అన్ని పెట్టుబడులకు ఒకే రికార్డు
న్యూఢిల్లీ: డీమ్యాట్ అకౌంట్ల తరహాలోనే వ్యక్తిగత పెట్టుబడులకు సంబంధించిన వివరాలన్నింటికీ ఒకే రికార్డు ఉండేలా ప్రత్యేక విధానాన్ని ఆర్థిక మంత్రి పి. చిదంబరం ప్రతిపాదించారు. ఖాతాల నిర్వహణ సులభంగా ఉండటంతో పాటు పన్నులు సక్రమంగా వసూలయ్యేలా చూసేందుకు ఇది తోడ్పడగలదని ఆయన తెలిపారు. దీని ప్రకారం ఆయా ఇన్వెస్టర్లు తీసుకున్న షేర్లు, బాండ్లు, మ్యూచువల్ ఫండ్లు, బ్యాంక్ డిపాజిట్లు మొదలైన వాటి వివరాలన్నీఆన్‌లైన్లో ఒకే అకౌంట్లో లభ్యమవుతాయి. దీని గురించి షేర్ల కోసం ప్రస్తుతం ఎన్‌ఎస్‌డీఎల్, సీడీఎస్‌ఎల్ వంటి డిపాజిటరీలు ఉన్నట్లే ప్రత్యేకంగా డిపాజిటరీని ప్రారంభించొచ్చు. ఇందుకు నియంత్రణ సంస్థలు అంగీకరించినట్లు చిదంబరం తెలిపారు.