శంషాబాద్‌లో కలుపొద్దు | shadnagar not attachment in shamshabad | Sakshi
Sakshi News home page

శంషాబాద్‌లో కలుపొద్దు

Published Sat, Aug 20 2016 11:51 PM | Last Updated on Mon, Sep 4 2017 10:06 AM

shadnagar not attachment in shamshabad

కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయకు బీజేపీ షాద్‌నగర్‌ నాయకుల వినతి 
రాయికల్‌(షాద్‌నగర్‌రూరల్‌) : కొత్తజిల్లాల ఏర్పాటులో భాగంగా షాద్‌నగర్‌ నియోజకవర్గాన్ని శంషాబాద్‌ జిల్లాలో కలుపొద్దని శనివారం బీజేపీ జిల్లా ప్రధానకార్యదర్శి శ్రీవర్ధన్‌రెడ్డి ఆద్వర్యంలో బీజేపీ నాయకులు కేంద్ర కార్మికశాఖ మంత్రి బండారు దత్తాత్రేయకు వినతిపత్రం అందజేశారు. శంషాబాద్‌లో కలపడం సరైనదికాదని, పాలమూరులోనే కొనసాగించాలని కోరారు. కష్ణా పుష్కరాలకు వెళ్తున్న కేంద్ర మంత్రి దత్తాత్రేయకు  మండల పరిధిలోని రాయికల్‌ టోల్‌ప్లాజావద్ద బీజేపీ నాయకులు ఘనస్వాగతం పలికారు. పాలమూరు జిల్లాకు షాద్‌నగర్‌ అన్నివిధాలుగా అనుకూలమైనదని, హైదరాబాద్‌ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి బూర్గుల రామకష్ణారావు పాలమూరు జిల్లాకు చెందినవారేనని వినతిపత్రంలో పేర్కొన్నారు. రాష్ట్రంలోని అత్యధిక రాజకీయ నాయకులు, ప్రముఖులకు సంబంధించిన ఆస్తులు, భూములు, కంపెనీలు షాద్‌నగర్‌ ప్రాంతంలోనే ఉన్నాయని, వాటి విలువను పెంచుకునేందుకే శంషాబాద్‌ను జిల్లానుచేసి షాద్‌నగర్‌ను కలపాలని ప్రయత్నించడం రాజకీయ లబ్ధికోసమేనని తెలిపారు. ప్రజల ఇష్టానుసారం షాద్‌నగర్‌ను పాలమూరు జిల్లాలోనే కొనసాగించాలని కోరారు. బండారుదత్తాత్రేయ మాట్లాడుతూ కష్ణాపుష్కరాలలో పాల్గొనడం చాలాసంతోషంగా ఉందన్నారు. ప్రతిఒక్కరూ పుష్కరాలలో పాల్గొని పునీతులు కావాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు శేరివిష్ణువర్ధన్‌రెడ్డి, కష్ణారెడ్డి, చెంది మహేందర్‌రెడ్డి, నందిగామ వెంకటేష్, వంశీకష్ణ, సత్యనారాయణ, మల్లికార్జున్, శ్రీకాంత్, హన్మంతు, ఆర్యవైశ్య సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement