వరంగల్‌లో 19న సాక్షి ఇన్వెస్టర్స్ సదస్సు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: నిత్యావసరాల ధరలు పెరుగుతున్నాయి. డిపాజిట్లు చేస్తే వడ్డీలు తగ్గుతున్నాయి. మరి సరైన ఆదాయం రావటం ఎలా? ఖర్చులను తగ్గించుకుంటూ.. పొదుపు చేసినా... అందుకు సరైన సాధనమేంటి? భవిష్యత్తు అవసరాల కోసం అనువైన పెట్టుబడులేంటి? ఇలా ఒకటేమిటి ఆర్థిక ప్రణాళికలు– పెట్టుబడుల నిర్వహణ, స్టాక్ మార్కెట్, డీమాట్ ఖాతా గురించి సమస్త సమాచారాన్ని, మెళకువలను అందించేందుకు వరుసగా సదస్సులు నిర్వహిస్తున్న ‘‘సాక్షి మైత్రి ఇన్వెస్టర్ క్లబ్’’... ఈ సారి వరంగల్‌లో సదస్సు నిర్వహిస్తోంది.
⇔ ఈనెల 19 ఆదివారంనాడు హన్మకొండ బాలసముద్రంలోని సామ జగన్‌మోహన్ స్మారక భవనంలో ఉదయం 10 నుంచి 1 గంట వరకు ఈ సదస్సు జరుగుతుంది. ప్రవేశం ఉచితం. సభ్యత్వం కోసం 95055 55020కు ఫోన్ చేసి పేర్లను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.
⇔ ఈ సదస్సులో సెంట్రల్ డిపాజిటరీ సర్వీసెస్ రీజినల్ మేనేజర్ శివ ప్రసాద్, కార్వి స్టాక్ బ్రోకింగ్ లిమిటెడ్ జీఎంలు ఎస్ వెంకట శ్రీనివాస్ రెడ్డి, జయంత్ కుమార్, ఫండమెంటల్ రీసెర్చ్ అనలసిస్ట్ అశోక్ రామినేని వక్తలుగా పాల్గొని విలువైన సమాచారాన్ని, సూచనలను అందిస్తారు.