‘మాకు అప్పగించండి.. నరకం చూపిస్తాం’ | Justice For Priyankareddy: Victim Mother Says Burn the Culprits | Sakshi
Sakshi News home page

‘బహిరంగంగా కాల్చి చంపండి’

Published Sat, Nov 30 2019 2:56 PM | Last Updated on Sat, Nov 30 2019 3:08 PM

Justice For Priyankareddy: Victim Mother Says Burn the Culprits - Sakshi

‍ప్రియాంక హత్య కేసులో పోలీసులు అరెస్ట్‌ చేసిన నిందితులు

సాక్షి, హైదరాబాద్‌: తన కూతురిని అత్యంత పాశవికంగా హత్య చేసిన నలుగురు నేరస్తులను బహిరంగంగా సజీవంగా తగులబెట్టాలని ప్రియాంకరెడ్డి తల్లి విజయమ్మ డిమాండ్‌ చేశారు. లోకం పోకడ తెలియని తన పెద్ద కుమార్తెను అన్యాయంగా పొట్టన బెట్టుకున్నారని ఆమె కన్నీటి పర్యంతమయ్యారు. ‘నా కూతురు చాలా అమాయకురాలు. అకారణంగా నా బిడ్డను హత్య చేసిన నిందితులను సజీవంగా తగులబెట్టాలని కోరుకుంటున్నాన’ని విజయమ్మ మీడియాతో చెప్పారు.

తాము ఫిర్యాదు చేయడానికి వెళ్లినప్పుడు పోలీసులు సరిగా స్పందించలేదని ఆమె ఆరోపించారు. ‘మా చిన్నమ్మాయి ముందుగా ఆర్‌జీఐఏ పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది. సీసీటీవీ దృశ్యాలు పరిశీలించిన పోలీసులు.. ప్రియాంక గచ్చిబౌలి వెళ్లి తిరిగి రాలేదని చెప్పారు. తమ పరిధిలోకి రాదన్న సాకుతో తర్వాత మమ్మల్ని శంషాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లమన్నారు. అక్కడ ఫిర్యాదు చేయడానికి వెళ్లినపుడు పోలీసులు అభ్యంతకర ప్రశ్నలు వేశార’ని విజయమ్మ వాపోయారు.

జైలు వద్దు.. ఎన్‌కౌంటర్‌ చేసేయండి
ఎంతో సౌమ్యంగా, పద్ధతిగా ఉండే ప్రియాంకరెడ్డి దారుణ హత్యను శంషాబాద్‌లోని నక్షత్ర కాలనీ వాసులు జీర్ణించుకోలేపోతున్నారు. అత్యంత కిరాతకంగా ప్రియాంకను హత్య చేసిన నలుగురు నిందితులను జైల్లో పెట్టొద్దని తమకు అప్పగిస్తే నరకం చూపిస్తామని అంటున్నారు. నలుగురు నేరస్తులను ఎన్‌కౌంటర్‌ చేసి చంపాలని తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు.

మరోవైపు నిందితులను ఉరి తీయాలని డిమాండ్‌ చేస్తూ వేలాది మంది షాద్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ వద్దకు భారీ ఎత్తున తరలివచ్చారు. నిందితులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ బారికేడ్లను ఎత్తిపడేశారు. వీరిని అదుపుచేయలేక పోలీసులు లాఠీచార్జి చేశారు. కాగా, ఇంతటి ఘోరానికి పాల్పడిన తన కొడుకును ఉరి తీసినా ఫర్వాలేదని ఏ–4 చింతకుంట చెన్నకేశవులు తల్లి జయమ్మ వ్యాఖ్యానించారు.

సంబంధిత వార్తలు

28 నిమిషాల్లోనే చంపేశారు!

పోలీసుల నిర్లక్ష్యమే కొంపముంచిందా?

షాద్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ వద్ద తీవ్ర ఉద్రిక్తత

పశువులు తిరుగుతున్నాయి జాగ్రత్త

ప్రియాంక కేసులో ఇదే కీలకం

నా కొడుకుకు ఉరిశిక్ష వేసినా ఫర్వాలేదు

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement