
న్యూఢిల్లీ: యార్న్ సంబంధ ప్రొడక్టులు రూపొందించే జిందాల్ కోటెక్స్‌పై క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ కొరడా ఝుళిపించింది. కంపెనీకి చెందిన బ్యాంకు, డీమ్యాట్ ఖాతాల అటాచ్‌మెంట్‌కు ఆదేశాలు జారీ చేసింది. గ్లోబల్ డిపాజిటరీ రిసీప్ట్స్(జీడీఆర్‌లు) జారీలో అవకతవకలకు సంబంధించి రూ. 14.55 కోట్ల రికవరీకి వీలు గా తాజా చర్యలు చేపట్టింది. జిందాల్ కోటెక్స్‌తోపాటు ముగ్గురు అధికారులపైనా చర్యలకు ఉపక్రమించింది.
ఈ జాబితాలో సందీప్ జిందాల్, రాజిందర్ జిందాల్, యశ్ పాల్ జిందాల్ ఉన్నారు. వడ్డీసహా అన్ని రకాల వ్యయా లు, చార్జీలు కలిపి రూ. 14.55 కోట్ల రికవరీకిగాను కంపెనీతోపాటు ముగ్గురు అధికారుల బ్యాంకు, లాకర్లు, డీమ్యాట్ ఖాతాల అటాచ్‌మెంట్‌కు సెబీ ఆదేశించింది. ఆయా ఖాతాల కు సంబంధించి అన్ని బ్యాంకులు, మ్యూచు వల్ ఫండ్స్ ఎలాంటి డెబిట్లనూ అనుమతించవద్దంటూ సెబీ ఆదేశించింది. అయితే క్రెడిట్ లావాదేవీలకు మాత్రం అనుమతించింది.
చదవండి: కస్టమర్ కంప్లైంట్.. ఫ్లిప్‌కార్ట్‌కు షాకిచ్చిన వినియోగదారుల ఫోరం!
Comments
Please login to add a commentAdd a comment