SBI 3 In 1 Account Charges, Minimum Balance, Process Full Details In Telugu - Sakshi
Sakshi News home page

ఎస్‌బీఐ ఖాతాదారులకు బంపర్ ఆఫర్..!

Published Sun, Dec 19 2021 1:15 PM | Last Updated on Sun, Dec 19 2021 1:53 PM

SBI Announces 3 in 1 Account Facility For Bank Customers - Sakshi

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్ తన ఖాతాదారులకు సరికొత్త సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొని వచ్చింది. ఎస్‌బీఐ ఖాతాదారులకు 3-ఇన్-1 ఖాతా పేరుతో సరికొత్త సేవలను ప్రారంభించింది. ఎస్‌బీఐ ఖాతాదారులకు సేవింగ్స్ ఖాతా, డీమ్యాట్ ఖాతా, ట్రేడింగ్ ఖాతాలను అనుసంధానించే 3-ఇన్-1 ఖాతా సౌకర్యాన్ని అందిస్తుంది. ఈ ఖాతా వల్ల ట్రేడింగ్ చేసే వారి ప్రయోజనం చేకూరుతుంది. వినియోగదారులు ఒకే ఖాతాతో మూడు రకాల సదుపాయాలను పొందుతారు. ఈ విషయన్ని ఎస్‌బీఐ తన ట్విటర్ ఖాతా ద్వారా తెలియజేసింది. మీరు ఎస్‌బీఐ 3-ఇన్-1 తెరవాలనుకుంటే ఈ క్రింది పేర్కొన్న పత్రాలు అవసరం. 

ఎస్‌బీఐ సేవింగ్స్ బ్యాంక్ ఖాతా కోసం:

  • పాన్ కార్డు లేదా ఫారం 60
  • ఫోటోగ్రాఫ్
  • పాస్‌పోర్ట్, ఆధార్, డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ ఐడీ కార్డ్, ఎమ్ఎన్ఆర్ఈజీఏ జారీ చేసే జాబ్ కార్డ్, మీ పేరు & చిరునామా వివరాలతో జాతీయ జనాభా రిజిస్టర్ జారీ చేసే ఏదైనా ఒక లేఖ. ఇందులో ఏదైనా ఒక పత్రం అవసరం.

ఎస్‌బీఐ డీమ్యాట్ & ట్రేడింగ్ అకౌంట్ కోసం:

  • పాస్‌పోర్ట్ సైజు ఫోటోగ్రాఫ్
  • పాన్ కార్డ్ కాపీ
  • ఆధార్ కార్డు కాపీ
  • ఒక క్యాన్సిల్ చేయబడ్డ చెక్ లీఫ్/తాజా బ్యాంక్ స్టేట్ మెంట్

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement