కష్టాల్లో సినిమా.. ఆలయానికి దీపిక! | Deepika Padukone visits Siddhivinayak temple | Sakshi
Sakshi News home page

Published Tue, Jan 23 2018 1:41 PM | Last Updated on Thu, Mar 21 2024 8:11 PM

సంజయ్‌ లీలా భన్సాలీ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన చారిత్రక సినిమా ‘పద్మావత్’.. రాణి పద్మావతి జీవితకథ ఆధారంగా తెరకెక్కినట్టు భావిస్తున్న ఈ సినిమా ఇప్పటికే అనేక వివాదాల్లో చిక్కుకుంది. ఈ సినిమా విడుదలకు సుప్రీంకోర్టు సైతం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చినా.. మరో రెండురోజుల్లో ప్రేక్షకుల ముందుకు వస్తుందా? రాదా? అన్నది ప్రశ్నార్థకంగా కనిపిస్తోంది. అందుకు కారణం అడుగడుగునా కర్ణిసేన ఆధ్వర్యంలో రాజ్‌పుత్‌లు ఈ సినిమాను తీవ్రంగా వ్యతిరేకిస్తుండటమే. ఇప్పటికే పలుచోట్ల ఈ సినిమాను ప్రదర్శిస్తారని భావించిన థియేటర్లపై కర్ణిసేన దాడులకు దిగుతోంది.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement