లేదని చెప్పింది. సినిమాను డిసెంబర్ 1న విడుదల చేసే ఉద్దేశం తమకు లేదని చిత్ర నిర్మాతల తరఫున హాజరైన సీనియర్ న్యాయవాదులు హరీశ్ సాల్వే, శ్యామ్ దివాన్ కోర్టుకు తెలిపారు. స్పష్టత కావాలి: నితీశ్ వివాదం ముగిసే వరకు ‘పద్మావతి’ విడుదలకు అనుమతించబోమని బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ స్పష్టం చేశారు. చిత్ర నిర్మాత, దర్శకుడు, సినిమాతో సంబంధం ఉన్న వారంతా స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. అయితే ఆయన ఏ విషయంలో స్పష్టత కోరుతున్నారో తెలపలేదు. ‘భన్సాలీకి పిలుపు’ పద్మావతి సినిమాపై నెలకొన్న వివా దంపై వివరణ ఇచ్చేందుకు పార్లమెంటరీ కమిటీ ముందు హాజరు కావాల్సిం దిగా చిత్ర దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ, సెన్సార్ బోర్డు చీఫ్ ప్రసూన్ జోషీని కోరినట్లు కమిటీ చైర్మన్ అనురాగ్ ఠాకూర్ తెలి పారు. అలాగే చిత్ర నిర్మాతలు, సమా చార, ప్రసార శాఖ అధికారులకు కూడా కమిటీ సమాచారమిచ్చింది. కమిటీ సమావేశం గురువారం జరుగనుంది. -
బెదిరించడం తగదు
న్యూఢిల్లీ: కళాకారులను హింసాత్మక రీతిలో బెదిరించడం, వారిపై భౌతిక దాడులు చేసిన వారికి నగదు బహుమతులిస్తామని ప్రకటించడం ప్రజాస్వామ్య దేశంలో ఆమోదనీయం కాదని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. శనివారం ఢిల్లీలో జరిగిన ఓ సాహిత్య వేడుకలో ఆయన మాట్లాడుతూ ‘సినిమాలపై నిరసన తెలపడంలో భాగంగా కొందరు వ్యక్తులు కళాకారులపై భౌతిక హింసకు పాల్పడిన వారికి రూ.కోటి బహుమతిగా ఇస్తామని ప్రకటిస్తున్నారు. ముందు అలాంటి వాళ్ల దగ్గర అసలు కోటి రూపాయలు ఉంటుందో లేదోనని నాకు అనుమానం? నిరసన తెలపాలంటే సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయొచ్చు. అంతేకానీ ఇలాంటి బెదిరింపులకు పాల్పడటం ప్రజాస్వామ్యంలో తగదు’ అని అన్నారు. ప్రత్యేకించి ఏ సినిమా గురించి వెంకయ్య ప్రస్తావించకపోయినప్పటికీ, సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వం వహించిన పద్మావతి చిత్రంపై ప్రస్తుతం పెద్ద ఎత్తున వివాదం నడుస్తున్న నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఎన్నిరోజులు పనిచేసిందన్నదే ముఖ్యం.... పార్లమెంటు సమావేశాలకు ప్రభుత్వం చాలా తక్కువ సమయం కేటాయించిందంటూ ప్రతిపక్ష కాంగ్రెస్ విమర్శిస్తున్న సందర్భంలో వెంకయ్య మాట్లాడుతూ ‘పార్లమెంటు సమావేశాలు ఎన్ని రోజులు జరిగాయన్నది ముఖ్యం కాదు. ఎన్ని రోజులు సభ పనిచేసిందన్నది ప్రధానం’ అని అన్నారు. సాహిత్యం సమాజానికి వెన్నెముకనీ, కాళిదాసు కాలం నుంచి నేటి వరకు ఎందరో కవులు, రచయితలు, మేధావులు భారతీయ సంప్రదాయాల్ని తమ రచనల్లో ప్రతిబింబించారని ఆయన పేర్కొన్నారు. -
మరో వివాదంలో పద్మావతి
జైపూర్: పద్మావతి వివాదం మరో మలుపు తీసుకుంది. శుక్రవారం జైపూర్‌లోని ఒక కోటకు వేలాడుతూ కనిపించిన వ్యక్తి మృతదేహం పద్మావతి సినిమాపై తాజా వివాదానికి కేంద్ర బిందువుగా మారింది. నహర్‌గఢ్ కోట ప్రహారీ గోడకు వేలాడుతున్న చేతన్ కుమార్ సైనీ(40) మృతదేహం పక్కన పద్మావతి సినిమా వ్యతిరేకించే వారిని హెచ్చరిస్తూ కొన్ని రాతలు దర్శనమిచ్చాయి. తమను బెదిరించడానికే ఆ రాతలు రాశారని రాజ్‌పుత్ కర్ణిసేన ఆరోపించగా, పద్మావతి సినిమాతో సైనీ మరణానికి ఎలాంటి సంబంధం లేదని మృతుడి సోదరుడు చెప్పడం గమనార్హం. సైనీది హత్యా? లేక ఆత్మహత్యా?.. పద్మావతి సినిమాతో ఈ మరణానికి ఏమైనా సంబంధముందా? అన్న అంశాలపై మాత్రం సందిగ్ధం వీడలేదు. ఈ సంఘటనపై జైపూర్ నార్త్ డీసీపీ సత్యేంద్ర సింగ్ సందిస్తూ.. ‘చేతన్ కుమార్ జైపూర్‌లోని శాస్త్రీ నగర్‌కు చెందిన చేనేత కార్మికుడు. కోట సరిహద్దు గోడకు అతని మృతదేహం వేలాడుతోండగా గుర్తించాం. పక్కన రాళ్లపై కొన్ని రాతలు కనిపించాయి. ఈ సంఘటనకు పద్మావతి ఆందోళనలకు మధ్య సంబంధంపై ఇప్పుడే అంచనాకు రావడం సరికాదు’ అని చెప్పారు. మృతదేహాన్ని పోస్టుమార్టంకు పంపామని, తదుపరి విచారణ కొనసాగిస్తున్నామని ఆయన తెలిపారు. మృతదేహం సమీపంలోని రాళ్లపై ‘ మేం కేవలం దిష్టిబొమ్మల్ని మాత్రమే వేలాడదీయమని పద్మావతి వ్యతిరేకులు తెలుసుకోవాలి. మేం బలవంతులం’ అని రాసి ఉంది. అయితే సైనీ మృతికి, పద్మావతి సినిమాకు ఎలాంటి సంబంధం లేదని మృతుడి సోదరుడు రామ్ రతన్ సైనీ పేర్కొన్నారు. ఇది ఆత్మహత్య కాదని, ఈ మరణంపై ఉన్నత స్థాయి విచారణ నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. కాగా రాజ్‌పుత్ కర్ణి సేన దీనిపై స్పందిస్తూ... నిరసన తెలిపే విధానం ఇది కాదని, తమను రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని పేర్కొంది. ఆ సంస్థ అధ్యక్షుడు మహిపాల్‌సింగ్ మాట్లాడుతూ ‘మా సంస్థను బెదిరించేందుకే రాళ్లపై ఆ రాతలు రాశారు’ అని చెప్పారు. పద్మావతిపై పిటిషన్‌ను తోసిపుచ్చిన ఢిల్లీ హైకోర్టు పద్మావతి సినిమాపై పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు తోసిపుచ్చింది. పద్మావతిలో చరిత్రను వక్రీకరించారా? లేదా? అన్న విషయాన్ని నిర్ధారించేందుకు సినిమా విడుదలకు ముందు ఒక కమిటీని ఏర్పాటు చేయాలని పిటిషనర్ కోర్టును కోరారు. ‘మీరు సినిమా చూశారా.. సినిమా హాళ్లను తగులబెడుతున్నవారు సినిమా చూశారా? ఆందోళన చేస్తున్నవారిని మరింత ప్రోత్సహించేలా ఈ పిటిషన్లు ఉంటున్నాయి’ అని తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గీతా మిట్టల్, జస్టిస్ సి.హరిశంకర్ల నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. -
బ్రిటన్‌లోనూ నిరసన సెగ
లండన్: వివాదాస్పద చారిత్రక మూవీ పద్మావతికి బ్రిటన్‌లోనూ నిరసన సెగలు తాకాయి. పద్మావతికి ఎలాంటి కట్స్ లేకుండా బ్రిటిష్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్(బీబీఎఫ్‌సీ) క్లియరెన్స్ లభించినా అక్కడ సినిమాను బహిష్కరిస్తున్నట్టు రాజ్పుట్ సమాజ్ పిలుపు ఇచ్చింది. బ్రిటన్‌లోనూ పద్మావతి విడుదలను నిలిపివేసేలా సినిమా సర్టిపికేషన్ను పునసమీక్షించాలని రాజ్పుట్ సమాజ్ బ్రిటిష్ బోర్డుకు లేఖ రాసినట్టు సమాచారం. పద్మావతి సినిమా భారతీయ చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలను వక్రీకరిస్తూ తెరకెక్కడంతో భారత్‌లోని పలు రాష్ట్రాలు సినిమాను బహిష్కరించాయని, దిక్కుతోచని నిర్మాతలు బ్రిటన్‌లో విడుదలకు సన్నాహాలు చేస్తున్నారని రాజ్పుట్ సమాజ్(యూకే) అధ్యక్షుడు మహేంద్రసింగ్ జడేజా వ్యాఖ్యానించారు. మరోవైపు రాజ్పుట్ సమాజ్ విజ్ఞప్తిపై బీబీఎఫ్‌సీ ఇప్పటివరకూ స్పందించలేదు. -
మనుషులుగా మిగులుతామా?
ఇప్పుడు వీధి సెన్సార్షిప్దే రాజ్యం. ఎవరు పద్మావతి సినిమా చూసినా, ఈ రౌడీలు వారిని తంతారట. పైగా దర్శకుడి తల తీస్తామని నిర్భీతిగా ప్రసార మాధ్యమాల్లో ప్రకటిస్తుంటే ఆ తాలిబన్లను అదుపు చేసే చట్ట వ్యవస్థే లేకుండా పోయింది. చట్టాల్ని అతిక్రమిస్తూ వీధిగూండాలు చెలరేగిపోతుంటే ప్రభుత్వాలు మిన్నకుండిపోవడం.. అగ్నిలో ఆజ్యం పోయడం.. ఇవాళ ఇదొక నిత్యకృత్యమైపోయింది. అసలు ఉందో లేదో తెలియని ఓ రాణి. ఆమె ప్రేమ గాథను 16వ శతాబ్దంలో రాశాడొక సూఫీ ఫకీరు మాలిక్ మహమ్మద్ జయసి. సదరు కథలోని విలన్ ఖిల్జీ పాలన ముగిసిన 250 ఏళ్ల తర్వాత రాసిన కథ ఇది. రాజారతన్ సేన్‌ని కానీ, పద్మావతిని కానీ మేవాడ్ రాజు కులం జాబి తాలో చేర్చింది 19వ శతాబ్దంలో. తెల్లవారికి వ్యతిరేకంగా హిందూ రాజ్యభావనను రెచ్చగొట్టడానికి ఈ గాథను మళ్లీ ప్రాచుర్యంలోకి తెచ్చారు. రాజపుత్ర స్త్రీల పవిత్రశీలం, పాతి వ్రత్యం, పురుషుడి ఆస్తిగా సతీసహగమనం అతి గొప్పగా కీర్తించడం ప్రారంభించారు. చారిత్రక వ్యక్తి కూడా కాని ఓ రాణి పవిత్రతను కాపాడటానికి దేశాన్ని తగలబెడతామని రాజపుత్రులు వీరావేశంతో ఊగిపోతున్నారు. భర్త ఎదుటే సామూహిక మానభంగానికి గురై పాతికేళ్ల తర్వాత కూడా న్యాయానికి నోచని భన్వరీ దేవి గురించి ఎవరికీ క్రోధావేశం కలగడం లేదు. శీలం, పవిత్రత అగ్రవర్ణ స్త్రీలకే ఉంటాయి కామోసు. అదే అగ్రవర్ణ మగాళ్ల లైంగిక దాహాల్ని భరించడం పీడిత కులాల మహిళల నుదుటిరాత అని హైకోర్టు ఆవరణలోని మనువు విగ్రహం సాక్షిగా రాజస్తాన్ హైకోర్టు 20 ఏళ్ల క్రితమే ధృవీకరించింది. చరిత్రలో లేని రాణికి వెండితెరపై కూడా మచ్చపడనీయం అంటూ మంత్రులు, ఎంపీలు జబ్బలు చరుస్తున్నారు. రూప్కన్వర్కు మత్తుమందిచ్చి భర్త చితిలో వేసి కాల్చి చంపిన ప్రదేశం ఇపుడొక ‘సతి’ ఆలయం. ఇటువంటివే మరో 125 దాకా సతుల చితులు ఆలయాలై సదరు భర్త ఇంటివారికి భుక్తిని కలిగిస్తున్నాయి. ఈ క్రూరాచారాన్ని కొలుస్తూ, కీర్తిస్తూ స్త్రీ స్వేచ్ఛను అథఃపాతాళానికి తొక్కుతున్న రాష్ట్రంలో రాణి పద్మావతి ‘జోహార్’ (రాజపుత్రుడు చనిపోతే జనానా స్త్రీలు చితిపేర్చుకుని మంటల్లో దూకి కాలిపోవడం) క్రతువును సరిగా చూపలేదని ఈ గూండా గుంపుల ఆవేదన. స్త్రీశరీరాన్ని పురుషుడి ఆస్తిగా భావించి ఆమె అత్తింటి ఆస్తిలో వాటాకు రాకుండా ఆమెను సజీవంగా కాల్చి చంపే ఫ్యూడల్ దారుణాల్ని అద్భుతాలుగా కీర్తించడం ఆధునిక క్రూరత్వం. బానిసత్వాన్ని, కుల అణచివేతను, హింసను రక్తపాతాన్ని మనిషన్నవాడెవడైనా సరే అమానవీయంగానే దృశ్యీకరించాలి. అది ఒక చారిత్రక వాస్తవమైనా సమర్థించరాదు. ఈ పద్మావతి సినిమా ’సతి’ని గ్లోరిఫై చేస్తే దాన్నీ ఖండించాల్సిందే. అల్లావుద్దీన్ ఖిల్జీ సమర్థుడైన పాలకుడు. రాజ్యం కలవాడెవడైనా అందగత్తెల్ని మోహించడం కొత్త కాదు. (మొదటి భార్య నాగమతి ఉండగా రతన్‌సేన్ పద్మావతిని కాంక్షించాడట) కాని రాజ్యప్రయోజనం చూడకుండా ఖిల్జీ ఆమెకోసమే దండెత్తి పోయాడనటం అతిశయోక్తి. హిందూ కులీన స్త్రీలు అసమాన సౌందర్యవతులు కనుకనే ముస్లిం దురాక్రమణదారుల నుంచి రక్షించుకోవడానికి బాల్య వివాహాలు వచ్చాయన్నంత అబద్ధమిది. ముస్లింలను మొత్తం గానే క్రూరులుగా, దుర్మార్గులుగా చిత్రించడం హిందుత్వ ఎజెండా. బన్సాలీ సినిమాలో ఖిల్జీని పచ్చిమాంసం తినే బర్బరుడిగా చిత్రించారని అంటున్నారు. అలా చిత్రించి వుంటే దాన్ని ఖండించాల్సిందే. ఖిల్జీ ఒక చారిత్రక వ్యక్తి. పద్మావతి కాదు. ఆమె ఒక కల్పన. ఇంతకీ ఆ సినిమా ఎవరూ చూడలేదు. పద్మావతి ఒక సూఫీ ఫకీరు కల్పించిన ప్రేమ కావ్యం. ఏ ఆధారం లేకుండా దీన్ని చరిత్రగా ఎట్లా భావించాలి? నమ్మకాలు చరిత్ర కాదు కదా! ఆధారాలు లభించిన చరిత్రపైనే విశ్లేషణా రీతినిబట్టి ఒక్కొక్క చరిత్రకారుడికీ ఒక్కో అభిప్రాయం/నిర్ధారణలు ఉంటాయి. కాల్పనిక కావ్యపు రాణి రాజ కుటుంబపు ఆస్తి, గౌరవం ఎట్లా అవుతుంది? పైగా 300ల రామాయణాలు ఉన్నట్టుగానే తరతరాలుగా ఓ వంద రకాలైన పద్మావతి గాథలు ఉన్నాయి. బెంగాలీలో, మయన్మార్‌లో కూడా భిన్న గాథలున్నాయి. వాటన్నింటినీ జానపదులు పాడుతుంటారు. దీనిలో ఒక రకానికి ప్రామాణికత నిర్ధారించి అదే సరైందనే హక్కు రాజపుత్రులకు ఉందా? అనేక గాథల్లో పద్మావతి అసలు రాజరికపు స్త్రీ కూడా కాదు. దేశ అత్యున్నత న్యాయస్థానం కల్పించుకోము అని తేల్చి చెప్పింది. కానీ ప్రభుత్వానికి ఖాతరు లేదు. ఇపుడు వీధి సెన్సార్షిప్ రాజ్యం. ఎవరు పద్మావతి సినిమా చూసినా, ఈ రౌడీలు వారిని తంతారట. అంతేకాదు దర్శకుడి తల తీస్తామని నిర్భీతిగా జాతీయ ప్రసార మాధ్యమాల్లో వారు ఆటవికత ప్రకటిస్తుంటే ఆ తాలిబన్లను అదుపు చేసే చట్ట వ్యవస్థే లేకుండా పోయింది. కుటుంబాలు పసివాళ్లతో సహా అప్పులు తాళలేక సామూహికంగా మరణిస్తారు. నియంత్రణ లేని లాభాల్తో ఫ్యాక్టరీల్లో, బస్సుల్లో, పడవల్లో జనం పిట్టల్లా రాలిపోతుం టారు. జీఎస్టీ చర్యను పక్కదారి పట్టించడానికి ఊహాజనిత సమస్యతో కృత్రిమ ఆడంబర గౌరవాల భంగం నెపంతో దేశవ్యాపిత బంద్.. దేశాన్ని కిడ్నాప్ చేసి, బ్లాక్మెయిల్ చేసి బెదిరించడం... వీధి గూండాల చేతుల్లో రాజ్యాంగం... ఏమైతేనేం మనకెందుకు కానీయండి అనుకుంటూ చానల్స్‌లో నిత్యం చౌకబారు కామెడీలు చూసుకుంటూ, ఆన్లైన్ షాపింగ్‌లు చేసుకుంటూ పాజిటివ్‌గా ఆలోచిస్తూ బతికేద్దాం... దేశం ఏమైతేనేం... ఎక్కడికెళ్తేనేం.. కానీ మనం మిగులుతామా.. చివరికి? దేవి వ్యాసకర్త సాంస్కృతిక కార్యకర్త మొబైల్ : 98486 22829 -
