సిద్ధి వినాయకుడికి డీమ్యాట్ అకౌంట్ | Siddhivinayak Temple Opens Demat Account For Stock Donations | Sakshi
Sakshi News home page

సిద్ధి వినాయకుడికి డీమ్యాట్ అకౌంట్

Published Tue, Jul 19 2016 6:21 PM | Last Updated on Mon, Sep 4 2017 5:19 AM

సిద్ధి వినాయకుడికి డీమ్యాట్ అకౌంట్

సిద్ధి వినాయకుడికి డీమ్యాట్ అకౌంట్

ముంబై : భక్తులు తరుచుగా సందర్శించే టెంపుల్స్ లో ఒకటిగా నిలుస్తున్న శ్రీ సిద్ధివినాయక గణపతి టెంపుల్ డీమ్యాట్ అకౌంట్ ను తెరిచింది.  అత్యంత శక్తివంతమైన, ధనికమైన గుడిగా పేరొందిన ఈ దేవస్థానం, భక్తుల డొనేషన్లను ఈక్విటీ షేర్లు, ఇతర సెక్యురిటీస్ రూపంలో కానుకలుగా సమర్పించడానికి అవకాశం కల్పించింది. శ్రీ సిద్ధి వినాయక గణపతి ట్రస్ట్ ముంబై పేరుతో సీడీఎస్ఎల్ డీమ్యాట్ అకౌంట్ ను ఎస్ బీఐక్యాప్ సెక్యురిటీస్ లిమిటెడ్ ఓపెన్ చేసింది.

ప్రస్తుతం సిద్ధి వినాయక టెంపుల్ తెరిచిన ఈ అకౌంట్ తో భక్తుల నుంచి కానుకలను షేర్లు, సెక్యురిటీల రూపంలో సేకరించనుంది. సిద్ధి వినాయక భక్తులు ఇకనుంచి యాక్టివ్ గా ట్రేడ్ అయ్యే షేర్లు, సెక్యురిటీలను డొనేట్ చేయొచ్చని లీడింగ్ సెక్యురిటీస్ డిపాజిటరీ సీడీఎస్ఎల్ ఓ ప్రకటనలో తెలిపింది.    

భక్తులు అధికంగా సమర్పించుకునే నగదు, బంగారంతో ఈ ఆలయ గణాంకాలు దేశంలో అత్యంత సంపన్నమైన దేవస్థానంగా ఉంది. ఈ దేవస్థానాన్ని ప్రతేడాది లక్షల మంది సంపన్నమైన, శక్తివంతమైన భక్తులు సందర్శిస్తుంటారు. గతేడాదే తిరుమల తిరుపతి దేవస్థానం డీమ్యాట్ అకౌంట్ ను ఓపెన్ చేసిన సంగతి తెలిసిందే. ఈ అకౌంట్ ఓపెన్ చేసిన దగ్గర్నుంచి భక్తుల కానుకల్లో వినూత్న స్పందన వస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement