సిద్ది వినాయకుడికి టిమ్ కుక్ పూజలు | Ahead Of Tim Cook's Announcement, The Scoop On Apple's Hyderabad Plans | Sakshi
Sakshi News home page

సిద్ది వినాయకుడికి టిమ్ కుక్ పూజలు

Published Wed, May 18 2016 2:16 PM | Last Updated on Tue, Jun 4 2019 6:19 PM

సిద్ది వినాయకుడికి టిమ్ కుక్ పూజలు - Sakshi

సిద్ది వినాయకుడికి టిమ్ కుక్ పూజలు

ముంబై: ప్రపంచ ఐటీ దిగ్గజం కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ టిమ్ కుక్ ముంబైలో హల్ చల్ చేశారు. భారత్ పర్యటనలో భాగంగా నేడు ముంబైలోని ప్రముఖ సిద్ది వినాయక ఆలయాన్ని దర్శించుకుని, పూజలు నిర్వహించారు. యాపిల్ హవా తగ్గుతున్న   నేపథ్యంలో తమ వ్యాపారాలను పునరుద్ధరించుకోవడానికి టిమ్ కుక్ భారత్ లో పర్యటిస్తున్నారు. చైనా పర్యటన అనంతరం ఆయన భారత్ కు విచ్చేశారు. ప్రధాని మోదీ ప్రవేశపెట్టిన మేక్ ఇన్ ఇండియా ప్రొగ్రామ్ లో యాపిల్ భాగస్వామ్యం కానుంది. ఈ విషయంపై ప్రధాని మోదీతో టిమ్ కుక్ ఈ వారంలో భేటీ కానున్నారు.


మరోవైపు భారత్ లో టెక్నాలజీకి మారుపేరుగా నిలుస్తున్న భాగ్యనగర్ కు టిమ్ కుక్ రేపు విచ్చేయనున్నారు. ఈ పర్యటనలో భాగంగా తెలంగాణ రాజధానికి కొత్త డిజిటల్ మ్యాప్స్ సెంటర్ ను ఆయన ప్రకటించనున్నారు. అమెరికాకు బయట నెలకొల్పుతున్న మెగా బ్రాండ్స్ ఫస్ట్ టెక్నాలజీ సెంటర్ ఇదేకావడం విశేషం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement