'పద్మావతి’ సినిమా షూటింగ్ సెట్స్‌లో రాజ్‌పుత్ కర్ణి సేన కార్యకర్తల వీరంగం, దర్శకుడు సంజయ్‌లీలా భన్సాలీపై దాడి ఘటన అటు సినీ రంగంతోపాటు ఇటు రాజకీయ రంగంలోనూ తీవ్ర చర్చనీయాంశమైంది. రాజస్థాన్‌లోని జైపూర్‌లో శుక్రవారం ‘పద్మావతి’ యూనిట్‌పై జరిగిన దాడిని బాలీవుడ్ నిర్మాతల సంఘం ఖండించగా, రాజ్‌పుత్ సేన మాత్రం సంజయ్ లీలాపై ఎదురుదాడిని కొనసాగించింది.