Siddhivinayak Temple
-
ఇషాన్ కిషన్‌తో కలిసి హార్దిక్ పాండ్యా పూజలు (ఫొటోలు)
-
ఆకాశ్, శ్లోకా నిశ్చితార్థం ; తొలి ఆహ్వానం ఎవరికంటే..
ముంబై : దేశీ కార్పొరేట్ దిగ్గజం ముఖేశ్ అంబానీ పెద్ద కుమారుడు ఆకాశ్ అంబానీ, వజ్రాల వ్యాపారి రసెల్ మెహతా కుమార్తె శ్లోకా మెహతాల పెళ్లి గురించి ప్రతి విషయం వైరల్‌గా మారుతుంది. మార్చిలోనే గోవాలో వీరి నిశ్చితార్థం జరిగినట్టు వార్తలు వచ్చాయి. ఆ తర్వాత ముఖేశ్ దంపతులు తమ సన్నిహితులకు గ్రాండ్‌గా పార్టీ కూడా ఇచ్చారు. కాగా వీరి నిశ్చితార్థ వేడుకను అధికారికంగా జూన్ 30న ముంబైలోని 39 అట్లామౌంట్ రోడ్లో జరపనున్నారు. నిశ్చితార్థ వేడుకకు సంబంధించిన ఇన్విటేషన్ తాజాగా ఇంటర్ నెట్లో హల్చల్ చేస్తోంది. కాగా ముఖేశ్ సతీమణి నీతా అంబానీ అతిథులను ఆహ్వానించేందుకు సిద్ధమయ్యారు. అందులో భాగంగా ముంబైలోని ప్రఖ్యాత సిద్ధి వినాయక దేవాలయంలో బుధవారం ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆమె... తొలి ఆహ్వాన పత్రికను వినాయకుడి చెంత ఉంచారు. నీతా వెంట చిన్న కుమారుడు అనంత్ అంబానీ కూడా ఉన్నారు. ముఖేశ్ కుటుంబంలో ఏ వేడుక జరిగిన ఇక్కడ పూజలు నిర్వహిస్తారు. గోవా పార్టీ తర్వాత కూడా అకాశ్, శ్లోకా జంటతోపాటు అంబానీ కుటుంబసభ్యులు ఈ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముఖేశ్ దంపతుల గారాల పట్టి ఈషా అంబానీ, బిజినెస్ టైకూన్ అజయ్ పిరమల్ వారసుడు ఆనంద్ పిరమల్ నిశ్చితార్థ వేడుక గత నెల 7వ తేదీన ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. -
కష్టాల్లో సినిమా.. ఆలయానికి దీపిక!
సాక్షి, ముంబై: సంజయ్ లీలా భన్సాలీ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన చారిత్రక సినిమా ‘పద్మావత్’.. రాణి పద్మావతి జీవితకథ ఆధారంగా తెరకెక్కినట్టు భావిస్తున్న ఈ సినిమా ఇప్పటికే అనేక వివాదాల్లో చిక్కుకుంది. ఈ సినిమా విడుదలకు సుప్రీంకోర్టు సైతం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినా.. మరో రెండురోజుల్లో ప్రేక్షకుల ముందుకు వస్తుందా? రాదా? అన్నది ప్రశ్నార్థకంగా కనిపిస్తోంది. అందుకు కారణం అడుగడుగునా కర్ణిసేన ఆధ్వర్యంలో రాజ్‌పుత్‌లు ఈ సినిమాను తీవ్రంగా వ్యతిరేకిస్తుండటమే. ఇప్పటికే పలుచోట్ల ఈ సినిమాను ప్రదర్శిస్తారని భావించిన థియేటర్లపై కర్ణిసేన దాడులకు దిగుతోంది. ఈ వివాదాల నడుమ వచ్చే గురువారం ‘పద్మావత్’ చిత్రం విడుదల అవుతున్న నేపథ్యంలో ఈ సినిమాలో టైటిల్ రోల్ పోషించిన దీపికా పదుకోన్ మంగళవారం ముంబైలోని ప్రసిద్ధ సిద్ధివినాయక ఆలయాన్ని దర్శించుకున్నారు. కట్టుదిట్టమైన భద్రత నడుమ ఆమె ఆలయానికి వచ్చారు. ఆలయంలో వినాయకుడికి ప్రత్యేక పుజలు నిర్వహించారు. ‘పద్మావత్’ సినిమాలో టైటిల్ రోల్ పోషించిన దీపికపై కూడా కర్ణిసేన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. దర్శకుడు భన్సాలీతోపాటు దీపిక తల నరికితే నజరానా ఇస్తామని ప్రకటించింది. ఈ నేపథ్యంలో దీపిక కట్టుదిట్టమైన భద్రత నడుమ ఆలయాన్ని దర్శించుకున్నారు. -
కష్టాల్లో సినిమా.. ఆలయానికి దీపిక!
-
ముంబైలో మానుషి ఛిల్లర్ సందడి
-
సిద్ధి వినాయకుడికి డీమ్యాట్ అకౌంట్
ముంబై : భక్తులు తరుచుగా సందర్శించే టెంపుల్స్ లో ఒకటిగా నిలుస్తున్న శ్రీ సిద్ధివినాయక గణపతి టెంపుల్ డీమ్యాట్ అకౌంట్ ను తెరిచింది. అత్యంత శక్తివంతమైన, ధనికమైన గుడిగా పేరొందిన ఈ దేవస్థానం, భక్తుల డొనేషన్లను ఈక్విటీ షేర్లు, ఇతర సెక్యురిటీస్ రూపంలో కానుకలుగా సమర్పించడానికి అవకాశం కల్పించింది. శ్రీ సిద్ధి వినాయక గణపతి ట్రస్ట్ ముంబై పేరుతో సీడీఎస్ఎల్ డీమ్యాట్ అకౌంట్ ను ఎస్ బీఐక్యాప్ సెక్యురిటీస్ లిమిటెడ్ ఓపెన్ చేసింది. ప్రస్తుతం సిద్ధి వినాయక టెంపుల్ తెరిచిన ఈ అకౌంట్ తో భక్తుల నుంచి కానుకలను షేర్లు, సెక్యురిటీల రూపంలో సేకరించనుంది. సిద్ధి వినాయక భక్తులు ఇకనుంచి యాక్టివ్ గా ట్రేడ్ అయ్యే షేర్లు, సెక్యురిటీలను డొనేట్ చేయొచ్చని లీడింగ్ సెక్యురిటీస్ డిపాజిటరీ సీడీఎస్ఎల్ ఓ ప్రకటనలో తెలిపింది. భక్తులు అధికంగా సమర్పించుకునే నగదు, బంగారంతో ఈ ఆలయ గణాంకాలు దేశంలో అత్యంత సంపన్నమైన దేవస్థానంగా ఉంది. ఈ దేవస్థానాన్ని ప్రతేడాది లక్షల మంది సంపన్నమైన, శక్తివంతమైన భక్తులు సందర్శిస్తుంటారు. గతేడాదే తిరుమల తిరుపతి దేవస్థానం డీమ్యాట్ అకౌంట్ ను ఓపెన్ చేసిన సంగతి తెలిసిందే. ఈ అకౌంట్ ఓపెన్ చేసిన దగ్గర్నుంచి భక్తుల కానుకల్లో వినూత్న స్పందన వస్తోంది. -
సిద్ది వినాయకుడికి టిమ్ కుక్ పూజలు
ముంబై: ప్రపంచ ఐటీ దిగ్గజం కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ టిమ్ కుక్ ముంబైలో హల్ చల్ చేశారు. భారత్ పర్యటనలో భాగంగా నేడు ముంబైలోని ప్రముఖ సిద్ది వినాయక ఆలయాన్ని దర్శించుకుని, పూజలు నిర్వహించారు. యాపిల్ హవా తగ్గుతున్న నేపథ్యంలో తమ వ్యాపారాలను పునరుద్ధరించుకోవడానికి టిమ్ కుక్ భారత్ లో పర్యటిస్తున్నారు. చైనా పర్యటన అనంతరం ఆయన భారత్ కు విచ్చేశారు. ప్రధాని మోదీ ప్రవేశపెట్టిన మేక్ ఇన్ ఇండియా ప్రొగ్రామ్ లో యాపిల్ భాగస్వామ్యం కానుంది. ఈ విషయంపై ప్రధాని మోదీతో టిమ్ కుక్ ఈ వారంలో భేటీ కానున్నారు. మరోవైపు భారత్ లో టెక్నాలజీకి మారుపేరుగా నిలుస్తున్న భాగ్యనగర్ కు టిమ్ కుక్ రేపు విచ్చేయనున్నారు. ఈ పర్యటనలో భాగంగా తెలంగాణ రాజధానికి కొత్త డిజిటల్ మ్యాప్స్ సెంటర్ ను ఆయన ప్రకటించనున్నారు. అమెరికాకు బయట నెలకొల్పుతున్న మెగా బ్రాండ్స్ ఫస్ట్ టెక్నాలజీ సెంటర్ ఇదేకావడం విశేషం. -
గణేశుడి విరాళం.. 40 కిలోల బంగారం!
దేశంలోనే అత్యంత ధనిక ఆలయాల్లో ఒకటి.. ముంబై సిద్దివినాయకుడి గుడి. అలాంటి ఆలయం నుంచి 40 కిలోల బంగారాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రారంభించిన బంగారం డిపాజిట్ పథకానికి తరలిస్తున్నారు. దీని ద్వారా ఆలయానికి ఏడాదికి రూ. 69 లక్షల వడ్డీ వస్తుందని భావిస్తున్నారు. ఈ పథకంలో ఇప్పటివరకు అత్యంత పెద్దస్థాయిలో వచ్చిన బంగారం ఇదేనని అంటున్నారు. దీంతో క్రమంగా తిరుమల, షిరిడీ లాంటి పెద్ద ఆలయాల నుంచి కూడా బంగారం డిపాజిట్లు వస్తాయని అంచనా వేస్తున్నారు. నిజానికి ఇప్పటివరకు ఈ పథకానికి పెద్దగా ఆదరణ లభించలేదు. దేశవ్యాప్తంగా కేవలం 400 గ్రాముల బంగారం మాత్రమే వచ్చింది. దేశం మొత్తమ్మీద ప్రజల వద్ద దాదాపు 20వేల టన్నుల బంగారం ఉందని, దాని విలువ దాదాపు రూ. 52 లక్షల కోట్లని అంచనా. తాజాగా ముంబై సిద్ది వినాయకుడి గుడి నిర్ణయంతో ఈ పథకానికి ఊపొస్తుందని అనుకుంటున్నారు. ప్రభుత్వ నియంత్రణలోని మింట్ వద్దకు ఈ బంగారాన్ని పంపి, అక్కడ దాన్ని కరిగించి బంగారు బిస్కట్లుగా మారుస్తారు. ఆలయాలకు భక్తుల నుంచి విరాళంగా వర్చే బంగారం చాలావరకు ఆభరణాల రూపంలో ఉంటుంది. దాంతో, 40 కిలోల ఆభరణాలను కరిగిస్తే స్వచ్ఛమైన బంగారం 30 కిలోల వరకు మాత్రమే వస్తుందని అంటున్నారు. 10 గ్రాముల బంగారం రూ. 25వేల వంతున లెక్కిస్తే, ఈ 30 కిలోల బంగారం విలువ రూ. 7.5 కోట్లు అవుతుంది. దానిమీద దాదాపు ఏడాదికి రూ. 69 లక్షల వడ్డీ వస్తుంది. ప్రస్తుతం సిద్దివినాయక ఆలయంలో దాదాపు 165 కిలోల బంగారం ఉంది. ఇప్పటికే పది కిలోల బంగారాన్ని ఎస్బీఐలో డిపాజిట్ చేయగా, దానిమీద ఏడాదికి ఒకశాతం వడ్డీ వస్తోంది. -
'తమాషా' కోసం... మాజీ ప్రియుడి కోసం
ముంబై: బాలీవుడ్ భామ, సొట్టబుగ్గల సుందరి దీపికా పదుకోన్ ముంబై లోని సిద్ధి వినాయకగుడిని దర్శించింది. తల్లి ఉజాలాతో కలిసి వచ్చిన ఈ భామ గుడిలో పూజా కార్యక్రమాలు నిర్వహించింది. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే రణబీర్ కోసం కూడా ప్రార్థించానన్న పొడుగు కాళ్ల సుందరి మాటలు, పూజలు బీటౌన్ లో హాట్ టాపిక్ గా మారాయి. గతంలో రణబీర్ తో దీపిక ప్రేమాయణం సాగించినట్టు పుకార్లు షికార్లు చేశాయి. అయితే తన ప్రతి సినిమా విడుదలకు ముందు ఈ గుడికి రావడం తనకు ఆనవాయితీ అని దీపికా చెబుతోంది. అందులో భాగంగానే ఈ రోజు (శుక్రవారం) విడుదలైన తమాషా సినిమా విజయం సాధించాలని గణనాధుణ్ని దర్శించుకున్నానంది. అంతేగాక మరో ఆసక్తికర విషయాన్ని కూడా మీడియాకు వివరించింది. మీ ఫ్రెండ్ రణబీర్ కోసం కూడా ప్రార్థించారా అని మీడియా ప్రతినిధులు అడిగినపుడు... 'అవును... రణబీర్ చాలా టాలెంటెడ్ యాక్టర్... జీవితంలో గెలుపు ఓటములు ఎవరికైనా రావడం సహజం.. అలాగే రణబీర్ కు కూడా.. ఈ సినిమా తప్పకుండా హిట్ అవుతుంది. మూవీ చూశాను.. అతని నటన అద్భుతంగా ఉంది' అని కితాబిచ్చింది. దీంతో తన మాజీ ప్రియుడి కోసం పూజలు చే సిందనే వార్త బాలీవుడ్ లో చక్కర్లు కొడుతోంది. కాగా రణబీర్ కపూర్ తో మూడవసారి జతకట్టింది ఈ తమాషా సినిమాలో. లవర్ బోయ్ ఇమేజ్ సొంతం చేసుకున్న రణబీర్ కపూర్, దీపికా పదుకోన్ జంటగా డైరెక్టర్ ఇంతియాజ్ అలీ 'తమాషా' అనే సినిమాను సాజిద్ నడియాడ్ వాలా నిర్మించారు. యే జవానీ హై దీవానీ సినిమాలాగానే తమాషా మూవీ కూడా బంపర్ హిట్ కావాలని కోరుకుంటోందీ ఈ జంట. బాలీవుడ్ తెర మీద బాలీవుడ్ సొట్ట బుగ్గల సుందరి దీపికా పదుకొనే, రణబీర్ కపూర్ మరోసారి జతకట్టడం హాట్ టాపిక్ గా మారింది. మళ్లీ ఈ మాజీ లవర్స్ కలవబోతున్నారంటూ బాలీవుడ్ గుసగుసలాడింది. ఈ నేపథ్యంలో తాజాగా దీపిక వ్యాఖ్యలు మరింత ఆసక్తికరంగా మారాయి. అటు ఈ మూవీలో ఈ జంట ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ ఇప్పటికే టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. -
కూతురుతో కలిసి గణపతిని దర్శించుకున్న ఐష్
-
ముంబై సిద్ధివినాయక ఆలయంలో కేసీఆర్
-
పుణ్యక్షేత్రాల బాటపట్టిన అభ్యర్థులు
సాక్షి, ముంబై: ఎన్నికలు సమీపించడంతో బరిలో దిగిన అభ్యర్థుల్లో కొందరు పుణ్యక్షేత్రాల బాట పట్టారు. ఈ ఎన్నికల్లో తమకు విజయం తప్పకుండా వరించాలని, ఎలాంటి విఘ్నాలు ఎదురుకాకుండా చూడాలని కోరుతూ పూజలు, హోమాలు చేస్తున్నారు. మరికొందరు తమ పరువు పోకుండా కనీసం డిపాజిట్ దక్కేలా చూడు స్వామి అని వేడుకుంటున్నారు. లోక్‌సభ, శాసన సభ, స్థానిక సంస్థలకు ఇలా ఎలాంటి ఎన్నికలు జరిగినా అభ్యర్థులను గెలిపించేది ఓటరు మహాశయులే. అయినప్పటికీ అభ్యర్థులు రాష్ట్రంతోపాటు ఇతర రాష్ట్రాల్లో ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రాలను సందర్శించేందుకు అప్పుడే బయలుదేరారు. కొందరు స్థానికంగా ఉన్న గుళ్లు, గోపురాల్లో పూజలుచేయగా మరికొందరు సాధు, సంతువులు, సన్యాసుల ఆశీర్వాదం పొందేందుకు వారు బసచేసిన మఠాలకు బయలుదేరారు. ముంబైలోని ప్రముఖ సిద్ధివినాయక, మహాలక్ష్మి మందిరాలతోపాటు రాష్ట్రంలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన షిర్డీలోని సాయిబాబాను, తిరుపతిలోని బాలాజీ, కొల్హొపూర్లోని మహాలక్ష్మి ఆలయం, వాషి, శేగావ్, యావత్మాల్, నాగపూర్‌లోని దుర్గమాత మందిరాలు, బుల్డాణ జిల్లాలో ప్రముఖ ఆలయం, మధ్యప్రదేశ్ ఇండోర్‌లోని భయ్యూజీ మహారాజ్ కొందరైతే దర్గాను కూడా వదలడం లేదు. అందులోని ముస్లీం మత గురువులకు మొక్కుతున్నారు. కాని ఎన్ని గుళ్లకు, గోపురాలకు మొక్కుకున్న, పుణ్యక్షేత్రాలు, తీర్థయాత్రలు చేసిన చివరకు ఎన్నికల్లో అంతిమ తీర్పునిచ్చేది ఓటర్లు మాత్రమేనని వీరు గుర్తించకపోవడం గమనార్హం. -
సిద్ధివినాయక ఆలయంలో పటిష్ట బందోబస్తు
సాక్షి, ముంబై: ఆంగారక సంకష్టిని పురస్కరించుకుని ప్రభాదేవిలోని సిద్ధివినాయక మందిరం, పక్కనున్న మైదానంలో ఏర్పాట్లు చేశారు. మంగళవారం సంకష్టి కావడంతో సోమవారం అర్థరాత్రి నుంచి నిరంతరాయంగా వినాయకున్ని దర్శించుకునేందు కుభక్తులకు సౌకర్యం కల్పించనున్నారు. సోమవారం మధ్యాహ్నం నుంచి భక్తులు క్యూలో నిలబడటం మొదలుపెడతారు. భక్తుల రద్దీని దృష్టి లో ఉంచుకుని 50 మంది పోలీసు అధికారులు, 915 కానిస్టేబుళ్లు, నాలుగు స్టేట్ రిజర్వుడు పోలీసు (ఎస్ఆర్పీ) కంపెనీలను మోహరించనున్నట్లు నగర డిప్యూటీ పోలీస్ కమిషనర్ ధనంజయ్ కులకర్ణి తెలిపారు. ఈసారీ అంగారకి సంకష్టి మంగళవారం రావడంతో సుమారు 15-20 లక్షల మంది భక్తులు వినాయకున్ని దర్శించుకునే అవకాశాలున్నాయని సిద్ధివినాయక ఆలయట్రస్టు అధ్యక్షుడు సుభాష్ మయేకర్ చెప్పారు. భక్తుల భద్రతకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఉగ్రవాదుల దాడులను దృష్టిలో ఉంచుకుని అనుమానితుల కదలికలపై ప్రత్యేక నిఘా వేయనున్నామన్నారు. అనుమానిత వస్తువులు, వాహనాలు కనిపిస్తే వెంటనే పోలీసులకు తెలియజేయాలని మయేకర్, కులకర్ణి సూచించారు. ఆలయ పరిసరాల్లో అంబులెన్స్, అగ్నిమాపక వాహనం, వైద్య బృందం 24 గంటలూ అందుబాటులో ఉంటాయి. రద్దీ కారణంగా ఆలయానికి ఆనుకున్న ఉన్న వివిధ రహదారులపై వాహనాల రాకపోకలను పూర్తిగా నిషేధించారు. దర్శన వేళలు... సోమవారం రాత్రి గం.8.46 ని.లకు చంద్రోదయం తర్వాత అర్ధరాత్రి గం.1.30 ని.లకు భక్తులను అనుమతిస్తారు. మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత రెండు గంటలకు క్యూ పూర్తవుతుంది. మంగళవారం రాత్రి గం.7.45 ని.ల నుంచి గం.9.15 ని. వరకు ప్రధాన గర్భగుడి బయట వివిధ ధార్మిక కార్యక్రమాలు ఉంటాయి. దూరం నుంచి (ముఖ్ దర్శన్) దర్శించుకునే వారికి సోమవారం అర్ధరాత్రి 1.30 నుంచి ప్రవేశద్వారం నంబరు-5 నుంచి అనుమతి కల్పిస్తారు. వికలాంగులకు, గర్భిణులకు, పాస్ హోల్డర్లకు, పిల్లల తల్లులకు సానే గురూజీ మైదాన్ నుంచి ప్రత్యేక క్యూలో పంపిస్తారు. సోమవారం అర్థరాత్రి 12.10-1.30 వరకు కాకడ్ హారతి, మహాపూజ. తెల్లవారుజాము 3.15-3.50 వరకు, మళ్లీ సాయంత్రం 7.15 హారతి ఉంటుంది.