demat account
-
జిందాల్ కోటెక్స్కు సెబీ షాక్
న్యూఢిల్లీ: యార్న్ సంబంధ ప్రొడక్టులు రూపొందించే జిందాల్ కోటెక్స్పై క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ కొరడా ఝుళిపించింది. కంపెనీకి చెందిన బ్యాంకు, డీమ్యాట్ ఖాతాల అటాచ్‌మెంట్‌కు ఆదేశాలు జారీ చేసింది. గ్లోబల్ డిపాజిటరీ రిసీప్ట్స్(జీడీఆర్‌లు) జారీలో అవకతవకలకు సంబంధించి రూ. 14.55 కోట్ల రికవరీకి వీలు గా తాజా చర్యలు చేపట్టింది. జిందాల్ కోటెక్స్తోపాటు ముగ్గురు అధికారులపైనా చర్యలకు ఉపక్రమించింది. ఈ జాబితాలో సందీప్ జిందాల్, రాజిందర్ జిందాల్, యశ్ పాల్ జిందాల్ ఉన్నారు. వడ్డీసహా అన్ని రకాల వ్యయా లు, చార్జీలు కలిపి రూ. 14.55 కోట్ల రికవరీకిగాను కంపెనీతోపాటు ముగ్గురు అధికారుల బ్యాంకు, లాకర్లు, డీమ్యాట్ ఖాతాల అటాచ్‌మెంట్‌కు సెబీ ఆదేశించింది. ఆయా ఖాతాల కు సంబంధించి అన్ని బ్యాంకులు, మ్యూచు వల్ ఫండ్స్ ఎలాంటి డెబిట్లనూ అనుమతించవద్దంటూ సెబీ ఆదేశించింది. అయితే క్రెడిట్ లావాదేవీలకు మాత్రం అనుమతించింది. చదవండి: కస్టమర్ కంప్లైంట్.. ఫ్లిప్‌కార్ట్‌కు షాకిచ్చిన వినియోగదారుల ఫోరం! -
‘క్రెడిట్ కార్డు యూజర్లకు ఆర్బీఐ అలెర్ట్’
ఆర్బీఐ, స్టాక్ మార్కెట్ల నియంత్రణ సంస్థలు (సెబీ) క్రెడిట్ కార్డ్, డీమ్యాట్ అకౌంట్లపై పలు మార్పులు చేసిన విషయం తెలిసిందే. అక్టోబర్ 1 నుంచి మార్పులు అమలు కానున్నాయి. వీటితో పాటు టోకనైజేషన్, నేషనల్ పెన్షన్ స్కీమ్ (ఎన్పీఎస్), అటల్ పెన్షన్ యోజన (ఏపీవై) పథకాల్లోని మారిన నిబంధనల గురించి తెలుసుకుందాం. క్రెడిట్ కార్డు వినియోగదారుల భద్రతే లక్క్ష్యంగా ఆర్బీఐ ఈ ఏడాది జులై నుంచి డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డులపై ఎప్పుటికప్పుడు మార్పులు చేస్తూ వస్తుంది. తాజాగా ఆర్బీఐ క్రెడిట్ కార్డుల జారీ అంశంలో కొత్త నిబంధనల్ని తెచ్చింది. ఆ నిబంధనల ప్రకారం.. అక్టోబర్ 1 నుంచి క్రెడిట్ కార్డుల జారీ సంస్థలు.. లబ్ధి దారులకు కార్డు జారీ చేసే ముందు వారి నుంచి ఓటీపీ రూపంలో అనుమతి పొందాల్సి ఉంటుంది. ఆ అనుమతి కార్డు జారీ చేసిన 30 రోజుల్లోగా పొందాల్సి ఉంటుంది. లేదంటే 30 రోజుల తర్వాత కార్డు బ్లాక్ అవుతుంది. అలాగే వినియోగదారుడి అనుమతి లేకుండా క్రెడిట్ కార్డు లిమిట్‌ను పెంచవద్దని ఆర్బీఐ ఆదేశాలు జారీ చేసింది. అటల్ పెన్షన్ యోజన పన్ను చెల్లింపు దారులు అక్టోబర్ 1 లోపు అటల్ పెన్షన్ యోజన (ఏపీవై) పథకంలో చేరే అవకాశం ఉంది. అక్టోబర్ 1 లేదా ఆ తర్వాత నుంచి చేరేందుకు అనర్హులని కేంద్ర ఆర్ధిక శాఖ తెలిపింది. ఒకవేళ అక్టోబర్ 1 న ఏపీవైలో చేరితే ఆ ఖాతాను బ్లాక్ చేసి, డిపాజిట్ చేసిన మొత్తాన్ని తిరిగి చెల్లిస్తామని వెల్లడించింది. నేషనల్ పెన్షన్ స్కీమ్ నేషనల్ పెన్షన్ స్కీమ్ ఖాతా దారులకు కేంద్రం శుభవార్త చెప్పింది. పెన్షన్ ఫండ్ రెగ్యూలరేటరీ అండ్ డెవలప్మెంట్ అథారటీ ( పీఎఫ్ఆర్డీఏ) ఆదేశాల ప్రకారం.. అక్టోబర్ 1 నుంచి పెన్షన్ స్కీమ్ ఖాతాదారులు చేసిన ఈ - నామినేషన్‌ను నోడల్ కార్యాలయం అధికారులు 30 రోజుల వ్యవధిలో యాక్సెప్ట్ చేయొచ్చు. లేదంటే రిజక్ట్ చేయొచ్చు. 30 రోజులు పూర్తయిన అధికారులు స్పందించకపోతే సెంట్రల్ రికార్డ్ కీపింగ్ ఏజెన్సీ( సీఆర్ఏ) సిస్టమ్‌లో ఆటోమేటిక్‌గా ఇ- నామినేషన్ ఆమోదం పొందుతుంది. డీ మ్యాట్ అకౌంట్ స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ చేయాలంటే డీమ్యాట్ అకౌంట్ తప్పని సరి. అయితే ఈ డీమ్యాట్ అకౌంట్‌పై స్టాక్ మార్కెట్ నియంత్రణ సంస్థ (సెబీ) ఈ ఏడాది జూన్ 14న సర్క్యూలర్‌ను పాస్ చేసింది. ఆ సర్క్యూలర్ ప్రకారం.. డీ మ్యాట్ టూ ఫ్యాక్టర్ అథంటికేషన్‌ను సెప్టెంబర్ 30,2022లోపు పూర్తి చేయాల్సి ఉంటుంది. దీంతో పాటు అకౌంట్‌ను ఓపెన్ చేసేందుకు ఐడీ, పాస్‌వర్డ్‌తో పాటు బయో మెట్రిక్ అథంటికేషన్ చేయాలని సెబీ ఆదేశాలు జారీ చేసింది. -
యాహూ! డీమ్యాట్ అకౌంట్లోకి రూ.11 వేల కోట్లు, కొన్ని గంటల్లోనే..
ఒక్కోసారి అనుకోని ఘటనలు మన జీవితంలో జరుగుతుంటాయి. అయితే అందులో కొన్ని శాశ్వతంగా నిలిచిపోగా మరికొన్ని తాత్కాలికంగా మాత్రమే ఉంటాయి. ఈ తరహాలోనే ఓ వ్యక్తి తన జీవితంలో జరిగిన ఓ అనూహ్య సంఘటన వల్ల కొన్ని గంటలు కోటీశ్వరుడిగా మారాడు. అదేంటి కొన్ని గంటల వరకే బిలియనీర్‌గా మారడం ఏంటని అనుకుంటున్నారా? వివరాల్లోకి వెళితే.. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌కు చెందిన రమేష్ సాగర్ గత ఆరు సంవత్సరాలుగా స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెడుతూ ఉన్నాడు. ఈ క్రమంలో అతను కోటక్ సెక్యూరిటీస్‌లో ఏడాది క్రితం డీమ్మాట్ అకౌంట్‌ని తెరిచి అందులో అనేక స్టాక్స్‌లలో పెట్టుబడి పెట్టేవాడు. అయితే ఓ రోజు అనకోకుండా అతని అకౌంట్లో సుమారు 11వేల కోట్లు జమ అయ్యింది. ఈ విషయాన్ని గమనించిన రమేష్ మొదట కంగారు పడినప్పటికీ తర్వాత జాక్‌పాట్ కొట్టానని ఆనంద పడ్డాడు. వెంటనే అందులోంచి రూ. 2 కోట్లను స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టి సాయంత్రం వరకు రూ. 5 లక్షలు లాభాన్ని ఆర్జించాడు. అయితే ఖాతాలో డబ్బులు క్రెడిట్ అయిన కొన్ని గంటలకే టెక్నికల్ సమస్య కారణంగా ఆ నగదు తన ఖాతాలో పడిందని, బ్యాంకు అధికారులు మెసేజ్ పంపారు. చివరకు బ్యాంకు నుంచి అతని ఖాతాలో క్రెడిట్ అయిన సొమ్ము కొన్ని గంటల్లోనే ఖాళీ అయ్యింది. కాగా బ్యాంకులో అవకతవకలు జరగడం ఇదే మొదటిసారి కాదు. గత సంవత్సరం, బీహార్ గ్రామంలోని ఇద్దరు పిల్లలు అకౌంట్లో దాదాపు వెయ్యి కోట్ల రూపాయల జమ అయిన సంగతి తెలిసిందే. చదవండి: శ్రీమంతుడు 2.0: రూ.24 వేల కోట్ల కంపెనీని విరాళంగా ఇచ్చాడు! -
LIC IPO: ఎల్ఐసీ కొత్త రూల్.. వారికి మాత్రమే ఐపీఓలో రాయితీ..!
LIC IPO: లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎల్ఐసీ) వచ్చే నెలలో ఐపీఓకు వచ్చేందుకు సిద్దం అవుతున్న సంగతి మనకు తెలిసిందే. అయితే, తన ఎల్ఐసీ ఐపీఓలో పాలసీదారులకు 10 శాతం రాయితీ ఇచ్చేందుకు ముందుకు వచ్చింది. ఈ రాయితీ ఇచ్చేందుకు ఇంతకముందు ఒక నిబంధన పెట్టింది. ఎవరైతే, ఫిబ్రవరి 28లోపు తమ పాలసీలకు పాన్-నెంబర్ లింకు చేస్తారో వారికి మాత్రమే 10 శాతం రాయితీ ఇవ్వనున్నట్లు తెలిపింది. ఈ ప్రకటనతో ఇప్పటివరకు 60-70 లక్షల మంది తమ పాన్(శాశ్వత ఖాతా నంబర్లు) కార్డు నెంబర్లను వెబ్సైట్లో అప్డేట్ చేసినట్లు చైర్మన్ ఎంఆర్.కుమార్ తెలిపారు. ఎల్ఐసీ ఐపీఓకు ముందు పాలసీదారుల నుంచి అద్భుతమైన స్పందన వస్తున్నట్లు చైర్మన్ పేర్కొన్నారు. మార్చిలో ప్రారంభ పబ్లిక్ ఆఫరింగ్(ఐపీఓ)కు వచ్చేందుకు సిద్ధంగా ఉన్న ప్రభుత్వ యాజమాన్యంలోని జీవిత బీమా ఎల్ఐసీ డీమ్యాట్ ఖాతాలు లేని పాలసీదారులకు కూడా సహాయం చేయనున్నట్లు అన్నారు. "మా పాలసీదారులు తమ పాన్ నెంబర్ లింక్ చేయడంలో సహాయపడటానికి మేము అన్ని కార్యాలయాలతో సమావేశాలు జరుపుతున్నాము. డీమ్యాట్ ఖాతాలు లేని పాలసీదారులకు సహాయం చేయడానికి ఎన్.ఎస్.డీ.ఎల్, సీడిఎస్ఎల్ సహకారం తీసుకుంటున్నాము" అని ఎల్ఐసీ చైర్మన్ ఎంఆర్.కుమార్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తెలిపారు. తాజాగా, ఫిబ్రవరి 13కు ముందు ఎల్ఐసీ పాలసీలను కొనుగోలు చేసిన వారు మాత్రమే(డ్రాఫ్ట్ రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్ దాఖలు చేసిన తేదీ) ఈ కోటాకు అర్హులు అని చైర్మన్ పేర్కొన్నారు. గత సంవత్సరం ఎల్ఐసీ చట్టం, 1956కు చేసిన సవరణ చేసి ఐపీఓలో పాల్గొనే పాలసీదారులు & వాటాదారులకు రాయితీ ఇచ్చేందుకు ఎల్ఐసీ మార్గం సుగమం చేసింది. (చదవండి: మూడు సహకార బ్యాంకులకు గట్టి షాకిచ్చిన ఆర్బీఐ..!) -
ఎస్బీఐ ఖాతాదారులకు బంపర్ ఆఫర్..!
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్ తన ఖాతాదారులకు సరికొత్త సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొని వచ్చింది. ఎస్బీఐ ఖాతాదారులకు 3-ఇన్-1 ఖాతా పేరుతో సరికొత్త సేవలను ప్రారంభించింది. ఎస్బీఐ ఖాతాదారులకు సేవింగ్స్ ఖాతా, డీమ్యాట్ ఖాతా, ట్రేడింగ్ ఖాతాలను అనుసంధానించే 3-ఇన్-1 ఖాతా సౌకర్యాన్ని అందిస్తుంది. ఈ ఖాతా వల్ల ట్రేడింగ్ చేసే వారి ప్రయోజనం చేకూరుతుంది. వినియోగదారులు ఒకే ఖాతాతో మూడు రకాల సదుపాయాలను పొందుతారు. ఈ విషయన్ని ఎస్బీఐ తన ట్విటర్ ఖాతా ద్వారా తెలియజేసింది. మీరు ఎస్బీఐ 3-ఇన్-1 తెరవాలనుకుంటే ఈ క్రింది పేర్కొన్న పత్రాలు అవసరం. ఎస్బీఐ సేవింగ్స్ బ్యాంక్ ఖాతా కోసం: పాన్ కార్డు లేదా ఫారం 60 ఫోటోగ్రాఫ్ పాస్‌పోర్ట్, ఆధార్, డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ ఐడీ కార్డ్, ఎమ్ఎన్ఆర్ఈజీఏ జారీ చేసే జాబ్ కార్డ్, మీ పేరు & చిరునామా వివరాలతో జాతీయ జనాభా రిజిస్టర్ జారీ చేసే ఏదైనా ఒక లేఖ. ఇందులో ఏదైనా ఒక పత్రం అవసరం. ఎస్బీఐ డీమ్యాట్ & ట్రేడింగ్ అకౌంట్ కోసం: పాస్‌పోర్ట్ సైజు ఫోటోగ్రాఫ్ పాన్ కార్డ్ కాపీ ఆధార్ కార్డు కాపీ ఒక క్యాన్సిల్ చేయబడ్డ చెక్ లీఫ్/తాజా బ్యాంక్ స్టేట్ మెంట్ Experience the power of 3-in-1! An account that combines Savings Account, Demat Account, and Trading Account to provide you with a simple and paperless trading experience. To know more, visit -https://t.co/Mvt7i2K3Le#Go3in1WithSBI #AzadiKaAmritMahotsavWithSBI pic.twitter.com/3RDWUZEgIF — State Bank of India (@TheOfficialSBI) December 15, 2021 -
Paytm: డీమ్యాట్‌లో పేటీఎమ్ దూకుడు
న్యూఢిల్లీ: డిజిటల్ ఫైనాన్షియల్ సర్వీసుల కంపెనీ పేటీఎమ్ మనీ చిన్న ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటోంది. గత ఆర్థిక సంవత్సరం(2020–21) మార్చికల్లా 2.1 లక్షల డీమ్యాట్ ఖాతాలను ప్రారంభించినట్లు వార్షిక నివేదికలో పేర్కొంది. వీటిలో 80 శాతం 35 ఏళ్లలోపు ఇన్వెస్టర్లేనని తెలియజేసింది. ఈ ఖాతాలలో సగటున రూ. 70,000 చొప్పున ఇన్వెస్ట్ చేసినట్లు వెల్లడించింది. గత ఏడాది కాలంలో ఇన్వెస్టర్ల పెట్టుబడుల తీరులో పలు మార్పులు చోటు చేసుకున్నట్లు పేటీఎమ్ మనీ సీఈవో వరుణ్ శ్రీధర్ తెలియజేశారు. ఈ కాలంలో ఇన్వెస్టర్లు సగటున నెలకు 10 లావాదేవీలు చొప్పున నిర్వహించినట్లు నివేదిక పేర్కొంది. సగటున రూ. 46,000 విలువైన స్టాక్స్‌ను హోల్డ్ చేసినట్లు తెలియజేసింది. ఇదేవిధంగా కొత్త పెట్టుబడులకు రూ. 74,000 జమ చేసినట్లు వివరించింది. ఇక మహిళా ఇన్వెస్టర్లు రెట్టింపుకాగా.. విభిన్న పెట్టుబడి ప్రొడక్టులకు ప్రాధాన్యత ఇచ్చినట్లు వార్షిక నివేదిక వివరించింది. మొత్తం ఇన్వెస్టర్లలో మహిళల సంఖ్య రెట్టింపుకాగా..మొత్తం వినియోగదారుల్లో 44 శాతం మహారాష్ట్ర, గుజరాత్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, కర్ణాటక తదితర ఐదు రాష్ట్రాలనుంచే నమోదైనట్లు తెలియజేసింది. డీమ్యాట్ ఖాతాదారుల్లో 64 శాతం మంది మ్యూచువల్ ఫండ్స్‌లో, 28 శాతం మంది ఈక్విటీలలో ఇన్వెస్ట్ చేసినట్లు వెల్లడించింది. పేటీఎం భారీ నియామకాల ప్రణాళిక... డిజిటల్ చెల్లింపులు, ఆర్థిక సేవల్లో ఉన్న పేటీఎం.. క్షేత్రస్థాయిలో 20,000 మందిని నియమించుకుంటోంది. వర్తకులను డిజిటల్ లావాదేవీల వైపు మళ్లించేందుకు వీరు కృషి చేయాల్సి ఉంటుంది. క్షేత్ర స్థాయి ఉద్యోగికి వేతనం, కమీషన్ రూపంలో నెలకు రూ.35 వేలు, ఆపైన ఆర్జించే అవకాశం ఉంటుందని కంపెనీ తెలిపింది. కనీసం 10వ తరగతి ఉత్తీర్ణులైన యువతీ యువకులు, కళాశాల విద్యార్థులను ఈ ఉద్యోగాల్లో చేర్చుకోనున్నట్టు వివరించింది. క్షేత్ర స్థాయి ఉద్యోగులుగా పెద్ద ఎత్తున మహిళలను నియమించుకోనున్నట్టు వెల్లడించింది. ఆన్‌డ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ కలిగి, 18 ఏళ్లు దాటిన ఔత్సాహికులు అర్హులు. ద్విచక్ర వాహనంతోపాటు గతంలో సేల్స్ విభాగంలో పనిచేసిన అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది. స్థానిక భాషవచ్చి ఉండాలి. -
ఐపీవో ప్రారంభానికి ముందే దరఖాస్తు!
న్యూఢిల్లీ: ప్రైమరీ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయదలచిన రిటైల్ ఇన్వెస్టర్లకు డిజిటల్ చెల్లింపుల దిగ్గజం పేటీఎమ్ సైతం సర్వీసులు అందించనుంది. డీమ్యాట్ ఖాతాలను తెరవడం ద్వారా ఇందుకు అవకాశాన్ని కల్పిస్తోంది. పేటీఎమ్ వినియోగదారులు ఇక నుంచీ పబ్లిక్ ఇష్యూలకు నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందుకు ఆన్లైన్ ఫుడ్ డెలివరీ దిగ్గజం జొమాటో పబ్లిక్ ఇష్యూని వేదిక చేసుకుంది. జొమాటో ఇష్యూ బుధవారం నుంచీ ప్రారంభంకానుంది. అంతకంటే ముందుగానే అప్లై చేసుకునేందుకు పేటీఎమ్ వీలు కల్పిస్తోంది. అయితే ఐపీవో ప్రారంభమయ్యాకే దరఖాస్తుల ప్రాసెసింగ్ ఉంటుంది. రిటైలర్లకు జోష్...: ఐపీవో తేదీకంటే ముందుగానే దరఖాస్తు చేసుకునేందుకు పేటీఎమ్ వీలు కల్పించడంతో మరింతమంది రిటైల్ ఇన్వెస్టర్లు ప్రైమరీ మార్కెట్ బాట పట్టే అవకాశముంది. నిజానికి సాధారణ పద్ధతిలో ఐపీవో ప్రారంభమయ్యాకే బిడ్స్‌కు వీలుంటుంది. కాగా.. గత రెండు రోజులుగా ప్రారంభమైన పేటీఎమ్ మనీ ప్లాట్‌ఫామ్ ద్వారా భారీస్థాయిలో రిటైలర్లు జొమాటో పబ్లిక్ ఇష్యూకి దరఖాస్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రీఐపీవో అప్లికేషన్ పేరుతో ఇందుకు వీలు కల్పించింది. వెరసి మార్కెట్ సమయాల్లో బిజీగా ఉండే యువత, తదితరులకు అన్నివేళలా ఐపీవోకు అప్లై చేసేందుకు దారి చూపుతోంది. ఈ ఆర్డర్లను పేటీఎమ్ మనీ ప్లాట్‌ఫామ్ ద్వారా నమోదు చేస్తుంది. ఆపై పబ్లిక్ ఇష్యూ ప్రారంభమయ్యాక ఎక్సే్ఛంజీలకు బదిలీ చేస్తుంది. పబ్లిక్ ఇష్యూ దరఖాస్తుకు సంబంధించిన సమాచారాన్ని సైతం వినియోగదారుడు అన్నివేళలా తెలుసుకునేందుకు వీలుంటుంది. భారీ స్పందన లభించే కొన్ని ఐపీవోలకు దరఖాస్తు సమయంలో సర్వర్ల సమస్యలు తలెత్తినప్పటికీ పేటీఎమ్ ఫీచర్ ప్రయోజనకరంగా ఉంటుందని కంపెనీ పేర్కొంటోంది. ఐపీవోకు ఓకే... తాజాగా నిర్వహించిన అసాధారణ సర్వసభ్య సమావేశం(ఈజీఎం)లో భాగంగా రూ. 12,000 కోట్ల సమీకరణకు ప్రతిపాదించిన పబ్లిక్ ఇష్యూకి పేటీఎమ్ వాటాదారులు అనుమతించారు. సెకండరీ సేల్ ద్వారా మరో రూ. 4,600 కోట్లను సమకూర్చుకోనున్నట్లు తెలుస్తోంది. వెరసి రూ. 16,600 కోట్ల ఐపీవో చేపట్టనున్నట్లు సంబంధిత వర్గాలు తెలియజేశాయి. ఈజీఎంలో కంపెనీ వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మను నాన్‌ప్రమోటర్‌గా సవరించే ప్రతిపాదనకూ వాటాదారులు ఆమోదముద్ర వేశారు. కంపెనీలో విజయ్‌కు ప్రస్తుతం 14.61 శాతం వాటా ఉంది. అయితే పేటీఎమ్ చైర్మన్, ఎండీ, సీఈవోగా కొనసాగనున్నారు. భారీ డిమాండ్ గత కొద్ది నెలలుగా ప్రైమరీ మార్కెట్ కళకళలాడుతోంది. దరఖాస్తుదారులు అధికమయ్యా రు. మార్కెట్ వేళల్లో పనులు, దరఖాస్తు సమయంలో ఆలస్యాలు తదితరాల కారణంగా కొంత మంది వీటిని మిస్ అవుతున్నారు. దీంతో ఎలాం టి అవకాశాలు కోల్పోకుండా ఆధునిక ఫీచర్స్‌ను రూపొందించాం. తద్వారా వినియోగదారులు సులభంగా దరఖాస్తు చేసుకునేందుకు వీలు కల్పించాం. ఒకే క్లిక్‌తో దరఖాస్తు చేసుకోవచ్చు. – వరుణ్ శ్రీధర్, సీఈవో పేటీఎమ్ మనీ -
వరంగల్‌లో 19న సాక్షి ఇన్వెస్టర్స్ సదస్సు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: నిత్యావసరాల ధరలు పెరుగుతున్నాయి. డిపాజిట్లు చేస్తే వడ్డీలు తగ్గుతున్నాయి. మరి సరైన ఆదాయం రావటం ఎలా? ఖర్చులను తగ్గించుకుంటూ.. పొదుపు చేసినా... అందుకు సరైన సాధనమేంటి? భవిష్యత్తు అవసరాల కోసం అనువైన పెట్టుబడులేంటి? ఇలా ఒకటేమిటి ఆర్థిక ప్రణాళికలు– పెట్టుబడుల నిర్వహణ, స్టాక్ మార్కెట్, డీమాట్ ఖాతా గురించి సమస్త సమాచారాన్ని, మెళకువలను అందించేందుకు వరుసగా సదస్సులు నిర్వహిస్తున్న ‘‘సాక్షి మైత్రి ఇన్వెస్టర్ క్లబ్’’... ఈ సారి వరంగల్‌లో సదస్సు నిర్వహిస్తోంది. ⇔ ఈనెల 19 ఆదివారంనాడు హన్మకొండ బాలసముద్రంలోని సామ జగన్మోహన్ స్మారక భవనంలో ఉదయం 10 నుంచి 1 గంట వరకు ఈ సదస్సు జరుగుతుంది. ప్రవేశం ఉచితం. సభ్యత్వం కోసం 95055 55020కు ఫోన్ చేసి పేర్లను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ⇔ ఈ సదస్సులో సెంట్రల్ డిపాజిటరీ సర్వీసెస్ రీజినల్ మేనేజర్ శివ ప్రసాద్, కార్వి స్టాక్ బ్రోకింగ్ లిమిటెడ్ జీఎంలు ఎస్ వెంకట శ్రీనివాస్ రెడ్డి, జయంత్ కుమార్, ఫండమెంటల్ రీసెర్చ్ అనలసిస్ట్ అశోక్ రామినేని వక్తలుగా పాల్గొని విలువైన సమాచారాన్ని, సూచనలను అందిస్తారు. -
షేర్లలో పెట్టుబడికి అవగాహన తప్పనిసరి
‘సాక్షి’ మైత్రి మదుపరుల అవగాహన కార్యక్రమంలో సీడీఎస్ఎల్ రీజనల్ మేనేజర్ వెనిశెట్టి సాక్షి, రాజమహేంద్రవరం: షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేముందు మదుపరులు మార్కెట్లోని అంశాలపై అవగాహన పెంచుకోవాలని సీడీఎస్ఎల్ రీజనల్ మేనేజర్ శివప్రసాద్ వెనిశెట్టి పేర్కొన్నారు. శనివారం తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ‘సాక్షి మైత్రి’ మదుపరుల అవగాహన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆయన ఔత్సాహిక మదుపుదారులకు పలు సూచనలు ఇచ్చారు. ఏదైనా కంపెనీ షేర్లు కొనుగోలు చేసే ముందు దాని వ్యాపార లావాదేవీలు మూడేళ్లుగా ఎలా ఉన్నాయో తెలుసుకోవాలన్నారు.డీమ్యాట్ అకౌంట్ తీసుకునేప్పుడు నామినీ పేరు చేర్చడం వల్ల.. అనుకోకుండా మదుపుదారుడు చనిపోయినా ఎలాంటి ప్రక్రియ లేకుండా నేరుగా ఆ షేర్లు నామినీకి బదిలీ అవుతాయన్నారు. మైనర్లు కూడా డీమ్యాట్ అకౌంట్ తీసుకోవచ్చని, లావాదేవీలు నిర్వహించేందుకు మాత్రం అనుమతి ఉండదని తెలిపారు. బ్యాంకులు, స్టాక్ బ్రోకర్ల ద్వారా సీడీఎస్ఎల్ మదుపుదారులకు సేవలందిస్తుందని చెప్పారు. బ్రోకర్ల ద్వారానే షేర్లు కొనుగోలు చేయాలని చెప్పిన ఆయన.. వారు ఇచ్చే కాంట్రాక్ట్ నోట్ భద్రపరుచుకోవాలని సూచించారు. చిన్న, కొత్త ముదుపుదారులకు రాజీవ్‌గాంధీ పథకం ద్వారా లభించే లాభాలు, రాయితీలను వివరించారు. అనంతరం మదుపుదార్ల సందేహాలను నివృత్తి చేశారు. కార్యక్రమంలో కొటక్ మ్యూచువల్ ఫండ్ తెలుగు రాష్ట్రాల హెడ్ విజయకుమార్ తిమ్ములూరు, హెచ్డీఎస్సీ ఏరియా సేల్స్ మేనేజర్ జి.విజయ్‌కుమార్, ‘సాక్షి’ రాజమహేంద్రవరం యూనిట్ మేనేజర్ శివుడు పాల్గొన్నారు. -
సిద్ధి గణపయ్యకు డీమ్యాట్ ఖాతా
♦ సీడీఎస్ఎల్ సంస్థ నుంచి ప్రారంభం ♦ఎలక్ట్రానిక్ విధానంలో షేర్ల బదిలీకి అవకాశం ♦డీమ్యాట్ ఖాతాలు తెరిచేందుకు ఆలయాలు, మత సంస్థల ఆసక్తి ♦ఆదాయం పెంచుకునే ఆలోచన... ♦ఇప్పటికే 50కు పైగా ప్రారంభం ముంబై: దేశంలోనే సంపన్న గణనాథుడిగా భక్తులతో పూజలందుకుంటున్న ముంబైలోని శ్రీ సిద్ధి వినాయక ఆలయం... భక్తుల షేర్లను విరాళంగా స్వీకరించేందుకు డీమ్యాట్ ఖాతా ప్రారంభించింది. ఆలయ వ్యవహారాలను చూసే ‘శ్రీ సిద్ధి వినాయక్ గణపతి టెంపుల్ ట్రస్ట్(ప్రభావతి)’ పేరుతో ఎస్బీఐ క్యాప్ సెక్యూరిటీస్ ద్వారా ఈ ఖాతా తెరిచారు. 12047200 11413505 నంబర్‌తో ఉన్న ఖాతా ప్రారంభ కిట్‌ను ఆలయ ట్రస్ట్‌కు మంగళవారం ఇక్కడ సీడీఎస్ఎల్ సంస్థ అందజేసింది. భక్తులు ఇకపై సిద్ధి వినాయకుడికి స్టాక్ మార్కెట్లో చురుగ్గా ట్రేడయ్యే షేర్లను, సెక్యూరిటీలను విరాళంగా ఇచ్చే అవకాశం ఏర్పడినట్టు సీడీఎస్ఎల్ ఎండీ, సీఈవో పీఎస్ రెడ్డి మంగళవారం ముంబైలో తెలిపారు. ఎలాంటి షేర్లను విరాళంగా ఇవ్వవచ్చన్న వివరాలను సిద్ధివినాయక డాట్ ఓఆర్జీ వెబ్సైట్ నుంచి తెలుసుకోవచ్చని చెప్పారాయన. టీటీడీ బాటలో...: గతేడాది దేశంలోనే తొలిసారిగా తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) భక్తుల నుంచి షేర్ల రూపంలో విరాళాలను అందుకునేందుకు డీమ్యాట్ ఖాతాను ప్రారంభించింది. దీనికి భక్తుల నుంచి సైతం మంచి స్పందన వచ్చింది. దీంతో దేశంలోని ఇతర ఆలయాలు కూడా టీటీడీ బాటలోనే అడుగులేశాయి. మత సంస్థలు, పలు చర్చిలు, మసీదులు కూడా డీమ్యాట్ ఖాతాలు ప్రారంభించాయి. సుమారు 50కు పైగా మత సంస్థలు డీమ్యాట్ ఖాతాలు తెరిచినట్టు సమాచారం. వీటిలో వైష్ణోదేవి ఆలయం, స్వామి నారాయణ్ ఆలయం, శంకరాచార్య ఆలయం, చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా, రాజస్థాన్‌లోని శ్రీనాథ్జీ ఆలయం, అంబానీలు కొలిచే నత్ద్వారా, ముంబై బాబుల్నాథ్ మందిరం, వర్ధమాన్ మహావీర్ ఆలయం మొదలైనవి ఈ జాబితాలో ఉన్నాయి. కాకపోతే ఆలయ ట్రస్ట్‌బోర్డ్ లేదా మత సంస్థ పేరిట పాన్ నంబర్ తీసుకున్న తర్వాతే డీమ్యాట్ ఖాతా తెరిచేందుకు అవకాశం ఉంటుంది. -
సిద్ధి వినాయకుడికి డీమ్యాట్ అకౌంట్
ముంబై : భక్తులు తరుచుగా సందర్శించే టెంపుల్స్ లో ఒకటిగా నిలుస్తున్న శ్రీ సిద్ధివినాయక గణపతి టెంపుల్ డీమ్యాట్ అకౌంట్ ను తెరిచింది. అత్యంత శక్తివంతమైన, ధనికమైన గుడిగా పేరొందిన ఈ దేవస్థానం, భక్తుల డొనేషన్లను ఈక్విటీ షేర్లు, ఇతర సెక్యురిటీస్ రూపంలో కానుకలుగా సమర్పించడానికి అవకాశం కల్పించింది. శ్రీ సిద్ధి వినాయక గణపతి ట్రస్ట్ ముంబై పేరుతో సీడీఎస్ఎల్ డీమ్యాట్ అకౌంట్ ను ఎస్ బీఐక్యాప్ సెక్యురిటీస్ లిమిటెడ్ ఓపెన్ చేసింది. ప్రస్తుతం సిద్ధి వినాయక టెంపుల్ తెరిచిన ఈ అకౌంట్ తో భక్తుల నుంచి కానుకలను షేర్లు, సెక్యురిటీల రూపంలో సేకరించనుంది. సిద్ధి వినాయక భక్తులు ఇకనుంచి యాక్టివ్ గా ట్రేడ్ అయ్యే షేర్లు, సెక్యురిటీలను డొనేట్ చేయొచ్చని లీడింగ్ సెక్యురిటీస్ డిపాజిటరీ సీడీఎస్ఎల్ ఓ ప్రకటనలో తెలిపింది. భక్తులు అధికంగా సమర్పించుకునే నగదు, బంగారంతో ఈ ఆలయ గణాంకాలు దేశంలో అత్యంత సంపన్నమైన దేవస్థానంగా ఉంది. ఈ దేవస్థానాన్ని ప్రతేడాది లక్షల మంది సంపన్నమైన, శక్తివంతమైన భక్తులు సందర్శిస్తుంటారు. గతేడాదే తిరుమల తిరుపతి దేవస్థానం డీమ్యాట్ అకౌంట్ ను ఓపెన్ చేసిన సంగతి తెలిసిందే. ఈ అకౌంట్ ఓపెన్ చేసిన దగ్గర్నుంచి భక్తుల కానుకల్లో వినూత్న స్పందన వస్తోంది. -
అమ్మ కోసం ఎలాంటి పాలసీ తీసుకోవాలి?
డీమ్యాట్ అకౌంట్ ద్వారా మ్యూచువల్ ఫండ్స్‌లో మదుపు చేద్దామనుకుంటున్నాను. ఇలా చేస్తే డెరైక్ట్ ప్లాన్‌లో పెట్టుబడి పెట్టినట్లు అవుతుందా? లేకుంటే రెగ్యులర్ ప్లాన్‌లో పెట్టుబడి పెట్టినట్లు అవుతుందా? డీ మ్యాట్ అకౌంట్ ద్వారా మ్యూచువల్ ఫండ్స్ డెరైక్ట్ ప్లాన్‌లో ఇన్వెస్ట్ చేయవచ్చా? - సాగర్, వరంగల్ మీరు డీమ్యాట్ అకౌంట్ ద్వారా మ్యూచువల్ ఫండ్ స్కీమ్‌ల్లో మదుపు చేయవచ్చు. కానీ డెరైక్ట్ ప్లాన్‌ల్లో కాదు. మీరు మీ డీమ్యాట్ అకౌంట్‌కు సంబంధించిన వివరాలేమీ ఇవ్వలేదు. బ్యాంక్ లేదా బ్రోకింగ్ సంస్థ వంటి ఇంటర్మీడియరీ అందించే డీ మ్యాట్ అకౌంట్ ద్వారా మీరు లావాదేవీలు నిర్వహిస్తున్నారని భావిస్తున్నాను. ఇలాంటి ఇంటర్మీడియరీ ద్వారా మీరు మ్యూచువల్ ఫండ్స్ స్కీమ్‌ల్లో ఇన్వెస్ట్ చేస్తే, సదరు మ్యూచువల్ ఫండ్ సంస్థ, ఆ డీమ్యాట్ సంస్థకు కొంత కమీషన్ చెల్లిస్తుంది. వినియోగదారులు నేరుగా మ్యూచువల్ ఫండ్ సంస్థను సంప్రదించి డెరైక్ట్ ప్లాన్‌ల్లో మదుపు చేయవచ్చు. ఇన్వెస్టర్‌కు, మ్యూచువల్ ఫండ్ సంస్థకు మధ్య ఎలాంటి మధ్యవర్తులు/ఏజెంట్లు లేకుండా ఇన్వెస్ట్ చేయడం కోసం ఉద్దేశించినవే.. డెరైక్ట్ ప్లాన్లు. మా అమ్మ వయస్సు 58 సంవత్సరాలు. ఆమె కోసం ఇంతవరకూ ఎలాంటి ఆరోగ్య బీమా పాలసీ తీసుకోలేదు. ఆమె కోసం ఏమైనా ప్లాన్లు సూచిస్తారా ? ఆమెను ఫ్యామిలీ ఫ్లోటర్ ప్లాన్‌లో చేర్చమంటారా ? లేక ఆమె కోసమే ప్రత్యేకంగా ఏదైనా ప్లాన్ తీసుకోమంటారా ? తగిన సలహా ఇవ్వండి. - సునయన, విశాఖపట్టణం పెద్దవాళ్లను/సీనియర్ సిటిజన్లను ఫ్యామిటీ ఫ్లోటర్ ప్లాన్‌లో చేర్చడం సరైనది కాదు. ఇలా చేస్తే మీరు చెల్లించాల్సిన ప్రీమియమ్‌లు అనవసరంగా పెరిగిపోతాయి. సీనియర్ సిటిజన్లు ఈ వైద్య బీమా రక్షణను అధికంగా వినియోగించుకుంటారు. కుటుంబంలోని ఇతరులకు తక్కువ బీమా రక్షణ అందుతుంది. అందుకని మీ అమ్మగారి కోసం మీరు ప్రత్యేకంగా వేరే ప్లాన్‌ను తీసుకోవడమే ఉత్తమం. జీవిత కాల రెన్యూవల్ ఉండే ప్లాన్‌ను తీసుకోవచ్చు. మీ అమ్మగారి ఆరోగ్య బీమా పాలసీ కోసం-ఐసీఐసీఐ లాంబార్డ్ కంప్లీట్ హెల్త్ ఇన్సూరెన్స్-ఐ హెల్త్ ప్లాన్, బజాజ్ అలయంజ్ సిల్వర్ హెల్త్, అపోలో మ్యూనిక్ ఈజీ హెల్త్ ప్లాన్లను పరిశీలించవచ్చు. పాలసీలు తీసుకునేటప్పుడు మినహాయింపులు, వెయిటింగ్ పీరియడ్ తదితర అంశాలన్నింటినీ క్షుణ్నంగా పరిశీలించండి. 58 సంవత్సరాల వయస్సున్న వ్యక్తి కోసం ఆన్లైన్లో ఆరోగ్య బీమా పాలసీ తీసుకోకూడదు. మీ అమ్మగారి ఆరోగ్య పరిస్థితులను మీ ప్రశ్నలో ప్రస్తావించలేదు. అందుకని ప్రీమియమ్‌ల గురించి ఏమీ చెప్పలేకపోతున్నాం. పాలసీకు ముందే చేసే హెల్త్ చెకప్, కుటుంబ ఆరోగ్య చరిత్ర, ఇతర అంశాలపై ప్రీమియమ్‌లు ఆధారపడి ఉంటాయి. ఆర్బిట్రేజ్ ఫండ్ డివిడెండ్ ఆప్షన్లో మదుపు చేద్దామనుకుంటున్నాను. ఈ యూనిట్లను ఏడాదిలోపే విక్రయిస్తే నేను ఎంత మొత్తంలో పన్ను చెల్లించాల్సి ఉంటుంది? - ప్రసేన్ కుమార్, హైదరాబాద్ పన్ను అంశాల పరంగా ఆర్బిట్రేజ్ ఫండ్స్‌ను ఈక్విటీ ఫండ్స్‌గానే పరిగణిస్తారు. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ అందించే డివిడెండ్లపై ఇన్వెస్టర్లు ఎలాంటి పన్నులు చెల్లించాల్సిన పనిలేదు. అంతేకాకుండా ఈక్విటీ ఫండ్ డివిడెండ్లపై మ్యూచువల్ ఫండ్ సంస్థలు కూడా ఎలాంటి పన్నులు చెల్లించవు. ఈ ఫండ్స్ యూనిట్లను ఏడాదిలోపే విక్రయిస్తే, మీరు 15 శాతం చొప్పున స్వల్పకాలిక మూలధన లాభాల పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అదే ఏడాది తర్వాత ఈ యూనిట్లను విక్రయిస్తే, మీరు ఎలాంటి పన్నులు చెల్లించాల్సిన పనిలేదు. ఈక్విటీ ఫండ్స్ యూనిట్లను ఏడాది తర్వాత విక్రయిస్తే వచ్చే లాభాలను దీర్ఘకాలిక మూలధన లాభాలుగా పరిగణిస్తారు. ఈక్విటీ ఫండ్స్‌పై ఎలాంటి దీర్ఘకాలిక మూలధన లాభాల పన్నులు చెల్లించాల్సిన పనిలేదు. ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక కాలంలో ఈక్విటీ పెట్టుబడులపై రూ.5,000 స్వల్పకాలిక లాభాలు పొందాను. ఈ లాభాలపై నేను ఎంత పన్ను చెల్లించాలి ? ఇలా పొందిన లాభాలను వేరే ఏ ఇతర సాధనాల్లో ఇన్వెస్ట్ చేస్తే పన్ను మినహాయింపులు పొందగలనా? నేను ఇప్పటికే నేషనల్ పెన్షన్ స్కీమ్(ఎన్పీఎస్), బీమా ఇన్వెస్ట్‌మెంట్స్‌పై నేను పన్ను మినహాయింపులు పొందాను. ఈ స్వల్పకాలిక మూలధన లాభాలపై పన్ను మినహాయింపునుపొందడానికి ఏమైనా మార్గాలున్నాయా ? - క్రాంతి, బెంగళూరు మీ ఈక్విటీ పెట్టుబడులను కొనుగోలు చేసిన ఏడాదిలోపే విక్రయిస్తే మీరు 15 శాతం స్వల్పకాలిక మూలధన లాభాల పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఈ స్వల్పకాలిక మూలధన లాభాల పన్ను మినహాయిం పులు పొందడానికి మీకు వేరే ఎలాంటి మార్గం లేదు. ఈ ఈక్విటీ పెట్టుబడులపై వచ్చిన లాభాలను వేరే ఏ ఇతర సాధనాల్లో ఇన్వెస్ట్ చేసినా కూడా మీరు పన్ను మినహాయింపులు పొందలేరు. - ధీరేంద్ర కుమార్ సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్ -
డీమ్యాట్ ఖాతా తెరుస్తున్నారా?
