
జయప్రద
రాయ్‌పూర్: సమాజ్‌వాదీ పార్టీ నాయకుడు అజంఖాన్‌ను ఉద్దేశించి మాజీ ఎంపీ జయప్రద సంచలన వ్యాఖ్యలు చేశారు. పద్మావత్ సినిమాలో అల్లావుద్దీన్ ఖిల్జీ పాత్రను చూస్తే తనకు అజంఖానే గుర్తొచ్చాడని ఆమె వ్యాఖ్యానిం చారు. ‘‘అజంఖాన్‌ను నేను సోదరునిగా భావించాను. కానీ అతను నాపై ప్రతీకారం తీర్చుకునేందుకు అనేక విధాలుగా ప్రయత్నించాడు’ అని రాయ్‌పూర్‌లో వ్యాఖ్యానించారు.