పద్మావతిపై కాంగ్రెస్ సీఎంల్లో చీలిక
సాక్షి,న్యూఢిల్లీ: వివాదాస్పద పద్మావతి మూవీ ప్రకంపనలు రాజకీయ పార్టీల్లోనూ సెగలు రేపుతున్నాయి. ఈ చిత్రంపై కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల సీఎంల్లో చీలిక నెలకొంది. పద్మావతికి కాంగ్రెస్ పాలిత కర్ణాటక సీఎం సిద్ధరామయ్య బాసటగా నిలిస్తే అదే పార్టీకి చెందిన పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ వ్యతిరేకించారు. చరిత్రను వక్రీకరించే సినిమాలను అనుమతించబోమని స్పష్టం చేశారు. పటియాలా రాజకుటుంబానికి చెందిన అమరీందర్ సింగ్ కర్నాటక సీఎంతో విభేదించారు. చరిత్రను ఇష్టానుసారం వక్రీకరిస్తే నిరసనలు తెలపడం ప్రజాస్వామిక హక్కని అమరీందర్ అన్నారు. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య పద్మావతిపై నిరసనలను తోసిపుచ్చారు. మూవీ హీరోయిన్ దీపికా పడుకోన్‌కు వస్తున్న హెచ్చరికలను తీవ్రంగా ఖండించారు. మహిళలను బెదిరించడం పెరుగుతున్న అసహనానికి మరో సంకేతమని, బీజేపీ స్వార్థపూరిత రాజకీయాల్లో ఇది భాగమని వ్యాఖ్యానించారు. దీపిక కుటుంబానికి కర్ణాటక ప్రభుత్వం పూర్తి భద్రత కల్పిస్తుందని భరోసా ఇచ్చారు. -
‘పద్మావతి’ని ఆడనివ్వం
భోపాల్: పద్మావతి సినిమాలో చరిత్రను వక్రీకరించారని వార్తలు వస్తున్నాయనీ, ఒకవేళ అదే నిజమైతే మధ్యప్రదేశ్‌లో ఆ సినిమా ప్రదర్శనకు అనుమతి ఇవ్వబోమని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. సినిమా ప్రదర్శనను నిలిపివేయాల్సిందిగా రాజ్‌పూత్ వర్గానికి చెందిన కొందరు సోమవారం సీఎంను ఆయన నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా చౌహాన్ మాట్లాడుతూ ‘చరిత్ర వక్రీకరణను మేం సహించం. రాణీ పద్మావతి గొప్పతనం గురించి మనం చిన్నప్పటి నుంచి పుస్తకాల్లో చదువుకుంటున్నాం. ఆమె వ్యక్తిత్వాన్ని కించపరిచే సన్నివేశాలు సినిమాలో ఉంటే ఇక్కడ ఆడనివ్వం’ అని చౌహాన్ అన్నారు. మహిళల రక్షణకు విశిష్ట సేవలందించే వ్యక్తులకు ‘రాష్ట్రమాత పద్మావతి అవార్డుల్ని’ అందజేస్తామని ప్రకటించారు. శౌర్యపరాక్రమాలు చూపినవారికి ‘మహారాణా ప్రతాప్ అవార్డు’ ఇస్తామన్నారు. మరోవైపు కేంద్రానికి తామిచ్చిన సూచనల్ని అంగీకరిస్తేనే రాష్ట్రంలో పద్మావతి చిత్రం విడుదల అవుతుందని రాజస్తాన్ సీఎం వసుంధరా రాజే స్పష్టం చేశారు. ఇదిలాఉండగా, పద్మావతి చిత్రంలో కొన్ని అభ్యంతరకర సన్నివేశాలున్నాయని ఆరోపిస్తూ వాటిని తొలగించాల్సిందిగా కోరుతూ వచ్చిన ఓ పిటిషన్‌ను సుప్రీంకోర్టు పక్కనబెట్టింది. సినిమాకు ఇంకా సీబీఎఫ్సీ ధ్రువీకరణ ఇవ్వనందున, ఇప్పుడే ఈ అంశాన్ని తాము చేపట్టడం తొందరపాటవుతుందని ధర్మాసనం పేర్కొంది. -
పద్మావతి వివాదం : సుప్రీం కీలక నిర్ణయం
న్యూఢిల్లీ : రోజులు గడుస్తున్న కొద్దీ సంజయ్ లీలా బన్సాలీ 'పద్మావతి' చిత్ర వివాదం మరింత ముదురుతోంది. ఇప్పటికే ఈ చిత్ర దర్శకుడు సంజయ్ లీలా బన్సాలీ, హీరోయిన్ దీపికా పదుకొనేలకు హెచ్చరికలు జారీ అయ్యాయి. అయితే ఈ చిత్ర విడుదలను నిషేధించాలంటూ దాఖలైన ప్రజాప్రయోజనాల వ్యాజ్యాన్ని అత్యున్నత న్యాయస్థానం సోమవారం తోసిపుచ్చింది. 'పద్మావతి' చిత్రం విడుదలపై నిషేధం విధించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని బెంచ్ ఈ మేరకు తీర్పునిచ్చింది. సెన్సార్ బోర్డుకు ఉన్న అధికారాల్లో తాము జోక్యం చేసుకోలేమని తెలిపింది. సీబీఎస్సీ ఇంకా సర్టిఫికెట్ ఇవ్వనే లేదని, అలాంటప్పుడు సినిమా విడుదలను ఎలా ఆపేస్తామని ప్రశ్నించింది. సీబీఎఫ్సీ నుంచి పద్మావతికి సర్టిఫికేషన్ రావాల్సి ఉందని పేర్కొంది. పద్మావతి సినిమా విడుదలపై నిషేధం విధించాలంటూ అడ్వకేట్ ఎంఎల్ శర్మ ఈ ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. సినిమా విడుదల నిలిపివేయాలంటూ దేశవ్యాప్తంగా రాజ్‌పుత్ కర్ణిసేన ఆందోళనలు చేస్తున్న నేపథ్యంలో చిత్ర నిర్మాణ సంస్థ స్వచ్ఛందంగా విడుదల తేదీని వాయిదా వేస్తున్నట్టు ఆదివారం ప్రకటించింది. అయితే సినిమాను నిషేధించాల్సిందేనంటూ కర్ణిసేన ఆందోళనలు ఉధృతమవుతున్నాయి. -
నిరసనలపై మమత ఫైర్
సాక్షి,న్యూఢిల్లీ: పద్మావతి మూవీపై ముసురుకున్న వివాదంపై సినీ, రాజకీయ ప్రముఖులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. తాజాగా తృణమూల్ అధినేత్రి, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ పద్మావతి వివాదంపై స్పందించారు. పద్మావతి మూవీపై వ్యక్తమవుతున్న నిరసనలను దీదీ తోసిపుచ్చారు. మొత్తం వ్యవహారాన్ని సరిగ్గా ఎదుర్కోలేకపోవడంతో దేశంలో సూపర్ ఎమర్జెన్సీ నెలకొందని ఆందోళన వ్యక్తం చేశారు. ‘పద్మావతి వివాదం దురదృష్టకరం...ఓ రాజకీయ పార్టీ భావప్రకటన స్వేచ్ఛను హరించే క్రమంలో వ్యూహాత్మక ప్రణాళికతో వ్యవహరిస్తుండటంతోనే దేశంలో అత్యయిక పరిస్థితి నెలకొంది‘ అన్నారు. చిత్ర పరిశ్రమలోని వారంతా ఏకమై దీనిపై గళమెత్తాలని మమతా బెనర్జీ పిలుపు ఇచ్చారు. మరోవైపు పద్మావతి మూవీని తమ రాష్ట్రంలో నిషేధిస్తున్నట్టు మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రకటించారు. చౌహాన్ నిర్ణయాన్ని కాంగ్రెస్ పాలిత పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ సమర్ధించడం గమనార్హం.చరిత్రను వక్రీకరిస్తే సహించేదిలేదని స్పష్టం చేశారు. -
పద్మావతిపై మధ్యప్రదేశ్ సంచలన నిర్ణయం
సాక్షి,భోపాల్: వివాదాస్పద పద్మావతి మూవీపై మధ్యప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. పద్మావతి చిత్రాన్ని తమ రాష్ట్రంలో నిషేధిస్తున్నట్టు ఎంపీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ చెప్పారు.చరిత్రను వక్రీకరించిన పద్మావతి చిత్రంపై నిషేధం విధించాలని రాజ్పుట్ సంఘాలు వినతి పత్రం ఇచ్చిన మీదట సీఎం చౌహాన్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. సెన్సార్ సమస్యల నేపథ్యంలో డిసెంబర్ 1న విడుదల కావాల్సిన పద్మావతి మూవీని వాయిదా వేస్తున్నట్టు చిత్ర మేకర్లు ప్రకటించిన విషయం తెలిసిందే. సెన్సార్ సర్టిఫికేషన్ కోసం అవసరమైన పత్రాలను ఇవ్వలేదని సెన్సార్ బోర్డ్ చీఫ్ ప్రసూన్ జోషి పేర్కొన్నారు. మరోవైపు బోర్డు సర్టిఫికెట్ పొందకుండానే పలు మీడియా ఛానెళ్లకు చిత్రాన్ని ప్రదర్శించడం పట్ల జోషి అభ్యంతరం వ్యక్తం చేశారు. సెన్సార్ సర్టిఫికెట్ కోసం చేసిన దరఖాస్తు అసంపూర్తిగా ఉందంటూ చిత్రాన్ని సీబీఎఫ్సీ నిర్మాతకు తిప్పిపంపింది. -
కొనసాగుతున్న పద్మావతి ప్రకంపనలు
సాక్షి,న్యూఢిల్లీ: సంజయ్ లీలా భన్సాలీ చెక్కిన చారిత్రక దృశ్యకావ్యం పద్మావతి ప్రకంపనలు కొనసాగుతున్నాయి. సినిమాకు సీబీఎఫ్సీ సర్టిఫికేషన్ నిలిచిపోయిన క్రమంలో పాలక రాజస్ధాన్, యూపీ, గుజరాత్ బీజేపీ సర్కార్ల తీరుపై బాలీవుడ్ ప్రముఖులు మండిపడుతున్నారు. బీజేపీ ప్రభుత్వాలే పద్మావతి చిత్ర విడుదలలో జాప్యానికి కారణమని నటి, సామాజిక కార్యకర్త షబనా అజ్మీ ఆరోపించారు. పద్మావతి విషయంలో చిత్ర పరిశ్రమ ఏకతాటిపై నిలిచి గోవాలో సోమవారం ప్రారంభమవుతున్న అంతర్జాతీయ చలన చిత్రోత్సవాన్ని బహిష్కరించాలని పిలుపు ఇచ్చారు. పద్మావతి మూవీపై రగడ జరుగుతుంటే రాజస్ధాన్ ముఖ్యమంత్రి వసుంధరా రాజె మౌన ప్రేక్షకురాలిలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. పద్మావతి మూవీని విడుదల చేస్తే హింసకు దిగుతామని హెచ్చరించిన వారిపై ఎలాంటి చర్యలూ చేపట్టలేదని ఆరోపించారు. రాష్ట్రంలో అసాంఘిక శక్తులను ఏరివేస్తామని ప్రకటించిన యూపీ ప్రభుత్వం శాంతిభద్రతల పేరుతో డిసెంబర్ 1న సినిమా విడుదలకు మోకాలడ్డుతోందని విమర్శించారు.