నగదు లావాదేవీల కోసం బ్యాంకు ఖాతాల తరహాలోనే షేర్ల క్రయవిక్రయాల కోసం ఉపయోగపడేదే డీమ్యాట్ అకౌంటు. డీమెటీరియలైజ్డ్ అకౌంటుకు సంక్షిప్త రూపమే డీమ్యాట్ ఖాతా. ఐసీఐసీఐ సెక్యూరిటీస్, మోతీలాల్ ఓస్వాల్, కొటక్ సెక్యూరిటీస్ మొదలైన బ్రోకరేజి సంస్థలు డీమ్యాట్ అకౌంట్లు ఇస్తున్నాయి. మార్కెట్లలో పెట్టుబడులకు కీలకమైన డీమ్యాట్ అకౌంట్లు, వాటి తీరుతెన్నుల గురించి వివరించేదే ఈ కథనం. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయదల్చుకునే వారికి ప్రధానంగా బ్యాంకు అకౌంటు, ట్రేడింగ్ అకౌంటు, డీమ్యాట్ అకౌంటు అవసరమవుతాయి. షేర్లు కొనడం, అమ్మడం నగదుతో ముడిపడి ఉంటుంది కాబట్టి బ్యాంకు ఖాతా కావాలి. ఆన్లైన్లో షేర్ల క్రయవిక్రయాల కోసం ట్రేడింగ్ ఖాతా ఉపయోగపడుతుంది. ఇక మీరు కొన్న షేర్లను ఎలక్ట్రానిక్ రూపంలో భద్రపర్చేందుకు డీమ్యాట్ ఖాతా అవసరమవుతుంది. సాధారణంగా బ్యాంకింగ్, బ్రోకింగ్ సేవలు అందించే సంస్థలు.. ఈ మూడింటిని 3-ఇన్-1 అకౌంట్లుగా కూడా అందిస్తున్నాయి. తద్వారా ఈ మూడింటిని ఒకదానితో మరొకదాన్ని అనుసంధానించుకోవచ్చు. ఇలా కాకుండా కొన్ని కేవలం డీమ్యాట్, ట్రేడింగ్ ఖాతాలు ఇస్తున్నాయి. ఇలాంటప్పుడు విడిగా బ్యాంకు అకౌంటు తీసుకుని, దాన్ని వీటికి అనుసంధానించుకోవాల్సి ఉంటుంది. ఇక, డీమ్యాట్ ఖాతాలకు సంబంధించి కచ్చితంగా చూసుకోవాల్సిన అంశాలు కొన్ని ఉన్నాయి. అవేంటంటే.. చార్జీలు, ఫీజులు: షేరు కొన్నా, అమ్మినా ప్రతిసారీ బ్రోకరేజి చార్జీలు కట్టాల్సి ఉంటుంది. ఇది ఫిక్స్డ్ అమౌంటుగా గానీ లేదా లావాదేవీ విలువలో ఇంత శాతమని గానీ ఉంటుంది. ఉదాహరణకు బ్రోకింగ్ ఫీజు 0.5 శాతం అనుకుంటే, మీరు రూ. 100 విలువ చేసే స్టాక్స్ కొన్న ప్రతిసారీ 50 పైసలు కట్టాల్సి ఉంటుంది. షేర్లు కాకుండా డెరివేటివ్స్, మ్యూచువల్ ఫండ్స్ మొదలైన వాటికి వేరే తరహా చార్జీలు ఉంటాయి. ఇక బ్రోకరేజి సంస్థలు, సర్వీసులను బట్టి వార్షికంగా రూ. 500 నుంచి రూ. 2,000 దాకా ఫీజులు ఉంటాయి. ఇవే కాకుండా డీమ్యాట్ చార్జీలని (షేర్లు పేపర్ సర్టిఫికెట్ రూపంలో ఉంటే వాటిని డీమ్యాట్ రూపంలోకి మార్చేందుకు), అడ్వైజరీ ఫీజులు, ఆప్షన్ అండ్ ఫ్యూచర్ ట్రేడింగ్ ఫీజులని సర్వీసుల వినియోగాన్ని బట్టి ఉంటాయి. టెక్నాలజీ, ట్రేడింగ్ ప్లాట్‌ఫాం: డీమ్యాట్ ఖాతాను తీసుకోవడంలో తక్కువ బ్రోకరేజి చార్జీలు మాత్రమే చూసుకుంటే సరిపోదు. సిసలైన ఇన్వెస్టర్లు ట్రేడింగ్ ప్లాట్‌ఫాం టెక్నాలజీ కూడా అత్యాధునికంగా ఉండేలా చూసుకోవాలి. ఇవే కాకుండా ట్రేడింగ్ ప్లాట్‌ఫాంకి ఉండాల్సిన లక్షణాలివి.. ►క్షణక్షణానికి మారిపోయే షేర్ల రేట్లను రియల్ టైమ్‌లో చూపించాలి ►ఫేవరెట్ స్టాక్స్, ఈవెంట్స్ మొదలైన వాటితో సొంత వాచ్ లిస్ట్ ఏర్పర్చుకునే సదుపాయం ఉండాలి. ►ఫైనాన్షియల్ డేటా, హిస్టరీ, కీలక ఈవెంట్స్, ఆయా కంపెనీల విశ్లేషణ మొదలైనవి అందుబాటులో ఉండాలి. ►నిర్దిష్ట కాలంలో జరిపిన లావాదేవీల హిస్టరీ, పోర్ట్‌ఫోలియో విలువ, లాభనష్టాలు, మార్జిన్ మనీ (అవసరమైతే) మొదలైన వివరాలు తెలిసేలా ట్రేడింగ్ ప్లాట్‌ఫాం ఉండాలి. గుర్తుంచుకోండి... సులభతరంగా లావాదేవీలు నిర్వహించుకునే సౌలభ్యంతో పాటు చౌకగా సర్వీసులు అందించే బ్రోకింగ్ సంస్థను ఎంచుకోవాలి. ఇందుకోసం వివిధ బ్రోకింగ్ సంస్థల వెబ్సైట్లలో డీమ్యాట్ ఖాతాల ప్రోటోటైప్ మోడల్స్ ఉంటాయి. ఖాతా స్వరూపం, ఇతర వివరాలు, లావాదేవీలు జరిగే విధానం మొదలైనవన్నీ వీటిలో ఉంటుంది. ఇప్పటికే ఉన్న ఖాతానో లేదా శాలరీ అకౌంటో కాకుండా కేవలం ట్రేడింగ్ కోసమే ప్రత్యేక బ్యాంక్ అకౌంటు ప్రారంభిస్తే మంచిది. దీనివల్ల మీ లాభనష్టాలు సులభంగా లెక్కకట్టుకోవచ్చు. ఇక, నిమిష నిమిషానికి మారిపోయే స్టాక్‌మార్కెట్ పరిణామాలు చూసి కంగారుపడిపోకుండా ఆలోచించి, ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. మీ దీర్ఘకాలిక పెట్టుబడి లక్ష్యాల కోసం ఇన్వెస్ట్ చేసేందుకు ఉపయోగపడేవిగా ఉండే కొన్ని కంపెనీలనే ఎంచుకోండి. వాటిని పూర్తిగా అధ్యయనం చేయండి. ఇన్వెస్ట్ చేశాక ఓర్పుగా ఉండండి. అప్పుడే ఆర్థిక లక్ష్యాలను చేరుకోవడం సాధ్యపడుతుంది. -
డిమ్యాట్ అకౌంట్ అనగా..?
Banks Special: Banking Awareness 'Demat Account' Means..? 1. Which of the following stock exchange is derecognized by SEBI on 19.11.2014 on the allegations of serious irregularities in its functioning? a) Bombay Stock Exchange b) Delhi Stock Exchange c) Calcutta Stock Exchange d) Bangalore Stock Exchange e) None of the above 2. Which of the following is not a function of General Insurance? a) Cattle Insurance b) Crop Insurance c) Marine Insurance d) Fire Insurance e) Medical Insurance 3. Liability- side of the balance-sheet comprises: a) Capital and reserve b) Long-term liabilities c) Current liabilities d) All of the above e) None of the above 4. Minimum cash reserves fixed by law constitute ___ a) A percentage of aggregate deposits of the bank b) A percentage of aggregate loans and advances of the bank c) A percentage of capital & reserves of the bank d) All of the above e) None of these 5. Which of the following organizations/ agencies has sought an emergency fund of Rs.1000 crore from banks to tackle acute liquidity crisis, which is coming in the way to give loans to micro borrowers? a) Regional Rural & Cooperative Banks b) RBI c) Micro Finance Institutions d) NABARD e) None 6. Which of the following types of accounts are known as "Demat Accounts"? a) Zero Balance Accounts b) Accounts which are opened to facilitate repayment of a loan taken from the bank. No other business can be conducted from there c) Accounts in which shares of various companies are traded in electronic form d) Accounts which are operated through internet banking facility e) None of the above Key: 1) b; 2) e; 3) d; 4) a; 5) d; 6) c. K.V. Gnana Kumar Director, DBS, Hyderabad -
ఫండ్స్ కొనుగోళ్లకు డీమ్యాట్ అకౌంట్ ఉండాలా?
నేను గత కొంతకాలంగా ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్(ఈఎల్ఎస్ఎస్)లో ఇన్వెస్ట్ చేస్తున్నాను. దీనికి సంబంధించిన లాక్-ఇన్ పీరియడ్ పూర్తయింది. నేను ఈ స్కీమ్‌లోనే కొనసాగాలనుకుంటున్నాను. కానీ, డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ ఆదా చేసే ఉద్దేశంతో డివిడెండ్ ఆప్షన్ నుంచి గ్రోత్ ఆప్షన్‌కు మారదామనుకుంటున్నాను. ఇలా మారితే మరో మూడేళ్లు లాకిన్ పీరియడ్ వర్తిస్తుందా?- లావణ్య కుమార్, హైదరాబాద్ మీరు ఈఎల్ఎస్ఎస్ స్కీమ్‌లో కొనసాగాలనుకుంటే, డివిడెండ్ ఆప్షన్ నుంచి గ్రోత్ ఆప్షన్‌కు మీ ఇన్వెస్ట్‌మెంట్‌ను మార్చుకుంటే, దానిని తాజా కేసుగానే భావిస్తారు. దీంతో మరో మూడేళ్ల లాకిన్ పీరియడ్ వర్తిస్తుంది. డైవర్సిఫైడ్ ఈక్విటీ ఫండ్‌లో గ్రోత్ ఆప్షన్లో మీరు ఇన్వెస్ట్ చేస్తే మీకు ఈ లాకిన్ పీరియడ్ బాదరబందీ ఏమీ ఉండదు. ఈఎల్ఎస్ఎస్ డివిడెండ్ ఆప్షన్లో ఎప్పుడు డివిడెండ్ చెల్లించాలనేది ఫండ్ మేనేజ్మెంట్ నిర్ణయిస్తుంది. డైవర్సిఫైడ్ ఈక్విటీ ఫండ్‌లో రెగ్యులర్ ఆప్షన్లో కనుక మీరు ఇన్వెస్ట్ చేసినట్లయితే మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌పై నియంత్రణ మీకే ఉంటుంది. ఒక ఏడాది దాటిన ఇన్వెస్ట్‌మెంట్స్‌ను మీరు ఉపసంహరించుకుంటే, వాటిని దీర్ఘకాలిక లాభాలుగా పరిగణించి ఎలాంటి పన్నులు విధించరు. ఫలితంగా మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను మీరు ఎప్పుడు ఉపసంహరించుకోవాలనే విషయాన్నీ మీరే నిర్ణయించుకోవచ్చు. అంతేకాకుండా ఎంత కావాలనుకుంటే అంతే మొత్తాన్ని ఉపసంహరించుకోవచ్చు. సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్(సిప్)లో ఇన్వెస్ట్ చేయడం మంచిదా? లేదా ఒక్కసారే పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్ చేయడం మంచిదా? - మాళవిక, గుంటూరు ఒక్కసారే పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్ చేయడం కంటే, సిప్ విధానంలో ఇన్వెస్ట్ చేయడమే ఉత్తమమైనదని పలువురు నిపుణులు చెబుతుంటారు. దీర్ఘకాలానికి పెద్ద మొత్తంలో ఒకేసారి ఇన్వెస్ట్ చేయడం కన్నా, సిప్ విధానంలో ఇన్వెస్ట్ చేయడమే ఉత్తమమని చాలా చాలా సందర్భాల్లో, ఎన్నోసార్లు నిరూపితమైనది. ఒక మ్యూచువల్ ఫండ్ స్కీమ్‌లో నిర్ణీత కాలానికి నిర్ణీత మొత్తాన్ని ఇన్వెస్ట్ చేయడం(ఉదాహరణకు నెలకు రూ.10,000 చొప్పున ఒక పదేళ్లపాటు)గా సిప్ విధానాన్ని పేర్కొనవచ్చు. ఫండ్ ఎన్ఏవీ(నెట్ అసెట్ వాల్యూ) ఎంత ఉన్నదనే విషయాన్ని పరిగణనలోకి తీసుకోకుండా క్రమం తప్పకుండా సిప్ విధానంలో ఇన్వెస్ట్ చేస్తారు. ఫలితంగా మార్కెట్లు పడిపోతున్నప్పుడు మనకు ఎక్కువ యూనిట్లు లభిస్తాయి. దీంతో సగటు ధర తక్కువగా ఉండి, అధిక రాబడులు వస్తాయి. అలా కాకుండా ఒకేసారి పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్ చేశారనుకోండి. ఈక్విటీ మార్కెట్లు ఉచ్ఛదశలో ఉన్నప్పుడు ఇన్వెస్ట్ చేసినట్లయితే మీరు అధిక ఎన్ఏవీకి యూనిట్లు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. తర్వాతి కాలంలో మార్కెట్లు పడిపోతే, మీ లాభాలు కూడా తగ్గిపోతాయి. ఒక వేళ మార్కెట్లు బాగా పడిపోయినప్పుడు ఒకేసారి పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్ చేస్తే, సిప్ కంటే మంచి రాబడులే వస్తాయి. కానీ, దీనిని పట్టుకోవడం కష్టం. మార్కెట్లు పడిపోతున్నప్పుడు ఇంకా పడిపోతాయేమో అన్న సందేహం ఉంటుంది. మనం ఊహిం చని విధంగా మళ్లీ మార్కెట్లు పుంజు కుం టాయి. ఏడాది అంతకు మించిన దీర్ఘకాలం ఇన్వెస్ట్ చేయాలనుకుంటే సిప్ విధానమే ఉత్తమం. మార్కెట్లు పెరుగుతున్నప్పుడు సాధారణ ఇన్వెస్టర్లు ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. అదే మార్కెట్లు పతన దశలో ఉన్నప్పుడు అసలు మార్కెట్ల జోలికే వెళ్లరు. కానీ సిప్ విధానంలో దీనికి వ్యతిరేకంగా జరుగుతుంది. మ్యూచువల్ ఫండ్స్‌ను డీమ్యాట్ అకౌంట్ ద్వారానే కొనుగోలు చేయాలా? - శశి, విజయవాడ డీ మ్యాట్ అకౌంట్ ద్వారా కూడా మ్యూచువల్ ఫండ్స్‌ను కొనుగోలు చేయవచ్చు. అయితే డీమ్యాట్ అకౌంట్ లేకుండా కూడా ఫండ్స్‌ను కొనుగోలు చేయవచ్చు. మ్యూచువల్ ఫండ్ కంపెనీ నుంచే నేరుగా మీరు మ్యూచువల్ ఫండ్స్‌ను కొనుగోలు చేయవచ్చు. సంబంధిత దరఖాస్తును నింపి, నిర్ణీత మొత్తానికి చెక్కును సదరు మ్యూచువల్ ఫండ్ కంపెనీకి పంపించాల్సి ఉంటుంది. అంతేకాకుండా మ్యూచువల్ ఫండ్ వెబ్సైట్ నుంచి కూడా ఆన్లైన్లో ఫండ్స్‌ను కొనుగోలు చేయవచ్చు. -
అన్ని పెట్టుబడులకు ఒకే రికార్డు
న్యూఢిల్లీ: డీమ్యాట్ అకౌంట్ల తరహాలోనే వ్యక్తిగత పెట్టుబడులకు సంబంధించిన వివరాలన్నింటికీ ఒకే రికార్డు ఉండేలా ప్రత్యేక విధానాన్ని ఆర్థిక మంత్రి పి. చిదంబరం ప్రతిపాదించారు. ఖాతాల నిర్వహణ సులభంగా ఉండటంతో పాటు పన్నులు సక్రమంగా వసూలయ్యేలా చూసేందుకు ఇది తోడ్పడగలదని ఆయన తెలిపారు. దీని ప్రకారం ఆయా ఇన్వెస్టర్లు తీసుకున్న షేర్లు, బాండ్లు, మ్యూచువల్ ఫండ్లు, బ్యాంక్ డిపాజిట్లు మొదలైన వాటి వివరాలన్నీఆన్లైన్లో ఒకే అకౌంట్లో లభ్యమవుతాయి. దీని గురించి షేర్ల కోసం ప్రస్తుతం ఎన్ఎస్డీఎల్, సీడీఎస్ఎల్ వంటి డిపాజిటరీలు ఉన్నట్లే ప్రత్యేకంగా డిపాజిటరీని ప్రారంభించొచ్చు. ఇందుకు నియంత్రణ సంస్థలు అంగీకరించినట్లు చిదంబరం తెలిపారు.