
సాక్షి, న్యూఢిల్లీ: మాజీ ఎంపీ, ప్రముఖ నటి జయప్రద కొంతకాలం కిందటివరకు ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. సమాజ్‌వాదీ పార్టీ తరఫున రాంపూర్ నియోజకవర్గం నుంచి ఆమె రెండుసార్లు ఎంపీగా గెలుపొందారు. ఆమె ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో కొనసాగుతున్న సమయంలో సొంత పార్టీ ఎస్పీ సీనియర్ నేత ఆజంఖాన్ నుంచి ఎన్నో వేధింపులు ఎదుర్కొన్నారు. ఎన్నికల సమయంలో తన పట్ల దుష్ప్రచారం చేస్తున్నారని కూడా అప్పట్లో ఆరోపించారు.
తాజాగా ‘పద్మావత్’ సినిమా చూస్తే ఆనాటి జ్ఞాపకాలు ఆమెను వెంటాడినట్టు ఉన్నాయి. అందుకే ‘పద్మావత్’ సినిమాలో అల్లావుద్దీన్ ఖిల్జీ పాత్రను చూస్తే తనకు ఆజంఖాన్ గుర్తుకువచ్చాడని, ఎన్నికల్లో తాను పోటీ చేస్తున్నప్పుడు అతను తనను ఎంతోగానే వేధించాడని ఆమె గుర్తుచేసుకున్నారు. ఆజంఖాన్‌ను ఖిల్జీతో పోల్చారు.
Comments
Please login to add a commentAdd a comment