పద్మావతి మూవీని కొన్ని లాంఛనాలు పూర్తికాలేదనే సాకుతో సీబీఎఫ్సీ తిప్పిపంపడాన్ని షబనా అజ్మీ తప్పుపట్టారు. దీనివెనుక గుజరాత్ ఎన్నికల్లో ఓట్లు దండుకునే రాజకీయం దాగున్నదన్నారు. మరోవైపు రాజ్పుట్ల ప్రాబల్యం కలిగిన రాజస్ధాన్‌లో పద్మావతి మూవీపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ పెద్ద ఎత్తున ఆందోళనలు చోటుచేసుకుంటున్న విషయం తెలిసిందే. పద్మావతి మూవీలో ఏ వర్గం వారినీ కించపరిచే సన్నివేశాలు లేకుండా మార్పులు చేసేంతవరకూ సినిమా విడుదల చేయరాదని రాజస్ధాన్ సీఎం వసుంధరా రాజే కేంద్రాన్ని కోరారు. చరిత్రకారులు, సినీ వర్గాలు, రాజ్పుట్ ప్రతినిధులతో కూడిన ప్రత్యేక కమిటీతో చిత్ర కథ గురించి చర్చించిన తర్వాతే సినిమాను విడుదల చేయాలని, అప్పటివరకూ విడుదల వాయిదా వేయాలని కేంద్ర సమాచార ప్రసార మంత్రి స్మృతీ ఇరానీకి వసుంధర రాజే లేఖ రాశారు. -
‘ అశ్లీల చిత్రాలపై నోరు మెదపని వాళ్లు.. ఆ చిత్రంపై..’
‘పద్మావతి’ సినిమా విడుదలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ వివాదాలు, విమర్శలు అధికమవుతున్నాయి. పద్మావతి చిత్రం విడుదల చేస్తే దాడులు చేస్తామంటూ రాజ్‌పుత్ కర్ణిక సేన కార్యకర్తలు తీవ్ర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. పద్మావతి చిత్రంలో ప్రధాన పాత్ర పోషించిన దీపికా పదుకునే ముక్కు కోస్తామని కొందరు అంటే.. ఆమెను చంపితే రూ. 5 కోట్లు ఇస్తామని మరో సంస్థ ప్రకటించింది. రాజ్‌పుత్ కర్ణిక సేన కార్యకర్తలు చేసిన హెచ్చరికలు, ఆందోళనలపై బహుభాష నటుడు ప్రకాశ్‌రాజ్ తన ట్విట్టర్లో తీవ్రంగా ఖండించారు. ‘కొద్ది రోజులుగా కళాకారులపై దాడులకు పాల్పడతామని.. హెచ్చరికలు చేస్తుండటం ఆందోళనకర పరిణామని అని అన్నారు. అనేక భాష్లలో విశృంఖలంగా నిర్మితమవుతున్న అశ్లీల చిత్రాల గురించి నోరు మెదపని వాళ్లు.. చారిత్రతాత్మక, సందేశాత్మక చిత్రాలో నటించిన, నటిస్తున్న కళాకారులపై దాడులకు పాల్పడతామంటూ హెచ్చరించడం ఎంత వరకు సమంజసమని’ ఆయన ప్రశ్నించారు. ఈ చిత్రాన్ని సంజలీలా భన్సాలీ రూపొందిస్తున్నారు. పద్మావతి చిత్రంపై ఎవరూ ఊహించని స్థాయిలో కర్ణిసేన ప్రతిస్పందిస్తోంది. సినిమా విడుదలను ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించమని సంస్థ తేల్చి చెప్పింది. సంజయ్‌లీలా భన్సాలీ హిందువుల మనోభావాలను దెబ్బతీశారని కర్ణిసేన ఆరోపించింది. సినిమా విడుదల ఆపకపోతే దీపిక ముక్కు కత్తిరిస్తామని కర్ణిసేన బహిరంగంగా ప్రకటించింది. థియేటర్లను ధ్వంసం చేస్తామని స్పష్టం చేసింది. మరికొందరు మాత్రం దీపికను చంపితే రూ. 5 కోట్లు బహుమతిగా ఇస్తామని ప్రకటించారు. -
‘అభ్యంతరకర దృశ్యాల తొలగింపు’
సాక్షి,న్యూఢిల్లీ: సంజయ్ లీలా భన్సాలీ చారిత్రక దృశ్య కావ్యం పద్మావతిపై నెలకొన్న వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. చిత్రంలో అభ్యంతరకర సన్నివేశాలను తొలగించాలని కోరుతూ శుక్రవారం సుప్రీం కోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది.సినిమా నుంచి కొన్ని అభ్యంతరకర సన్నివేశాలు తొలగించాలని పిటిషన్ దాఖలు చేసిన న్యాయవాది సర్వోన్నత న్యాయస్ధానాన్ని కోరారు. ఈ అంశాన్ని తాను పరిశీలిస్తానని సుప్రీం కోర్టు బదులిచ్చినట్టు సమాచారం. కాగా అంతకుముందు పద్మావతి టైటిల్ రోల్ పోషించిన దీపికా పదుకోన్‌కు రాజ్పుట్ కర్ణి సేన హెచ్చరికల నేపథ్యంలో ముంబయి పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. ఆమె నివాసం, ముంబయి కార్యాలయం వద్ద భారీగా పోలీసులను మోహరించారు. చరిత్రను వక్రీకరించేలా పద్మావతి మూవీని తెరకెక్కించారని రాజ్పుట్ సంఘాలు, హిందూ సంస్థలు భారీ ఆందోళనలు చేపడుతున్న విషయం తెలిసిందే. సినిమా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకొచ్చే డిసెంబర్ 1న రాజ్పుట్ సంఘాలు భారత్ బంద్‌కు పిలుపు ఇవ్వడం ఉత్కంఠ రేపుతోంది. -
పద్మావతికి భద్రత పెంపు
సాక్షి,ముంబయి: వివాదాస్పద పద్మావతి మూవీ టైటిల్ రోల్ పోషిస్తున్న దీపికా పదుకోన్‌కు ముంబయి పోలీసులు భద్రత పెంచారు. రాజ్‌పుత్ కర్ణి సేన హెచ్చరికల నేపథ్యంలో ఆమెకు భద్రతను కట్టుదిట్టం చేశారు. పద్మావతి సినిమాను చరిత్రను వక్రీకరించేలా తెరకెక్కించారని, ఈ సినిమా విడుదలను నిలిపివేయాలని రాజ్‌పుత్ సంఘాలతో పాటు హిందూ సంస్థలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టిన విషయం తెలిసిందే. రాణీ పద్మినిగా పద్మావతిలో నటించిన దీపికా పదుకోన్‌కు నిరసనకారుల నుంచి తీవ్ర హెచ్చరికలు ఎదురయ్యాయి. ఆమెను హతమార్చిన వారికి రూ 5 కోట్లు ఇస్తామని..దీపిక ముక్కు కోస్తామని ఆందోళనకారులు హెచ్చరిస్తున్నారు. ఈ హెచ్చరికల నేపథ్యంలో దీపిక నివాసం, ముంబయిలోని ఆమె కార్యాలయం వద్ద భారీగా పోలీసులు మోహరించారు. దీపిక ముక్కు కోస్తామని హిందూ గ్రూప్‌లు హెచ్చరించిన అనంతరం ముంబయి పోలీసులు ఆమెకు భద్రత పెంచారని నగర పోలీస్ జాయింట్ కమిషనర్ (శాంతిభద్రతలు) దెవెన్ భారతి చెప్పారు. మరోవైపు దీపిక ప్రజల మనోభావాలను రెచ్చగొట్టేలా వ్యవహరిస్తే ఆమెపై భౌతిక దాడులకు దిగుతామని రాజ్పుట్ కర్ణి సేన నేత మహిపాల్ సింగ్ మాకర్ణ హెచ్చరించారు. పద్మావతి మూవీని నిషేధించకుంటే తీవ్ర పరిణామాలు తప్పవని పునరుద్ఘాటించారు. ఇక పద్మావతి డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ, దీపికా పదుకోన్‌ల తలనరికిన వారికి రూ 5 కోట్లు ఇస్తామని యూపీకి చెందిన చైతన్య సమాజ్ పేర్కొంది. సర్వ్ బ్రాహ్మణ మహాసభ కూడా పద్మావతిపై సీబీఎఫ్‌సీకి ఫిర్యాదు చేస్తామని ప్రకటించింది. ఇక పద్మావతి మూవీ ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకొస్తున్న డిసెంబర్ 1న రాజ్పుట్ కర్ణిసేన భారత్ బంద్‌కు పిలుపు ఇచ్చింది. -
కమిటీ ముందు స్క్రీనింగ్‌కు భన్సాలీ ఓకే
సాక్షి,న్యూఢిల్లీ: పద్మావతి చుట్టూ ముసురుకున్న వివాదం కొత్త మలుపు తిరిగింది. డిసెంబర్ 1న సినిమా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకొస్తున్న క్రమంలో విడుదలకు ముందు ప్రత్యేక కమిటీ కోసం మూవీని ప్రదర్శించేందుకు దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ అంగీకరించినట్టు సమాచారం. చరిత్రను వక్రీకరించారని ఆరోపిస్తూ పద్మావతి మూవీపై గత కొద్దిరోజులుగా రాజ్పుట్ సంఘాలు, హిందూ సంస్థలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడుతున్న విషయం తెలిసిందే. చిత్రంలో అభ్యంతరకర దృశ్యాలుంటే తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని, థియేటర్లను దగ్ధం చేస్తామని నిరసనకారులు హెచ్చరిస్తున్నారు. విడుదలకు ముందు తమకు చిత్రాన్ని ప్రదర్శించాలని డిమాండ్ చేస్తూ ముంబయిలో భన్సాలీ కార్యాలయాన్ని అఖండ్ రాజ్‌పుటానా సేవా సంఘ్ కార్యకర్తలు ముట్టడించారు. సెన్సార్‌కు వెళ్లే ముందుగానే తమకు ప్రత్యేక స్క్రీనింగ్ ఏర్పాటు చేయాలని వీరు డిమాండ్ చేశారు. పద్మావతిపై నెలకొన్నవివాదాలకు స్వస్తి పలికేందుకు సినిమాను ప్రత్యేక కమిటీకి ప్రదర్శించేందుకు భన్సాలీ అంగీకరించినట్టు తెలిసింది. నవంబర్ 15 నుంచి 18 మధ్య సినిమాను తమకు ప్రదర్శిచేందుకు భన్సాలీ సిద్ధమని ఆయన తరపు ప్రతినిధులు తమకు స్పష్టం చేశారని రాజ్పుట్ సేవా సంఘ్ జాతీయ అధ్యక్షుడు మహవీర్ జైన్ వెల్లడించినట్టు మిడ్డే వెబ్సైట్ పేర్కొంది.దీపికా పదుకొనే ప్రధాన పాత్రలో నటించిన ఈ మూవీ డిసెంబర్ 1న ప్రేక్షకుల ముందుకురానుంది. -
పసందుగా పదేళ్లు!
