attachment
-
బంధాలను ప్రభావితం చేసే బాల్యానుభవాలు
రాహుల్, పూజ ఇద్దరూ సాఫ్ట్వేర్ ఇంజినీర్లు. ఇద్దరికీ ఆఫీసులో పరిచయమైంది. ఆ పరిచయం ప్రేమగా మారింది. పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. రెండేళ్లపాటు వాళ్ల కాపురం అందంగా, ఆనందంగా సాగింది. ఆ తర్వాత అవగాహనలో సమస్యలు ఏర్పడ్డాయి, విభేదాలు పెరిగాయి. రాహుల్ తనకు తగినంత సమయం ఇవ్వడం లేదని పూజ భావిస్తోంది. ఆమె అవసరాలు తీర్చడాన్ని ఒత్తిడిగా రాహుల్ భావిస్తున్నాడు. ఈ విషయమై తరచూ గొడవలు పడుతున్నారు. ఆ గొడవలను వారికి వారు పరిష్కరించుకోలేక కౌన్సెలింగ్ తీసుకోవాలని నిర్ణయించుకున్నారు.మూలాలు బాల్యానుభవాల్లో..మొదటి సెషన్లో విడివిడిగా రాహుల్, పూజలు తమ చిన్ననాటి అనుభవాలను వివరించారు. రాహుల్ చిన్నప్పుడు తన తల్లిదండ్రుల నుంచి ఎక్కువగా ఎమోషనల్ సపోర్ట్ పొందలేకపోయాడు. ఫలితంగా అతనిలో అవాయిడెంట్ అటాచ్మెంట్ ఏర్పడింది. దీంతో బంధాలలో సాన్నిహిత్యం కంటే స్వేచ్ఛను ఎక్కువగా కోరుకుంటున్నాడు. పూజ బాల్యంలో తల్లిదండ్రుల నుంచి అనిశ్చితమైన ప్రేమను పొందింది. పూజ తల్లిదండ్రులు ఆమె ఎమోషనల్ అవసరాలను కొన్నిసార్లు తీర్చేవారు, మరికొన్నిసార్లు విస్మరించేవారు. ఫలితంగా ఆమెలో యాంగ్షియస్ అటాచ్మెంట్ ఏర్పడింది. తన భాగస్వామి కాస్త దూరంగా ఉంటే చాలు అభద్రతను, భయాన్ని అనుభవిస్తోంది. దాంతో నిత్యం తనతోనే ఉండాలని రాహుల్ పై ఒత్తిడి పెంచుతోంది. ఈ వ్యత్యాసాల కారణంగా చిన్న విషయాలు కూడా పెద్ద గొడవలుగా మారాయి. ఒకరినొకరు తీవ్రంగా ప్రేమిస్తున్నప్పటికీ అపార్థాలకు దారితీశాయి.రెండు నెలల్లో సమస్యలు దూరం.. ఇద్దరితో మాట్లాడి, వారి అటాచ్మెంట్ స్టయిల్స్ గురించి, వాటివల్ల ఏర్పడుతున్న సమస్యల గురించి అర్థం చేసుకున్నాక, వాటిని బ్యాలెన్స్ చేయడానికి వారికి సూచించిన వ్యూహాలు కొన్ని..1. రాహుల్ తన స్వేచ్ఛ కోసం చేసే పనులు ప్రేమను తిరస్కరించడం కాదని పూజ గుర్తించాలి. అలాగే తన నిరంతర ధ్రువీకరణ అవసరాన్ని పరిమితం చేసుకోవాలి. 2. ఇద్దరూ తమ భావోద్వేగాలను, అవసరాలను స్పష్టంగా, నిర్మాణాత్మకంగా కమ్యూనికేట్ చేయడం ప్రారంభించారు. ఉదాహరణకు, పూజకు ధ్రువీకరణ అవసరం ఉన్నప్పుడు, ఆమె ప్రశ్నల ద్వారా కాకుండా తన భావాలను చెప్పడం నేర్చుకుంది.3. పూజకు ఇవ్వాల్సిన ఎమోషనల్ సపోర్ట్ ప్రాధాన్యాన్ని గుర్తించి రాహుల్.. ఆమెకు ఎక్కువ సమయాన్ని కేటాయిస్తున్నాడు. అదే సమయంలో పూజ కూడా రాహుల్ స్వేచ్ఛకు గౌరవం ఇవ్వడం తెలుసుకుంది.4. ఇరువురూ తమ రోజువారీ జీవనంలో పరస్పర సహకారం, చిన్నచిన్న ఆనందాలను ఆస్వాదించేందుకు సమయం కేటాయించటం మొదలుపెట్టారు. ఉదాహరణకు, వారాంతాల్లో కలిసి వాకింగ్ చేయడం లేదా ఒక కొత్త హాబీని ఆరంభించడం లాంటివి.రెండు నెలల కౌన్సెలింగ్ తర్వాత వారి సంబంధంలో గణనీయమైన మార్పులు వచ్చాయి. దాంతో, వారి మధ్య గొడవలు తగ్గి, ఒకరిపై ఒకరికి నమ్మకం, ప్రేమ పెరిగాయి.అటాచ్మెంట్ థియరీ మన చిన్ననాటి అనుభవాలు, పెంపకం విధానాలు మన ప్రస్తుత సంబంధాలను ఎలా ప్రభావితం చేస్తాయో వివరించే సిద్ధాంతమే అటాచ్మెంట్ థియరీ. బాల్యంలో తల్లిదండ్రులతో ఏర్పడే అనుబంధం, మన వ్యక్తిత్వానికి, భావోద్వేగ వ్యవహారానికి, ముఖ్యంగా ప్రేమ సంబంధాలకు మూలస్తంభం అవుతుంది. అయితే, ఈ అటాచ్మెంట్ శైలులు స్థిరమైనవి కావు, వాటిని మార్చుకోవచ్చు. ఇందులో మూడు రకాలున్నాయి. సెక్యూర్ అటాచ్మెంట్సెక్యూర్ అటాచ్మెంట్ కలిగిన వ్యక్తులు ప్రేమ, నమ్మకం, అనుబంధానికి ప్రాధాన్యమిస్తారు. ఇతరులతో సంబంధాలను బలంగా, స్వతంత్రంగా, అనురాగపూర్వకంగా నిర్వహించగలుగుతారు. ఉదాహరణకు ఒక సెక్యూర్ వ్యక్తి తన భాగస్వామి కొంత సమయం స్వతంత్రంగా గడపాలని కోరితే, దాన్ని సానుకూలంగా అర్థం చేసుకుంటాడు.యాంగ్షియస్ అటాచ్మెంట్యాంగ్షియస్ అటాచ్మెంట్ కలిగిన వ్యక్తులు సంబంధాల్లో ఎక్కువ భయాన్ని, అస్థిరతను అనుభవిస్తారు. వీరు ఎక్కువగా భావోద్వేగ ధ్రువీకరణ కోసం భాగస్వామిపై ఆధారపడతారు. ఉదాహరణకు భాగస్వామి తక్షణమే ఫోన్ కాల్కి ప్రతిస్పందించకపోతే, తనపై ప్రేమ లేదా శ్రద్ధ తగ్గిందని అనుమానపడతారు.అవాయిడెంట్ అటాచ్మెంట్అవాయిడెంట్ అటాచ్మెంట్ కలిగిన వ్యక్తులు స్వేచ్ఛకు అధిక ప్రాధాన్యమిస్తారు. అనుబంధం, సాన్నిహిత్యాన్ని నివారించడానికి ప్రయత్నిస్తారు. ఉదాహరణకు ఈ అటాచ్మెంట్ శైలి ఉన్న వ్యక్తి.. భాగస్వామి తనతో ఎక్కువ సమయం గడపాలని కోరితే.. తన స్వేచ్ఛను లాగేసుకుంటున్నట్లు భావిస్తాడు, ప్రతిఘటిస్తాడు. -
ఏ బంధంలోనైనా గౌరవం ముఖ్యం
కనెక్షన్ లేదా రిలేషన్షిప్ అనగానే అందరికీ లవర్స్ లేదా కపుల్స్ గుర్తొస్తారు. వారి మధ్య వచ్చే సమస్యలే గుర్తొస్తాయి. కానీ స్నేహితులు, తోబుట్టువులు, కుటుంబ సభ్యులు, సహోద్యోగులతో సంబంధం కూడా ముఖ్యం. అందుకే మన ‘కనెక్షన్ కార్నర్’లో ఇవన్నీ చర్చించుకుందాం.అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘రేసుగుర్రం’ మూవీ చూశారా? అందులో అన్నాదమ్ములిద్దరూ రోజూ కొట్టుకుంటూ ఉంటారు. కానీ అన్నకు సమస్య వచ్చినప్పుడు తమ్ముడు అండగా నిలబడతాడు. అదే బంధాలకు ఉండే ప్రాధాన్యం. అయితే అన్ని సందర్భాల్లోనూ అలా సర్దుకుపోరు. కొన్నిసార్లు అన్నదమ్ముల మధ్య గొడవలు పెరిగి పెద్దవై పోలీస్ కేసుల వరకూ వెళ్లిన సందర్భాలు కూడా మనం వార్తల్లో చూస్తుంటాం. అలాంటి ఒక కేస్ గురించి ఈరోజు మాట్లాడుకుందాం.రోహిత్, సిద్ధార్థ్ అన్నదమ్ములు. 32 ఏళ్ల రోహిత్ స్వంత వ్యాపారం పెట్టి సక్సెస్ అయ్యాడు. 28 ఏళ్ల సిద్ధార్థ్ లెక్చరర్ గా పనిచేస్తున్నాడు. రెండేళ్లుగా వారి రిలేషన్షిప్ బాగా దెబ్బతింది. తరచుగా వాదనలు, అపార్థాలు, సెటైర్లు.తానెంతో కష్టపడి వ్యాపారం మొదలుపెట్టి 32 ఏళ్లకే సక్సెస్ సాధించినా, తనను ‘డబ్బు మనిషి’ అంటున్నాడని సిద్ధార్థ్ పై రోహిత్ కు కోపం. మరోవైపు తక్కువ సంపాదిస్తున్నాడని రోహిత్ కు తానంటే చిన్నచూపని సిద్ధార్థ్ కు బాధ. అలా ఇద్దరూ తరచూ ఒకరిపై ఒకరు సెటైర్లు వేసుకుంటున్నారు. అవి చిలికిచిలికి గాలివానగా మారి ఇద్దరూ కొట్టుకునేవరకూ వెళ్లింది.ఆ వయసుకొచ్చిన పిల్లలు కొట్టుకోవడం చూసి తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. ఏం చేయాలో అర్థంకాక వారిద్దరినీ కౌన్సెలింగ్ కు వెళ్లమని అడిగారు. వాళ్లిద్దరూ అయిష్టంగానే వచ్చారు.పరస్పర గౌరవం లేకపోవడమే సమస్య... మొదటి సెషన్ లో వాళ్లిద్దరితో విడివిడిగా మాట్లాడాను. పరస్పర గౌరవం లేకపోవడమే వారి సంఘర్షణకు మూలమని అర్థమైంది. అందుకే వారి విభేదాలు నిర్మాణాత్మకంగా కాకుండా వ్యక్తిగత దాడులుగా మారాయి. 👉 సోదరులిద్దరూ వారి కెరీర్ ఛాయిస్, వ్యక్తిగత నిర్ణయాలను తప్పుగా అంచనా వేసుకుంటూ, వారి పరస్పర విశ్వాసాన్ని దెబ్బతీస్తూ ఉంటారు.👉 ఏ ఒక్కరూ మరొకరి దృక్పథాన్ని వినకపోగా ఒకరి ఐడియాకు మరొకరు అంతరాయం కలిగిస్తున్నారు లేదా తిరస్కరిస్తున్నారు. 👉వారి సంభాషణలు తరచుగా సర్కాస్టిక్ కామెంట్స్ (వ్యంగ్య వ్యాఖ్యలు), నెగెటివ్ జడ్జ్ మెంట్స్ (ప్రతికూల తీర్పులు) గా మారి విభేదాలకు మరింత ఆజ్యం పోశాయి.👉దీంతో వారిద్దరూ సరిగా కమ్యూనికేట్ చేసుకోలేకపోతున్నారు. తన సోదరుడు తప్పుగా అర్థం చేసుకుంటున్నాడని అపార్థం చేసుకుంటున్నాడు. అతని వైఖరిని అంగీకరించడానికి ఏమాత్రం ఇష్టపడలేదు.శ్రద్ధగా వినడమే తొలి అడుగు... ఇలాంటి సందర్భాల్లో చాలామంది ఎడమొహం పెడమొహంగా మారి విభేదాలను ఇంకా పెద్దవి చేసుకుంటారు. కానీ సోదరులిద్దరూ ఒకరి కెరీర్ ఛాయిస్, లైఫ్ స్టైల్, వాల్యూస్ ను అర్థం చేసుకోవడం, అభినందించడం అవసరం. ఆ మేరకు సెషన్స్ ప్లాన్ చేశాను. 👉ప్రారంభ సెషన్లలో ‘యాక్టివ్ లిజనింగ్’ అనే కాన్సెప్ట్‌ను పరిచయం చేసాను. అంటే సోదరుడు మాట్లాడేటప్పుడు ఎలాంటి అభ్యంతరం పెట్టకుండా వినాలి. అతని దృక్పథంతో విభేదించినప్పటికీ, అతని భావోద్వేగాలను అంగీకరించాలి. విమర్శలకు బదులుగా నిర్మాణాత్మక సూచనలివ్వాలి. 👉తర్వాత ‘ఐ ఫీల్‘ స్టేట్మెంట్ టెక్నిక్‌ని ఇచ్చాను. అంటే సోదరుడిని నిందించడానికి బదులుగా ‘నాకిలా అనిపించింది’, ‘నేను బాధపడ్డాను’ అని తన అభిప్రాయాన్ని, భావోద్వేగాన్ని మాత్రమే వ్యక్తపరచాలి. ఈ టెక్నిక్ వారు వాదించుకోకుండా కమ్యూనికేట్ చేయడానికి ఉపయోగపడింది. 👉 ఫైనాన్షియల్ సక్సెస్ సాధించడమే రోహిత్ లక్ష్యమైతే, అకడమిక్ గా టాప్ లో ఉండటమే సిద్ధార్థ్ లక్ష్యం. ఒకరి ఎంపికను మరొకరు అర్థం చేసుకునేలా చర్చించుకునేలా ప్రోత్సహించాను. 👉 వారిద్దరూ ఒకరి ఛాయిస్ ను మరొకరు ఎలా చూశారో వివరిస్తూ మనసువిప్పి లెటర్లు రాసుకోమన్నాను. ఇది వారి అభిప్రాయాలను రీఫ్రేమ్ చేసి, ఒకరినొకరు అభినందించుకునేలా చేసింది.అలా పది సెషన్లలో రోహిత్, సిద్ధార్థ్ ఒకరినొకరు పూర్తిగా అర్థంచేసుకున్నారు. సర్కాజం, క్రిటిసిజం లేకుండా ఎలా కమ్యూనికేట్ చేయవచ్చో నేర్చుకున్నారు. ఒకరి ఛాయిస్ ఏదైనా దాన్ని గౌరవించాలని, నచ్చకపోతే తన అభిప్రాయాన్ని నిర్మాణాత్మంగా వివరించాలని అర్థం చేసుకున్నారు. చక్కగా మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. తమ కెరీర్ ఛాయిస్ ఏదైనా కుటుంబానికి అండగా నిలబడటం, తమ భవిష్యత్తును తీర్చిదిద్దుకోవడం ముఖ్యమని అర్థం చేసుకుని, ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. అది చూసి వారి తల్లిదండ్రులు సంతోషించారు.సోదరులనే కాదు, టీనేజ్, కపుల్, వర్క్ రిలేషన్షిప్స్ లో పరస్పర గౌరవానికి కీలక పాత్ర. గౌరవం ఉండటమే కాదు, ఉన్నట్లు కనిపించాలి. లేదంటే రోహిత్, సిద్ధార్థ్ లా అపార్థాలు, గొడవలు తప్పవు. అందుకే తీర్పులివ్వకుండా వినడం, కమ్యూనికేషన్ ను మెరుగుపరచుకోవడం, గౌరవప్రదమైన సరిహద్దులను సెట్ చేసుకోవడం, తీర్పులను రీఫ్రేమ్ చేసుకోవడం అవసరం.సైకాలజిస్ట్ విశేష్ +91 8019 000066www.psyvisesh.com -
అన్ని బంధాలకూ మూలం బాల్యంలోనే!
హలో ఫ్రెండ్స్,గతవారం సారా గురించి మాట్లాడుకున్నాం కదా. బాల్యంలో పేరెంట్స్, గార్డియన్స్, కుటుంబ సభ్యులతో ఉన్న అనుబంధం జీవితానికి ఒక పునాదిలా పనిచేస్తుంది. ఆ తర్వాత వివిధ వ్యక్తులతో సాన్నిహిత్యం, భావోద్వేగాలను నియంత్రించే సామర్థ్యం, సంఘర్షణలను పరిష్కరించుకునే సామర్థ్యాకు బ్లూప్రింట్ లా ఉంటుంది. వీటినే అటాచ్మెంట్ స్టైల్స్ అంటారు. జీవితంలో బలమైన కనెక్షన్ లను నిర్మించుకోవాలంటే వీటిని అర్థం చేసుకోవడం అవసరం.నాలుగు రకాలు... Secure Attachment: బాల్యంలో అనేక అవసరాలు ఉంటాయి. అన్నీ పిల్లలు చేసుకోలేరు. తల్లిదండ్రులు లేదా సంరక్షకుల అవసరం ఉంటుంది. ఆ అవసరాలను వెంటనే గుర్తించి, స్పందించి, సంరక్షించే పేరెంట్స్ ఉన్నప్పుడు పిల్లల్లో భద్రంగా ఉన్నామనే ఫీలింగ్ ఏర్పడుతుంది. అలా సెక్యూర్ అటాచ్మెంట్ స్టైల్ ఏర్పడుతుంది. వయసుతో పాటు అదీ పెరుగుతూ ఇతరులతో బంధాలను ఏర్పరచుకోవడంలో దిక్సూచిలా పనిచేస్తుంది. ఈ అటాచ్మెంట్ స్టైల్ ఉన్నవారు తమకు ఏ కష్టం వచ్చినా తన జీవిత భాగస్వామి అందుబాటులో ఉంటారని నమ్ముతారు. తమ మనసులోని భావాలు ఎలాంటివైనా నేరుగా కమ్యూనికేట్ చేస్తారు. తన లైఫ్ పార్టనర్ తో సాన్నిహిత్యంగా, సుఖంగా ఉంటారు. అందరితోనూ సత్సంబంధాలు ఏర్పరచుకుంటారు.Anxious Attachment: బాల్యంలో పేరెంట్స్ లేదా గార్డియన్స్ అందుబాటులో లేకపోవడం, ఉన్నా పట్టించుకోకపోవడం, అవసరాలను గుర్తించకపోవడంతో... తనను ఎవరూ పట్టించుకోవడంలేదు, వదిలేస్తారనే భయం, ఆతృత ఏర్పడుతుంది. ఆ భయం వారి జీవితాంతం ఉంటుంది. అందుకే మనసులోని భావాలను నేరుగా చెప్పలేరు. చెప్తే తమను వదిలివేస్తారనే భయం వారిని వెంటాడుతూ ఉంటుంది. పార్టనర్ మౌనంగా ఉంటే అది తిరస్కారంగా భావిస్తారు. ‘నేనంటే ఇష్టంలేదా?’ అని పదే పదే అడుగుతారు. చాలా ఇష్టమని చెప్పినా సంతృప్తి చెందరు. వదిలేస్తారేమోనని భయపడుతుంటారు. దాంతో మరింత దగ్గరగా అతుక్కుపోతారు. మరోవైపు పార్టనర్ చర్యలను తప్పుగా అర్థం చేసుకుంటారు. అసూయ, అభద్రత వంటి వారిని కంట్రోల్ చేసుకోవడానికి కష్టపడుతుంటారు. ఇలాంటివారికి భరోసా ఇవ్వడం పార్టనర్ కు తలకు మించిని భారమవుతుంది. సారా సమస్య ఇదేనని గుర్తొచ్చిందా?Avoidant Attachment: కొందరు పేరెంట్స్ పిల్లలను పట్టించుకోరు, దూరంగా పెడుతుంటారు. వాళ్లేం చేసినా నిరుత్సాహపరుస్తుంటారు. అందువల్ల పిల్లలు వారితో సాన్నిహిత్యంగా ఉండలేరు. ఎమోషన్స్ ను వ్యక్తం చేయలేరు. అలా వ్యక్తంచేయడం అసౌకర్యంగా భావిస్తారు. స్వతంత్రంగా ఉండలేరు. ఒంటరిగా ఫీలవుతుంటారు. అలా ఈ అటాచ్మెంట్ స్టైల్ అభివృద్ధి చెందుతుంది. ఇలాంటి అటాచ్మెంట్ స్టైల్ ఉన్నవారు ఏదీ ఓపెన్ గా మాట్లాడలేరు. మానసికంగా దూరంగా ఉంటారు. తరచూ పోట్లాడుతుంటారు. ఒంటరిగా ఫీలవుతుంటారు. వీరితో ఎలా వ్యవహరిస్తే ఏమవుతుందోనని పార్టనర్ గందరగోళానికి గురవుతారు.Disorganized Attachment: కొందరు పేరెంట్స్ లో తెలియని భయాలు ఉంటాయి. దాంతో వారి ప్రవర్తన ఎప్పడు ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు. ఇలాంటి పేరెంట్స్ దగ్గర పెరిగిన పిల్లల్లో ఇలాంటి అటాచ్మెంట్ స్టైల్ అభివృద్ధి చెందుతుంది. వీరు ఇతరులతో సాన్నిహిత్యం కోరుకుంటారు. కానీ వాళ్లను విశ్వసించాలంటే తీవ్రమైన భయం. దాంతో వారి బంధాలు, అనుబంధాలు అస్థిరంగా ఉంటాయి. వారి భావోద్వేగ ప్రతిస్పందనలు అనూహ్యంగా ఉంటాయి. వీరికి ఎమోషనల్ సెక్యూరిటీ అందించడంలో పార్టనర్స్ ఇబ్బందులు పడుతుంటారు.మరేం చెయ్యాలి?సరే సర్. అటాచ్మెంట్ స్టైల్స్ రిలేషన్ షిప్ డైనమిక్స్ ను ప్రభావితం చేస్తాయంటున్నారు సరే, ఇప్పుడేం చెయ్యాలి? అని మీరు అనిపించవచ్చు. బాల్యంలో ఏర్పడిని అటాచ్మెంట్ స్టైల్స్ అలాగే శిలేసుకుని కూర్చోవు. వాటిపట్ల అవగాహన పెంచుకుని, మార్చుకునేందుకు ప్రయత్నం చేస్తే మారతాయి. సైకాలజిస్ట్ సహాయంతో సురక్షితమైన అటాచ్మెంట్ స్టైల్ ను అభివృద్ధి చేసుకోవచ్చు. గతవారం సారా కేసులో జరిగింది ఇదే. అందుకోసం ముందుగా మీరేం చేయాలో చెప్తా.• మీ అటాచ్మెంట్ శైలిని గుర్తించడం అనేది హెల్తీ కనెక్షన్లను నిర్మించుకోవడంలో తొలి అడుగు. మీ శైలిని అర్థం చేసుకోవడం వల్ల మీ ప్రవర్తనకు మూల కారణాలను గుర్తించవచ్చు. మీ వ్యక్తిత్వాన్ని అంచనా వేసేందుకు సైకాలజిస్ట్ సహాయపడతారు. • మనం మొదటివారం చెప్పుకున్నట్లు అన్ని బంధాలూ మీ సెల్ఫ్ ఎస్టీమ్ పైనే ఆధారపడి ఉంటాయి. మీపై మీకు గౌరవం, విశ్వాసం ఉంటే ఇతరులపై ఆధారపడటం తగ్గిస్తుంది. సురక్షితమైన అనుబంధాన్ని సులభతరం చేస్తుంది• నిజాయితీతో కూడిన ఓపెన్ కమ్యూనికేషన్ స్కిల్స్‌ను పెంపొందించడం విశ్వాసాన్ని పెంపొందిస్తుంది. రిలేషన్స్ లో వచ్చే సంఘర్షణలను సమర్థంగా పరిష్కరించుకునేందుకు, మీ అవసరాలను నేరుగా వ్యక్తీకరించేందుకు ఉపయోగపడుతుంది. • బంధాలలో ఏది ఓకేనో, ఏది నాట్ ఓకేనో స్పష్టమైన సరిహద్దులను సెట్ చేయడం మీ ఎమోషనల్ వెల్ బీయింగ్ ను కాపాడుతుంది. పరస్పరం గౌరవప్రదంగా ఉండేలా ప్రోత్సహిస్తుంది. • రిలాక్సేషన్ టెక్నిక్స్, మైండ్‌ఫుల్‌నెస్ ప్రాక్టీసెస్ వంటివి మీ భావోద్వేగ నియంత్రణను మెరుగుపరుస్తాయి. నెగెటివ్ ఎమోషన్స్ మీ సంబంధాలను దెబ్బతీయకుండా కాపాడతాయి. • బంధాలకు సంబంధించిన నెగెటివ్ ఆలోచనా విధానాలకు గుర్తించడానికి, వాటిని మార్చుకోవడానికి కాగ్నిటివ్-బిహేవియరల్ థెరపీ (CBT) ఉపయోగపడుతుంది. మీ ఎమోషనల్ రెగ్యులేషన్ కు, సెల్ఫ్ కంపాషన్ పెంపొందించడానికి కోపింగ్ మెకానిజమ్‌లను అభివృద్ధి చేయడంలో సహాయపడుతుంది.సైకాలజిస్ట్ విశేష్+91 8019 000066psy.vishesh@gmail.com -
ఫైబర్‌నెట్ కేసులో కీలక పరిణామం
సాక్షి, విజయవాడ: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నిందితుడిగా ఉన్న ఫైబర్‌నెట్ కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితుల ఆస్తుల్ని అటాచ్ చేయాలని నేర దర్యాప్తు విభాగం(సీఐడీ)ని మంగళవారం ఆదేశించింది విజయవాడ అవినీతి నిరోధకశాఖ న్యాయస్థానం(ఏసీబీ కోర్టు). ఫైబర్‌నెట్ స్కామ్ కేసులో నిందితుల ఆస్తుల అటాచ్‌కు అనుమతి ఇవ్వాలంటూ ఏపీ సీఐడీ, ఏసీబీ కోర్టును నవంబర్ 6వ తేదీన ఆశ్రయించింది. టెరాసాఫ్ట్ కంపెనీతోపాటు చంద్రబాబు సన్నిహితులకు చెందిన స్థిరాస్తుల్ని అటాచ్ చేయాల్సిన అవసరం ఉందని పిటిషన్లో విజ్ఞప్తి చేసింది. అంతకు ముందు సీఐడీ ఈ అంశంపై చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర హోం శాఖ అనుమతి ఇచ్చిన విషయాన్ని పిటిషన్లో ప్రస్తావించింది. నిందితులకు సంబంధించి.. ఏపీ, తెలంగాణలో ఉన్న మొత్తం ఏడు స్థిరాస్తుల అటాచ్‌మెంట్‌కు అనుమతివ్వాలని పిటిషన్లో సీఐడీ కోరింది. ఈ జాబితాలో టెరాసాఫ్ట్ కంపెనీతోపాటు చంద్రబాబు సన్నిహితులకు చెందిన స్థిరాస్తులు ఉన్నాయి. వీటిని అటాచ్ చేయాల్సిన అవసరం ఉందని పిటిషన్లో విజ్ఞప్తి చేసింది. ఫైబర్‌నెట్ కేసులో అటాచ్‌కు నిర్ణయించిన ఆస్తుల వివరాలు ఇవి ►తుమ్మల గోపీచంద్, ఆయన భార్య పావని పేర్లపై హైదరాబాద్ శ్రీనగర్ కాలనీ, యూసఫ్ గూడ, జూబ్లీహిల్స్ కాలనీ, చిన్నమంగళారం లలో ఉన్న ఇళ్లు, వ్యవసాయ క్షేత్రాలు ►నెటాప్స్ ఫైబర్ సొల్యూషన్స్ డైరక్టర్ కనుమూరి కోటేశ్వరరావుకి చెందిన గుంటూరు, విశాఖ కిర్లంపూడి లే అవుట్ లోని ఇళ్లు. ►మొత్తంగా అటాచ్ చేసే ఆస్తుల్లో గుంటూరులో ఇంటి స్థలం, విశాఖపట్నంలో ఓ ఫ్లాట్, హైదరాబాద్‌లోని నాలుగు ఫ్లాట్లు, తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాలో వ్యవసాయ భూమి. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఫైబర్ నెట్ కుంభకోణంలో రూ. 114 కోట్లు దుర్వినియోగమయ్యామని సీఐడీ ఇప్పటికే ఎఫ్ ఐ ఆర్ నమోదు చేసింది. ఈ కేసులో ఏ1 గా వేమూరి హరికృష్ణ, ఏ-11 గా టెర్రా సాఫ్ట్ ఎండీ తుమ్మల గోపీచంద్ పేర్లు ఉండగా.. చంద్రబాబు పేరును ఏ-25 గా సీఐడీ చేర్చింది. -
కార్వీ మాజీ అధికారుల బ్యాంకు ఖాతాల అటాచ్మెంట్ - సెబీ ఆదేశాలు
న్యూఢిల్లీ: కార్వీ స్టాక్ బ్రోకింగ్ (కేఎస్‌బీఎల్) క్లయింట్ల నిధుల దుర్వినియోగం కేసుకు సంబంధించి రూ. 1.80 కోట్లు రాబట్టేందుకు కార్వీ గ్రూప్ మాజీ అధికారులైన ముగ్గురి బ్యాంక్, డీమ్యాట్ ఖాతాలు, లాకర్లను అటాచ్ చేయాల్సిందిగా మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ ఆదేశించింది. వీరిలో మాజీ వీపీ (ఫైనాన్స్, అకౌంట్స్) కృష్ణ హరి జి., మాజీ కాంప్లయెన్స్ ఆఫీసర్ శ్రీకృష్ణ గురజాడ, బ్యాక్ ఆఫీస్ ఆపరేషన్స్ జీఎం శ్రీనివాస రాజు ఉన్నారు. వీరి ఖాతాల నుంచి డెబిట్ లావాదేవీలను అనుమతించరాదంటూ బ్యాంకులు, డిపాజిటరీలు, మ్యూచువల్ ఫండ్స్ సంస్థలకు సెబీ సూచించింది. అయితే, క్రెడిట్ లావాదేవీలకు అనుమతి ఉంటుంది. క్లయింట్ల సెక్యూరిటీలను వారికి తెలియకుండా తనఖా పెట్టి కేఎస్‌బీఎల్ దాదాపు రూ. 2,033 కోట్ల మేర నిధులు సమీకరించిందని ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో ఈ ఏడాది మే నెలలో సెబీ కృష్ణ హరికి రూ. 1 కోటి, రాజుకి రూ. 40 లక్షలు, శ్రీకృష్ణకు రూ. 30 లక్షల జరిమానా విధించింది. వడ్డీలు, ఇతర వ్యయాలతో సహా మొత్తం సుమారు రూ. 1.8 కోట్లు కట్టాలంటూ గత నెల డిమాండ్ నోటీసులు జారీ చేసింది. -
‘ఫైబర్‌నెట్’ నిందితుల ఆస్తుల అటాచ్‌కు అనుమతివ్వండి
సాక్షి, అమరావతి: టీడీపీ హయాంలో జరిగిన ఫైబర్‌నెట్ కుంభకోణం కేసు దర్యాప్తులో భాగంగా నిందితులకు చెందిన ఆస్తుల అటాచ్‌మెంట్‌కు అనుమతి కోరుతూ విజయవాడ ఏసీబీ న్యాయస్థానంలో సీఐడీ సోమవారం పిటిషన్ దాఖలు చేసింది. ఏపీ, తెలంగాణలో ఉన్న మొత్తం ఏడు స్థిరాస్తుల అటాచ్‌మెంట్‌కు అనుమతివ్వాలని ఆ పిటిషన్లో కోరింది. టీడీపీ ప్రభుత్వ హయాంలో కేంద్ర ప్రభుత్వ నిధులతో చేపట్టిన రూ.330 కోట్ల ఫైబర్‌నెట్ మొదటి దశ ప్రాజెక్ట్ కాంట్రాక్టును అప్పటి సీఎం చంద్రబాబు నిబంధనలకు విరుద్ధంగా తన సన్నిహితుడు వేమూరి హరికృష్ణకు చెందిన టెరాసాఫ్ట్ కంపెనీకి కేటాయించారు. దీనిపై కేసు నమోదు చేసిన సీఐడీ ఏ–1గా వేమూరి హరికృష్ణ, ఏ–11గా టెరాసాఫ్ట్ కంపెనీ ఎండీ తుమ్మల గోపీచంద్, ఏ–25గా చంద్రబాబును పేర్కొంటూ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఈ నేపథ్యంలో టెరాసాఫ్ట్ కంపెనీతో పాటు ఈ కేసులోని నిందితులకు ఏపీ, తెలంగాణలో ఉన్న ఏడు స్థిరాస్తులను అటాచ్ చేయాలన్న సీఐడీ ప్రతిపాదనను రాష్ట్ర హోం శాఖ ఆమోదిస్తూ ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో వాటి అటాచ్‌మెంట్‌కు అనుమతి కోరుతూ విజయవాడ ఏసీబీ కోర్టులో సీఐడీ పిటిషన్ దాఖలు చేసింది. కోర్టు అనుమతి వచ్చిన తర్వాత ఆ ఆస్తుల అటాచ్‌మెంట్‌కు సీఐడీ చర్యలు చేపట్టనుంది. ఫైబర్‌నెట్ కేసులో అటాచ్‌కు నిర్ణయించిన ఆస్తులు.. నిందితుడు కనుమూరి కోటేశ్వరరావు పేరిట గుంటూరులో ఉన్న 797 చ.అడుగుల ఇంటి స్థలం, ఆయన డైరెక్టర్‌గా ఉన్న నెప్‌టాప్స్ ఫైబర్ సొల్యూషన్స్‌కు విశాఖపట్నం కిర్లంపూడి లేఅవుట్లో ఉన్న ఓ ఫ్లాట్. మరో నిందితుడు టెరాసాఫ్ట్ కంపెనీ ఎండీ టి.గోపీచంద్ పేరిట హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో ఉన్న ఫ్లాట్, శ్రీనగర్ కాలనీలో ఉన్న రెండు ఫ్లాట్లు, యూసఫ్‌గూడలో ఉన్న ఫ్లాట్, ఆయన భార్య పవనదేవి పేరిట తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లో ఉన్న వ్యవసాయ భూమి. -
ED Attachment: మూడు ఆండ్రాయిడ్ యాప్‌లు..రూ.150 కోట్ల మోసం!
అధిక రాబడి వస్తుందని ప్రజల్లో ఆశ చూపించి మోసానికి పాల్పడుతున్న మొబైల్ యాప్ నిర్వాహకులపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చర్యలు చేపట్టింది. యాప్ నిర్వాహకులైన వైభవ్ దీపక్ షా, సాగర్ డైమండ్స్, ఆర్‌హెచ్‌సీ గ్లోబల్ ఎక్స్‌పోర్ట్స్‌కు చెందిన రూ.59.44 కోట్ల ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. పవర్ బ్యాంక్ యాప్ మోసం కేసుకు సంబంధించి మనీ లాండరింగ్ నిరోధక చట్టం(పీఎంఎల్ఏ), 2002 నిబంధనల ప్రకారం ఈ చర్య తీసుకున్నట్లు ఈడీ తెలిపింది. ఉత్తరాఖండ్, దిల్లీ పోలీసులు(స్పెషల్ సెల్), కర్ణాటక పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ల ఆధారంగా ఆస్తులను అటాచ్ చేసినట్లు అధికారులు చెప్పారు. భారత ప్రజలను మోసం చేసేందుకు చైనాకు చెందిన కొందరు చార్టర్డ్ అకౌంటెంట్లు, కంపెనీ సెక్రటరీల సహాయంతో దేశంలో షెల్ కంపెనీలను సృష్టించారని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తెలిపింది. తమ పెట్టుబడులపై భారీ మొత్తంలో సంపాదించవచ్చని ప్రజల్లో ఆశ చూపించి మోసం చేస్తున్నట్లు పేర్కొంది. గూగుల్ ప్లే స్టోర్‌లోని పవర్ బ్యాంక్ యాప్, టెస్లా పవర్ బ్యాంక్ యాప్, ఈజీప్లాన్ అనే మూడు అప్లికేషన్ల ద్వారా ప్రజలను మోసగిస్తున్నట్లు అధికారులు గుర్తించామన్నారు. ఈ యాప్‌ల ద్వారా ప్రజల నుంచి రూ.150 కోట్ల మేర మోసం చేసినందుకు దిల్లీ పోలీస్ సైబర్ సెల్ జూన్ 2021లో అనేక మందిని అరెస్టు చేసింది. ఈ యాప్‌లు కస్టమర్ల నుంచి చెల్లింపులను సురక్షితం చేసిన తర్వాత వినియోగదారు ఖాతాలను బ్లాక్ చేసేవని ఈడీ తెలిపింది. ఇలా కూడగట్టిన డబ్బును నిందితులు, ఈ కేసుతో సంబంధం ఉన్న సంస్థలు బోగస్ దిగుమతుల సాకుతో విదేశాలకు భారీగా నిధులు మళ్లించారని వెల్లడైంది. అయితే రూ.10.34 కోట్ల విలువైన ఆస్తులను ఏజెన్సీ రికవరీ చేసింది. రూ.14.81 కోట్ల విలువైన బ్యాంకు ఖాతాలను సీజ్ చేసినట్లు అధికారులు తెలిపారు. -
వీడియోకాన్ ఫౌండర్ అకౌంట్ల అటాచ్మెంట్.. సెబీ ఆదేశాలు
న్యూఢిల్లీ: రూ. 5.16 లక్షల జరిమానా బకాయిలను రాబట్టుకునే దిశగా వీడియోకాన్ గ్రూప్ వ్యవస్థాపకుడు వేణుగోపాల్ ధూత్‌కు చెందిన బ్యాంక్, డీమాట్, మ్యుచువల్ ఫండ్ ఖాతాలు, లాకర్లను అటాచ్ చేయాల్సిందిగా మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ ఆదేశించింది. ఆయా ఖాతాల నుంచి డెబిట్ లావాదేవీలను అనుమతించరాదంటూ బ్యాంకులు, డిపాజిటరీలు (సీడీఎస్ఎల్, ఎన్ఎస్డీఎల్), మ్యుచువల్ ఫండ్ సంస్థలకు సూచించింది. అయితే, క్రెడిట్ లావాదేవీలకు అనుమతించవచ్చని పేర్కొంది. క్వాలిటీ టెక్నో అడ్వైజర్స్, క్రెడెన్షియల్ ఫైనాన్స్, సుప్రీం ఎనర్జీ వంటి సంస్థలతో తనకున్న పెట్టుబడులు, సంబంధం గురించి వెల్లడించకుండా, నిబంధనలను ఉల్లంఘించినందుకు గాను ఈ ఏడాది మార్చిలో ధూత్‌కు సెబీ రూ. 5 లక్షల జరిమానా విధించింది. అయితే, ఆ మొత్తాన్ని చెల్లించడంలో ఆయన విఫలమయ్యారు. ఇదీ చదవండి ➤ ఫాక్స్ కార్పొరేషన్ స్ట్రీమింగ్ సర్వీస్‌కు సీఈవోగా అంజలీ సూద్ దీంతో అసలుతో పాటు రూ. 15,000 వడ్డీ, రికవరీ వ్యయాల కింద మరో రూ. 1,000 కలిపి మొత్తం రూ. 5.16 లక్షలు బాకీ చెల్లించాలని అటాచ్మెంట్ నోటీసులో సెబీ ఆదేశించింది. వీడియోకాన్ గ్రూప్ సంస్థలకు రుణ సదుపాయాలు కల్పించినందుకు ప్రతిగా అప్పట్లో ఐసీఐసీఐ బ్యాంక్ సీఈవోగా పనిచేసిన చందా కొచర్, ఆమె భర్తకు ధూత్ ప్రయోజనం చేకూర్చారని (క్విడ్ ప్రో కో) ఆరోపణలు ఉన్న సంగతి తెలిసిందే. -
జిందాల్ కోటెక్స్కు సెబీ షాక్
న్యూఢిల్లీ: యార్న్ సంబంధ ప్రొడక్టులు రూపొందించే జిందాల్ కోటెక్స్పై క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ కొరడా ఝుళిపించింది. కంపెనీకి చెందిన బ్యాంకు, డీమ్యాట్ ఖాతాల అటాచ్‌మెంట్‌కు ఆదేశాలు జారీ చేసింది. గ్లోబల్ డిపాజిటరీ రిసీప్ట్స్(జీడీఆర్‌లు) జారీలో అవకతవకలకు సంబంధించి రూ. 14.55 కోట్ల రికవరీకి వీలు గా తాజా చర్యలు చేపట్టింది. జిందాల్ కోటెక్స్తోపాటు ముగ్గురు అధికారులపైనా చర్యలకు ఉపక్రమించింది. ఈ జాబితాలో సందీప్ జిందాల్, రాజిందర్ జిందాల్, యశ్ పాల్ జిందాల్ ఉన్నారు. వడ్డీసహా అన్ని రకాల వ్యయా లు, చార్జీలు కలిపి రూ. 14.55 కోట్ల రికవరీకిగాను కంపెనీతోపాటు ముగ్గురు అధికారుల బ్యాంకు, లాకర్లు, డీమ్యాట్ ఖాతాల అటాచ్‌మెంట్‌కు సెబీ ఆదేశించింది. ఆయా ఖాతాల కు సంబంధించి అన్ని బ్యాంకులు, మ్యూచు వల్ ఫండ్స్ ఎలాంటి డెబిట్లనూ అనుమతించవద్దంటూ సెబీ ఆదేశించింది. అయితే క్రెడిట్ లావాదేవీలకు మాత్రం అనుమతించింది. చదవండి: కస్టమర్ కంప్లైంట్.. ఫ్లిప్‌కార్ట్‌కు షాకిచ్చిన వినియోగదారుల ఫోరం! -
అజిత్ పవార్‌కు ఐటీ శాఖ ఝలక్
ముంబై: మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఎన్సీపీ నాయకుడు అజిత్ పవార్‌కు ఆదాయపన్ను శాఖ గట్టి షాక్ ఇచ్చింది. పవార్, ఆయన కుమారుడు పార్థ్ పవార్, ఇతర బంధువులకు చెందిన రూ.1,400 కోట్లకు పైగా ఆస్తుల్ని అటాచ్ చేసింది. ముంబై, న్యూఢిల్లీ, పుణె, గోవా, మరో డజనుకుపైగా ప్రాంతాల్లో ఆస్తుల్ని అటాచ్ చేస్తున్నట్టుగా మంగళవారం ప్రకటించింది. ప్రొహిబిషన్ ఆఫ్ బినామీ ప్రాపర్టీ ట్రాంజాక్షన్ యాక్ట్ 1988 కింద ఈ ఆస్తుల్ని అటాచ్ చేసుకున్నట్టుగా స్పష్టం చేసింది. సతారాలో రూ.600 కోట్ల విలువ చేసే షుగర్ ఫ్యాక్టరీ, గోవాలో రూ.250 కోట్లు విలువ చేసే రిసార్ట్ నిలయ, దక్షిణ ముంబైలోని రూ.25 కోట్లు విలువ చేసే పార్థ్ పవార్ కార్యాలయం నిర్మల్ హౌస్ , దక్షిణ ఢిల్లీలోని రూ.20 కోట్లు విలువ చేసే ఫ్లాట్‌తో పాటుగా... వివిధ ప్రాంతాల్లో రూ.500 కోట్లు విలువ చేసే భూములు అటాచ్ చేసుకున్నట్టుగా ఐటీ శాఖ అధికారి ఒకరు వెల్లడించారు. ఈ ఆస్తులన్నీ అజిత్ పవార్, ఆయన బంధువులవేనని, వారి బినామీ పేర్ల మీద ఉన్నాయని తెలిపారు. ఆ ఆస్తులన్నీ అక్రమ మార్గాల్లోనే వారికి వచ్చాయని అన్నారు. గత నెలలో ఆదాయ పన్ను శాఖ అధికారులు పవార్ బంధువుల నివాసాలపై దాడులు చేసిన విషయం తెలిసిందే. -
సాహితీ శిఖరం.. కళల కెరటం..
పెదవాల్తేరు/మద్దిలపాలెం(విశాఖతూర్పు): అవధుల్లేని మహా ప్రవాహం ఆయన జీవన పయనం. అనంతమైన మహా సముద్రం ఆయన అనుభవ సారం. అనేక అధ్యాయాల.. అసంఖ్యాక ప్రకరణాల ఉద్గ్రంథం ఆయన ప్రతిభాసామర్థ్యం. సామాన్య కుటుంబాన జన్మించి.. అక్షర సేద్యంలో రాణించి.. ఆపై అనేక రంగాల్లో అసమాన నైపుణ్యం చూపించి.. తుదిశ్వాస వరకు సృజనాత్మకతనే శ్వాసించి.. తెలుగు సాహితీ కళారంగాల్లో అనితర సాధ్యమైన స్థానం సంపాదించి దూరతీరాలకు తరలిపోయిన గొల్లపూడి మారుతీరావు అచ్చంగా ఉత్తరాంధ్ర ముద్దుబిడ్డ. చిన్ననాట ఇక్కడ ఓనమాలు దిద్దినా.. తర్వాత ఆంధ్ర విశ్వకళాపరిషత్తు నీడలో విద్యాభ్యాసం చేస్తూనే రంగస్థలంపై సృజన కిరణాలు ప్రసరింపజేసినా.. నాటక రంగంలో మహనీయులతో కలసి నైపుణ్యానికి సానపెట్టుకుని తళుకులీనినా.. తర్వాత జీవన సంధ్యాకాలంలో విశాఖను శాశ్వత నివాసంగా చేసుకున్నా.. ఆయన జీవితంలో వైశాఖి కీలకపాత్ర పోషించింది. ఎక్కడికి వెళ్లినా మళ్లీ ఇక్కడికి వచ్చినప్పుడే హాయిగా ఉంటుందన్న భావన కలిగించింది. విశాఖ నుంచి అనివార్యంగా తరలివెళ్లిన తర్వాత చెన్నపట్నంలో ఆయన తుదిశ్వాస వీడినా.. ఆయన దివ్యాత్మ విశాఖ ఒడిలోకే చేరి ఉంటుంది. విజయనగరంలో జన్మించిన గొల్లపూడి మారుతీరావు కుటుంబసభ్యులతో విశాఖలో దాదాపుగా 15 సంవత్సరాలపాటు నివసించారు. ఆయన పిఠాపురం కాలనీ జనశిక్షణ సంస్థాన్ రోడ్డులోని ఒక అపార్ట్మెంట్ ఫ్లాట్‌లోనివసించారు. ఏడాది క్రితమే ఈ ఫ్లాట్ విక్రయించేసి చెన్నై వెళ్లిపోయారు. ఏయూలో పాఠ్యపుస్తకం గొల్లపూడి రచనలను భారతదేశంలోని పలు విశ్వవిద్యాలయాలలో పాఠ్యాంశాలుగా ప్రాచుర్యంలో వున్నాయి. తెలుగు నాటక రంగం మీద ఆయన రాసిన వ్యాసాలను ఆంధ్రాయూనివర్శిటీ లో గల థియేటర్ ఆర్ట్స్ విభాగంలో పాఠ్యపుస్తకంగా వుంది. గొల్లపూడి రచనలపై ఎంతోమంది విద్యార్థులు పరిశోధనలు చేసి ఎంఫిల్, డాక్టరేట్లు పొందారు. ప్రముఖ సినిమా నటుడు వంకాయల సత్యనారాయణ కుమార్తె లావణ్య గొల్లపూడి రచనలపై పరిశోధనలు చేసి ఏయూ నుంచి డాక్టరేట్ పొందారు. మానసిక పాఠశాలలో... పెదవాల్తేరులో గల హిడెన్‌స్ప్రౌట్స్ పాఠశాలలో జరిగిన పలు కార్యక్రమాలలో ఆయన పాల్గొనేవారని పాఠశాల వ్యవస్థాపకుడు శ్రీనివాసరావు గుర్తు చేసుకున్నారు. తరచూ పాఠశాల నిర్వాహకులతో సమావేశమయి మానసిక దివ్యాంగుల యోగక్షేమాలు విచారించేవారు. ఎన్నో స్మృతులు ఆయన విశాఖలో జరిగిన పలుసాంస్కృతిక కార్యక్రమాలలో విశిష్ట అతిథిగా పాల్గొనేవారు. పిఠాపురం కాలనీ కళాభారతి, ప్రేమసమాజం తదితర వేదికలపై జరిగిన సినిమా సంగీత విభావరి, ఇతర కార్యక్రమాలలో ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారని సహచరులు గుర్తు చేసుకుంటున్నారు. ఆయన వన్‌టౌన్‌లోని కురుపాం మార్కెట్ , టౌన్‌హాలు, హిందూ రీడింగ్‌రూమ్ లతో గొల్లపూడికి ఎంతో అనుబంధం వుంది. నాటకరంగంలో వున్నపుడు ఆయన ఇక్కడ సహచరులతో సంతోషంగా గడిపేవారని, నగర వీధుల్లో తిరిగేవారని రచయిత, వ్యాఖ్యాత భీశెట్టి వెంకటేశ్వరరావు తెలిపారు. ఓనమాలు ఇక్కడే.. ఆయన సీబీఎం పాఠశాలలోను, ఏవిఎన్ కళాశాలలోను, ఆంధ్రాయూనివరి్సటీలోను విద్యాభ్యాసం చేశారు. గొల్లపూడి విద్యార్థి దశలో వుండగానే శ్రీవాత్సవ రచించిన స్నానాలగది నాటకానికి కెవి గోపాలస్వామి దర్శకత్వం వహించారు. ఈ నాటకంతోపాటుగా భమిడిపాటి రాధాకృష్ణ రచించిన మనస్తత్వాలు నాటకంలోను నటించారు. కాగా, మనస్తత్వాలు నాటకాన్ని కొత్తఢిల్లీలో జరిగిన ఐదో అంతర్ విశ్వవిద్యాలయాల యువజనోత్సవాలలో భాగంగా ప్రదర్శించడం విశేషం. గొల్లపూడి రచన అనంతం ఉత్తమ రేడియో నాటకంగా అవార్డు పొందింది. చైనా ఆక్రమణపై తెలుగులో మొదటి నాటకం రచించి చిత్తూరు, మదనపల్లి , నగరి ప్రాంతాలలో ప్రదర్శించి వచ్చిన రూ.50వేల నిధులను ప్రధానమంత్రి రక్షణ నిధికి విరాళంగా ఇచ్చారు. అమ్మ చెప్పిన పురాణాలే తొలి పాఠాలు మారుతీరావు పూర్తి పేరు వెంకట సూర్య మారుతి లక్ష్మీ నారాయణ. అమ్మ అన్నపూర్ణమ్మ చదవే పూరాణాలు వింటూ, వాటి సారాన్ని ఔపోసన పడుతూ.. ఆపై కొత్త ఆలోచనలు పేర్చుకుంటూ పెరిగారు. విన్న పురణాల గాథలను నాన్న సుబ్బారావుగారి షార్ట్‌హేండ్ పుస్తకాలపై రాసేవారు. ఇలా భాషపై పట్టుసాధించారు. తాను చూసిన తాజ్‌మహల్ వంటి అద్భుత కట్టడాల గురించి అనుభూతులను ఆవిష్కరించారు. యవ్వనంలోకి అడుగుపెట్టక ముందే “రేనాడు ‘అనే వీక్లీలో ఆయన తొలి నవల ‘ఆశాజీవి’ అచ్చయింది. మహాకవి శ్రీశ్రీ కొన్నాళ్లు కంపోజింగ్ సెక్షన్లో పనిచేయడంతో కొత్త రచయితలకు అలాంటి స్థానిక పత్రికపై మక్కువ ఉండేదని.. తమ రచనలు వాటిలో ముద్రితమైతే చూడాలనే ఆరాటం ఉండేదని తర్వాత ఆయన చెప్పేవారు. పర్యావరణ ప్రేమికుడు.. సీతంపేట: గొల్లపూడి మారుతీరావు సినీనటుడు, జర్నలిస్టు మాత్రమే కాదు పర్యావరణ ప్రేమికుడు. పర్యావరణ మార్గదర్శి నిర్వహించిన పలు కార్యక్రమాల్లో ఆయన చురుగ్గా పాల్గొన్నారు. అంతర్జాతీయంగా పర్యావరణ పరిస్థితులను గురించి అవలీలగా మాట్లాడేవారు. పర్యావరణ మార్గదర్శి సభ్యులతో ఎప్పుడు కలిసినా ప్రపంచవ్యాప్తంగా ఉష్ణతాపం పెరిగిపోతోందని.. మంచు కొండలు కరిగిపోతున్నాయని, వాయుకాలుష్యం పెరుగుతోందని చెప్పారు. ఆహార పదార్థాల్లో విషతుల్య రసాయనాలు చేరుతున్నాయని వివరించేవారు. ఆయన మృతి పర్యావరణ మార్గదర్శి సభ్యులకు దిగ్భ్రాంతి కలిగించింది. – ఎస్.విజయ్‌కుమార్, అధ్యక్షుడు, పర్యావరణ మార్గదర్శి వైశాఖి నడిచే విజ్ఞాన సర్వస్వం గొల్లపూడి నడిచే విజ్ఞాన సర్వస్వం. బహుముఖ ప్రజ్ఞానిధి. రచన, పత్రిక, నాటకం, సినిమా ఈ నాలుగు రంగాలలో ఆంధ్ర రాష్ట్రంలో సాధికారికంగా మాట్లాడగలిగే ఏకైక వ్యక్తి గొల్లపూడి. సినిమా రంగంలో ఆయన ప్రతిభ అందరికీ తెలిసిందే, సాహిత్య రంగంలో ఏ విషయం మీద అయినా చాలా వేగంగా అద్భుతంగా రచనలు చేయగలిగే నిష్ణాతుడు. వందేళ్ల కధకు వందనాలని టీవీలో ప్రోగ్రామ్ చేశారు. కృష్ణశాస్త్రి, శ్రీశ్రీ నుంచి ఇప్పటి మా తరం వరకు మాబోటి వారితో.. మొత్తం మీద నాలుగు తరాల వారితో గొల్లపూడికి అనుబంధం ఉంది. – డి.వి.సూర్యారావు, రచయిత గొల్లపూడికి గీతం డాక్టరేట్ ఆరిలోవ(విశాఖతూర్పు): సినీ నటుడు గొల్లపూడి మారుతిరావుకు గీతం వర్సిటీతో మెరుగైన సంబంధాలు ఉండేవి. ఆయన నటన శైలి, రచనలను గీతం డీమ్డ్ వర్సిటీ గుర్తించింది. ఇందులో భాగంగా 2017లో గీతం 8వ స్నాతకోత్సవం సందర్భంగా డాక్టరేట్ ప్రకటించింది. అప్పటి స్నాతకోత్సవంలో గీతం చాన్సలర్ కోనేరు రామకృష్ణారావు గొల్లపూడి మారుతీరావుకు డాక్టరేట్‌ను అందజేసి గౌరవించారు. నవ్వుతూ, నవ్విస్తూ ఉండే స్నేహశీలి మహారాణిపేట(విశాఖ దక్షిణం): తెలుగు సాహిత్యంలో సాటిలేని సంతకం గొల్లపూడి మారుతీరావుది. నాటక, సినీ రంగాల్లో ఆయనది అందె వేసిన చెయ్యి. ఆయన రాసిన పరిశోధనాత్మక రచనలు, వర్తమాన అంశాలను స్పృశిస్తూ వాస్తవాలను ఎలుగెత్తి చెప్పేవి. వివిధ పత్రికల్లో ప్రచురితమైన రచనలు పాఠకులను అమితంగా ఆకట్టుకున్నాయి. వీటన్నిటికీ మించి మంచి స్నేహశీలి. ఎప్పడు తన మాటలతో ఎదుటివాడి నోటికి తాళం వేసేటట్టు.. ఛలోక్తులు విసురుతూ మాటాడేవారు. మాటకారితనంతో మురిపించేవారు. అందరిని నవ్విసూ్త,నవ్వుతూ ఉండేవారు. ఆయన మృతి సాహితీరంగానికి తీరని లోటు. నేను మంచి మిత్రుడిని కోల్పోయాను. -వంగపండు ప్రసాదరావు, కళాకారుడు -
సింగపూర్‌లో నీరవ్ మోదీకి చుక్కెదురు
పీఎన్బీ కుంభకోణంలో ప్రధాన నిందితుడు, డైమండ్ వ్యాపారి నీరవ్ మోదీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. సింగపూర్‌లో మోదీ సన్నిహితులకు చెందిన ఆస్తులను ఎటాచ్ చేయాలని సింగపూర్ హైకోర్టు ఆదేశాలచ్చింది. నీరవ్‌మోదీ సోదరి, ఆమె భర్త నిర్వహిస్తున్న కంపెనీలకు చెందిన బ్యాంకు ఖాతాల్లో రూ. 44.41 కోట్ల రూపాయలను ఫ్రీజ్ చేయాలని ఆదేశించింది. ఈ మేరకు రూ. 44కోట్లను, బ్యాంకు ఖాతాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సదరు సొమ్మును భారత బ్యాంకులనుంచి అక్రమంగా తరలించారని ఈడీ కోర్టుకు తెలిపింది. ఈడీ అభ్యర్థన మేరకు సింగపూర్ హైకోర్టు తాజా ఆదేశాలు జారీ చేసింది. కాగా ప్రభుత్వరంగ బ్యాంకు పంజాబ్ నేషనల్ బ్యాంకులో నకిలీ పత్రాలు, లెటర్స్ ఆఫ్ అండర్‌టేకింగ్ (ఎల్‌ఒయు) లాంటి అక్రమ పద్ధతుల ద్వారా వేలకోట్ల కుంభకోణానికి పాల్పడిన కేసులో వ్యాపారి నీరవ్ మోదీ కీలక నిందితుడు. భారీగా రుణాలను ఎగవేసి లండన్‌కు చెక్కేసిన మోదీని ఉద్దేశపూర్వక ఎగవేతదారుడుగా భారత ప్రభుత్వం ప్రకటించడంతోపాటు తిరిగి భారత్‌కు రప్పించాలని భారీ కసరత్తు చేస్తోంది. ఈ క్రమంలో లండన్ పోలీసులు సహకారంతో గత ఏడాది నీరవ్‌మోదీని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం లండన్‌లో జైల్లో ఉన్న మోదీ బెయిల్ పిటిషన్‌ను వెస్ట్ మినిస్టర్ కోర్టు తిరస్కరించిన సంగతి తెలిసిందే. -
ఖాకీలకూ ‘పనిష్మెంట్’
పోలీసు ఉల్లంఘనలపై ప్రత్యేక నజర్ ♦ సిబ్బంది, అధికారుల వయొలేషన్స్‌పై సీరియస్ ♦ తాజాగా కానిస్టేబుల్‌పై అటాచ్మెంట్ వేటు సాక్షి, హైదరాబాద్: రహదారులపై ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన సాధారణ ప్రజలకు జరిమానా, పాయింట్లు మాత్రమే పడుతున్నాయి. ఇదే పని పోలీసులు చేస్తే వారికి వీటితో పాటు తాఖీదులు తప్పట్లేదు. కొన్ని నెలలుగా నగర పోలీసులు ఈ విధానాన్ని పక్కాగా అమలు చేస్తున్నారు. ఇప్పటి వరకు మొత్తం 242 మంది పోలీసు సిబ్బంది, అధికారులకు ఉన్నతాధికారులు చార్జ్ మెమోలు జారీ చేశారు. వీరిలో ఆరుగురిపై బదిలీ లేదా అటాచ్మెంట్ వేటు కూడా పడింది. హెల్మెట్ లేకుండా వాహనం నడుపుతూ మీడియాకు చిక్కిన రామ్‌గోపాల్‌పేట కానిస్టేబుల్ కె.రాకేష్సాగర్ను సీఏఆర్ హెడ్–క్వార్టర్స్‌కు అటాచ్ చేస్తూ మధ్య మండల డీసీపీ జోయల్ డెవిస్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. అమలు చేయాల్సిన వారే తప్పు చేస్తే... రహదారి భద్రతకు సంబంధించి అంశాలు, నిబంధనల్ని క్షేత్రస్థాయిలో ట్రాఫిక్, శాంతిభద్రతల అధికారులే అమలు చేస్తుంటారు. ఇలాంటి అధికారాలున్న వారే తప్పులు చేస్తే ప్రజల్లో చులకన భావం ఏర్పడుతుందని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో నగరంలోని హెల్మెట్ నిబంధన పక్కా చేసినప్పుడు కమిషనరేట్లోకి వచ్చే ప్రతి ద్విచక్ర వాహనచోదకుడూ కచ్చితంగా దీన్ని ధరించాల్సిందేనని కొత్వాల్ గతంలోనే స్పష్టం చేశారు. ఈ విధానాన్ని మరింత విస్తరిస్తూ రహదారుల పైనా పోలీసులు నిబంధనలు కచ్చితంగా పాటించాల్సిందేనని స్పష్టం చేశారు. యూనిఫాంలో ఉంటే సీరియస్... నగర పోలీసు విభాగంలో పనిచేస్తున్న పది వేల మందికి పైగా సిబ్బంది నిత్యం ఇళ్ల నుంచి పోలీసుస్టేషన్/కార్యాలయం మధ్య, వ్యక్తిగత/అధికారిక పనుల నిమిత్తం రాకపోకలు సాగిస్తుంటారు. ఇలా వీరు రాకపోకలు సాగిస్తున్న నేపథ్యంలో అత్యధిక శాతం యూనిఫాంలోనే ఉంటున్నారు. వీరు వినియోగిస్తున్న వాటిలో ప్రైవేట్ వాహనాలతో పాటు ప్రభుత్వం అందించినవీ ఉంటున్నాయి. ఇలాంటి సందర్భాల్లో యూనిఫాంలో ఉన్న పోలీసులతో పాటు పోలీసు వాహనాలు ఉల్లంఘనలకు పాల్పడటాన్ని ఉన్నతాధికారులు సీరియస్‌గా తీసుకున్నారు. వీరిలో మార్పు తీసుకురావడానికి కౌన్సెలింగ్‌లు చేపట్టిన అధికారులు, కొన్నాళ్లుగా తాఖీదులు జారీ చేయడం మొదలుపెట్టారు. నాలుగు రకాలుగా ఆధారాలు పోలీసుల ఉల్లంఘనలకు సంబంధించి పక్కా ఆధారాలు ఉంటేనే చర్యలు తీసుకుం టున్నామని ఓ ఉన్నతాధికారి ‘సాక్షి’కి తెలి పారు. మొత్తం 4 రకాల సాధనాల ద్వారా వీటిని సేకరిస్తున్నారు. విధుల్లో ఉంటున్న సిబ్బంది తమ చేతిలో ఉండే కెమెరాల ద్వారా చిత్రీకరిస్తున్నారు. బషీర్‌బాగ్‌లోని కమిషన రేట్లో ఉన్న ట్రాఫిక్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ నుంచీ ఫొటోలు తీస్తున్నారు. ఈ రెంటితో పాటు సోషల్‌మీడియాలో సర్క్యు లేట్ అవుతున్న, పత్రికల్లో వస్తున్న ఫొటోలను పరిగణలోకి తీసుకుంటున్నారు. తాఖీదులు పొందిన వారు ఇలా.. అదనపు ఇన్స్పెక్టర్ 1 ఎòౖÜ్సలు 66 హెడ్–కానిస్టేబుళ్లు 9 కానిస్టేబుళ్లు 86 హోంగార్డులు 80 మొత్తం 242 ముందు ఫైన్... ఆపై మెమో... సేకరించిన ఫొటోలను కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ సిబ్బంది అధ్యయనం చేస్తున్నారు. ఆ సమయంలో వాహనాన్ని నడిపింది ఎవరనేది నిర్ధారించేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారు. స్పష్టత వచ్చిన తర్వాత సదరు పోలీసుల నుంచి జరిమానా వసూలు చేసి, ఆపై చార్జ్‌మెమో జారీ చేస్తున్నారు. నిర్ణీత సమయంలోపు సంజాయిషీ ఇవ్వకపోయినా, ఇచ్చింది సం తృప్తికరంగా లేకపోయినా తదుపరి చర్యలు తీసుకోవాలని అధికారులు నిర్ణయించారు. మరో పక్క పోలీసు సిబ్బంది/అధికారులకు చెందిన వ్యక్తిగత, అధికారిక వాహనాలపై ఎలాంటి జరిమానాలు లేకుండా ఎప్పటికప్పుడు క్లియర్ చేసుకోవాలని సీపీ స్పష్టం చేశారు. -
సహారాకు ఈడీ దెబ్బ
న్యూఢిల్లీ : సహారా అధినేత సుబ్రతోరాయ్ మరిన్ని ఇబ్బందుల్లో చిక్కుకోనున్నారు. ఇటీవల ఆంబే వాలీని అటాచ్ చేయాలంటూ ఆదేశించి సుప్రీంకోర్టు షాకివ్వగా ఇపుడు ఈడీ వంతు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఇడి)తాజా నిర్ణయంతో మరిన్ని కష్టాలు సహారాను చుట్టు ముట్టనున్నాయి. మనీలాండరింగ్ చట్టం కింద ఈడీ మరిన్ని విలువైన ఆస్తులను స్వాధీనం చేసుకునేందుకు పావులు కదుపుతోంది. సహారా గ్రూప్ హోటల్స్ సహా ఇతర విదేశీ ఆస్తులను అటాచ్ కోసం ఈడీ సిద్ధమవుతోంది. సహారా హోటల్స్, విదేశాల్లో్ ఉన్న నాలుగు ప్రాపర్టీల అటాచ్‌మెంట్‌కు రంగం సిద్ధం చేస్తోంది. దాదాపు రూ. 3,697కోట్ల విలువైన ఈ ఆస్తుల అటాచ్‌మెంట్‌కు అనుమతి కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ ఆస్తులను సహారా అక్రమంగా కూడబెట్టిందని ఈడీ ఆరోపిస్తోంది. సుప్రీం అక్రమ ఆస్తులుగా ప్రకటించిన ఈ ప్రాపర్టీలనున పెట్టుబడిదారుల పెట్టుబడుల నుంచి సంపాదించుకుందని ఈడీ నమ్ముతోంది. కాగా సహారా గ్రూప్ అంటే ఆంబేవాలీ. అత్యంత విలువైన ఆస్తి విలువు రూ.39వేల కోట్లు. ఆంబే వాలీని అటాచ్ చేస్తున్నట్టు పేర్కొన్న సుప్రీంకోర్టు తదుపరి విచారణను ఫిబ్రవరి 20కి వాయిదా వేసిన సంగతి తెలిసిందే. -
ఖరీదైన సహారా ఆస్తిని అటాచ్ చేసిన సుప్రీం
న్యూఢిల్లీ : సహారా అధినేత సుబ్రతోరాయ్కి సుప్రీంకోర్టు షాకిచ్చింది. సహారా గ్రూప్‌కు చెందిన అత్యంత విలువైన ఆస్తి ఆంబే వాలీని అటాచ్ చేస్తున్నట్టు సుప్రీంకోర్టు సోమవారం పేర్కొంది. ఈ ప్రాపర్టీ విలువ రూ.39వేల కోట్లు. గ్రూప్‌లోని రెండు కంపెనీలు ఇన్వెస్టర్లకు చెల్లించాల్సి ఉన్న రూ.14,799 కోట్ల రికవరీ నేపథ్యంలో ఈ ప్రాపర్టీని అటాచ్ చేస్తున్నట్టు తెలిపింది. డబ్బులు చెల్లించకుంటే జైలుకు వెళ్లాల్సి వస్తుందని సుప్రీంకోర్టు, సుబ్రతోరాయ్కి వార్నింగ్ ఇచ్చింది. జస్టిస్ దీపక్ మిశ్రా, రంజన్ గొగోయ్, ఏ.కే సిక్రి సభ్యులుగా ఉన్న స్పెషల్ బెంచ్ ఈ మేరకు ఆదేశాలు జారీచేసింది. అంబీ వాలీ సిటీని సహారా గ్రూప్ మహారాష్ట్రలోని పుణేలో డెవలప్ చేసింది. ఎలాంటి చిక్కులు లేని ఆస్తులనూ సహారా గ్రూప్ తమకు ఫిబ్రవరి 20 వరకు సమర్పించాలని ఆదేశించింది. ఈ ప్రాపర్టీస్‌ను పబ్లిక్ ఆక్షన్‌లో పెట్టి చెల్లించాల్సిన డబ్బును రాబడతామని చెప్పింది. సహారా ఇప్పటికే రూ.11వేల కోట్లను సెబీకి చెల్లించగా.. మిగతా బ్యాలెన్స్ రూ.14,779 కోట్లను 2019 జూలై వరకు చెల్లించేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతోంది. అయితే 2019 వరకు పొడిగించడం కాలయాపనేనని, చెల్లించాల్సిన నగదును రికవరీ చేయడానికి ప్రాపర్టీస్ ఆస్తుల ఆక్షన్ చేపడతామని కోర్టు తెలిపింది. ఈ విషయంపై తదుపరి విచారణను ఫిబ్రవరి 20న చేపట్టనున్నట్టు పేర్కొంది. . -
అద్వితీయ రాష్ట్రపతికి రాజమహేంద్రవరానుబంధం
చరిత్ర కెక్కని వాస్తవం రెండేళ్లు ఆర్ట్స్ కాలేజీలో తత్త్వశాస్త్రాన్ని బోధించిన సర్వేపల్లి రాజమహేంద్రవరం కల్చరల్: తత్త్వవేత్త, రాజనీతిజ్ఞుడు, భారతదేశ ద్వితీయ రాష్ట్రపరి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ పండితునికి రాజమహేంద్రవరంతో అనుబంధం ఉంది. అయితే ఆ విషయం చరిత్రపుటలకు ఎక్కలేదు. ఆయన 1917–1919 మధ్యకాలంలో రాజమహేంద్రవరం ఆర్ట్సు కళాశాలలో ‘ఫిలాసఫీ’ (తత్త్వశాస్త్రాన్ని) బోధించారు. ఆ రోజుల్లో ఆర్ట్సు కళాశాల నేటి గూడ్సుషెడ్డుకు సమీపంలో ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాల భవనంలో ఉండేది. రాధాకృష్ణన్ పండితుడు నేటి టి.నగరు ప్రాంతంలోని కొక్కొండవారి వీధిలో నెలకు రూ.15 అద్దెకు ఉండేవారు. అయితే ఆ విషయం సర్వేపల్లి రాధాకృష్ణన్ జీవితంపై వెలువడిన గ్రంథాల్లో ఎక్కడా ప్రస్తావించిన దాఖలాలు లేవు. చివరకు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, నిఘంటు నిర్మాణశాఖ, భాషాభివృద్ధిపీఠం ఆధ్వర్యంలో ప్రచురించిన ‘20వ శతాబ్దపు తెలుగువెలుగులు’ గ్రంథంలో ప్రచురించిన రాధాకృష్ణన్‌పై వ్యాసంలో కూడా ఈ విషయాన్నిఎక్కడా ప్రస్తావించలేదు. అయితే రాజమహేంద్రి జ్ఞాపకాలు ఆయనలో సదా పదిలంగా ఉండేవి. ఆ విషయం చరిత్ర పరిశోధకుడు, గ్రంథరచయిత యాతగిరి శ్రీరామనరసింహారావు తన స్వీయచరిత్ర‘నరసింహావలోకనం’లో ఇలా తెలియజేశారు. ‘1962లో గుర్గాంవ్లో అఖిల భారత సహకారశిక్షణా కళాశాలలో శిక్షణపొందుతున్న సమయంలో నా నాయకత్వంలో వివిధ రాష్ట్రాలకు చెందిన కొందరం ట్రెయినీలం రాష్ట్రపతి సర్వేపల్లిని కలుసుకునేటందుకు విజ్ఞాపన పత్రాన్ని పంపాం. వెంటనే రాష్ట్రపతి భవనం నుంచి ప్రత్యేక దూత ద్వారా మాకు అంగీకారం లభించింది. అది1962 సెప్టెంబర్ 30 వ తేదీ సాయంత్రం 4 గంటలు. సర్వేపల్లికి నాపేరు వైఎస్ నరసింహారావు అని తెలిపాను. ఊరు పేరు, ఇంటిపేరుతో సహాపూర్తిగా చెప్పమని ఆయన అడిగారు. ఊరు రాజమండ్రి, పూర్తిపేరు యాతగిరి శ్రీరామనరసింహారావు అన్నాను. మాది బ్రాహ్మణులలో మధ్వశాఖ అని వెంటనే గ్రహించిన ఆయన అరిపిరాల పాపారావు పంతులుగారు బాగున్నారా? అని అడిగారు. అరిపిరాలవారి ఇంట దక్షిణంవైపు వాటాలో నెలకు రూ. 15 అద్దెపై ఉండేవాడినని ఆయన తెలిపారు. ఆయనింకో ప్రశ్న వేశారు.. రాజమండ్రి మెయిన్‌రోడ్డు అంతే ఉందా? తరువాత ఆయన వేసిన మరోప్రశ్న– గోదావరిబ్రిడ్జి కింద ఏడో స్తంభం బలహీనమైనదని అనేవారు, ఇంకా అంటున్నారా? అని. నా చిన్నతనంలో అనేవారని బదులు చెప్పాను. మాకు కేటాయించిన 8 నిమిషాల సమయం 26 నిమిషాల వరకు కొనసాగింది’. స్మృతి చిహ్నం డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ రాజమహేంద్రవరంలో పనిచేసిన సుమారు 96 సంవత్సరాల తరువాత, నేటి ఆర్ట్సుకళాశాల ప్రాంగణంలో –2015లో ఆయన శిలా విగ్రహాన్ని నెలకొల్పారు. దానిపై ఈ వివరాలన్నీ పేర్కొనడం నగర ప్రేమికులకు కొంత ఊరట కలిగిస్తున్నాయి. -
శంషాబాద్‌లో కలుపొద్దు
కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయకు బీజేపీ షాద్‌నగర్ నాయకుల వినతి రాయికల్(షాద్‌నగర్‌రూరల్) : కొత్తజిల్లాల ఏర్పాటులో భాగంగా షాద్‌నగర్ నియోజకవర్గాన్ని శంషాబాద్ జిల్లాలో కలుపొద్దని శనివారం బీజేపీ జిల్లా ప్రధానకార్యదర్శి శ్రీవర్ధన్‌రెడ్డి ఆద్వర్యంలో బీజేపీ నాయకులు కేంద్ర కార్మికశాఖ మంత్రి బండారు దత్తాత్రేయకు వినతిపత్రం అందజేశారు. శంషాబాద్‌లో కలపడం సరైనదికాదని, పాలమూరులోనే కొనసాగించాలని కోరారు. కష్ణా పుష్కరాలకు వెళ్తున్న కేంద్ర మంత్రి దత్తాత్రేయకు మండల పరిధిలోని రాయికల్ టోల్‌ప్లాజావద్ద బీజేపీ నాయకులు ఘనస్వాగతం పలికారు. పాలమూరు జిల్లాకు షాద్‌నగర్ అన్నివిధాలుగా అనుకూలమైనదని, హైదరాబాద్ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి బూర్గుల రామకష్ణారావు పాలమూరు జిల్లాకు చెందినవారేనని వినతిపత్రంలో పేర్కొన్నారు. రాష్ట్రంలోని అత్యధిక రాజకీయ నాయకులు, ప్రముఖులకు సంబంధించిన ఆస్తులు, భూములు, కంపెనీలు షాద్‌నగర్ ప్రాంతంలోనే ఉన్నాయని, వాటి విలువను పెంచుకునేందుకే శంషాబాద్‌ను జిల్లానుచేసి షాద్‌నగర్‌ను కలపాలని ప్రయత్నించడం రాజకీయ లబ్ధికోసమేనని తెలిపారు. ప్రజల ఇష్టానుసారం షాద్‌నగర్‌ను పాలమూరు జిల్లాలోనే కొనసాగించాలని కోరారు. బండారుదత్తాత్రేయ మాట్లాడుతూ కష్ణాపుష్కరాలలో పాల్గొనడం చాలాసంతోషంగా ఉందన్నారు. ప్రతిఒక్కరూ పుష్కరాలలో పాల్గొని పునీతులు కావాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు శేరివిష్ణువర్ధన్రెడ్డి, కష్ణారెడ్డి, చెంది మహేందర్‌రెడ్డి, నందిగామ వెంకటేష్, వంశీకష్ణ, సత్యనారాయణ, మల్లికార్జున్, శ్రీకాంత్, హన్మంతు, ఆర్యవైశ్య సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
ఉద్యోగులు కూడా ఆస్తుల అటాచ్ మెంట్ కోరవచ్చు
న్యూఢిల్లీ : కొత్త దివాలా బిల్లు ప్రకారం రుణదాతలు, పెట్టుబడిదారులు, ఉద్యోగులు సైతం కంపెనీ దివాలా తీసినప్పుడు ప్రమోటర్ల స్థిర ఆస్తులను (విదేశీ ఆస్తులు సైతం) అటాచ్ చేయమని కోరొచ్చని ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి శక్తికాంత్ దాస్ తెలిపారు. రుణాలకు గ్యారెంటీగా, బకాయిలను తిరిగి పొందడానికి ఈ ఆస్తులను ప్రమోటర్లు చూపించాలని పేర్కొన్నారు. ఈ ఆస్తులే కంపెనీ దివాలా తీసినప్పుడు రుణాల పరిష్కారానికి, ఉద్యోగులకు, పెట్టుబడిదారులకు ఎలాంటి నష్టం జరగకుండా గ్యారెంటీగా ఉంటాయని చెప్పారు. రుణ సమస్యల సత్వర పరిష్కారం కోసం.. రుణదాతలకు, ప్రజలకు మేలు కలిగేలా దివాలా బిల్లును ఈ నెల మొదట్లో పార్లమెంట్ ఆమోదించిన సంగతి తెలిసిందే. ఉద్యోగులు, రుణదాతలు, పెట్టుబడిదారులు ఎక్కువగా ఆర్థిక ఒత్తిడిలను ఎదుర్కొంటారని దాస్ చెప్పారు. 9నెలల స్పష్టత కాలం అనంతరం కూడా రుణ సమస్య కొనసాగితే, ప్రమోటర్లు రుణానికి గ్యారెంటీగా ఇచ్చిన అన్నీ స్థిర ఆస్తులను(విదేశ ఆస్తులు కూడా కలుపుకుని) అటాచ్ చేయమని ఉద్యోగులు, పెట్టుబడిదారులు ఎవరైనా కోరచ్చని తెలిపారు. ఏ కంపెనీని, ఏ కేసును నొక్కి ఈ కామెంట్ చేయడం లేదన్నారు. బ్యాంకులకు రూ.9వేల కోట్లను ఎగొట్టి వ్యాపారవేత్త విజయ్ మాల్యా విదేశాల్లో తిరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ కొత్త చట్టంతో ఆర్థిక రంగ రూపురేఖలే మారబోతున్నాయని దాస్ చెప్పారు. ఓ కొత్త, శక్తివంతమైన ఎకో సిస్టమ్ ను ఆర్థిక ఒత్తిడిలో కూరుకుపోయిన కంపెనీల కోసం రూపొందిస్తున్నామని తెలిపారు. రుణ సమస్యలు సత్వరమే పరిష్కరించేలా ఈ సిస్టమ్ తోడ్పడుతుందన్నారు. అయితే మొదట రెజల్యూషన్ ప్రాసెస్ ను ఆరంభించడానికి ప్రతి స్టాక్ హోల్డర్ హక్కు కలిగి ఉంటారన్నారు. రుణదాతలు, ఆర్థిక రుణదాతలు, నిర్వహణ రుణదాతలు, వర్క్ మెన్, ఉద్యోగులు ఈ స్టాక్ హోల్డర్ జాబితాలోకి వస్తారని దాస్ చెప్పారు. -
జగిత్యాల తహశీల్దార్ ఆఫీస్ జప్తు
జగిత్యాల: కరీంనగర్ జిల్లా జిగిత్యాల తహశీల్దార్ కార్యాలయం, కార్యాలయంలోని ఫర్నిచర్‌ను శుక్రవారం కోర్టు ఆదేశాల మేరకు జప్తు చేశారు. లింగంపేట చెరువు ముంపు బాధితుల పరిహారాన్ని రూ.3కోట్ల మేరకు చెల్లించాలని జిల్లా సెషన్స్ కోర్టు గతంలో ఆదేశాలు జారీ చేసింది. వీటిని అమలు చేయకపోవడంతో శుక్రవారం రెవెన్యూ ఆస్తులను జప్తు చేశారు. -
మనసును తడిమి.. హృదయాన్ని చేరి
కెరీర్ గోల్ చేరే క్రమంలో సొంతూళ్లను వదిలేసి సిటీ బాట పట్టిన యువత... అయినవాళ్ల ‘అటాచ్మెంట్’ మిస్సవుతోంది. తాతయ్య, అమ్మమ్మ, నానమ్మ, అన్నా, చెల్లి... కుటుంబ సభ్యులతో గడిపిన మధుర క్షణాలు మాయమవుతున్నాయి. తీయని పలుకరింపులు... బంధాలు... అనుబంధాలు... మెట్రో నగరంలో ఎంత బిజీగా గడిపినా ఎక్కడో ఏదో తెలియని వెలితి. ఇంట్లో ఉన్న ప్రతి క్షణం కళ్లల్లో కదలాడుతుంటుంది. గుర్తొచ్చినప్పుడల్లా ఫోన్ చేసి కాస్తంత భారం దించుకుంటున్నారు. జూబ్లీహిల్స్ అన్నపూర్ణ ఇంటర్నేషనల్ ఫిల్మ్ స్కూల్ అండ్ మీడియా విద్యార్థులు జితేంద్ర, వృషబ్, అభిప్స, జాహ్నవి, ఇషా, శికా, తులసి, మహేష్, పృథ్వీ, కుశాల్ల పరిస్థితి కూడా ఇదే! ఓ రోజు స్కూల్లో దర్శకుడు ప్రవీణ్ ప్రదర్శించిన ‘బేర్ ఫీట్ టు గోవా’ మూవీ చూసిన వీరి మనసు చలించింది. బంధాలకు అనుసంధానకర్తలను చేసింది. ఇంతకీ ఏముందీ చిత్రంలో! ఏంచేస్తున్నారీ విద్యార్థులు! బంజారాహిల్స్ లామకాన్‌లో శనివారం ఈ వివరాలను వెల్లడించారు... ముంబైలో ఉండే పేరెంట్స్.. గోవాలో నివాసముంటున్న వారి తల్లిదండ్రులను పట్టించుకోరు. వారికి తమ వద్దకు తెచ్చుకోకపోవడానికి ముంబైలో ఇరికిళ్లని... సాకుగా చూపుతారు. తమ పేరెంట్స్‌కు నానమ్మ దగ్గరి నుంచి లెటర్స్ రావడం గమనిస్తారు సదరు పేరెంట్స్ పిల్లలు. ఓ రోజు లెటర్ ఓపెన్ చేసి చదువుతారు. ‘క్యాన్సర్ వచ్చింది. రండి... ప్లీజ్’ అని లెటర్ ఉంటుంది. అది చూసి మనసు కదిలిన మనవళ్లు వెంటనే ముంబై నుంచి గోవాకు రైలులో బయలుదేరుతారు. ఈ క్రమంలో వారు ఎదుర్కొన్న కష్టాలు, ఇబ్బందులు మా హృదయాలను తాకాయి. అందుకే మా వంతుగా ఈ సినిమాకు ప్రమోషన్ చేయాలని నిర్ణయించుకున్నాం. కార్పొరేట్ స్కూళ్లకి వెళ్లి అక్కడి విద్యార్థులను కలిశాం. వారి నాన్నమ్మ, అమ్మమ్మ, తాతయ్యలతో ఉన్న అనురాగాలను పోస్ట్ కార్డులో రాయమని చెప్పాం. అలా వారు రాసిన కార్డులనే పోస్ట్ చేశాం. త్వరలోనే వారి నుంచి సమాధానం వస్తుందనుకుంటున్నాం. ఇలా చేయడం వల్ల వారికి నానమ్మ, తాతయ్యలతో అనురాగబంధం గుర్తు చేయగలుగుతున్నాం. సీనియర్ సిటిజన్లు అయిన వారి గుండెల్లో మేమున్నామనే ధైర్యాన్ని నింపగలుగుతున్నాం. పదిహేను దేశాల్లోని 238 మంది నుంచి విరాళాలు సేకరించి తీసిన చిత్రం ఇది. తప్పకుండా అదరి హృదయాలను టచ్ చేస్తుంది. ఆత్మీయానురాగాలు అడుగంటుతున్న ఈ రోజుల్లో వాటిని కళ్లకు కట్టించిన తీరు నిజంగా భావోద్వేగాలకు లోను చేస్తుంది. షాపింగ్ మాల్స్‌లో కూడా ప్రమోషన్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. యూసుఫ్‌గూడలోని ఓ వృద్ధాశ్రమంలో ఉంటున్న వారికి ఈ చిత్రం గురించి వివరించాం. ఈ నెల 10న సినిమా రిలీజ్. మేం టచ్ చేసిన వారందరికీ ఈ సినిమా చూపిస్తాం. సినిమా ఫీల్డ్‌లోకి వెళ్లేందుకు రకరకాల కోర్సులు చేస్తున్నాం. ఓ మంచి సందేశం ఇచ్చే ఇలాంటి సినిమాలకు ప్రమోషన్ చేయడమంటే అది మాకు దక్కిన అదృష్టంగా భావిస్తున్నాం. -
మారన్ ఆస్తులు అటాచ్
కేంద్ర టెలికం మాజీ మంత్రి దయానిధి మారన్, ఆయన సోదరుడు కళానిధి, వారి కుటుంబసభ్యులకు సంబంధించిన 742 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డెరైక్టరేట్ అటాచ్ చేసింది. ఎయిర్‌సెల్-మాక్సిస్ మనీలాండరింగ్ కేసులో ఈడీ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ కేసులో బుధవారం వారి ఆస్తులను అటాచ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. అటాచ్ చేసిన వాటిలో దయానిధి మారన్, ఇతరులకు చెందిన రూ. 7.47కోట్ల ఎఫ్డీలు, కళానిధి మారన్‌కు చెందిన రూ. 100 కోట్ల ఎఫ్డీలు, రూ. 2.78 కోట్ల విలువైన మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి. అలాగే, కళానిధి భార్య కావేరికి చెందిన రూ. 1.3 కోట్ల విలువైన ఎఫ్డీలు, రూ. 1.78 కోట్ల విలువైన మ్యూచువల్ ఫండ్స్‌ను కూడా ఈడీ అటాచ్ చేసింది. -
అసభ్యకరంగా ప్రవర్తించిన ఎస్ఐ..ఎస్పీకి అటాచ్మెంట్
ఖమ్మం : 'ఆంధ్రాపోరి' సినీ యూనిట్‌తో అసభ్యకరంగా ప్రవర్తించిన ఖమ్మం జిల్లా పాల్వంచ పట్టణ ఎస్ఐ షణ్ముఖాచారిని జిల్లా ఎస్పీకి అటాచ్మెంట్ చేస్తూ నిన్న ఉత్తర్వులు జారీ అయ్యాయి. గత 20 రోజులుగా ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ తనయుడు ఆకాష్ హీరోగా 'ఆంధ్రాపోరి' సినిమా పాల్వంచలో షూటింగ్ చేస్తున్నారు. భద్రాచలం రోడ్‌లోని బృందావన్ రెస్టారెంట్లో చిత్ర యూనిట్ బస చేసింది. అయిదు రోజుల క్రితం రాత్రివేళ ఎస్ఐ ఆ రెస్టారెంట్‌కు వెళ్లి చిత్ర బృందంతో అసభ్యకరంగా ప్రవర్తించారు. పూరి జగన్నాథ్ ఈ విషయాన్ని పోలీస్ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకు వెళ్లారు. ఈ నేపథ్యంలో ఎస్ఐని ఎస్పీకి అటాచ్ చేసి ...సంఘటనపై పోలీస్ ఉన్నతాధికారులు విచారణ చేస్తున్నారు. -
పేదరికం బతుకంటోందీ.. చట్టం జీవహింసంటోంది!
-
‘అక్షయ గోల్డ్’ ఆస్తుల స్వాధీనానికి ఉత్తర్వులు
సాక్షి, హైదరాబాద్: వివిధ రకాల స్కీముల పేరుతో భారీ కుంభకోణానికి పాల్పడి, రూ.కోట్లలో దండుకున్న అక్షయ గోల్డ్ ఫార్మ్స్ అండ్ విల్లాస్ ఇండియా సంస్థ ఆస్తుల స్వాధీనానికి అనుమతిస్తూ ఏపీ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న 26 మందికి చెందిన, సంస్థ/వ్యక్తిగత బ్యాంకు ఖాతాల్లో ఉన్న రూ.10.15 కోట్ల నగదుతో పాటు 2,354 ఎకరాల స్థలాలను సైతం స్వాధీనం చేసుకోనున్నారు. -
295 కోట్ల రోజ్‌వ్యాలీ ఆస్తుల జప్తు
దేశంలోనే అతిపెద్ద అటాచ్మెంట్గా రికార్డు సాక్షి, భువనేశ్వర్: అధిక వడ్డీ ఆశ చూపి అనధికారికంగా వేల కోట్ల రూపాయల డిపాజిట్లు సేకరించిన ఒడిశాలోని రోజ్‌వ్యాలీ గ్రూపుపై ఎన్ఫోర్స్మెంట్ డెరైక్టరేట్(ఈడీ) కొరడా ఝుళిపించింది. ఆ సంస్థకు చెందిన రూ.295 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేస్తూ కోల్‌కతా జోనల్ ఈడీ కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. ఇది దేశంలోనే అతిపెద్ద అటాచ్మెంట్గా పేర్కొంటున్నారు. ఒడిశా, పశ్చిమబెంగాల్, జార్ఖండ్ తదితర రాష్ట్రాల్లో రోజ్‌వ్యాలీ కి చెందిన 2,807 బ్యాంకు అకౌంట్లను ఈడీ ఫ్రీజ్ చేసింది. ఇప్పటికే వెలుగులోకి వచ్చిన పొంజి స్కాంలో రోజ్‌వ్యాలీ అతిపెద్ద భాగస్వామి. ఇది అధిక వడ్డీ ఆశ చూపించి రూ.15 వేల కోట్లకుపైగా డిపాజిట్లు సేకరించింది. ఒక్క ఒడిశాలోనే డిపాజిటర్లకు రూ.400 కోట్లు తిరిగి చెల్లించడంలో కంపెనీ విఫలమైందని ఈడీ పేర్కొంది. 27 కంపెనీల పేర్లతో డిపాజిట్లు సేకరించడంతోపాటు మనీల్యాండరింగ్‌కు పాల్పడినట్లు ఈడీ నిర్ధారణకు వచ్చింది. దీంతో బ్యాంకు ఖాతాలతో పాటు రోజ్‌వ్యాలీ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ లిమిటెడ్, రోజ్‌వ్యాలీ హోటల్-ఎంటర్టైన్మెంట్ ఆస్తులను కూడా అటాచ్ చేసింది. ఈ సంస్థకు ఒడిశాలోనే 65 బ్రాంచ్‌లు ఉన్నాయి. -
మీరు వదులుకోవాల్సినవి వీటినే!
వివేకం మీకు గాఢమైన అనుబంధం, మీ సంపద మీద, మీ ఇంటి మీదా కాదు. మీ భార్య పట్ల, మీ భర్త పట్ల, మీ సంతానం పట్ల కూడా కాదు. మీకు ఎక్కువ అనుబంధం మీ సొంత ఆలోచనల పట్ల, మీ సొంత భావాల పట్లనే! ఎప్పటికీ అంతే. ‘అదేం కాదు! నా భార్య అంటే నాకు చాలా ఇష్టం, నా పిల్లవాడు అంటే ఇష్టం!’ అని మీరు అనవచ్చు. ఒకవేళ ఎప్పుడైనా మీ భార్య గానీ, మీ పిల్లవాడు గానీ లేక మీ చుట్టూ పరిస్థితులు గానీ, మీకు వ్యతిరేకంగా మారిపోయాయనుకోండి. మీరు అనుకున్నట్లుగానో, మీరు ఆలోచించినట్లుగానో లేవనుకోండి. ఇక వారందరూ ఎడమైపోతారు, దూరమైపోతారు. మీ సొంత ఆలోచనలు, భావనలు మాత్రమే మీతో నిలుస్తాయి. అసలు మీరు నిజంగా పోగు చేసుకున్నవి మీ ఆలోచనా విధానాలు, మీ ఉద్దేశాలు, మీ సిద్ధాంతాలు, మీ విశ్వాసాలు... ఇవే మీ చుట్టూరా అనేక విధాలుగా విస్తరిస్తాయి. అందువల్ల, మీరు వదిలిపెట్టవలసినది వీటినే. మీ ఇంటినీ, మీ బ్యాంక్ బ్యాలెన్సునీ కాదు. మీ ఆలోచనా విధానం, మీ సిద్ధాంతాలు, మీ వ్యక్తిత్వం, ఇవే వాస్తవంగా మీరు పోగు చేసుకున్నవి. మీరు పారవేయాల్సింది వీటినే. మీ భార్యనో, మీ పిల్లవాడినో, మరొకదాన్నో కాదు. ‘నాకొక అభిప్రాయం ఉంది’ అని మీరు అంటే అర్థం ఏమిటి? అది ఒక వాస్తవమో, జ్ఞానమో అని కాదు. మీకు ఒక విధమైన ఆలోచన ఉంది, ఊహ ఉంది అని అర్థం. సిద్ధాంతం అంటే ఏమిటి? ఒక క్రమబద్ధం చేయబడిన ఆలోచన. దాని వలన ఏమౌతుంది? అది మిమ్మల్ని వాస్తవానికి దూరంగా తీసుకుపోతుంది. ప్రస్తుతం మీరిక్కడ కూర్చుని ఇక్కడ లేని ఏ విషయం గురించో ఊహించుకోవటం మొదలుపెడితే, అప్పుడు ఆ ఊహ, మీ చుట్టూ ఉన్న ప్రస్తుత వాస్తవం నుంచి మిమ్మల్ని విడదీస్తుంది. ఇక ఆ ఊహ బాగా క్రమబద్ధం అయిందనుకోండి. అది మిమ్మల్ని వాస్తవం నుంచి పూర్తిగా తీసివేస్తుంది. అప్పుడు వాస్తవికతతో మీకు సంబంధమే లేకుండా పోతుంది. ఊహతో ఉన్న బంధం ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది కాబట్టి, కల్పన చాలా ఆకర్షవంతంగా ఉంటుంది. అది పూర్తిగా క్రమబద్ధం అయినప్పుడు, మరీ ఆకర్షవంతం అవుతుంది. ఒకసారి దానితో మీరు మమేకం అయిపోయారంటే చాలు, అది వాస్తవికత నుంచి మిమ్మల్ని సంపూర్ణంగా విడగొడుతుంది. వాస్తవం నుండి అలా మీరు విడిపోయినప్పుడు, మీరు నిజంగా అర్థవంతమైన జీవితం జీవిస్తున్నట్లేనా? మీరు నిజంగా సత్యమైన అర్థంతో జీవిస్తున్నట్లేనా? మీరు జీవితానుభవం నిజంగా పొందుతున్నట్లేనా? జీవితాన్ని తెలుసుకునే ఒకే ఒక్క మార్గం, జీవితం ఎలా ఉందో అలాగే అవగతం చేసుకోవటం. కానీ, ఏదో ఒక సిద్ధాంతంతో మీ మనసు వక్రమైపోయిందనుకోండి. అప్పుడిక మీరు చూసేదంతా మీ సిద్ధాంతపు దృష్టికి లోబడే ఉంటుంది. అంతేకాని వాస్తవానికి దానితో ఏ సంబంధమూ లేదు. సమస్య - పరిష్కారం వయసు పైబడుతున్నకొద్దీ భయం పెరుగుతోంది. వయసు పైబడకుండా ఎప్పటికీ యుక్త వయసులో ఉండడమెలా? -జి.రత్నాకర్, హైదరాబాద్ సద్గురు: మీరు పీల్చే గాలి, తాగే నీరు, తినే భోజనం వీటితోనే మీ శరీరం తయారైంది. ఒకసారి సేకరించిన పదార్థాన్ని అవసరం లేదని మీ శరీరం నుండి మీరు పూర్తిగా విసర్జించలేరు. అలాగే ఒకరోజు గడిచిందంటే దానిని మీ వయసులో నుంచి తీసివేయలేరు. అలాగే మీ మనసు ఎలా ఏర్పడిందో కూడా చూడండి. పుట్టినప్పటినుండి మీ చుట్టూ సమాజం మీకిచ్చిన సలహాలు, మీరు చదివిన చదువు, పొందిన అనుభవాలతో చెత్తబుట్టలా తయారైంది. అన్నింటినీ మనం ఉంచుకోవాలని ఎవరూ బలవంతపెట్టరు. ఏది విసర్జించాలో ఏది సేకరించాలో మీ చేతిలోనే ఉంది. అవసరం లేని వాటిని వదిలేసి మనసును నవీనంగా ఉంచుకునే స్వతంత్రత, వయసు పైబడనీయక ఎప్పుడూ యుక్త వయసులా ఉంచుకునే సామర్థ్యం మీకు ప్రసాదించబడింది. క్రమబద్ధంగా యోగా చేయడం వల్ల ఇది సాధ్యమౌతుంది. అవకాశం చేజారనీయకండి.