... కంప్లీట్ అయ్యాయి... హీరోయిన్గా దీపికా పదుకోన్ బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి. ఫరా ఖాన్ దర్శకత్వంలో షారుక్‌ఖాన్ హీరోగా నటించిన ‘ఓం శాంతి ఓం’ ద్వారా ఈ సొట్టబుగ్గల సుందరి హిందీ తెరపై మెరిసిన విషయం గుర్తుండే ఉంటుంది. ఆ సినిమా తర్వాత ఈ సౌత్ బ్యూటీ వెనక్కి తిరిగి చూసుకోలేనంత బిజీ అయ్యారు. 2007 నవంబర్ 9న ఆ చిత్రం విడుదలైంది. హీరోయిన్గా పదేళ్లు కెరీర్ విజయవంతంగా పూర్తి చేసుకున్న సందర్భంగా దీపిక తిరుపతి వెళ్లారు. వెంకటేశ్వరుడి ఆశీస్సులు పొందారు. దీపిక తిరుమల వెళ్లిన ఫొటోను ఇన్సెట్లో చూడొచ్చు. తిరుపతిలోని పద్మావతి టెంపుల్ని కూడా సందర్శించారామె. లేటెస్ట్గా సంజయ్‌లీలా భన్సాలీ దర్శకత్వంలో దీపికా పదుకోన్, రణ్వీర్ సింగ్, షాహిద్ కపూర్ ముఖ్యపాత్రల్లో రూపొందిన ‘పద్మావతి’ని డిసెంబర్ 1న రిలీజ్ చేయాలనుకుంటున్నారు. పద్మావతి పేరుతో సినిమా చేశారు కాబట్టి, ప్రత్యేకంగా ఆ అమ్మవారి గుడికి వెళ్లి ఉంటారని ఊహించవచ్చు. ఆ సంగతి పక్కన పెడితే... గడచిన పదేళ్లలో ‘లవ్ ఆజ్ కల్, హౌస్‌ఫుల్, రేస్ 2, చెన్నై ఎక్స్‌ప్రెస్, పీకూ, బాజీరావ్ మస్తానీ’ వంటి హిట్ చిత్రాల్లో ఆమె నటించారు. గతేడాది ‘ట్రిపులెక్స్: రిటర్న్ ఆఫ్ గ్జాండర్ కేజ్’ చిత్రం ద్వారా ఆమె హాలీవుడ్‌కి ఎంట్రి ఇచ్చిన సంగతి తెలిసే ఉంటుంది. రణబీర్ కపూర్‌తో లవ్, బ్రేకప్ తర్వాత కొంత డిప్రెషన్‌కి గురయ్యారు. ఆ సమయంలో సైకాలజిస్ట్‌ని కలసి, డిప్రెషన్ నుంచి బయటపడ్డారు. ఏమైతేనేం.. ప్రొఫెషనల్‌గా... పర్సనల్‌గా ఇప్పుడు దీపిక మంచి స్పేస్‌లో ఉన్నారు. -
విడుదలైతే విధ్వంసమే..
సాక్షి,ఆగ్రా: సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన వివాదాస్పద పద్మావతి మూవీపై పలు రాష్ట్రాల్లో నిరసనలు మిన్నంటాయి. రాజస్ధాన్, గుజరాత్, హర్యానాల్లో ఈ సినిమాపై రాజ్పుట్ సంఘాలు, హిందూ సంస్థలు పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహిస్తుండగా తాజాగా ఆగ్రాలో హిందూ గ్రూపులు పద్మావతిని విడుదల చేస్తే విధ్వంసం తప్పదని హెచ్చరించాయి. నగరంలో ఈ సినిమాను విడుదల చేస్తే తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని థియేటర్లకు స్పష్టం చేశాయి. తమ అభ్యంతరాలను ఖాతరు చేయకుండా పద్మావతి సినిమాను ప్రదర్శిస్తే జరిగే పరిణామాలకు మీరే బాధ్యత వహించాలని హిందూ సంస్థలు హెచ్చరించాయి. పద్మావతి పోస్టర్లకు బ్లాక్ ఇంక్ పులిమి తమ ఆందోళనలు ఎలా ఉంటాయో హిందూ సంస్థలు సంకేతాలు పంపాయి. ఈ కేసుకు సంబంధించి థియేటర్ యజమానులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. హిందూ సంస్కృతికి వ్యతిరేకంగా రూపొందే సినిమాలను తీవ్రంగా ప్రతిఘటిస్తామని హిందూ జాగరణ్ మంచ్ ఆగ్రా జిల్లా అధ్యక్షుడు అమిత్ ఛౌదరి స్పష్టం చేశారు.రాజ్పుట్ల మనోభావాలను దెబ్బతీసేలా రూపొందిన పద్మావతి చిత్రాన్ని నిలిపివేయాలని ఇప్పటికే యూపీ మాజీ మంత్రి, బీజేపీ నేత రాజా మహేంద్ర అరిదమన్ సింగ్ డిమాండ్ చేశారు.మరోవైపు డిసెంబర్ 1న పద్మావతి విడుదల రోజే యూపీలో స్ధానిక ఎన్నికల ఫలితాలు వెలువడుతుండటంతో హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటాయనే ఆందోళన నెలకొంది. -
శ్రీవారి సేవలో దీపిక పదుకొనె